ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Telugu Proverbs


Telugu Proverbs

౧. ఆరు నెలలు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళవుతారు.
౨. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
౩. ఆదిలోనే హంస పాదు.
౪. ఏమి లేని ఎడారిలో ఆముదం చెట్టే మహా వృక్షం.
౫. ఆకలి రుచి ఎరగడు నిద్ర సుఖమెరగదు
౬. ఆలస్యం అమృతం విషం.
౭. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు.
౮. ఆరే దీపానికి వెలుగు ఎక్కువ
౯. ఆరోగ్యమే మహ భాగ్యం
౧౦ ఆవు చేను మేస్తే దూడ గట్టు మేస్తుందా.
౧౧ అభద్ధం ఆడినా అతికినట్లుండాలి
౧౨. అడగందే అమ్మయినా అన్నం పెట్టదు.
౧౩. అడిగే వాడికి చెప్పేవాడు లోకువ
౧౪. ఏ ఎండకు ఆ గొడుగు!
౧౫. అగ్నికి ఆయువు తోడయినట్లు!
౧౬. ఐశ్వర్యం వస్తే అర్ధ రాత్రి గొడుగు పట్టమనేవాడు!
౧౭. అందితే జుట్టు అందకపోతే కాలు!
౧౮. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్లు!
౧౯. అన్నపు చొరవేగానీ అక్షరపు చొరవు లేదు!
౨౦. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు!

Telugu Proverbs Part 2

౨౧. అప్పు చేసి పప్పుకూడు
౧౨. అతి రహస్యం భాట్టబయలు
౨౩. అయ్యవారు వచ్చేవరకు అమ్మవాస్య ఆగుతుందా!
౨౪. బతికుంటే బలుసాకు తినవచ్చు.
౨౫. బెల్లం కొట్టిన రాయిలా!
౨౬. బూడిదలో పోసిన పన్నీరు
౨౭. చేదస్తపు మొగుడు చెపితే వినడు, గిచ్చితే ఏడుస్తాడు.
౨౮. చాప కింద నీరులా
౨౯. చదువవస్తే ఉన్న మతి పోయినట్లు
౩౦. చదువు రాని వాడు వింత పశువు
౩౧. చేతకానమ్మకి చేష్టలు ఎక్కువ!
౩౨. చేతులు  కాలాక ఆకులు పట్టుకున్నట్లు
౩౩. చక్కనమ్మ చిక్కిన అందమే!
౩౪. చెరపకురా చెడేవు
౩౫. చీకటి కొన్నాళ్ళు, వెలుగు కొన్నాళ్ళు!
౩౬. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
౩౭. చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లు
౩౮. చింత చచ్చినా పులుపు చావలేదు
౩౯. చింతకాయలు అమ్మటానికి సిరిమానం వస్తే ఆ వంకర టింకరవి ఏమి కాయలని అడుగుతుందట

Telugu Proverbs Part 3

౪౧. చిలికి చిలికి గాలివానయినట్లు
౪౨. డబ్బుకు లోకం దాసోహం
౪౩. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు
౪౪.దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
౪౫. దాసుని తప్పు దండంతో సరి
౪౬. దెయ్యాలు  వేదాలు వల్లించినట్లు
౪౭. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
౪౮. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు
౪౯. దూరపు కొండలు నునుపు
౫౦. దున్నపోతు మీద వాన కురిసినట్టు
౫౧. దురాశ దుఖ్హానికి చేటు 
౫౨.ఈతకు మించిన లోతే లేదు  
౫౩. ఎవరికీ వారే ఎమునా తీరే 
౫౪. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు 
౫౫. గాడిద సంగీతానికి వొంటే ఆశ్చర్యపడితే, వొంటే అందానికి గాడిద మూర్చ పోయిందట  
౫౬. గంతకు తగ్గ బొంత 
౫౭. గతిలేనమ్మకు గంజే పానకం 
౫౮. గోరు చుట్టూ మీద రోకలి పోటు
౫౯. గొంతెమ్మ కోరికలు 
౬౦. గుడ్డి కన్నా మెల్ల మేలు.


Telugu Proverbs Part 4

౬౧. గుడ్డి ఎద్దు చేలో పడినట్లు
౬౨. గుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించినట్లు
౬౩. గుడిని గుడిలో లింగాన్ని మింగినట్లు
౬౪. గుడ్లమీద కోడిపెట్ట వలె
౬౫. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు
౬౬. గురువుకి పంగనామాలు పెట్టినట్లు
౬౭. ఇంట గెలిచి రచ్చ గెలువు
౬౮. తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లు
౬౯. ఇంటి దొంగను ఈస్వరుడయినా పట్టలేడు.
౭౦. ఇసుక తక్కెడ పేడ తక్కెడ
౭౧. జోగి జోగి రాసుకుంటే రాలేది భూడిద
౭౨. కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు
౭౩. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు
౭౪. కాకి ముక్కుకి దొండ పండు
౭౫. కాకి పిల్ల కాకికి ముద్దు
౭౬. కాలం కలిసి రాక పోతే , కర్రే పామై కాటు వేసినట్లు
౭౭. కలిసొచ్చే కాలం వస్తే, నడిసోచ్చే కొడుకు పుడతాడు
౭౮. కంచే చేను మేసినట్లు
౭౯. కంచు మోగినట్లు, కనకంబు మ్రోగునా
౮౦. కందకు లేని దురద కత్హి పీటకు ఎందుకు

Telugu Proverbs Part 5

౮౧. కరవమంటే కప్పకి కోపం, వదలమంటే పాముకి కోపం
౭౨. కీడెంచి మేలెంచమన్నారు
౭౩. కొండ నాలుకకి మందేస్తే, ఉన్న నాలుక ఊడినట్లు
౭౪. కొండని తవ్వి ఎలుకని పట్టినట్లు
౭౫. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు
౮౬. కూటి కోసం కోటి విద్యలు
౮౭. కూటికి పేదయితే కులానికి పేదా!
౮౮. కొరివితో తల గోక్కున్నట్లు!
౮౯. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
౯౦. కోత్హోక వింత - పాతొక రోత
౯౧. కోటి విద్యలు కూటి కొరకే
౯౨. కోత్హ భిచ్చగాడు పొద్దు ఎరగడు
౯౩. కృషితో నాస్తి దుర్భిక్షం
౯౪. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
౯౫. కుక్క కాటుకి చెప్పు దెబ్బ
౯౬. లేని దాత కంటే ఉన్న లోభి నయం
౯౭. లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక
౯౮. మెరిసేదంతా బంగారం కాదు
౯౯. మంది ఎక్కువయితే మజ్జిగ పలుచన అయినట్లు
౧౦౦. మనిషికి ఒక మాట, గొడ్డుకి ఒక దెబ్బ

Telugu Proverbs Part 6

౧౦౧. మీ బోడి సంపాదకు ఇద్దరు పెళ్ళాలా!
౧౦౨. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయినదంట
౧౦౩. మొక్కయి వంగనిది మోనై వంగునా!
౧౦౪. మొరిగే కుక్క కరవదు
౧౦౫. మోసే వాడికి తెలుసు కావిడి బరువు
౧౦౬. ముల్లుని ముల్లుతోనే తియ్యాలి, వజ్రాన్ని వజ్రం తోనే కొయ్యాలి
౧౦౭. ముందు గొయ్యి - వెనుక నుయ్యి
౧౦౮. నడమంత్రపు సిరి నరాల మీద పుండు