ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MUTTER KOFTA CURRY

మాటర్ కోఫ్తా కర్రీ

కావలసినవి-
పచ్చి బఠానీ -పావు కేజి
సెనగపిండి- 2టీ స్పూన్లు
ఉల్లిపాయలు - 50 గ్రా
పచ్చి మిర్చి-నాలుగు
ఉప్పు-తగినంత
కారం-1 టీ స్పూన్
ధనియాల పొడి-1 టీ స్పూన్
గరం మసాలా- 1/4 టీ స్పూన్
పసుపు- 1/2 టీ స్పూన్
బంగాల దుంపలు-100 గ్రా
నూనె- 50 గ్రా
తయారుచేసే విధానం:
1)పచ్చి బఠానీలు ఉడికించి,మిక్సీలో గ్రైండ్ చేయండి.
2 )ఒక పాన్ లో నూనె వేసి కొన్ని ఉల్లిపాయముక్కల్ని వేయించండి.ఇందులో పచ్చిమిర్చి ముక్కలు,సెనగపిండి వేసి కొద్ది సేపు ఫ్రై చేయండి.ఆ పైన బఠానీ పేస్ట్ వేసి కలిపి ముద్దలుగా (కోఫ్తాలు) చేసి నూనెలో వేయించండి.
3 )ఒక గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయముక్కలు వేయించి,అందులో కారం,ధనియాల పొడి,పసుపు వేసాక-బంగాళా దుంప ముక్కలు కలిపి రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించండి.గ్రేవి పూర్తిగా ఉడికాక,ఉప్పు వేయండి.ఇందులో ముందు గా వేయించి పెట్టుకున్న కోఫ్తాలు వేసి కదపకుండా కొన్ని నిమిషాలు ఉడికిస్తే మాటర్ కోఫ్తా కర్రీ సిద్ధం......