ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BANANA WITH COCONUT ONION CHILLI STUFFING


బనానా స్టఫింగ్

కావలసిన పదార్ధాలు:
పచ్చి అరటికాయలు: 2
కొబ్బరి తురుము: 1/2 cup
పచ్చిమిరపకాయ ముక్కలు: 4
ఎండుమిరపకాయ ముక్కలు: 3
కొత్తిమీర: 1/2 cup
పసుపు: చిటికెడు
ఆవాలు: 1/2 tsp
నిమ్మరసం: 1 tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: తగినంత
తయారుచేయు విధానము:
1. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అందులోనే ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసి కలిపి ప్రక్కన పెట్టుకోవాలి.
2. అరటికాయలను రెండు అంగుళాల పొడవుగా ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి.
3. పై పొట్టు(తొక్క) తీసాక ముక్కలను సగం వరకు నిలువగా కోసి, అందులో కొబ్బరి తదితర పదార్ధాలతో తయారైన ముద్దను కూరాలి.
4. పాన్ లో ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు వేసి, అవి చిటపట లాడగానే అరటికాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేయాలి అంతే బనానా స్టఫింగ్ రెడీ.