ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

FRIED RICE WITH PANNEEER


పనీర్ ఫ్రైడ్ రైస్

కావలసిన పదార్ధాలు:
పనీర్ – 2 cup
బాస్మతి బియ్యం – 2 cup
క్యాప్సికమ్ – 1 (చిన్నగా తరిగినవి)
పచ్చిబఠాణి – 1/2 cup
జీడిపప్పు 25 gms
తాజా కొబ్బరి తురుము – 1/4 cup
క్యారట్ తురుము – 1/4 cup
ఉల్లికాడల తురుము – 1/4 cup
చిల్లీ సాస్ – 1 tsp
టొమాటో సాస్ – 1 tsp
అల్లం వెల్లుల్లి ముద్ద – 1tsp
గరం మసాలా పొడి – 1/2 tsp
మిరియాలపొడి – 1/2 tsp
ఉప్పు – రుచికి సరిపడా
అజినోమాటో – చిటికెడు
నూనె 50 gms
తయారు చేయు విధానము:
1. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి అంగుళం ముక్కలుగా కోసిన పనీర్ ముక్కలు, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. బియ్యం కడిగి కాస్త బిరుసుగా(పొడిపొడిగా) వండి పెట్టుకోవాలి.
3. అదే పాన్ లో మరి కొద్ది నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లిముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత ఉల్లికాడల తురుము, క్యాప్సికమ్, పచ్చిబఠానీలు, క్యారట్ తురుము వేసి కలిపి కొద్దిగా వేయించాలి.
4. ఆ తర్వాత చిల్లీసాస్, టోమాటో సాస్, మిరియాల పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి బాగా వేపాలి.
5. ఇప్పుడు అందులోనే వేపి పెట్టుకొన్న పనీర్, జీడిపప్పు ముక్కలు, అజినోమాటో, వండిన అన్నం వేసి అన్నీ బాగా కలియబెట్టాలి. చివరగా తురిమిన కొత్తిమిర, కొబ్బరి కూడా చల్లి 5 నిమిషాలు ఉంచి దింపేయాలి. అంతే ఫన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ.