ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LORD VIGNESH - LORD VINAYAKA - LORD GANAPATHI PRAYER IN TELUGU


గణఫతి పూజ


ప్రారంభములో సాగేది గణాధిపతి పూజ, దీన్నే గణపతి పూజ అని అంటారు. వైష్ణవులు అయితే విష్వక్సేన పూజ అంటారు.
శివాయ విష్ణు రూపాయ - శివరూపాయ విష్ణవే,
శివస్య హృదయం విష్ణుః - విష్ణో శ్చ హృదయగం శివః

అనే విషయాన్ని గమనెస్తే, శివకేశవ భేధమే లేదు కావున, రెండూ ఒకటే అవుతాయి. రోజు సంద్యావందనంలో ఈ శ్లోకాన్ని చదివి కూడా, బేధం ఉందని భావిస్తే, చెప్పేది ఏమీలేదు.

1) దేవీం వాచ మజనయంత దేవాః- అయం ముహుర్తః సుముహూర్తో అస్తు

2) య శ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళాl
తయో స్సంస్మరణా త్పుంసాం సర్వతో జయమంగలమ్ll

౩) శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్l
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేll
అని ఈ తీరుగా మంగల శ్లోకాలు వెడలుతాయి ప్రారంభములో, వరుసగా అర్దం చూద్దాం.