ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SANKRANTHI FESTIVAL SPECIAL COCO BOBBATTLU


 స్పెషల్ కొబ్బరి బొబ్బట్లు

కావలసినవి:
కొబ్బరికాయ: 2
మైదా: 1/2 kg
బెల్లం లేదా పంచదార: 1/4 kg
యాలకులు: 3
నూనె లేదా నెయ్యి: 100grm
గసగసాలు: 100grms
తయారు చేయు విధానము:
1. కొబ్బరిని తరుముకొని, బెల్లం కూడా తురుముకోవాలి రెండింటినీ ఒక గిన్నెలో వేసి ఉడికించాలి.
2. కొబ్బరి, బెల్లం ఉడికి ముద్దలా అయి తీగ పాకం వచ్చాక దించాలి. తర్వాత బాగా మెదిపి యాలకుల పొడి, దోరగా వేయించిన గసగసాలు వేయాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ముద్దను నిమ్మకాయ సైజులో ముద్దలుగా చేసుకోవాలి.
3. మైదా పిండిలో నీళ్లు పోసి చపాతీ పిండి మాదిరిగా కలిపి 2 గంటు నాననివ్వాలి.
4. మైదాను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక్కో దాన్నీ చిన్న పూరీలా ఒత్తి అందులో కొబ్బరి ముద్ద పెట్టి పూరీతో చుట్టేసి చేత్తో లేదా అప్పడాల కర్రతో సున్నితంగా వత్తాలి.
5. వీటిని బొబ్బట్ల మాదిరిగానే పెనం మీద నెయ్యి లేదా నూనె వేసి రెండు వైపులా దోరగా కాల్చాలి. అంతే కొబ్బరి బొబ్బట్లు రెడీ ఇవి రెండు రోజులు నిల్వ ఉంటాయి(బెల్లం ఇష్టం లేని వారు పంచదారా కూడా వాడవచ్చు).