ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SPECIAL ARTICLE ON CHRISTAMAS FESTIVAL AND SPECIAL CHRISTAMAS RECIPES IN TELUGU



క్రిస్మస్ శుభాకాంక్షలు


డిసెంబర్ రాగానే ఉత్సాహంఆనందంజేగంటలుశాంటాక్లాస్లైట్లుకేకులు, స్టార్బహుమతులు ,కేకులు అంటూ క్రిస్మస్ 
\సందడి మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లకు చాలా ముఖ్యమైన పండగ క్రిస్మస్. క్రిస్టమస్ అనగా క్రీస్తు జననం. యేసుక్రీస్తు ఈ లోక ప్రజలకు పాప విముక్తి కలిగించటానికి ధివి నుండి దిగివచ్చిన ప్రేమ మూర్తి. లోకరక్షకుడైన ఆ 
యేసుక్రీస్తు జన్మదినమైన డిసెంబర్ 25 ను ఎంతో పవిత్రంగా భావిస్తారు. క్రైస్తవ మత స్థాపకుడుమానవప్రేమను ప్రబోధించిన కరుణామయుడు . ఆ దేవుడి కుమారుడే లోకానికి రక్షకుడిగా ఇలలో వెలసిన ఈ పవిత్రమైన రోజును క్రిస్టియన్లు పండగలా జరుపుకుటారు. సుమారు రెండు వేల సంవత్సరాల క్రింద బెత్లెహేము నగరంలో కన్నె మరియయోసేఫులకు ముద్దుల బిడ్డగా ఒక పశువులపాకలో జన్మించాడు యేసు. దేవదూతలు దిగి వచ్చి ఆతని రాకను మానవాళికి తెలియచేసారు. అంతటి పవిత్రాత్మను స్మరించుకునే పండగరోజు ఈ క్రిస్మస్... 
డిసెంబరు మొదలు కాగానే క్రిస్మస్ పండగ హడావిడి మొదలవుతుంది. ముందుగా ప్లమ్ కేకును తయారు చేయడానికి సన్నాహాలు మొదలు పెడతారు. తమ గృహాలువ్యాపార సంస్థలు,చర్చీలు శుభ్రం చేసి రంగు రంగు కాగితాలువిద్యుత్ దీపాలురంగు రంగుల అలంకరణ వస్తువులతో అలంకరిస్తారు. ఈ పండగ సంబరాలలో ముఖ్యమైనది ఇంట్లో పెట్టుకునే క్రిస్మస్ చెట్టుబయట వేలాడదీసే అందమైన కాంతులీనే నక్షత్రం. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆకాశంలో అతి ప్రకాశవంతమైన ఒక నక్షత్రం వెలిసింది. ఇది మిగతా నక్షత్రాల కన్నా భిన్నంగా ఉంది. యేసు పుట్టిన సమయంలో ప్రజలకు ఆ బాలుడి జన్మస్థానానికి దారి చూపిన ఆ తారక కు గుర్తుగా క్రీస్మస్‌ మాసం మొదలుకాగానే స్టార్‌ను ఇంటిముందు పెట్టుకుని అలంకరించుకుంటారు. అలాగే క్రిస్మస్ నాడు క్రిస్మస్ చెట్టును ఇంట్లో పెట్టి దానికి చిన్న చిన్న బంతులుకొవ్వొత్తులుకాగితపు పువ్వులుజేగంటలు, బొమ్మలు మొదలైనవి వేలాడదీస్తారు. ఇక క్రిస్మస్ పండగ అనగానే అందరికీ గుర్తొచ్చేది క్రిస్మస్ తాత శాంటాక్లాజ్. ఎర్రని దుస్తులతో ఈ తాత తన బగ్గీపై మంచు కొండలమీదుగా ఆకాశమార్గాన వచ్చి క్రిస్మస్ చెట్టుకు వేలాడదీసిన మేజోళ్లలో పిల్లలకోసం ఎన్నో బహుమతులు పెట్టి వెళతాడంట. దీనివెనుక ఉండే ఉద్దేశమంతా ఒక్కటే మానవుడినిప్రకృతిని సృష్టించిన దేవుడి ప్రేమను తెలుసుకోవడమే. క్రిస్మస్ నాడు కొవ్వొత్తులు క్రిస్మస్ ట్రీ చుట్టూ వెలిగించడం పరిపాటి.




మరి దీనిలోనూ పరమార్ధం లేకపోలేదు. అజ్ఞానాంధకారంలో అలమటిస్తున్న జగత్తులోకొనసాగే మానవాళికి వెలుగును చూపడానికి విచ్చేసిన లోకోద్ధారకుడు క్రెస్తు జ్ఞానజ్యోతి 'కి చిహ్నం. ఈ విషయానికి ప్రతీకయే ఈ కొవ్వొత్తుల ఆచారం.


24వ తేది అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు. అందుకే ఆ సమయంలో అందరూ కొత్తబట్టలు ధరించి ,చర్చికి వెళ్లి ప్రార్ధనలు చేసి ఆ దేవకుమారుడి ప్రేమతత్వాన్ని స్మరించుకుంటారు. తర్వాత రోజు ఉదయం బంధుమిత్రులను కలిసి శుభాకాంక్షలు తెలియచేస్తారు. విందు వినోదాలు ఏర్పాటు చేస్తారు. చిన్నవారికి బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ కూడా. అలాగే మత సంబంధం లేకుండా ఇరుగు పొరుగు వారికి,మిత్రులకు కేకుమిఠాయిలుపళ్లు మొదలైన తినుబండారాలు పంపిస్తారు.







SPECIAL CHRISTAMAS RECIPES - DECEMBER 25


స్వీట్ బ్రేక్
హ్యాపీ క్రిస్‌మస్!!
ఇవాళ్టి నుండి కొత్త సంవత్సరానికి ‘కేక్’వాక్ మొదలైనట్లే.
మీ లైఫ్ తియ్యగా, స్మూత్‌గా సాగాలని ‘ఫ్యామిలీ’ ఆకాంక్షిస్తోంది.
పాత రుచులకు బ్రేక్ వేసి, కొత్త రుచులను బేక్ చేస్తుండే...
ఈ డిసెంబర్ చలిలో మీతో పాటు,మీ స్నేహితుల్ని, సన్నిహితుల్ని వెచ్చగా ఉంచే కేక్‌లు ఇవి. కలిసి లాగించండి, కలిసి ఆనందించండి. మరోసారి హ్యాపీ క్రిస్‌మస్!
అలాగే - అడ్వాన్స్‌గా హ్యాపీ న్యూ ఇయర్.


క్యారట్ కేక్
కావలసినవి: 
మైదా - రెండు కప్పులు
బేకింగ్ పౌడర్ - టీ స్పూను, వంటసోడా - పావు టీ స్పూను
ఉప్పు - చిటికెడు, దాల్చినచెక్కపొడి - అర టీ స్పూను
జాజికాయపొడి - చిటికెడు, వెన్న - కప్పు
పంచదారపొడి - కప్పు,
కండెన్స్‌డ్ మిల్క్ - అర టిన్ను (200 గ్రా.)
వెనిలా ఎసెన్స్ - అర టీ స్పూను
తురిమిన క్యారట్ - ఒకటిన్నర కప్పు
బాదం, జీడిపప్పు, ఆక్రోట్లు, కిస్‌మిస్ - అరకప్పు
పాలు - అర కప్పు

తయారి:
మైదా, బేకింగ్‌పౌడర్, సోడా, ఉప్పు, దాల్చినచెక్క, జాజికాయపొడి వేసి జల్లించాలి. వెన్న, పంచదారపొడి, కండెన్స్‌డ్ మిల్క్, వెనిలా ఎసెన్స్ వేసి నురగ వచ్చేలా గిలకొట్టాలి. ఇందులో జల్లించిన మైదా, తురిమిన క్యారట్, సన్నగా కట్ చేసిన డ్రైఫ్రూట్స్ వేసి కలపాలి. పిండి గ ట్టిగా ఉంటే కొద్దిగా పాలు కలపాలి. కేక్ టిన్ను లోపల వెన్న రాసి మైదా వేసి మొత్తం అంటుకునేలా సర్దిన తరవాత కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసి ముందే వేడి చేసుకున్న ఓవెన్‌లో 180 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర 45 నిముషాలు బేక్ చేయాలి.

పైనాపిల్ అప్‌సైడ్ డౌన్ కేక్
కావలసినవి: 
గుడ్లు - 4, మైదా - 200 గ్రా., బేకింగ్ పౌడర్-అర టీ స్పూను, వంటసోడా-అర టీ స్పూను, వెన్న - 200 గ్రా., పంచదార - 200 గ్రా., పైనాపిల్ ఎసెన్స్ - 6 చుక్కలు, పైనాపిల్ ముక్కలు - 8, చెర్రీలు - 8

తయారి:
కేక్ చేసే టిన్నులో మూడు చెంచాల పంచదార వేసి వేడి చేయాలి. అది కరిగి ఎరగ్రా అవుతుంది. ఆ పాకాన్ని గిన్నెకంతా రాసి ఉంచాలి. మైదాలో బేకింగ్ పౌడర్, వంటసోడా వేసి రెండుమూడు సార్లు జల్లించాలి. పైనాపిల్ చెక్కు తీసి సన్నని, గుండ్రటి స్లైసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వెన్న, పంచదార వేసి కరిగేవరకు బాగా కలపాలి. ఇందులో కోడిగుడ్డు పచ్చసొన వేసి కలపాలి. తెల్లసొనని విడిగా నురగ వచ్చేలా గిలకొట్టాలి. ఈ వెన్న మిశ్రమంలో గుడ్ల మిశ్రమం, మైదాపిండిని ఒకదాని తరవాత ఒకటి వేసి కలుపుతూండాలి. చివరలో ఎసెన్స్ వేసి కలపాలి. క్యారమిల్ సిరప్ రాసిన కేక్ టిన్నులో పైనాపిల్ ముక్కలు దగ్గరదగ్గరగా పెట్టాలి. వీటి మధ్యభాగంలో చిన్నముక్క తీసేసి అక్కడ చెర్రీపళ్లు పెడితే బావుంటుంది. కలిపి ఉంచుకున్న కేక్ మిశ్రమాన్ని వేసి సమానంగా పరవాలి. ముందే వేడి చేసుకున్న ఓవెన్‌లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 50 నిముషాల పాటు బేక్ చేయాలి. చల్లారిన తరవాత టిన్నును ఒక పళ్లెంపై పెట్టి తిరగేసి కేక్‌ను బయటకు తీస్తే పైనాపిల్ ముక్కలు పైకి కనపడుతూ కేక్ తయారవుతుంది. అడుగున పెట్టిన పళ్లముక్కలు పైకి వస్తాయన్నమాట.

ప్లమ్ కేక్
కావలసినవి: 
మిల్క్ మెయిడ్ - ఒక టిన్ను
మైదా - 200 గ్రా., వెన్న - 100 గ్రా.
బేకింగ్ పౌడర్ - టీ స్పూను
వంటసోడా - అర టీ స్పూను
బిస్లరీ సోడా - 125 మి.లీ.
డ్రైఫ్రూట్స్ (కాజు, బాదం, ఆక్రోట్, టూటీ ఫ్రూటీ, కిస్‌మిస్) - 150 గ్రా.
పంచదార - 6 టీ స్పూన్లు
నీళ్లు - 50 మి.లీ.

తయారి: 
కేక్ చేసే టిన్ను లోపల భాగమంతా వెన్న రాసి కొద్దిగా మైదాపిండి చల్లి గిన్నె అంతా పరుచుకునేలా కదపాలి. ఒక గిన్నెలో పంచదార కరిగించి ఎరగ్రా అయ్యాక అందులో పావు కప్పు నీళ్లు కలిపి క్యారమిల్ సిరప్ చేసి పెట్టుకోవాలి. మైదాపిండిలో వంటసోడా, బేకింగ్‌పౌడర్ వేసి రెండుసార్లు జల్లించాలి. వెడల్పాటి గిన్నెలో వెన్న కరిగించి మిల్క్‌మెయిడ్ వేసి బాగా కలపాలి. ఇందులో బిస్లరీ సోడా, మైదాపిండి మార్చిమార్చి వేస్తూ బాగా కలపాలి. చివర్లో క్యారమిల్ సిరప్, సన్నగా కట్ చేసుకున్న డ్రైఫ్రూట్స్ వేసి కలపాలి. వెన్న రాసి పెట్టుకున్న కేక్ టిన్నులో ఈ మిశ్రమం వేసి సమానంగా సర్దాలి. ఓవెన్‌ను 180 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేసి ఈ కేక్ మిశ్రమాన్ని పెట్టి ముప్పావుగంట బేక్ చేయాలి.

క్రీమ్ డోనట్స్
కావలసినవి: 
మైదా-రెండు కప్పులు, పంచదార-అరకప్పు, బేకింగ్ పౌడర్-టీ స్పూను, దాల్చినచెక్కపొడి-చిటికెడు, ఉప్పు-చిటికెడు, గుడ్డు-1, పాలు-అర కప్పు, వెన్న-రెండు టీ స్పూన్లు, నూనె - వేయించడానికి తగినంత

తయారి: 
మైదాలో బేకింగ్ పౌడర్, ఉప్పు కలిపి రెండుసార్లు జల్లించాలి. ఇందులో దాల్చినచెక్కపొడి, వెన్న వేసి కలపాలి. ఇప్పుడు పంచదార, గిలకొట్టిన గుడ్డు, పాలు వేసి చపాతీపిండిలా కలుపుకోవాలి. పలుచగా ఉంటే కొద్దిగా మైదాపిండి కలుపుకోవచ్చు. పది నిమిషాల తరవాత ఈ పిండిని చపాతీలా అరంగుళం మందంలో ఒత్తుకోవాలి. డోనట్ కటర్‌తో కాని ఏదైనా మూతతో కాని గుండ్రంగా కట్ చేసుకోవాలి. చూడడానికి ఇవి వడల్లా ఉంటాయన్నమాట. పిండి మొత్తం ఇలాగే డోనట్లు తయారుచేసుకుని వేడినూనెలో నిదానంగా రెండువైపులా బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. ఇవి ఇలాగే సర్వ్ చేయొచ్చు లేదా మధ్యలో కట్ చేసి పంచదార పొడి లేదా ఐసింగ్ షుగర్, వెన్న కలిపిన క్రీమ్ పెట్టొచ్చు.

చాకొలేట్ కేక్
కావలసినవి: 
మైదా - ఒకటి ముప్పావు కప్పు, కోకో పౌడర్ - పావు కప్పు, ఉప్పు - చిటికెడు, తాజా గడ్డపెరుగు - ఒక కప్పు, పంచదారపొడి - ఒక కప్పు, బేకింగ్ పౌడర్ - అర టీ స్పూను, వంటసోడా - టీ స్పూను, రిఫైండ్ నూనె లేదా వెన్న - అరకప్పు, వెనిలా ఎసెన్స్ - టీ స్పూను, జీడిపప్పు, ఆక్రోట్లు, బాదం - అరకప్పు, పాలు - అరకప్పు

తయారి: 
మైదా, కోకోపౌడర్, ఉప్పు కలిపి జల్లించాలి. పెరుగులో పంచదారపొడి కలిపి బాగా గిలకొట్టాలి. ఇందులో వంటసోడా, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. తరవాత కరిగించిన వెన్న లేదా నూనె, వెనిలా ఎసెన్స్ కలిపి మరికొద్ది సేపు గిలకొట్టాలి. జల్లించిన మైదా, సన్నగా కట్‌చేసుకున్న డ్రైఫ్రూట్స్ కూడా వేసి కలపాలి. పిండి జారుడుగా ఉండడానికి అవసరమైతే కొద్దిగా పాలు కలపాలి. కేక్ టిన్ను లోపల భాగమంతా వెన్న రాసి, కొద్దిగా మైదా వేసి మొత్తం గిన్నెకంతా అంటుకునేట్టు పరిచిన తరవాత క లిపి ఉంచుకున్న కేక్ మిశ్రమాన్ని వేసి ముందే వేడి చేసుకున్న ఓవెన్‌లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 45 నుంచి 50 నిముషాలు బేక్ చేయాలి.

ఓవెన్ లేకున్నా కేక్ చేసుకోవచ్చు...
కేక్ చేయాలంటే కరెంట్ ఓవెన్ కాని మైక్రోవేవ్ ఓవెన్ కాని తప్పనిసరిగా ఉండాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉన్న ప్రెషర్ కుకర్లో లేదా మందపాటి అల్యూమినియం గిన్నెలో కూడా కే క్ తయారుచేసుకోవచ్చు. ముందుగా కుకర్‌లో చిల్లుల స్టాండ్ పెట్టి నీళ్లు పోయకుండా వేడి చేయాలి. దాని మీద కేక్ మిశ్రమం వేసిన గిన్నె పెట్టి కుకర్ మూతపెట్టి, వెయిట్ పెట్టకుండా సన్నమంట మీద ముప్పావుగంట వేడి చేయాలి. ఆ వేడికి కేక్ పూర్తిగా ఉడుకుతుంది. మధ్యలో మూత తీయొద్దు.