ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

EAT VEGETABLES - GRAINS FOR HEALTHY LIFE


వెజిటేరియన్ మాంసం


పిల్లల ఎదుగుదల బాగుండాలన్నా, కండరాలు దృఢంగా తయారు కావాలన్నా, మెదడు చురుగ్గా ఉండాలన్నా ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి అని చెబుతుంటారు వైద్యులు. శరీరానికి అత్యంత అవసరమైనవి సూక్ష్మ పోషకాలు, పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు. వీటన్నింటిలో నీటి తర్వాత అంతటి ప్రాముఖ్యం ఉన్నవి ప్రొటీన్లే. వీటినే తెలుగులో మాంసకృత్తులు అంటారు. కొన్ని ప్రోటీన్లు మాంసాహారంతో శరీరానికి నేరుగా అందుతాయి కాబట్టే వాటికి ఆ పేరు. మరి శాకాహారులైతే ఈ మాంసకృత్తులు ఎలా...? మాంసం, చేపలు తినని వారికి ఏ ఆహారంతో ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. ప్రొటీన్లు పుష్కలంగా అందేలా ‘ముందుజాగ్రత్త’ తీసుకోండి. 

మాంసకృత్తులు మన శరీర నిర్మాణంలో ముఖ్యమైన పదార్థాలు. కండరాల బలానికి ఇవి చాలా అవసరం. అలాగే కణజాలల పనితీరు, అంతర్గత అవయవాల ఆరోగ్యానికి ప్రొటీన్లు ఎంతగానో అవసరం అవుతాయి. మాంసకృత్తులని ప్రాణ్యములు అనీ, ప్రొటీన్లు అని వీటిని పిలుస్తారు. గ్రీకు భాషలో ‘ప్రోటోస్’ అంటే ముఖ్యమైనది అని అర్థం. అమినో యాసిడ్స్...

ఇరవెరైండు రకాల అమినో యాసిడ్స్ వేరు వేరు తరహాల్లో ఒక దానికి ఒకటి అనుసంధానితమై మన శరీరంలో ఎన్నో రకాల ప్రొటీన్లుగా తయారవుతాయి. ఉదాహరణకు... శిరోజాలకు, గోళ్లకు, ఎముకలకు, హార్మోన్లకు, కండరాలకు... ఇలా ప్రతీ దానికీ వేరు వేరు మోతాదుల్లో ప్రొటీన్ అవసరం అవుతుంది. ఈ ప్రోటీన్ సమకూర్చడం అన్నది ఇరవై రెండు రకాల అమినో యాసిడ్స్ ద్వారా సాధ్యమౌతుంది. ఈ ప్రక్రియ మొత్తం ఆర్.ఎన్.ఎ, డి.ఎన్.ఎ పర్యవేక్షణలో జరుగుతుంది. (ఆర్.ఎన్.ఎ, డి.ఎన్.ఎ ప్రత్యేకమైన ప్రొటీన్లు. వీటిలో మన జీవన విధానాన్ని నిర్దేశించే జన్యువులు ఉంటాయి). అయితే వీటిలో ఎనిమిది రకాల అమినో యాసిడ్స్‌ని శరీరం స్వయంగా తయారుచేసుకోలేదు. అందుకని వీటిని తప్పనిసరిగా ఆహారం ద్వారానే తీసుకోవాలి. వీటినే ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటారు.

శరీరంలో ప్రొటీన్లు అమినో యాసిడ్స్‌తో తయారవుతాయి. అన్ని రకాల ప్రొటీన్లు జీర్ణం అయ్యాక అమినో యాసిడ్స్‌గా మారి రక్తంలోకి వెళ్తాయి. అక్కడ నుంచి ఈ అమినో యాసిడ్స్ మళ్లీ మన శరీరానికి అవసరమైన కొత్త ప్రొటీన్‌గా రూపొందుతాయి. మాంసం, చేపలు, గుడ్లు, పాలు, మొదలైన జంతు సంబంధమైన వనరుల నుండి లభించే ప్రొటీన్లు తీసుకునేవారికి ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. అయితే పప్పులు, కాయగూరలు తీసుకునే శాకాహారులు కూడా ప్రొటీన్లు ఉండే సమతుల ఆహారం తమ భోజనంలో ఉండేలా చూసుకుంటే వారి ఆరోగ్యం బాగుంటుంది.


ప్రొటీన్ల వల్ల ఉపయోగాలు...
శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు, ఎముకల బలానికే కాకుండా హార్మోన్ల పనితీరుకు, రోగనిరోధక కణాల కోసం, జీర్ణకోశ రసాయనాల విడుదలకు, ఎర్ర రక్త కణాల పునరుజ్జీవానికి ప్రొటీన్ల అవసరం ఎంతైనా ఉంది. పెరిగే వయసులో సరైన ఎదుగుదలకే కాదు, ఒకసారి ఎదిగిన తర్వాత శరీరాన్ని సరిగ్గా మెయింటనెన్స్ చేయడానికి కూడా ప్రొటీన్ల సహాయం తప్పనిసరి. అంతేకాదు ప్రొటీన్లు శక్తినీ, శరీరానికి తగినంత వేడిని అందిస్తాయి.
ప్రొటీన్లు శరీరానికి తగినంతగా అందకపోతే...
జుట్టు రాలిపోవడం, గోళ్లు విరిగిపోవడం, చర్మం పొడిబారడం, రక్తహీనత, నీరసంగా ఉండటం, కండరాలు క్షీణత, లైంగికంగా బలహీనంగా అనిపించడం, చురుకుదనం లోపించడం... వంటివి జరుగుతాయి. 
వీటిలో ప్రొటీన్లు ఎక్కువ...
పాలు, మాంసం, గుడ్లలో ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి.
తల్లిపాలలో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే మొదటి ఏడాది ఇవి బిడ్డకు కావల్సిన బలాన్ని ఇస్తాయి. అందుకే తప్పనిసరిగా
తల్లిపాలు శిశువుకి ఇవ్వాలని, అవి శిశువు భవిష్యత్తు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటారు.

గింజధాన్యాలను నేరుగా కంటే, కొద్దిగా ఉడికించి తీసుకుంటే, త్వరగా జీర్ణమై ఇందులోని ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. అలా అని గింజ ధాన్యాలను ఎక్కువ ఉడికించడం, ఉడికించిన నీరు పారబోయడం వంటివి చేస్తే ప్రొటీన్లను కోల్పోయే అవకాశం ఉంటుంది.

మిగతా చిక్కుడు జాతి గింజలతో పోల్చితే సోయాలో ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి.
 

వెజ్‌లో ప్రొటీన్లు...
బాదం, జీడిపప్పు, శనగలు, వేరుశనగలు, చిక్కుళ్లు, గుమ్మడి, పొద్దుతిరుగుడు, నువ్వులు, వాల్‌నట్స్, కందిపప్పు, బీన్స్, సోయా బీన్స్, బఠాణీ, బార్లీ, దంపుడు బియ్యం, ఓట్‌మిల్, గోధుమ...
గుడ్డులో...




రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది అని చెబుతుంటారు. కోడిగుడ్డులో 13 శాతం అన్ని రకాల అమినో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. అయితే ప్రొటీన్లు తెల్ల సొనలో ఉంటాయి. పచ్చసొనలో విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ ఉంటాయి. మన శరీరానికి, కణజాలానికి తెల్లసొనలో ఉండే ప్రొటీన్లు 99.9% సరిగ్గా సరిపోలుతాయి. రోజూ ఒక గుడ్డును తినడం వల్ల వీటిలోని పోషకాలు అంది మెదడు చురుగ్గా పనిచేస్తుంది. 
అల్పాహారంలో...
తొమ్మిది నుంచి పదకొండు సంవత్సరాల వయసు గల విద్యార్థులలో పౌష్టికాహార నిపుణులు జరిపిన పరిశోధనల్లో తేలిన విషయం ఏంటంటే... ఉదయాన్నే అల్పాహారంలో ప్రోటీన్లు ఎక్కువ శాతం ఉన్న ఆహారం తీసుకున్న వారిలో మెదడు పనితీరు చురుకుగా ఉన్నట్టు వెల్లడైంది. అయితే శరీరానికి కావలసిన ప్రొటీన్లను అందించకుండా టీ, కాఫీల ద్వారా నేరుగా చక్కెరను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందవు. ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి.
 

100 గ్రా.ల పదార్థాలలో ప్రొటీన్ల శాతం...
మాంసాహారం, గుడ్డు, సోయా, కాయ గింజలు, పప్పు దినుసులు, నట్స్, పాలలో ఎక్కువ శాతం, కొద్ది మోతాదులో బియ్యం, గోధుమలలోనూ ప్రొటీన్లు ఉంటాయి.
సోయా - 40 %
కోడిగుడ్డు - 13%
మాంసం - 20 %
తృణధాన్యాలు - 10%
బియ్యం - 7%
ఆకుకూరలు, పండ్లు, దుంపలు - 2%
కొవ్వు తీసేసిన నూనె గింజలు - 50- 60%
(తెలగపిండి)
వయసుల వారీగా ఒక రోజుకు కావలసిన ప్రొటీన్లు

పురుషులకు - 60 గ్రా.; స్ర్తీలకు - 50 గ్రా.
గర్భవతికి - 50+15 గ్రా.; పాలిచ్చే తల్లులకు - 50+25 గ్రా. (12 నెలల వరకు)



WORLD FAMOUS TOURIST SPOT - KANYAKUMARI - INDIA - A BRIEF ARTICLE


సాగర అందాలకు అగ్రస్థానం... కన్యాకుమారి




వివేకానందుని స్ఫూర్తి క్షేత్రం... మహాత్ముని స్మారక చిహ్నం... ఇవి సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారి ని విహారకేంద్రగానే కాక, విజ్ఞాన ఖనిగా మార్చిన అద్భుత నిర్మాణాలు. పర్యాటక భారతావనికి చివరి మజిలీగా... త్రివేణి సంగమ పవిత్ర స్థలంగా... ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ప్రకృతి అందాల మణిమకుటం కన్యాకుమారి విశేషాలు...

మూడు సముద్రాల అరుదైన మేలుకయిక కన్యాకుమారి ప్రధాన ఆకర్షణ. భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్యభగవానుడు, అప్పుడే సముద్ర గర్భం నుంచి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తుంటా డు. ముఖ్యంగా పౌర్ణ మి రోజు రాత్రి పూ ట ఏకకాలంలో జ రిగే సూర్యా స్తమ యం, చంద్రో దయాలను చూ సి పులకించని యాత్రికుడుండడేమో.
 

త్రివేణి సంగమ క్షేత్రం...

కన్యాకుమారిలో బంగాళాఖాతం, మరోవైపు అరేబియా మహాసము ద్రం, దిగువన హిందూ మహాసము ద్రం.. వీక్షకుల్ని పరవశింపజేస్తుం టాయి. సముద్రతీర ప్రకృతి రమణీ యతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని థోరియం ధాతువుతో కూడిన ఇసుక రేణు వులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాళ్లుగా చెబుతుంటా రు. అలాగే వారణాసి పరమశివు డికి నివాస స్థలమైనట్లుగా, కన్యా కుమారి పార్వతిదేవికి నివాస స్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వా సం. మూడు మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు.

ప్రధాన ఆకర్షణలివే...
కన్యాకుమారిలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వివేకానంద రాక్‌, తిరువళ్లువర్‌ విగ్రహం, గాంధీజీ స్మారక మంటపం, కుమరి ఆలయం ముఖ్యమైనవి. అలాగే ఈ ప్రాంతంలో అనేక రకాల అరుదైన పుష్పాలు, వృక్షాలను కూడా చూడవచ్చు. ఇంకా పెలికాన్‌, ఫ్లెమింగ్‌, స్పూన్‌బిల్‌, అనేక రకాల బాతులు.. కన్యాకుమారికి వలస వస్తుంటాయి. ఈ విదేశీ పక్షులు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

వివేకానంద రాక్‌...
కన్యాకుమారి పర్యాటనలో ముందుగా చెప్పుకోవాల్సింది వివేకానంద రాక్‌. ఇక్కడ క్రీస్తు శకం 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల చలువరాతితో స్మారక కేంద్రం నిర్మించారు. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 1970వ సంవ త్సరంలో అప్పటి రాష్టప్రతి వి.వి. గిరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వివేకా నందుడి రాక్‌కు కొంత దూరంలో పార్వ తిదేవి పరమశివుడిని పెళ్లాడేందుకు తపస్సుచేసిన ప్రాంతం, అక్కడ శిలారూ పంలోని ఆమె పాద ముద్రిలు కూడా మనకు దర్శనమిస్తాయి.

తరువళ్లువర్‌ విగ్రహం...




వివేకానంద రాక్‌కు సమీపంలోని ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనిని 2000 సంవత్సరం లో తమిళనాడు ముఖ్యమంత్రి డాక్టర్‌ కరుణానిధి ఆవిష్కరించారు. ఈ తిరు వళ్లువర్‌ విగ్రహం బరువు ఏడువేల టన్నులు కాగా.. చాలా పొడవైన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు పడవలలో వెళ్లాల్సిందే. ఇది ఆసియా లోని ఎతె్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది.

మహాత్ముని స్మారక చిహ్నం...


కన్యాకుమారిలో చూడదగిన మరో అద్భుత పర్యాటక క్షేత్రం మహాత్మా గాంధీ స్మారక మంటపం. గాంధీజీ అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో 1954వ సంవత్సరంలో ఈ స్మారక మంటపాన్ని నిర్మించారు. మహాత్ముడి జయంతి అయిన అక్టోబర్‌ 2 మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్య కిరణాలు ఆయన అస్థికలను స్పృశించేలా అద్భుతంగా నిర్మించడం విశేషం.

కుమరి ఆలయం...


బాణాసురుడిని సంహరించిన అమ్మవారి కుమరి ఆలయం చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. మూడువైపులా ఎతె్తైన గోడలున్న ఈ ఆలయంలో మూడు ప్రాకారాలు న్నాయి. ఆలయంలోని ముగ్ధ మోహనదేవి విగ్రహం భక్తులను పరవశింపజేసేలా ఉంటుంది. ఒకప్పుడు దేవి ముక్కెరలోని రత్నపు కాంతి నావికులను ఆకర్షించి నావలు రేవులోని బండరాళ్లను ఢీకొనేవని చెబుతుంటారు. బంగాళాఖాతానికి అభి ముఖంగా ఉండే ఈ ఆలయ ద్వారా న్ని ఎల్లప్పుడూ మూసే ఉంచుతారు. సంవ త్సరంలో ఓ నాలుగైదుసార్లు మాత్రమే ఉత్సవాల సందర్భంగా తెరుస్తారు.

ఆలయ చరిత్ర...
పురాణ కథనాల ప్రకారం కుమరి ఆలయంలో దేవతగా కొలువబడుతున్న కన్యాదేవి, పరమశివుడిని వివాహం చేసు కునేందుకు సిద్ధపడిం దట. అయితే ముహూర్తం సమయా నికి కూడా శివుడు రాకపోవ టంతో విందుకు సిద్ధంచేసి పెట్టుకున్న బియ్యం రాశులను, మిగిలిన వస్తువులను అలాగే ఉంచేశారట. కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్లుగా, బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తుంటాయని చెబుతుంటారు.

ఇందిరాపాయింట్‌...

కన్యాకుమారి చివరి సరిహద్దును ఇందిరాపాయింట్‌ అని పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని చూసేందుకు దేశం నలుమూలలనుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. అలాగే కన్యాకుమారి శివార్లలోని ఉదయగిరి కోట, విట్టకొట్టాయ్‌ కోటలు ఇక్కడ మరో ఆకర్షణ. కన్యాకుమారికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే తమి ళులకు ప్రీతిపాత్రమైన స్వామితోప్‌ పతి ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది.

రొయ్యలకూ ప్రసిద్ధి...
ప్రముఖ పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతున్న కన్యాకుమారి ‘రాక్‌ లాబ్‌స్టర్స్‌’ అని పిలిచే భారీ సైజు రొయ్యలకు కూడా ప్రసిద్ధి చెందినది. సగటున రెండు కేజీల బరువుండే ఈ లాబ్‌స్టర్ల ధర 5 వేల రూపాయల పైమాటే. కేంద్ర సముద్ర మత్స్య పరి శోధనా సంస్థ వాణిజ్య ప్రాతిపదికన కేజ్‌ కల్చర్‌ద్వారా ప్రత్యేకంగా పెంచ బడే ఈ లాబ్‌స్టర్లను ఎక్కువగా జపాన్‌, హాంకాంగ్‌ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు.


కన్యాకుమారి, మండపం, కేరళలోని విళింజం వంటి తీర ప్రాంతాల్లోనే ఈ లాబ్‌స్టర్లు ఎక్కువగా దొరుకు తుంటాయి. తీరం నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలో ఉండే రాళ్ల చుట్టూనే ఉంటాయి కాబట్టి వీటికి రాక్‌ లాబ్‌స్టర్స్‌ అనే పేరు వచ్చింది. ఇవి రాళ్ల చుట్టూ ఉంటాయి కాబట్టి రొయ్యల్లా ట్రాలింగ్‌ చేసి మొత్తం ఊడ్చి పట్టేయడం సాధ్యపడదు. వేరే చేపల కోసం వేసిన వలల్లో ఇవి పడుతూ ఉంటాయి. సెప్టెంబరు-జనవరి మధ్య ఎక్కువగా లభించే వీటిని పట్టుకునేం దుకు మత్స్యకారులు కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంభిస్తుంటారు.

ఇలా వెళ్లాలి...
చెన్నై నగరానికి 743 కిలోమీటర్ల దూరంలో ఉండే కన్యాకుమారి ఎలా వెళ్లాలంటే.. విమాన మార్గంలో అయితే, మధురై నుంచి 250 కిలోమీటర్లు, తిరువనంతపురం నుంచి 90 కిలో మీటర్ల దూరం ప్రయాణించి వెళ్లవచ్చు. చెన్నై నుంచే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాల నుంచి కన్యాకుమారికి నేరుగా రైలు సౌకర్యం ఉంది. తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాలనుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కన్యాకుమారి చేరుకోవచ్చు. ఇక వసతి విషయానికి వస్తే.. కన్యాకుమారిలో పలు చిన్న, పెద్ద హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖవారి హోటల్‌, దేవస్థానంవారి కాటేజీలు, ట్రావెలర్స్‌ బంగళా, అతిథి గృహాలు.. పర్యాటకులకు అందుబాటు లో ఉన్నాయి. 

SOUTH INDIAN FAMOUS TEMPLE - BRUHADRESWARA ALAYAM AT TANJAVOUR TAMILNADU INDIA - A BRIEF HISTORY AND FACTS


దక్షిణ భారత శిల్ప సౌందర్యం బృహదీశ్వరాలయం

భారతదేశంలో దేవాలయం అన్నది మతానికి, ఆరాధనకు జీవగర్రగా ఉంటూ వచ్చింది. విగ్రహాన్ని నెలకొల్పిన ఆలయంలో భక్తులకు ప్రదక్షిణ, పూజచేయడానికి ఏర్పాట్లుండేవి. ఆలయం అనేది మనదేశంలో వివిధ దశల్లో రకరకాలుగా రూపొందుతూ వచ్చింది. ఆయా దేశ, కాల పరిస్థితులను బట్టి దేవాలయం మార్పులకు లోనవుతూ వచ్చింది. అయితే ఆలయాలను నిర్మించిన స్థపతులూ, శిల్పులూ ఒకే రకమైన శిక్షణ పొందినవారు. ఆయా దేవాలయాలలోని దేవుళ్లు, పూజాపద్ధతులు తెలిసిన పూజారులు, మతాధికారులు మొదలైన వారి ఆదేశాలనుసారం ఈ శిల్పులు ఆలయ నిర్మాణాలు చేశారు.ప్రధాన దేవతా విగ్రహాల రూపుౌౌరేఖలలో ఆలయాల శిల్పరీతులలో అలంకరణలలో మార్పులు చేశారు.వీటన్నిటి ఫలితంగానే మన శాస్త్రాలలో పేర్కొన్న వాస్తు శిల్ప, ఆగమ గ్రంథాలు, సూత్రాలు రూపొందాయి. ఈ కారణంగానే మన దేశంలోని వాస్తు శిల్పం అంటూ ఒక సమగ్రమైన, మౌలికమైన భారతీయ శిల్పంగా గోచరిస్తుంది. అలాంటి శిల్ప, వాస్తు సౌందర్యాల మేళవింపే బృహదీశ్వరాలయం...

తమిళనాడులో కావేరీ నదికి దక్షిణాన ఉన్న తంజావూరులో ఉంది బృహదీ శ్వరాలయం. తంజావూరుకు ఈ పేరు ‘తంజన్‌-ఆన్‌’ అనే రాక్షసుని వల న వచ్చిందని చెబుతారు. ఈ రాక్షసుడు శ్రీఆనందవల్లి అమ్మ, శ్రీనీలమేఘ పెరుమాళ్‌ ల చేత చంపబడ్డాడని, ఆ రాక్షసుని కోరిక మేరకు ఈ పట్టణానికి తంజావూరు అనే పేరు వచ్చిందనేది ఒక పురాణగాథ. చారిత్రకంగా ఈ నగరం చోళ రాజులకు బలమైన కేంద్రం. తరువాత నాయక రాజులు, ఆ తరువాత విజయ నగర రాజులు పరిపాలించారు. అటుపిమ్మట 1674వ సంవత్సరంలో ఈ నగరాన్ని ‘వెంకాజీ’ ఆక్రమించుకున్నాడు. ఈ వెంకాజీ శివాజీ మహారాజు కు తమ్ముడు. 1740లో బ్రిటీష్‌వారు మొదట ఆక్రమణకు ఇక్కడికి వచ్చినా విఫలం చెందారు. తరువాత 1799లో విజయం సాధించారు. ఇదీ స్థూలంగా ఈ నగర చరిత్ర..
అచ్చెరువొందే శిల్పకళానైపుణ్యం...
ఆనాడు చోళుల సామ్రాజ్యం తమిళ, కేర ళ దేశాలకే కాక దక్షిణ మైసూరు, కోస్తాంధ్ర, అండమాన్‌, లక్షద్వీప్‌, మాల్దీవులు మొదలైన ద్వీపాలకు విస్తరించి ఉంది. అప్పటికే రాష్ట్ర కూటులు తమ ప్రాభవాన్ని కోల్పోగా పశ్చిమ చాళుక్యులు విజృంభించారు. చాళుక్యులు వచ్చే నాటికే అక్కడక్కడా రాతితో ఆలయ నిర్మాణాలు, వాటిపై అందమైన శిల్పాలు శాస్తబ్రద్ధంగా పరిణతి చెందాయి. విశాలమైన ఈ ఆలయానికి చేరడానికి మూడు ద్వారాలున్నాయి. మొదటి ద్వారం అనగా ప్రవేశద్వారం ‘కేరళాంతకన్‌’, రెండో ద్వారం ‘రాజరాజ న్‌ తిరువసల్‌’, మూడో ద్వారం ‘తిరువానుక్కన్‌ తిరువసల్‌’ఈ ఆలయం సర్వ కళా శోభితమై సంస్కృత తమిళ శాసనాలున్న చారిత్రాత్మక సుప్రసిద్ధ దేవాల యంగా అలరారుతున్నది. క్రీశ 1003-14 ప్రాంతంలో మొదటి రాజరాజ చోళుడు బృహదీశ్వరాల యాన్ని నిర్మించాడు. ఈపవిత్ర ఆలయంలోకి అడుగిడగానే 13 అడుగుల ఎతె్తైన శివలింగం దర్శనమిస్తుంది.ఐదుపడగల నాగేంద్రుని నీడన స్వామి దర్శ నమిస్తాడు. ఈ దేవాలయం మొత్తం నిర్మాణంలో ఇదొక అద్భుతమైన నిర్మా ణం. దక్షిణ విమాన నిర్మాణ కౌశలానికి, తమిళ శిల్పుల ళా నైపు ణ్యానికి పరాకాష్టగా దీనిని పేర్కొనవచ్చు. ఈ బృహదీశ్వరాలయా న్ని నిర్మించిన రాజరాజచోళుడి పేరున ‘రాజరాజేశ్వరాలయం’ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం వాస్తు, శిల్ప, చిత్రలేఖన కళ లన్నిటి సంగమం అని చెప్పవచ్చు.
ైభారీ నంది, ఎతె్తైన శివలింగం...

ఈ ఆలయానికి ఎదురుగా బ్రహ్మాండమైన నంది శిల్పం ఉంది. రాజ రాజచోళుని తరువాత వచ్చిన రాజులు ఈ నంది విగ్రహం చుట్టూ చక్కని మండపాన్ని నిర్మించారు. అనంతపురం జిల్లాలోని లేపాక్షి నంది విగ్రహం కంటే ఈ విగ్రహం పెద్దది. మండపం లోపలి కప్పుకి అందమైన రంగులతో డిజైన్లు చిత్రించారు. ఆ చిత్రాలు ఇప్పటికీ తమ ప్రాభవాన్ని కోల్పోకుండా అందంగా అలరిస్తున్నాయి. ఈ మండపం చాలా ఎత్తులో ఉంటుంది. బృహదీశ్వర ఆలయం విమానపు అధిష్టానం రెండు తలాలతో, మందమైన రెండు గోడల సాంధర ఆలయంగా ఉంటుంది. ఆలయం తూర్పునకు అభి ముఖంగా ఉండగా, ఉత్తర, దక్షిణ, పడమర దిశల్లో ద్వారాలున్నాయి. గర్భగు డిలో చాలా పెద్ద పీఠం, దానిమీద పెద్ద లింగం ఉంది. ఇంత పెద్ద లింగం బహు శ దక్షిణ భారతదేశంలోనే లేదేమో! రెండు గోడల మధ్య రెండతస్తులతో ప్రదక్షి ణ మార్గం కూడా ఉంది.ఇలా నాలుగు వైపులా ద్వారాలున్న ఈ ఆలయం సర్వతోభద్రంగా ఉన్న ఆలయంగా వర్ణిస్తారు.
 అబ్బురపరిచే వర్ణచిత్రాలు...

అలాగే ఆలయద్వారానికి అటూ ఇటూ ఉన్న నిలువు గూళ్లను దేవకోష్టాలుగా తీర్చి వాటిలో దేవతామూర్తుల విగ్రహాలనుం చారు. ఇక కింది తలుపు లోపలి గోడలో దక్షిణాన శివుడు, పడమట వైపు నటరాజు, ఉత్తరాన దేవీ విగ్రహాలున్నాయి. ఆలయ ప్రదక్షిణ మార్గపు లోపలి గోడల మీద, కుడ్య స్తంభా లమీద, ఆలయ చూరు మీద, బయటి గోడలో తట్టుమీద అందమైన వర్ణచిత్రాలున్నాయి. ఈ వర్ణ చిత్రాలలో శివుడు త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించిన కథ చిత్రాలు ఉన్నాయి. ఇంకా శివ భక్తుడై న సుందరమూర్తి కథ, చిదంబరం నటరా జు మూర్తిని రాజు పూజిస్తున్న దృశ్యం, గాయకులు, నాట్యకత్తెలు, వివిధ పక్షులు వంటి చిత్రాలను అందంగా చిత్రించారు.

ప్రాకారంలో నందికి ఉత్తరంగా బృహదీశ్వరీ అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయ విమానం మీద విశాల శిఖరం, ఎదురుగా మండపాలు ఉన్నాయి. ఆ పక్కనే సభామండపంలో దక్షిణాముఖుడైన నటరాజస్వామి ఉన్నాడు. ఆగ్నేయాన గణేశుడు, వాయువ్యాన సుబ్రహ్మణ్య ఆలయాలు తూర్పు ముఖంగా ఉన్నాయి.ఇవన్నీ కూడా కాలక్రమంలో వివిధరాజులు కట్టించినవి.

బృహదీశ్వర ఆలయ ప్రాంగణంలో నాయక రాజులు కట్టించిన సుబ్రహ్మణ్య ఆలయం ఒక మణిపూసవంటింది.బృహదీశ్వర ఆలయ ప్రాకారం లోపల ఈ ఆలయాన్ని విమాన అర్ధ, ముఖ మండపాలతో కట్టారు. నునుపైన గట్టి రాతితో కట్టిన ఈ ఆలయపు అధిష్ఠానం మీద, కుడ్య స్తం భాల మీద చాలా సూక్ష్మమైన, అందమైన శిల్పాలున్నాయి. ఈ శిల్పాలు అందమైన అలం కరణ లతో కనులు పండువుగా ఉన్నాయి. గర్భగృహంలో సుబ్రహ్మణ్య స్వామిని సూచిస్తున్నట్లు ఆల య గ్రీవ శిఖరాలు షణ్ముఖంగా ఉంటాయి. బహుతలములైన ఈ ఆలయపు విమాన తలం మూ లలు కూడా షట్భుజంగా ఉన్నాయి. ఈ పద్ధతి తరువాతి దక్షిణాత్య స్థపతులకు మార్గదర్శకాల య్యాయి.
సమ్మోహనభరితం... కోట ప్యాలెస్‌...
తంజావూరులో చూడదగ్గ మరో అద్భుత కట్టడం పెద్ద కోట ప్యాలెస్‌. 14వ శతాబ్దంలో పరిపాలించిన నాయక, మరాఠా రాజులు ఈ ప్యాలెస్‌ను గొప్పగా తీర్చిదిద్దారు. దాదాపు 110 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్‌లో సమ్మో హనపరిచే అందమైన కట్టడాలు, విశాలమైన కారిడార్లు, గదులు, ఎతె్తైన టవ ర్లు, ఆకర్షణీయమైన వర్ణచిత్రాలతో గది గోడలు, పరరాజుల దాడులలో రక్షణ కు ఉపయోగించే రహస్య భూమార్గాలు ఉన్నాయి.
విజ్ఞాన గని... సరస్వతీ మహల్‌
పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే వాటిలో ముఖ్యమైనది సరస్వతీ మహ ల్‌ గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో పురాతన తాళపత్ర గ్రంథాలు, ఆనాటి వర్ణచిత్రాలు, చోళ, నాయక, మరాఠా రాజులు వాడిన ఆయుధాలు, వాటికి సంబంధించిన వివరాలున్నాయి. సంస్కృత గ్రంథాలు, వేలాది రాతప్రతులు, భారత యూరోపియన్‌ భాషలకు సంబంధించిన గ్రంథాలు, అముద్రిత గ్రంథాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రంథాలయం ఓ పెద్ద విజ్ఞాన భాండాగారం. చరిత్ర అధ్యయన కారుల కు, విజ్ఞానపిపాసులకు ఈ గ్రంథాలయం ఓ వరం.


త్యాగరాజస్వామికి ఘన నివాళి...
తంజావూరుకి 11 కి.మీ. దూరంలో ఉన్న ‘తిరువయూరు’ అనే గ్రామం కావేరీ నది ఒడ్డున ఉంది. ఈ గ్రామంలోనే ప్రఖ్యాత వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి వారి సమాధి మందిరం ఉం ది. అనర్గలమైన సంగీత రత్నాలను అందించిన ఆయన సమాధి వద్ద ప్రతి సంవత్సరం ‘త్యాగ రాజస్వామివారి ఆరాధన ఉత్సవాలు’ ఘనంగాజరుపుతారు. ఆరోజు ఇక్కడికి దేశం నలుమూ లల నుంచి సంగీత విద్వాంసులు వచ్చి స్వామివారికి నీరాజనాలు పలుకుతారు. ఆయన రచించి న గీతాలను ఆలపిస్తూ ఈ కార్యక్రమం సాగుతుంది.


బృహదీశ్వరాలయానికి చేరుకోవాలంటే...
ఈ ప్రసిద్ధ ఆలయానికి చేరాలంటే... చెనై్న వరకు రైలు లేదా విమాన ప్రయాణం ద్వారా చేరుకొ ని అక్కడి నుండి బస్సు ద్వారా తంజావూర్‌ చేరుకోవచ్చు.

తొలి వెయ్యి నోటుపై బృహదీశ్వరాలయం...

1954లో మొట్టమొదటిసారిగా రూ.1000 నోటు చలామణిలోకి వచ్చింది. ఆనాడు భారత ప్రభుత్వం ఆ నోటుమీద బృహదీశ్వరాయం బొమ్మను ముద్రించింది. తరువాత 1975లో భారత ప్రభుత్వం వెయ్యి రూపాయల నోటును నిషేధించింది. ఈనాడు మళ్లీ ఈ ఆలయం సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ ఆ నోటు గుర్తుకు వచ్చింది.
1954లో తొలిసారిగా బృహదీశ్వరాలయం ఫొటోతో విడుదలైన వెయ్యి రూపాయల నోటు.

తపాలా ‘ముద్ర’...

రాజరాజచోళునిచే 1010వ సంవత్సరంలో తంజా వూరులో నిర్మించిన బృహదీశ్వరాలయానికి వెయ్యి సంవత్సరాలు నిండిన సందర్భంగా, సహస్రాబ్ది ఉత్స వాలకు తపాలాశాఖ 26-9-2010 న బృహదీశ్వరాలయం బొమ్మలతో ఒక ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. మన దేశంలో ఉన్న అతిపెద్ద గర్భగుడి, విమాన గోపురం ఉన్న దేవాలయం ఇదే. భూమినుండి స్తుపి వరకు 66మీ ఎత్తులో అద్భుత శ్పికళా సంపదతో అలరారే ఈ దేవాలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇటీవల తపాలా శాఖ విడుదల చేసిన బృహదీశ్వరాలయం పోస్టల్‌ స్టాంప్‌.

WHY INDIAN WOMEN PUT EAR RINGS ?


చెవులెందుకు కుట్టిస్తారు? మీకు తెలుసా?


ఆడ పిల్లలకు చెవులూ, ముక్కూ కుట్టించి చక్కని ఆభరణాలు ధరింపచేసి లక్ష్మీ దేవిలా తలచుకుని మురిసిపోయే ఆ కార్యక్రమంలో మరో ఆరోగ్య రహస్యం కూడా వుంది.చెవులు కుట్టించుకుంటే కంటి చూపు శక్తి పెరుగుతుంది. ఆక్యుపంక్చర్‌ వైద్య విధానం చెవి కుట్టించుకుంటే శరీరం మొత్తానికి మంచిదని చెబుతోంది.

HEALTH USES OF DATES - KARJURA



ఖర్జూరాలతో కలిగే మరిన్ని ప్రయోజనాలివి...

ఖర్జూరాల్లో ఉన్న పోషకాలు, అవి చేసే మేలు ఇంత అని చెప్పలేం. ఇందులో ఫ్రక్టోజ్, డెక్స్‌ట్రోజ్ అనే చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని తిన్న వెంటనే తక్షణం శరీరంలోకి ఎంతో శక్తి విడుదలవుతుంది. ఖర్జూరాలతో కలిగే మరిన్ని ప్రయోజనాలివి... 

ఖర్జూరాల్లో పీచుపదార్థం (డయటరీ ఫైబర్) చాలా ఎక్కువ. మనం చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) ఎక్కువగా తీసుకున్నప్పుడు ఖర్జూరాలు తింటే... ఇందులోని పీచుపదార్థాలు ఈ చెడుకొలెస్ట్రాల్‌కు అడ్డుపడి శరీరంలో ఇంకకుండా చూస్తాయి. దాంతోపాటు తేలిగ్గా మలవిసర్జన కావడం జరుగుతాయి. 

ఖర్జూరాల్లో ఉండే టానిన్స్ అని పిలిచే ఫ్లేవనాయిడ్ పాలీఫీనాలిక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్లను, మంట, వాపు వంటివి కలగడాన్ని (ఇన్‌ఫ్లమేషన్‌ను), రక్తస్రావాలను నివారిస్తాయి. 

ఖర్జూరాల్లో ఉండే బీటా-కెరోటిన్, ల్యూటిన్, జీ-గ్జాంథిన్ అనే యాంటీఆక్సిడెంట్స్ మన శరీరంలోని అన్ని కణాలను సంరక్షిస్తాయి. పై పోషకాలు పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్ క్యాన్సర్లను నిరోధిస్తాయి. 

జీ-గ్జాంథిన్ అనే పోషకం మన కంటి రెటినాలోకి శోషితమై కంటిని సంరక్షిస్తుంటుంది. వయసు పెరగడం వల్ల కన్ను సామర్థ్యం తగ్గడాన్ని ఈ పోషకం నివారిస్తుంది. 

ఖర్జూరాల గురించి ముఖ్యంగా చెప్పాల్సింది... మన దేశంలోని మహిళలు వీలైనంత ఎక్కువగా దీన్ని వాడటం మంచిది. ఎందుకంటే మన దేశంలోని 85 శాతం యుక్తవయసున్న మహిళల్లో రక్తహీనత ఉంటుంది. ప్రతి 100 గ్రాముల ఖర్జూరాల్లో 0.90 మి.గ్రా. ఐరన్ ఉంటుంది. దాంతో ఖర్జూరాలు క్రమం తప్పకుండా తినేవారికి రక్తహీనత తగ్గుతుంది. అందుకే మహిళలు తాము తినే చిరుతిండ్లలో దీన్ని భాగం చేసుకోవడం చాలా మేలు. 

ఇందులో పొటాషియమ్ పాళ్లూ ఎక్కువే. 100 గ్రా. ఖర్జూరాల్లో 696 మి.గ్రా. పొటాషియమ్ ఉంటుంది. పొటాషియమ్ రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది కాబట్టి హైబీపీ ఉన్నవారు వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండెజబ్బులు (కరొనరీ హార్ట్ డిసీజెస్), పక్షవాతం వంటి వాటిని నివారించవచ్చు. 

HOW MUCH CALORIES ARE CONSUMED WHILE DOING EXERCISES ?


ఏయే వ్యాయామాలతో ఎన్నెన్ని క్యాలరీల ఖర్చు...?


మహిళలు చేసే ఏయే వ్యాయామాల వల్ల ఎన్నెన్ని క్యాలరీలు ఖర్చవుతాయనే అంశం అనేక ఇతర విషయాలపై ఆధారపడుతుంది. అయితే దాదాపు 75 కిలోల బరువున్న ఒక మహిళ చేసే కొన్ని వ్యాయామాలతో ఉజ్జాయింపుగా ఎన్నెన్ని క్యాలరీలు ఖర్చవుతాయనే వివరాలు ఈ కింద...

Blenders Pride HYderabad International Fashion Week 2012 Day 3

Blenders Pride HYderabad International Fashion Week 2012 Day 3

Blenders Pride HYderabad International Fashion Week 2012 Day 3

Blenders Pride HYderabad International Fashion Week 2012 Day 3

Blenders Pride HYderabad International Fashion Week 2012 Day 3

Blenders Pride HYderabad International Fashion Week 2012 Day 3

Blenders Pride HYderabad International Fashion Week 2012 Day 3

Blenders Pride HYderabad International Fashion Week 2012 Day 3

TELUGU NOVEL BY MALLADHI VENKATA KRISHNA MURTHY - FEAR OF LIFE - A FAMILY DRAMA NOVEL


Malladi Venkata Krishna Murthy's Telugu Novel

Life Fear - family drama - ladies special novel