ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

A BRIEF FACTS OF THE FESTIVAL MAHA SHIVA RATHRI IN TELUGU

మహా శివరాత్రి




మాఘమాసంలో బహుళ చతుర్ధశిని “మహా శివరాత్రి” అంటారు. (తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందు రోజు – రాత్రి చతుర్ధశి కలిగిన వున్న రోజుని జరుపుకోవాలి) . మహా శివరాత్రి మానవులందరకు పర్వదినము – అనగా గొప్ప పండుగ. చలి కాలం వెళ్ళబోతుండగా ‘మహాశివరాత్రి’ పండుగ దినము వస్తుంది. శివక్షేత్రములందు ‘శివరాత్రి’ని పార్వతీ పరమేశ్వరుల (శివ-పార్వతుల) కళ్యాణ మహోత్సవముగా చాలా గొప్పగా జరుపుతారు.
శిభక్తులు ఈ పండుగనాడు తెల్లవారు ఝాముననే నిద్ర లేస్తారు. ఇళ్ళలోను, గుళ్ళలోనూ కూడ శివపూజలు, శివాభిషేకములు చేస్తారు. ఈ రోజు ‘ఉపవాసం’, రాత్రి ‘జాగరణ ‘చేస్తారు. (రాత్రి అంతా మేల్కొని శివనామ స్మరణ చేస్తూ గడపడాన్ని జాగరణ అంటారు. మరునాటి ఉదయం యధావిధి స్నాన సంధ్యలు ముగించుకొని భగవంతునికి (శివునికి) అర్పించిన ఆహారాన్ని తింటారు.)



శివరాత్రి మహాత్యము:

తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు      తెలుపుతున్నాయి.
భార్య భర్తల మధ్య అన్యోన్యానికి:
రోజు సంధ్యాసమయంలో అర్ధనారీశ్వర స్తోత్రం పఠించి, తేనే కలిపిన పాలు నివేద్యం పెట్టండి. ఇలా ఒక మండలం(40 or 41) రోజులు కానీ రోజు కానీ చేస్తే తప్పక ఫలితం లభిస్తుంది.
సోమవారంనాడు శివాలయంలో పొద్దున్న సమయంలో తేనే, పాలు ఇవ్వండి.
సిరిసంపదలకి

ప్రతి సోమవారంనాడు కనీ, 16 సోమవారాలు కానీ  సోమవర వ్రతం చేయండి ఫలితం లభిస్తుంది.