ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

IS OUR KITCHEN CLEAN ? TIPS FOR CLEAN KITCHEN


వంటిల్లు వుందా శుభ్రంగా!



ఇంటికి సంబంధించి కిచెన్‌ చాలా ముఖ్యమైనది. కుటుంబానికి కావలసిన ఆహారం తయారయ్యేది ఇక్కడే. తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఈ కిచెన్‌ ఎన్నో ప్రమాదాలకు కారణమవుతుంది. జాగ్రత్తగా ఉండకపోతే కిచెన్‌ పుణ్యమా అని అనారోగ్యం దరిచేరవచ్చు. తిరిగి ఆరోగ్యవంతులం కావడానికి ఎంతో కాలం, ధనం వెచ్చించాల్సి వస్తుంది.
కిచెన్‌ శుభ్రంగాలేకపోతే అనారోగ్యం వస్తుంది. అందుకు మూడు కారణాలున్నాయి. సరైన పారిశుధ్య పరిస్థితులు లేకపోవడం, ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణం కాకపోవడం, సరిగా వండకపోవడం. ఈ మూడు కారణాలు ప్రధానమైనవి. కిచెన్‌ క్షేమదాయకంగా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం. కిచెన్‌లో మంటలు చెలరేగడానికి ఒక కారణం వంట నూనె. దీనికి త్వరగా మండే స్వభావం ఉంటుంది. మూకుడు నిండా నూనె పోయడం లేదా బాగా కాగిన నూనెలో తడి కూరముక్కలు వేయడం/ నీళ్ల చిందులు పడడం. వీటి వల్ల మూకుడులోని నూనె బయటకు విరజిమ్మి ఒంటిమీద పడి గాయాలవుతాయి. అందుకే మూకుడులో నూనె సగం లేదా మూడోవంతు వరకు మాత్రమే పోయాలి. స్టవ్‌ మీద కాగుతున్న నూనెను వదిలి మరొక పనిలోకి వెళ్లకూడదు. అత్యవసరంగా మరొక పని చేయాల్సివస్తే మూకుడును నూనెతో పాటు స్టవ్‌మీద నుండి కింద పెట్టాలి.
సమస్యలు!
స్టవ్‌ మీద ఉంచిన పాత్ర హ్యాండిల్స్‌ మీ వైపుకు ఉండకూడదు. పొరపాటునో, హడావుడిలోనో మీ చెయ్యి దానికి తగిలిందంటే అది కిందనో/ మీదపడో అనవసర ప్రమాదాలు జరుగుతాయి. హ్యాండిల్‌కి మంట లేదా ఇతర పాత్రల వేడి తగిలేవిధంగా ఉంచకూడదు. అలా వుంచితే పాత్రను దింపేందుకు హ్యాండిల్‌ పట్టుకోగానే చుర్రుమంటుంది. కిచెన్‌లో వంటకు ఉపయోగపడే అనేక పదార్థాలు డబ్బాలలో నిల్వ చేసుకుని ఎత్తుగా షెల్ఫ్‌లో ఉంచుతారు. వీటిని తీసుకునేందుకు నేలమీద పీట వేసుకుని అందుకోడానికి ప్రయత్నిస్తారు. ఈ పీట తగినంత గట్టిగా, స్థిరమైన కాళ్లు కలిగి ఉండాలి. ఏదో ఒక పీట వేసుకున్నారంటే దానిమీద నుండి పడడం, ఆపైన కొత్త ప్రమాదాలు ఎదురవుతాయి. బరువైన వస్తువులను బ్యాలన్స్డ్‌గా కిందికి దింపగలమనే అతి ఆత్మవిశ్వాసం మంచిది కాదు. ఇతరుల సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి. కిచెన్‌లోని షెల్ఫుల్లో సామాన్లు ఎంతో ఆలోచనతోను, ప్రణాళికతో జాగ్రత్తగా సర్దుకోవాలి. నిల్వ ఉంచడం, నిరపాయకరంగా ఉండడం అనే విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. కిచెన్‌లో బిగించుకునే షెల్ఫులు దృఢమైన ఆధారాలకు బిగించుకోవాలి. పని అయిన తర్వాత షెల్ఫు తలుపులు మూసే అలవాటు లేకపోతే ఆ తలుపులే మీకు తగిలి గాయపరుస్తాయి. అందువల్ల అటూ ఇటూ జరిగే తలుపులున్న షెల్ఫులను అమర్చుకోవాలి.
విడివిడిగా ఉంచాలి!
కిచెన్‌ తగినంత విశాలంగా ఉండకపోవచ్చు. పాత్రలను శుభ్రం చేసేందుకు ఉపయోగించే క్లీనింగ్‌ పౌడర్లు, సింకులు శుభ్రం చేసేందుకు వాడే యాసిడ్లు, లోషన్లు ఉండే చోటు పక్కనే వండుకున్న ఆహార పదార్థాలు ఉంచితే, అవి కలుషితమయ్యే ప్రమాదం ఉంది. మొనదేలిన వస్తువులు, కత్తిపీట, చాకు వంటివి పని పూర్తికాగానే ఎత్తైన ప్రదేశాల్లో ఉంచాలి. లేకపోతే వీటివల్ల ఇంట్లోవారికి కూడా గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఏదైనా డబ్బా మూత తెరవాలంటే తగిన పరికరం ఉపయోగించాలి గాని వేళ్లు కాదు. సీలు డబ్బాలకుండే రేకులను విడగొట్టేటప్పుడు కొంత తెగింది కదాని మిగిలిన దాన్ని చేత్తో పట్టుకుని లాగే ప్రయత్నం చేయకూడదు. పూర్తిగా తెగేవరకు పరికరాలను ఉపయోగించాలి. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సూదిగా, వాడిగా ఉండే వస్తువులను శుభ్రపరిచేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే చేతులు కోసుకుపోతాయి.


జాగ్రత్తలు!
పది పనులు ఒకేసారి చేయకూడదు. టేబుల్‌ చివర వేడి వంటకాలు పెట్టకూడదు. హడావుడిగా తిరిగేటప్పుడు ఆ పాత్రలకు తగిలి, అందులోనివి ఒలికి, ఒళ్లు కాలొచ్చు.
ఎలక్ట్రిక్‌ పరికరాలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పర్వాలేదనే ఆలోచనతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జీవితానికే ముప్పు. గ్రైండర్‌లో పప్పు రుబ్బుతూ కరెంటు ఆపేయకుండా అందులో చెయ్యి పెట్టడం, లోహపు గరిటెలు ఉంచడం, ఎలక్ట్రిక్‌ కుక్కర్‌ ఆన్‌లో ఉండగా అందులో నీళ్లు పోయడం వంటి పనులు చేయకూడదు.
ఎలక్ట్రిక్‌ పరికరాలతో పనిచేసేటప్పుడు కరెంటు సరఫరా నిలిపివేసి అవసరమైతే ప్లగ్‌ బయటకు తీస,ి వాటిలోని పదార్థాలను పట్టుకోవచ్చు.
ఆహారపదార్థాలను తగిన విధంగా నిల్వ చేసుకోకపోతే సూక్ష్మజీవుల వల్ల పాడైపోతాయి. అటువంటి ఆహారం తింటే రోగాలు కొని తెచ్చుకున్నట్లే.
ప్రతి ఇంట్లోనూ కొన్ని నియమాలు పాటించడం మంచిది. ఆహార పదార్థాలు వేడిగా ఉంచాలి. చల్లని పదార్థాలను చల్లగా ఉంచాలి. తినే పదార్థాలను పరిశుభ్రంగా ఉంచాలి.
వంట చేసేముందు చేతులు సబ్బుతో శుభ్రపరచుకోవాలి. దీనివల్ల సూక్ష్మజీవుల వ్యాప్తిని అరికట్టవచ్చు. మార్కెట్లో కొనుగోలు చేసిన కాయగూరలు, ఇతర పచ్చికూరలను నీటితో శుభ్రంగా కడగాలి. మిగిలిన ఆహార పదార్థాలను సింకు దగ్గర నిల్వ ఉంచకూడదు. తడిగా ఉండే ఆ ప్రదేశాల్లో సూక్ష్మజీవులు త్వరత్వరగా వ్యాప్తి చెందుతాయి.
వంటపని పూర్తికాగానే స్టవ్‌ మంటకు సంబంధించిన వ్యవస్థలన్నిటిని ఆపేయాలి. స్టవ్‌ 'నాబ్స్‌' పిల్లలకు అందే ఎత్తులో ఉంచకూడదు. వయసు చాలని పిల్లలు తెలియక ఈ నాబ్స్‌ తిప్పితే ప్రమాదాలు ఎదురవుతాయి.