ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SUNDAY SPECIAL CHICKEN DHUM BIRYANI RECIPE


చికెన్‌ దమ్‌ బిర్యానీ


కావలసిన పదార్థాలు


చికెన్‌ ముక్కలు - కిలో, పాలు - ఒకటింబావు లీటరు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1 టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర - 1 కట్ట, పచ్చిమిర్చి - 4, లవంగాలు - 3, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, వెన్న - 200 గ్రాములు, బాస్మతి బియ్యం - అరకిలో, మంచినీళ్లు - 6 కప్పులు, నిమ్మకాయలు - 2
తయారీ విధానం
వెడల్పాటి పాన్‌లో పాలు పొయ్యాలి. అందులోనే అల్లంవెల్లుల్లి పేస్ట్‌, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, ఉప్పు కలపాలి. ఈ పాలు సగం అయ్యేవరకు మరిగించాలి. ఇందులోనే చికెన్‌ ముక్కలు కూడా వేసి ఉడికించాలి. బియ్యంలో నీళ్లుపోసి అన్నం మూడొంతులు ఉడికించాలి (అంటే అన్నం బాగా పలుకుగా ఉండాలి). మరో మందపాటి గిన్నెలో అడుగున ఒక స్పూన్‌ నూనె వేసి పలుకుగా ఉడికిన అన్నం పొరలాగా వేయాలి. దానిమీద పాలల్లో ఉడికించిన చికెన్‌, మళ్లీ దానిమీద అన్నం, ఆపై చికెన్‌... ఇలా పొరలుగా వేసి పైన నిమ్మరసం పోసి ఆవిరి పోకుండా మూత పెట్టాలి. మంట బాగా సిమ్‌లో పెట్టి దీన్ని పావుగంట ఉడికించాలి. రుచికరమైన చికెన్‌ బిర్యానీ రెడీ.