ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

KITCHEN TIPS IN TELUGU FOR WOMEN - 3


చిట్కా లిస్టు 3

1. పెరుగు గిన్నెలో చిన్న కొబ్బరి ముక్క వేసి ఉంచితే పెరుగు పులవదు.

2. కూరలలో ఉప్పు ఎక్కువ అయితే రెండు చెంచాల పాల మీగడ వేసి కలిపితే చాలా రుచిగా వుంటుంది.

3. ఒక ప్లేటు లో బొగ్గులు వేసి ఫ్రిజ్జి లో ఉంచితే ఆ బొగ్గులు దుర్వాసనను పీల్చి ఫ్రిజ్జి ని తాజాగా ఉంచుతాయి.

4. ఫ్రిజ్జి లో గుడ్లు నిలవ చేసేటప్పుడు, సన్న భాగం కిందకు, వెడల్పు భాగం పైకి ఉండేలా నిలవ చేస్తే గుడ్లు తాజాగా వుంటాయి.

5. ఫ్రిజ్జి లో పెట్టె ice trays కి కాస్త నూనె రాసి, నీళ్లు పోసినట్లు అయితే, ice cubes తేలికగా తీయవచ్చును.

6. Dining Table మధ్యలో పుదినా ఆకులు ఉంచితే ఆ వాసనకు దోమలు, యీగలు దరిచేరవు.

7. Dining Table ను రసం పిండేసిన నిమ్మ డిప్పలతో తుడిస్తే టేబుల్ మీద ఉన్నజిడ్డు పోతుంది.

8. ఉల్లి పాయ తిన్న తరువాత ఒక యాలక్కాయ నమిలితే నోటి నుండి ఉల్లి వాసన రాకుండా అరికట్టవచ్చు.


9. కాబేజీ వుడుకుతున్నప్పుడు వాసన రాకుండా వుండాలి అంటే అందులో ఒక బ్రెడ్డు ముక్క వేస్తే సరి.

10. హాట్ ప్యాక్ లో పదార్దాలు ఎంత నిండుగా వుంటే అంత ఎక్కువ సేపు వేడి గా వుంటుంది.

11. హాట్ ప్యాక్ లో వేడి పదార్దాలు పెట్టేముందు వేడి నీళ్ళతో, చల్ల పదార్దాలు పెట్టేటప్పుడు చల్లటి నీళ్ళతో ముందు కడిగి అప్పుడు ఉంచితే పదార్దాలు చాలా సేపు వరకు ఎలా ఉండాలో అలా వుంటాయి.

12. అర్జెంటుగా పెరుగు అవసరం అయితే, గోరువెచ్చని పాలను హాట్ ప్యాక్ లో పోసి ఒక స్పూను పెరుగు పోసి మూత పెట్టి ఉంచాలి. గంటకి ఒకసారి మూత తీసి రెండు నిమిషాలు అలా వుంచి మళ్ళా మూత పెట్టాలి. యిలా చేస్తే నాలుగు గంటలలో పెరుగు తోడుకుంటుంది.

13. కొబ్బరి నూనె తాజాగా వుండాలి అంటే అందులో ఎండు మిర్చి వెయ్యాలి.

14. యింట్లో చేసుకునే టొమాటో సూపు కి మంచి రంగు, రుచి రావాలి అంటే చిన్న బీట్రూట్ ముక్క వేస్తే సరి. మంచి పోషకాలు కూడా అందుతాయి.

15. వెన్న కాచేటప్పుడు నెయ్యి సువాసన తో చాలా కాలం తాజాగా వుండాలి అంటే కాచేటప్పుడు ఒక తాజా తమలపాకు అందులో వేసి చూడండి.

16. రోజు చిన్న గ్లాసుడు బీట్రూట్ రసం తాగితే రక్త హీనత సమస్య దూరం అవుతుంది.

17. ఒకసారి వేయించిన వడలు మళ్ళా వేయిస్తే నూనె ఎక్కువగా పీలుస్థాయి. అందుకు ఏమి చేయాలి అంటే వడలను ఒక్క నిమిషం మాత్రమె వేయించి తీసి tissue paper లో పెడితే నూనె అంతగా పీల్చవు.

18. పావుగంట పాటు వేడి నీళ్ళలో నానపెడితే బాదం పొట్టు తేలికగా వస్తుంది.

19. బొద్దింకలు తిరిగే చోట బొరిక్ పౌడర్ చల్లి చూడండి. వాటి బెడద తొలగిపోతుంది.

20. గ్యాస్ స్టవ్ ప్రాంతాన్ని తినేసోడా కలిపిన నీటితో కడిగితే త్వరగా శుభ్రం అవుతుంది.

21. ఎరుపు రంగు దుస్తులు రంగు పోకుండా వుండాలి అంటే వుతికేముందు అర కప్పు వెనిగర్ కలిపిన నీళ్ళలో కాసేపు వుంచి తరువాత వుతకండి.

22. పాతచింతకాయ పచ్చడి తో ఇత్తడి, రాగి సామానులు తోమితే నలుపు పోయి కొత్త వాటిలా మెరుస్తాయి.

23. షూ పోలిష్ గట్టి పడితే అందులో కాస్త తెల్ల స్పిరిట్ వేసి చూడండి. వదులు అవుతుంది.

24. దుస్తుల మీద షూ పోలిష్ మరకలు పడితే Eucalyptus ఆకుల రసంతో రుద్ది సుభ్ర పరిస్తే త్వరగా మరకలు పోతాయి.

25. యినప వస్తువులతో పని అయిపోయాక కిరోసిన్ తో తుడిచి భద్ర పరిస్తే తుప్పు పట్టవు.
26. Storage Containers అంచులకి ఆముదం రాస్తే చీమలు దరిచేరవు.

27. బియ్యం, పప్పులు నిలవ చేసే డబ్బాలలో వేప ఆకులు వేసినట్లయితే పురుగులు పట్టవు.

28. పంచదార నిలవ చేసే డబ్బాలో రెండు లవంగాలు వేస్తే చీమలు దరి చేరవు.

29. పుదినా పచ్చడి కాని కొత్తిమిర పచ్చడి కాని చేసాక కాస్త నిమ్మరసం చల్లి ఫ్రిజ్జి లో పెడితే చట్ని ఆకుపచ్చ రంగు లోనే వుంటుంది.

30. కొబ్బరి కాయను పగలకొట్టిన తరువాత ఒక రాత్రంతా ఫ్రిజ్జి లో పెడితే, కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి తీయటం తేలిక అవుతుంది.

31. పెరుగు త్వరగా తోడుకోవాలి అన్నా, చలి కాలం లో బాగా తోడుకోవాలి అన్నా యిలా చేసి చూడండి. గురువెచ్చని పాలని ఒక హాట్ ప్యాక్ లో పోసి ఒక టీ స్పూను పెరుగు వేసి మూత పెట్టి పెట్టండి.

32. కొత్తిమిర కొనగానే, వాటి వేళ్ళని కత్తిరించి, కొత్తిమిరని ఒక పేపరు లో చుట్టి, డబ్బాలో పెట్టి ఫ్రిజ్జి లో పెట్టినట్లయితే పదిహేను రోజుల వరకు తాజాగా వుంటాయి ఆకులు.

33. కొబ్బరి చిప్పల లోపల కాస్త ఉప్పు రాసినట్లుయితే చిప్ప లైఫ్ ఎక్కువ సేపు వుంటుంది.

34. రవ్వని వేయించి, చల్లార్చి, గాలి సోకని డబ్బాలో పెడితే పురుగు పట్టదు.

35. పూరి పిండి కలిపేటప్పుడు కాస్త పాలు పోసి కలిపితే పూరీలు మెత్తగా వస్తాయి.

36. పూరి, చపాతీ, పరాట చేసేటప్పుడు పిండి లో 1 పెద్ద స్పూను పెరుగు వేసి కలిపితే మెత్తగా వస్తాయి. నూనె వేయకుండా యిది ఒక చిట్కా.

37. క్రిస్పి బంగాల దుంప కాని అరటికాయ చిప్స్ కాని కావాలి అంటే అవి డీప్ fri అయ్యేటప్పుడు కాస్త ఉప్పు నీళ్లు చల్లితే సరి.

38. పులుపు వస్తువులు (చింతపండు, నిమ్మకాయ వంటివి) Non-stick గిన్నెలలో వండితే, Non-stick త్వరగా పాడు అవుతుంది.

39. Cutting Boards , కత్తులను నిమ్మకాయ తో రుద్దితే వాటికి పట్టిన ఘాటు వాసనలు (ఉల్లి, వెల్లుల్లి) వాసనలు పోతాయి. లేదా బేకింగ్ లో సోడా కాస్త నీళ్ళు కలిపి పేస్టు లాగ చేసి దానితో వాటిని రుద్దితే వాసనలు పోతాయి.

40. Salt Shaker లో కాసిన్ని బియ్యం గింజలు వేస్తే ఉప్పు గడ్డకట్టకుండా సులువుగా బయటకు వస్తుంది.

41. కొత్త గిన్నెలు కొన్నప్పుడు యిలా చేస్తే గిన్నెలు త్వరగా మాడవు. ఒక ఉల్లి పాయను సగానికి కోసి, గిన్నె లోపలి భాగం లో బాగా రుద్ది, గిన్నెను కాస్త వేడి చేసి కొంచం నూనె వేసి చూడండి.

42. Copper గిన్నెలు కడిగేటప్పుడు, గిన్నెల మిద కాస్త నిమ్మ రసం చల్లి, తరువాత ఉప్పు చల్లి, తరువాత ఒక నిమ్మ చెక్కతో రుద్దితే బాగా శుభ్రం అవుతాయి.

43. జిడ్డు గిన్నెలు తోమాలి అంటే నిమ్మ చక్కని ఉప్పు లో ముంచి దానితో రుద్దితే బాగా శుభ్రం అవుతాయి.

43. Microwave Oven ను క్లీన్ చేయాలి అంటే, నిమ్మ చెక్కని నాలుగు ముక్కలుగా కోసి ఒక కప్పు నీళ్ళలో వేసి, కొన్ని లవంగాలు వేసి అయిదు నిమిషాలు మరగపెట్టండి.

44. పాత్రలు వేడిగా ఉండగానే కొంచం వెనిగర్, కాస్త ఉప్పు వేసి, స్పాంజ్ తో రుద్ది కడిగితే పాత్రలు మిలమిల మెరుస్తాయి.

45. గాజు పాత్రలు రెండు ఒకదానికి ఒకటి అతుక్కుని యిరుక్కుపోతే, లోపటి దానిలో చల్లటి నీళ్ళు పోసి, మొత్తం సెట్టు ను వేడి నీళ్ళలో పెడితే రెండు విడివిడిగా బయటకు వస్థాయి.

46. మాడిన గిన్నెలను అమ్మోనియా కలిపిన నీటిలో ఒక గంట సేపు నానపెట్టి వాడేసిన నిమ్మ చెక్క, సోపు, నీళ్ళతో కడిగితే సరి.

47. మాడిపోయిన అల్యుమినియము గిన్నెల్లో ఒక ఉల్లిపాయను వేసి నీళ్ళు పోసి మరిగించండి. మాడినది అంత ఊడి నీళ్ళలో పైకి తేలుతుంది.

48. బాటిల్స్ క్లీన్ చేయాలి అంటే దానిని సగం వరకు నీళ్ళతో నింపి, అందులో ఒక స్పూను బేకింగ్ సోడా వేసి బాగా షేక్ చేసి ఒక గంట సేపు వుంచి కడగండి.

49. కుక్కరు లో ఒక చిన్న నిమ్మ చెక్క కాని నిమ్మ ఉప్పు కాని వేసి మరగపెడితే కుక్కరు బాగా క్లీన్ అవుతుంది.

50. ఆపిలు కోసాక, ఆ ముక్కలకి కాస్త నిమ్మ రసం రాస్తే కనుక, నల్ల పడకుండా చాల సేపటివరకు తాజాగా వుంటాయి.