ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MAAZA MAAZA SWEET CORN - HEALTHY FOOD ITEM





కాలక్షేపంకోసమో పోషకాహారంగానో, అల్పహారంగానో ఉపయోగించే వాటిల్లో మొక్కజొన్నను కూడా చెప్పుకోవాలి. మామిడి, సపోటా వంటి పండ్లలా సాగుచేసుకునే పంట కూడా ఇది. వాతావరణం చల్లగా ఉండి, వర్షంపడుతున్న సమయంలో వేడివేడి మొక్కజొన్న పొత్తులను తింటుంటే ఆ రుచిని, ఆ సంతోషాన్ని ఆస్వాదించాలేకాని చెప్పనలవికాదన్నది మొక్కజొన్నను ఇష్టపడే ఎందరో ఆహ్లాదప్రియుల ఉవాచ.
సుమారుగా వెయ్యి సంవత్సరాల నుండి భారతదేశంలో మొక్కజొన్న వాడకం గురించి తెలిసినట్లు తెలుస్తున్నది. క్రమక్రమంగా దీన్ని ఎన్నోప్రాంతాలవారు ఆహారంగా కూడా ఉపయోగించడం ప్రారంభించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలోని ప్రజలు ప్రధాన ఆహారంగా మొక్కజొన్నను తీసుకుంటున్నారు. మొక్కజొన్న పైభాగంలో ఉండే పీచును గృహావసరాలకు ఉపయోగించే వస్తువులు తయారుచేసే పరిశ్రమల్లో ఉపయోగిస్తుంటారు. మొక్కజొన్నవల్ల ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి. షుగర్‌ పేషంట్లకు ఆహారంగా ఇస్తారు. ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహకరిస్తుంది. అంతేకాదు మలబద్ధకాన్ని నివారించడంలో కూడా సహాయకారిగా పనిచేస్తుంది. మొక్కజొన్న గింజలను నమలడం వల్ల నోటికి వ్యాయామంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. పిల్లలు దీనితో తయారుచేసే పలు పదార్ధాలను పాలలో కలుపుకుని ఎంతో ఇష్టంగా తింటారు. మొక్కజొన్నలో నాలుగురకాలున్నాయి. అయితే మనదేశంలో మాత్రం ఎక్కువగా సాధారణ మొక్కజొన్న మాత్రమే ఉంది. కొన్ని ప్రాంతాల్లో స్వీట్‌ కార్న్‌ పేరుతో కొత్తరకాన్ని సాగుచేస్తున్నారు. అయితే ఎక్కువగా విదేశాల నుండే దిగుమతి అవుతుంది.
స్వీట్‌కార్న్‌ పేరుకు తగ్గటే తియ్యగా ఉంటుంది. కనుక దానికి కొద్దిగా మసాలా జోడించి పిల్లలు, పెద్దలు అందరు హాయిగా తినవచ్చు. అలాగే చాలామంది సాధారణంగా దొరికే మొక్కజొన్న పొత్తులను కాల్చి కొద్దిగా ఉప్పు, కారం, నిమ్మరసం రాసుకుని తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. స్వీట్‌కార్న్‌ను ఎక్కువగా అమెరికా ఉత్పత్తి చేస్తున్నది. అంతేకాదు ప్రపంచంలోని ఎక్కువ దేశాలకు కూడా అదే ఎగుమతి చేస్తున్నది.
స్త్రీ, పురుష బేధం లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడితినే ఆహారంగా మొక్కజొన్నను చెప్పుకోవచ్చు. పలు ఆహార పదార్ధాల తయారీలో దీనిని ఉపయోగిస్తారు కూడా. దీంతో తయారుచేసే పాప్‌కార్న్‌ను ఇష్టపడని వారుండరు.
అటు కాలక్షేపంకోసం, ఇటు పోషకాహారంగా, అల్పహారంగా పలురకాలుగా దీన్ని ఉపయోగించు కోవచ్చు. దీనిపై సినీకవులు 'మొక్కజొన్న తోటలో.. ముసిరిన చీకట్లలో..' 'రెండుమొక్కజొన్న పొత్తులున్నారు తిందువా..' అంటూ హుషారైన గీతాలను కూడా వ్రాశారు.
పోషకవిలువలుండి, పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే వాటిల్లో మొక్కజొన్న మొదటివరుసలో ఉంటుందని చెప్పొచ్చు.