ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

A BRIEF ARTICLE ON USAGE OF COMPUTER REGULARLY AND ITS SIDE EFFECTS ON HEALTH - TIPS FOR USAGE OF COMPUTER PROPERLY


ఏకధాటిగా గంటలకొద్ది కంప్యూటర్‌ ఎదురుగా ఉన్నప్పుడు ఐ స్ట్రెయిన్‌తో పాటు తలపోటు, మెడనొప్పి రావడం సహజం. కొంతమందిలో రాను రాను చూపు కూడా మందగించవచ్చు. కాబట్టి ప్రతి పది నిమిషాలకు ఒకసారి కనీసం దూరంలో ఉన్న వస్తువుల మీద దృష్టి కాసేపు మరల్చినట్లయితే ఇటువంటి దుష్ర్పభావాలకు దూరంగా ఉండవచ్చు.

ఎడతెరపి లేకుండా గంటల కొద్దీ కంప్యూటర్‌ ముందు కూర్చుండే వారిలో రక్త ప్రసరణ మందగిస్తుంది. ఇది ముఖ్యంగా కాళ్లలో ఉండే రక్తనాళాల్లో జరగడం తద్వారా రక్తం గడ్డ కట్టుకుపోయేటటువంటి దుష్ప్పభావాలు కలుగుతాయి. దీని వ్లల కాళ్లల్లో నీరు చేరటం , కాళ్లు ఉబ్బటం, పిక్కల్లో నొిప్పి, కొద్ది దూరం కూడా నడవలేకపోవడం జరుగుతుంది. దీనిని డీప్‌ వీన్‌ త్రాంబోసిస్‌ అంటారు. ఒక్కోసారి ప్రమాదవశాత్తు ఇవి గుండెకు, అక్క డి నుంచి ఊపిరితిత్తుల్లోకి రక్తం ద్వారా ప్రవహించి పల్మోనరి త్రాంబో ఎంబాలజిం అనే ప్రమాదకరమైన వ్యాదిని కలిగిస్తాయి. 


వీరిలో శ్వాస ప్రక్రియ సరిగ్గా జరగక ఆయాసప డడం, గుండెదడ, బిపి తక్కువ అవ్వడం, కళ్లు తిరిగి పడిపోవడం, రక్తంలో ఆస్జిన్‌ స్థాయి బాగా పడిపోయి వివిధ అవయవాలపైన ఆ దుష్పభావాలు పడడం జరుగుతుం ది. కొంత మందిలో కృత్రిమ శ్వాస కూడా అందించాల్సిపన పరిస్థితి ఎదురవుతుంది. వీటితో పాటు ప్రాణ వాయువు, రక్తం కరిగించే మందులు కూడా వాడాలి. ఈ మం దులు కనీసం 6 నుండి 12 నెల పాటు కూడా వాడాల్సిన అవసరం ఏర్పడవచ్చు. 

డీప్‌ వీన్‌ త్రాంబోసిస్‌, పల్మోనరీ త్రాంబో ఎంబాలిజం వంటి వ్యాధులు రాకుండా కాలి కండరాలను కదిలించే వ్యాయామాలు చేస్తే రక్త ప్రసరణలో గడ్డలు కట్టకుండా ఉం టుంది. అరగంటకు ఒకసారి లేచి నిల్చొని కాళ్లు కదపడం లేదా కూర్చున్న దగ్గరే కాళ్లకు ఎక్స్‌టెన్షన్‌, ఫ్లెక్షన్‌ వంటి వ్యాయామం చేయడం వల్ల ఇలాంటి రుగ్మతల బారి నుండి తప్పించుకోవడం చల్లని వాతావరణంలో పనిచేసే వారిలో ముఖ్యంగా ఎసి ఉన్న ఆఫీసుల్లో శ్వాసకోశ వ్యాధులు రావడమే కాకుండా అది వరకే ఉన్న వ్యాధులు ఉధృతంగా మారటం, ఒకరి నుండి ఇంకరొకికి అంటుకునే ప్రమాదం ఉంది. ఎలర్జీ లక్షణాలు ఉండేవారిలో ఇలాంటి ఏసి గదుల్లో తరచుగా జలుబు, తుమ్ములు, దగ్గు, ఆయాసం, పిల్లికూతలు రావటం జరుగుతుంది. ఆస్తమా వ్యాధి ఉన్న వారిలో చలిగాలి ఆయాసాన్ని ఎక్కువ చేస్తుంది. 


ముఖ్యంగా రాత్రిల్లు పని చేసే వారిలో ఈ ఇబ్బందులు ఎక్కువ. సాధారణంగానే తక్కువ ఉష్ణోగ్రత ఉండే రాత్రి సమయాల్లో ఏసి వాడకం తోడయితే అస్తమా వ్యాధి తీవ్రంగా మారుతుంది. ఏసి లేని గదుల్లో పనిచేయడం, లేదా తాము వాడే అస్తమా మందుల మోతాదులను సరి చూసుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. శ్వాసకోశాల్లో వచ్చే బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్ష న్‌-న్యూమోనియా కూడా చలిగాలిలో వచ్చే అవకాశాలె క్కువ. 

దగ్గు, చలితో కూడుకున్న జ్వరం, ఒళ్లు నొప్పులు మెదలవుతుండగానే ఈ జబ్బును గుర్తించి సరైన యాం టి బయాటిక్స్‌ను వాడాలి. వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లిన వారిలో ముఖ్యంగా పొగ, మత్తుపానియాలకు బానిస లుగా మారిన వారిలో క్షయ వంటి అంటువ్యాధులు కూ డా ప్రబలే అవకాశాలుంటాయి. గాలి,వెలుతురు సరి గ్గా ఉండని గదుల్లో ఈ బ్యాక్టీరియా ఒకరి నుండి ఇంకొ కరికి సంక్రమించి జబ్బులు కలుగజేస్తాయి. జుబ్బు ఉనవారు కనీసం మొహానికి రుమాలు అడ్డంగా ఉం చుకున్నట్లయితే వారు దగ్గినా,తుమ్మినా ఆ గాలి తుం పర్లు, క్రిములు, ఇతరుల్లో వ్యాపించకుండా జాగ్రత్త పడవచ్చు.