ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ANDHRA MATHA GONGURA WITH NON VEG MUTTON CURRY


కావలసిన పదార్థాలు : 

లేత వేటమాంసం...అరకేజీ, పసుపు-అర టీస్పూన్‌, ఉప్పు-తగినంత, వెల్లుల్లి రేకలు- పది, అల్లం-అరంగుళంముక్క, నూనె-3టీస్పూన్ల్‌, లవంగాలు-నాలుగు, యాలకులు-నాలుగు, దాల్చిన చెక్క-కాస్తంత, బే ఆకులు-రెండు, గోంగూర-200గ్రా, పచ్చిమిర్చి-తగినన్ని, ఉల్లిపాయ-ఒకటి, కరివేపాకు- తగినంత,
తయారీ విధానం : ప్రెజర్‌ కుక్క ర్‌లో మటన్‌, కొద్దిగా అల్లం, వెల్లుల్లి, ఉప్పు వేసి ఉడికించాలి. మూకుడులో నూనె వేడిచేసి లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, బే ఆకులు, వేసి వేయించాలి.

అల్లం, వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, ఉల్లిముక్కల్ని వేసి వేయించాలి. ఆ తరువాత కరివేపాకు, గోంగూర, పసుపు కూడా వేసి నూనె పైకి తేలేంతదాకా ఉడికించాలి. చివర్లో మాంసం ముక్కల్ని కలిపి 5నుంచి 10 నిమిషాల వరకు ఉడికించి, ఆ తరువాత తగినన్ని నీళ్ళుపోసి మళ్ళీ చిక్కబడేంతదాకా ఉడికించాలి.

చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయలతో అలంకరించి సర్వ్‌ చేయాలి. అంతే నోరూరించే పుల్లటి రుచితో అలరించే గోంగూర వేటమాంసం కర్రీ తయార్‌...!!