ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

EGG IS HEALTHY AND ALSO FOR WOMEN BEAUTY - TIPS FOR USING EGGS FOR BEAUTIFICATION





కొంత మంది తమను తాము ఎగ్‌టేరియన్స్‌గా చెప్పుకుంటారు. అందుకు కారణం వారు మాంసాహారం తీసుకోకపోయినా గుడ్డులో అధిక పోషకాలున్నందువల్ల, గుడ్డును తినడానికి ఎక్కువగా ఇష్టపడటం వల్ల ఎగేటేరియన్లుగా ఫిక్స్‌ అయిపోతారు. అంతే కాకుండా గుడ్డును మాంసాహారం అంటారు. కానీ చాలా మంది శాకాహారంగానే భావిస్తున్నారు కాబట్టి శాకాహారులు కూడా గుడ్డును తినడం మొదలుపెట్టేసారు. గుడ్డులో చెప్పుకోలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. గుడ్డు మంచి పౌష్టికాహారం. చిన్న పిల్లలు మొదలుకొని, ముసలివారి వరకు డాక్టర్లు గుడ్డు తినమని చెబుతారు. కోడిగుడ్డు ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రొటీన్లను అందజేస్తుంది. పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా వైద్యులు సలహాలిస్తుంటారు. గుడ్డులో పలురకాల లవణాలు, అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌లు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి మేలు చేసేవే. ఇది శరీరానికి మాత్రమే కాదు అందానికి కూడా అద్భుతమైన ప్రయోజ నాలను అందిస్తుంది. గుడ్డును ముఖానికి మరియు కేశాలకు అప్లై చేస్తే అనేక బ్యూటీ బెనిఫిట్స్‌తో మీకు ఆశ్చర్యం కలగక మానదు. గుడ్డు చర్మానికి అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది.ముఖ్యంగా మొటిమలు మరియు చర్మాన్ని టైట్‌ చేయడంలో, పొడిబారిన మరియు ఆయిల్‌ చర్మానికి అద్భుతంగా పనిచేసి మంచి ఫలితాలను అందిస్తుంది. మొటిమలు, నల్లటి మచ్చలు తొలగిస్తుంది. ఫేస్‌ ప్యాక్‌లలో గుడ్డును చేర్చడం వల్ల ముఖంలో కొత్తమెరు పులు తీసుకొస్తుంది. అలాగే కేశాలు కూడా అద్భుతమైన ప్రయోజ నాలను కలిగి స్తుంది. దీన్ని నేచురల్‌ కండీషనర్‌ గాను మరియు కేశాలకు మ్రుదువుగా మార్చడానికి మరియు షైనింగ్‌ పెంచు కోవడానికి సహజయంగా కేశ సౌందర్యాన్ని పెంపొందించు కోవడానికి గుడ్డును ఉపయోగి స్తారు. మరి గుడ్డులోని మరిన్ని బ్యూటీ బెనిఫిట్స్‌ ఏంటో ఒకసారి చూద్దామా..

లి అయిల్‌ స్కిన్‌ : ఆయిల్‌ స్కిన్‌ పోగొట్టడంలోబాగాసహాయ పడుతుంది. గుడ్డులోని తెల్లసొనను శాండిల్‌ ఉడ్‌ పౌడర్‌ లో మిక్స్‌ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల జిడ్డు వదిలిపోతుంది.



లి మొటిమల నివారణ: మొటిమ లను నివారించ డంలో అద్భుతం గా పనిచేస్తుంది. ఎగ్‌ వైట్‌ ఫేషియల్‌ మసాజ్‌ చర్మ రంధ్రాలను టైట్‌ చేసి మొటిమలను నివారిస్తుంది. లి చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది. గుడ్డును పెరుగుతో మిక్స్‌ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం సున్నితంగా మారుతుంది. మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. లి సన్‌టాన్‌: ఇది మరో బ్యూటీ బెనిఫిట్‌. గుడ్డును తేనె మరియు నిమ్మరసంతో మిక్స్‌ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల సన్‌ టాన్‌ మరియు డార్క్‌ స్పాట్స్‌ను తొలగించి మిమ్నల్ని అందంగా ఉంచుతుంది. లి హెయిర్‌ మాయిశ్చరైజర్‌ : మీ కేశాలను సుతిమెత్తగా మరియు ఆరోగ్యంగా నిర్వహించాలంటే గుడ్డును ఉపయోగించాల్సిందే. కేశాలను సున్నితంగా మార్చుతుంది. ఒత్తుగా, మంచి మెరుపుతో ఉంటుంది. లి చుండ్రు నివారణకు : కేశ సంరక్షణలో చుండ్రు ప్రధాన కారణం,చుండ్రుకు గుడ్డుతో ట్రీట్మెంట్‌ చేయవచ్చు. గుడ్డును తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవడం వల్ల చుండ్రు వదిలిపోతుంది. లి జుట్టురాలడాన్ని అరికడుతుంది : గుడ్డుతో హెయిర్‌ప్యాక్‌ వేసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది. తలలోని చర్మ సమస్యలను, దురద, మొటిమలను నివారిస్తుంది. గుడ్డు నిమ్మ, హెయిర్‌ ఆయిల్‌తో మిక్స్‌ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. హెయిర్‌ ఫాల్‌ తగ్గుతుంది. లి కేశాల జిడ్డును తగ్గిస్తుంది.: వేసవిలో చాలా వరకూ మన కేశాలు జిడ్డుగా మారతాయి. మరియు చిక్కుకూడా ఎక్కువే. ఈ రెండు సమస్య నివారణకు గుడ్డు అద్భుతంగా పనిచేస్తుంది. నల్లటి వలయాలను పోగొడుతుంది: ఎగ్‌ వైట్‌ను బాగా గిలకొట్టి కళ్ళకింద అప్లై చేయాలి. ఇది తడి ఆరిన తర్వాత తిరిగి మరోసారి అప్లై చేసి అదీ ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవచ్చు అలాగే కీరదోసముక్కలను కూడా కళ్ళమీద పెట్టుకోవడం వల్ల డార్క్‌సర్కిల్స్‌ తగ్గిస్తుంది.