ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

EAT FISH PRODUCTS REGULARLY FOR GOOD HEALTH - TIPS FOR EATING SEA PRODUCTS FOR HEALTHY LIFE


చేపలు తినండి ..... !ఆరోగ్యాన్ని..ఆయుష్యును పెంచుకోండి

హెల్తీఫుడ్ అంటే ఏదీ, ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. రోజూ ఏ డైట్ తీసుకోవాలి, వారంలో ఎన్ని రోజులు మాంసాహారం తీసుకోవచ్చు ఇలా పలు రకాల సందేహాలు మనలో కలగవచ్చు. మాంసాహారం ఎన్ని రోజులకొకసారి తీసుకోవచ్చు. ఇలా అనేక సందేహాలు. అయితే, మన రెగ్యులర్ డైట్ శాఖాహారమైన, మాంసాహారమైన సరే సమతుల్య ఆహారం తీసుకోవడం తమాంసాహార ప్రియులైతే మీ రెగ్యులర్ డైట్ చేర్చుకోవల్సిన ఒక ముఖ్యమైన ఫుడ్ చేపలు. చేపల్లో అనేక ప్రోటీలను, న్యూట్రీషియన్స్ మరియు విటమినులు పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చేపలను ప్రతి రోజూ లేదా వారానికొకసారి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అంతే కాదు మనం చాలా యాక్టివ్ గా కూడా ఉన్నట్లు అనుభూతి చెందుతారు.
స్థానికంగా పుష్కలంగా లభించే చేపలు, రొయ్యలను ఆహారంలో తీసుకుంటే పోషకాహార లోపం తగ్గిపోయి ఆరోగ్యసమస్యలు దరిచేరవని నిపుణులు సూచిస్తున్నారు. చేపలు, రొయ్యలు పోషకవిలువలు ఉన్న బలవర్థక ఆహారం. చేపల్లో వివిధ రకాలున్నాయి. అందులో సాల్ మన్ , మాక్రెల్ , ట్యూనా , హెర్రింగ్ , సార్డినెస్ మున్నగునవి .చేపల్లోపోషక పదార్ధాలు - మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్ఫరస్, ఇతర ఖనిజములు పుష్కలంగా ఉంటాయి. మంచి రుచిగా ఉండే చేపల మాంసం తేలికగా జీర్ణమవుతుంది. అంతే కాదు, కొన్ని అధ్యయనాల ప్రకారం, రోజూ చేపలను తినడ ద్వారా అనేక హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. చేపలు తరచూ తినడం వల్ల, చిన్న పిల్లల్లో ఆస్తమా నుండి పెద్దల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వరకూ అన్ని రకాల జబ్బులను నివారించవచ్చు. ఈ లోఫ్యాట్ చేపలను డైలీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా కొన్ని పౌండ్ల బరువు తగ్గించుకోవచ్చు. ఇవేకాకుండా మీ రెగ్యులర్ డైట్ లో చేపలు చేర్చుకోవడం వల్ల పొందే అనేక ప్రయోజనాలు ఈ క్రింది పరిశీలించండి...

గుండె జబ్బుల నివారణకు: చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. ఇవి గుండెజబ్బుల్ని కలిగించవు. ఫిష్ లో మంచి క్రొవ్వులను (ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్)కలిగి ఉంటుంది. అందుకే హార్ట్ పేషంట్స్ ను చాలా మంచిది. కార్డియో వ్యాస్కులార్ డిసీజ్(గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను) నివారించడానికి ఫిష్ తినడం చాలా అవసరం. చేపల తినడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడానికి తగ్గిస్తుంది.

చేపల... రకం, వయస్సును బట్టి వీటిలో కొవ్వు 0.2 నుండి 20 శాతం వరకూ ఉంటుంది. కానీ, దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది (పోలి అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌). దీనిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది.

కంటి చూపుకు: సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి.

ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు దోహపడుతుంది.

ఎముకల బలానికి : చేపల కాలేయంలో ఉండే విటమిన్‌ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియంను స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్‌ డి అవసరం.

రక్త హీనత: రక్తవృద్ధికి హీమోగ్లోబిన్‌ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది.

మెదడుకు: అయోడిన్‌ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయి.

కాబట్టి వారంలో రెండు రోజులు చేపలు తినండి. ఇలా రోజూ చేపలు తీసుకునేవారిలో గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం వంటి ముప్పు కారకాలు తక్కువగా ఉంటున్నాయని వివరిస్తున్నారు. బొజ్జ, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర పెరగటం, మంచి కొలెస్ట్రాల్‌ తగ్గటం, ట్రైగ్జిరైడ్లు ఎక్కువ కావటం వంటివన్నీ మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం రావటానికి దోహదం చేస్తాయి. ఈ కారకాల్లో మూడు గానీ అంతకుమించి గానీ ఉన్నవారికి గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు రెట్టింపు అవుతోంది. అయితే చేపలు ఎక్కువగా తినేవారిలో లావు పొట్ట, అధిక రక్తపోటు వంటివి రావటం తగ్గుతుందని కొరియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో వెల్లడైంది.