ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BRIEF DESCRIPTION ABOUT SRI KANAKA MAHALAKSHMI TEMPLE AT VISAKHAPATNAM - ANDHRA PRADESH - INDIA



విశాఖపట్నం లోని బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు కోవెల చాల ప్రసిద్ధమైనది. ఈ అమ్మవారు స్వయంభువు. ఈ అమ్మవారు స్థానికంగా ఉన్న ఒక బావిలో దొరికిందని, ఆ విగ్రహానికి 1912లొ స్థానిక రాజులు కోవెల కట్టించారని ప్రతీతి. 

ఇక్కడ ఉన్న విశేషం ఏమిటంటే, భక్తులు తము స్వయంగా మూలవిరాట్టుకు పూజలు చేసుకోవచ్చు. అభిషేకాలు చేసుకోవచ్చు. ఇక్కడ మార్గశిర మాసంలో పూజలు చాల విశేషంగా జరుగుతాయి. మొత్తం మాసం లో దాదాపు 10 లక్షల మంది భక్తులు వైజాగ్, చుట్టుపక్కల ప్రాంతాలనుండి, పక్క రాష్ట్రాల నుండి కూడా విచ్చేసి అమ్మవారి పూజలు చేసుకుంటారు. ఈ అమ్మవారిని, కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, సత్యమైన తల్లిగా, స్త్రీలకూ సౌభాగ్యం ప్రసాదించే తల్లిగా నమ్ముతారు.

మార్గశిర మాసం ప్రత్యేకించి లక్ష్మివారం, అంటే గురువారం ఈ తల్లికి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. భక్తులు ఎంతో ఆనందోత్సాహాలతో ఇందులో పాల్గొంటారు.

ఇక్కడ జరిగే అన్నదానంలో పాల్గొనడాన్ని అన్నదాన ప్రసాదం స్వీకరించడాన్ని భక్తులు తమ పుణ్యంగా భావిస్తారు. మార్గశిర మాసంలో ప్రతిరోజూ అన్నదానం జరుగుతుంది. లక్ష్మివారం నాడు విశేషించి భక్తులు అన్నదానంలో పాల్గొంటారు.

మార్గశిర లక్ష్మివారమ్ సాధారణ రోజువారీ పూజలే కాక, విశేష పూజలు, విశేష అభిషేకాలు, లలిత సహస్ర పారాయణ, భగవద్గిత పారాయణ, హరికథ కాలక్షేపం వంటివి కూడా నిర్వహించబడతాయి.