ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

IMAGE OF ANCIENT INDIAN KUNDALINI CHAKRA


Ganesha near the waterfall Unakoti, Tripura


IS COW MILK REQUIRED FOR PUJA ? TELUGU BHAKTHI ARTICLE


SRI SARASWATHI DEVI STHOTRAM IN TELUGU


DESI GOLDEN BANGLES DESIGNS


NOT EVERYTHING THAT IS FACED CAN BE CHANGED, BUT NOTHING CAN CHANGE UNTIL IT IS FACED


OCEAN TREASURE


MODERN ANDHRA BRIDE


anyone can catch your eye, but it take someone special to catch your heart


7 hills god statue meaning


the word "sorry"


amazing man made monument lord krishna


amazing cake design


amazing painting


hollywood queen lucy pinder in a back drop of italian interior decoration


life is beautiful


LOVES CHOOSES HEART




BHARTIYA SCRIPTURES - INDIAN SCRIPTURES INFORMATION IN TELUGU



(13)
హరి ఓం.
న్యాయ దర్శనం గౌతమ మహర్షి చే రూపొందించబడిన న్యాయ విద్యా విభాగం.న్యాయ దర్శనం ఆస్తిక విభాగానికి చెందినది. గౌతముడు క్రి.పూ 5 వ శతాబ్ది కాలానికి చెందిన మహర్షి. అతనిని "అక్షపాద" అని కుడా అంటారు.

షడ్-ధర్శానాలన్ని విజ్ఞానానికి సమాన ప్రాదాన్యతను ఇచ్చాయి. అలాగే న్యాయశాస్త్రంలో విజ్ఞానానికి ఇచ్చిన ప్రాదాన్యతను ప్రమాణాలు అంటారు. ఈ న్యాయ విధానాన్ని న్యాయశాస్త్రం గాను, తర్కశాస్త్రం గాను వ్యవహరిస్తారు.

న్యాయ శాస్త్రంలో ముఖ్యంగా నాలుగు ప్రమాణాలు ఉంటాయి.
అవి :
1. ప్రత్యక్షము.
2. అనుమానము.
3. ఉపమానము.
4. శబ్ద గుణము.
తర్కమునకు చర్చకు ఇవి మూలములు.

న్యాయదర్శనం భగవద్ నామాన్ని అంగీకరిస్తుంది. ఆ భగవంతుడిని ఈశ్వరుడిగా సంభోదిస్తూ సమస్త సృష్టికి కారణంగా వ్యవహరిస్తుంది.

గౌతముని సృష్టి వివరణలో ఒక ముఖ్యమైన వాఖ్యం..
"ఈ సమస్త విశ్వం 'శక్తి స్వరూపం'లోని ఈశ్వరునిచే నిర్మించబడి, ఆయననుంచే అణువులు, కాలము , ఆలోచన, అంతరిక్షము, జీవ రాశి సృష్టించబడ్డాయి"

న్యాయ దర్శనమును "తర్క శాస్త్రము" అని కూడా అంటారు.
కాని ఇది పూర్తిగా తర్క శాస్త్రం కాదు. ఇందులో మొత్తము 524 సూత్రాలుంటాయి.
గౌతముని న్యాయ సూత్రాలు ఇలా ప్రారంభం అవుతాయి.

ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన
దృష్టాంత సిద్ధాంతావయవ తర్క నిర్ణయ
వాద జల్ప వితండాహేత్వాభాసచ్ఛల
జాతి నిగ్రహ స్థానానాం తత్వజ్ఞానా
న్నిఃశ్రేయ సాధిగమః

1. ప్రమాణములు
న్యాయ దర్శనం పదహారు పదార్థాలను (షోడశపదార్థములు) తెలుసుకుంటే నిశ్శ్రేయసం (మోక్షం) ప్రాప్తిస్తుందని వాగ్దానం చేస్తుంది. అవి:
ప్రమాణం, ప్రమేయం, సంశయం, ప్రయోజనం, దృష్టాంతం, సిద్ధాంతం, అవయవం, తర్కం, నిర్ణయం, వాదం, జల్పం, వితండం, హేత్వాభాసం, ఛలం, జాతి మరియు నిగ్రహ స్థానం.
ఈ పైన సూచించిన (షోడశపదార్థములు) ప్రమాణములు జ్ఞాన సాధనములు.

2. ప్రమేయములు
ఆత్మ, శరీరము, ఇంద్రియము, అర్థము, బుద్ధి, (జ్ఞానము), మనస్సు, ప్రవృత్తి, దోషము, ప్రేత్య భావము, ఫలము, దుఃఖము మరియు అపవర్గము.

THE STORY OF LORD KRISHNA AND THE ARJUNA - KIDS TELUGU STORY


ANCIENT HISTORY / STORY OF BALLUKA RAJA - JAMBHAVANTHA


జాంబవంతుడు :-
.......................
జాంబవంతుడు బ్రహ్మ ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. కృత యుగం నుండి ద్వాపర యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది. క్షీరసాగర మధనం సమయంలోను, వామనావతారం సమయంలోను జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో రాముని పక్షాన పోరాడాడు. కృష్ణునికి శ్యమంతకమణిని, జాంబవతిని ఇచ్చాడు.
సముద్రాన్ని దాటి సీతను అన్వేషించడం ఎలాగో తెలియక అందరూ విషణ్ణులైనపుడు జాంబవంతుడే ఆ పనికి హనుమ సర్వ సమర్ధుడని తెలియజెప్పాడు.
ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వల్ల రామ లక్ష్మణులు, వానర సేన మూర్ఛిల్లినపుడు - మృత ప్రాయులై ఉన్నవారిలో బ్రతికినవారికోసం విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు.
"హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధాన కరణి అనే ఔషధాలను తీసుకు రమ్మని హనుమను కోరాడు.
జాంబవంతుడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కొన్నింటిని (బహుశా నాలుగు కూర్మ, వామన, రామ, కృష్ణావతారాలు) చూసిన పరమ భక్తుడు. సమస్త భూమండలాన్ని ఎన్నో సార్లు ప్రదక్షిణ చేశాడు. క్షీరసాగర మథనం జరుగుతున్నపుడు దేవతల కోరిక మేరకు భూగోళంపై ఔషధులన్నింటినీ అందులో పోశాడు. బలి చక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు మహావిష్ణువు త్రివిక్రమావతారం ఎత్తినపుడు, సురగంగతో బ్రహ్మపాదాలు కడిగే సమయాన జాంబవంతుడు త్రివిక్రముడుకి అనేక ప్రదక్షిణలు చేశాడు.
రామావతారంలో హనుమంత, అంగదాది వానర వీరులతో సీతాన్వేషణకై వెళ్ళాడు. శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని దాటే ఉపాయం తెలియక వానరవీరులంతా ప్రాయోపవేశానికి సిద్ధమైనపుడు జాంబవంతుడు హనుమంతుని సమీపించి అతని జన్మ వృత్తాంతం, శాపాల్లాంటి వరాల గూర్చి చెప్పి హనుమంతుడికి ప్రేరణనిచ్చాడు. ఆ తర్వాత యుద్ధంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించిన వేళ, సర్వ వానరసేన మూర్చిల్లుతారు. అస్త్ర ప్రభావం సోకని విభీషణుడు వానర యోధులను సమీపించి వారి చెవులలో ధైర్య వచనాలు పలుకుతుంటే, ఆంజనేయుడు కూడా లేచి తనవారికి ఉత్సాహం కల్పించే ప్రయత్నం చేస్తాడు.
ఈ సమయంలో విభీషణుడు జాంబవంతుడి దగ్గరకు వెళ్ళి ”తాతా!” అంటే ”బ్రహ్మాస్త్రం ధాటికి కన్నులు కనపడకున్నవి. కంఠస్వరాన్ని బట్టి నిన్ను గుర్తిస్తున్నాను. ఇంతకూ మన వాయునందనుడు క్షేమమేనా?” అని ప్రశ్నిస్తాడు. ఆశ్చర్యచకితుడైన విభీషణుడు ”తాతా! రామలక్ష్మణులు, అంగద సుగ్రీవుల గురించి అడగకుండా, కేవలం హనుమంతుని గురించి మాత్రమే ఎందుకడుగుతున్నావు?” అని ప్రశ్నిస్తాడు.
అప్పుడు జాంబవంతుడు ”ఒక్క హనుమంతుడు ఉంటే చాలు. సర్వం శుభప్రథమే అంటాడు. ” హనుమంతునిపై ఆయనకున్న విశ్వాసం అటువంటిది. అప్పుడు మారుతి జాంబవంతుని చెంతకు చేరి సంతోషంతో ఆలింగనం చేసుకుని, బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల మూర్ఛితులైన వారిని కాపడటం కోసం హిమగిరుల్లోని ఔషధులు తెమ్మని చెబుతాడు. ఇంకా జాంబవంతుడి ప్రస్థావన క్రిష్ణావతారంలోనూ కనిపిస్తుంది. స్వయంగా కృష్ణుడితో యుద్ధం చేయడమే కాకుండా, ఆయనకు కన్యాదానమే చేశాడు.

AMAZING BLOUSES DESIGNS






HOW DO I CHOOSE BETWEEN FOREVER AND ALWAYS


ALL FUNCTION SPECIAL STEP CAKE DESIGN


LORD PANCHA MUKHA VEERA HANUMAN - RARE PIC AND IMAGE


1940 One Rupee Note (Image shown of George VI, England)


LIST OF NAMES OF LORD SIVA IN DIFFERENT PURANAS IN INDIAN ANCIENT HISTORY AND MYTHOLOGY


శివునికి పురాణాలలో ఉన్న పేర్లు

వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తులలో శివునికి అనేక పేర్లతో స్మరిస్తుంటారు.
వాటిలో కొన్ని పేర్లు మీకోసం...

హర-హర మహదేవ, రుద్రుడు, శివుడు, అంగీరాగురు, అంతకుడు, అండధరుడు, అంబరీషుడు,

అకంప, అక్షతవీర్యుడు, అక్షమాలి, అఘోర, అచలేశ్వరుడు, అజాతారి, అజ్ఞేయ, అతీంద్రియుడు,

అత్రి, అనఘ, అనిరుద్ధ్, అనేకాలోచనడు, అపానిధి, అభిరాముడు, అభీరు, అభదన్, అమృతేశ్వర్,

అమోఘ, అరిదమ్, అరిష్టనేమి, అర్ధేశ్వర్, అర్థనారీశ్వరుడు, అర్హత్, అష్టమూర్తి, అస్థమాలి, ఆత్రేయ,

ఆశుతోష్,ఇంద్రభూషణుడు, ఇందుశేఖరుడు, ఇకంగ, ఈశాన్, ఈశ్వరుడు, ఉన్నమత్తవేషుడు, ఉమాకాంతుడు,

ఉమానాథ్, ఉమేష్, ఉమాపతి, ఉరగభూషణ్, ఊర్ధ్వరేతా, ఋతుధ్వజ, ఏకనయన్, ఎకపాద్, ఎకలింగ, ఎకాక్ష,

కపాలపాణి,కమండలధర, కళాధర్, కల్పవృక్ష, కామరిపు, కామారి, కామేశ్వర్, కాలకంఠ, కాలభైరవ, కాశీనాథ్,

కృత్తివాసా, కేదారనాథ్, కైలాశనాథ్, క్రతుధ్వసీ, క్షమాచార్, గంగాధర, గణనాథ, గణేశ్వర, గరళధర, గిరిజాపతి,

గిరీష్, గోనర్ద్, చంద్రేశ్వర్, చంద్రమౌళి, చీరవాసా, జగదీశ్, జటాధర, జటాశంకర్, జమదగ్ని, జ్యోతిర్మయ్,

తరస్వీ, తారకేశ్వర్, తీవ్రానంద్, త్రిచక్షు, త్రిధామా, త్రిపురారి, త్రియంబక్, త్రిలోకేశ్, త్రయంబక్, దక్షారి,

నందికేశ్వర్, నందీశ్వర్, నటరాజ్, నటేశ్వర్, నాగభూషణ్, నిరంజన్, నీలకంఠ, నీరజ,

పరమేశ్వర్, పూర్ణేశ్వర్, పినాకపాణి, పింగలాక్ష్, పురందర్, పశుపతినాథ్, ప్రథమేశ్వర్,

ప్రభాకర్, ప్రళయంకర్, భోలేనాథ్, బైజనాథ్, భగాలీ, భద్ర, భస్మశాయీ, భాలచంద్ర్, భువనేశ్,

భూతనాథ్, భూతమహేశ్వర్,మంగలేశ్, మహాకాంత్, మహాకాల్, మహాదేవ్, మహారుద్ర్, మహార్ణవ్,

మహాలింగ్, మహేశ్, మహేశ్వర్, మృత్యుంజయ, యజంత్, యోగేశ్వర్, లోహితాశ్వ్, విధేశ్, విశ్వనాథ్,

విశ్వేశ్వర్, విషకంఠ్, విషపాయీ, వృషకేతు, వైద్యనాథ్,

శశాంక్, శేఖర్, శశిధర్, శారంగపాణి, శివశంభు, సతీష్,

సర్వలోకేశ్వర్, సర్వేశ్వర్, సహస్రభుజ్, సాంబ, సారంగ, సిద్ధనాథ్, సిద్ధీశ్వర్,

సుదర్శన్, సురర్షభ్, సురేశ్, హరిశర్, హిరణ్య, హుత్ సోమ్, స్రుత్వా మొదలైనవి ......సుందర్ ప్రియ.