loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HAPPY NEW YEAR 2014


COUNT DOWN STARTS FOR CELEBRATION FOR NEW YEAR 2014


LORD VISHNU'S - KAALA PURUSHA DESCRIPTION


GOLDEN SHIV LINGH WITH NAGA RAJA


NATURE IS GREAT


LORD SIVA AND HIS SON LORD GANESHA PERFORMING PUJA


ARTICLE ON `SALAGRAMA" ROCK - LORD VISHNU RESIDES IN SALAGRAMAM - ARTICLE BY Brahmasri Chaganti Koteswara Rao Garu


సాలగ్రామము :

సాలగ్రామము విష్ణుప్రతీకమైన ఒక శిలా విశేషము. సర్వకాల సర్వ్యావస్థలయందు విష్ణువు సాక్షాతూ సాన్నిధ్యం కలిగి ఉండేది సాలగ్రామంలో మాత్రమే. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు. భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది. క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంబుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు. త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు. దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.

హిందువులందరికీ తులసి, శంఖం, సాలగ్రామం పూజనీయమైనవి. తులసి హిందువుల ఇహపర సాధనానికి భూలోకంలో అవతరించిన వనదేవత. ఈ తులసి అపూర్వమైన మూలిక కూడా. శంఖం అత్యంత పవిత్రమైనది. శంఖారావం వ్యాపించినంత దూరం సూక్ష్మక్రిములు నశిస్తాయి అంటారు. నీరు శంఖంలో పూరిస్తే తీర్థం అవుతుంది. వట్టివేళ్ళు, ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాలు చేర్చిన నీటిని శంఖంలో పోసుకుంటూ సాలగ్రామాలకు పురుషుసూక్తం పఠిస్తూ అభిషేకం చేసిన తీర్థం సర్వశక్తివంతం. ఇటువంటి తీర్ధాన్ని భక్తితో సేవిస్తే ప్రాయశ్చిత్తం, పాపక్షయం కలుగుతుంది. తీర్ధాన్ని మూడుసార్లు తీసుకుంటారు. మొదటిది కాయసిద్ధి కొరకు, రెండవది ధర్మసాధనకు,మూడవది మోక్షం పొందడానికి. అసలీ తీర్ధం అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయం కలుగుతాయి.

సాలగ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం. సాలగ్రామ దర్శనం వల్ల, స్పర్శవల్ల, అర్చనవల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది. సాలగ్రామాలు శిలాజాలు. శాస్త్రజ్ఞులు ఈ శిలలను ఒక విధమైన ప్రాణి నిర్మిస్తుందని అంటారు. ఆలి అనే ఒక విధమైన మత్స్యం శీతాకాలంలో తన శరీరం నుంచి వెలువడే ఒక విధమైన రసాయనిక పదార్ధంతో శిలామయమైన కవచాన్ని నిర్మించుకుని దానిలో నివశిస్తుందని అది మరణించినప్పుడు లేక వదిలి వెళ్ళినప్పుడు అవి సాలగ్రామాలుగా మనకు లభిస్తాయని అంటారు. సాలగ్రామాల మీద వివిధ దేవతా చిహ్నాలు ఉంటాయి. ముఖ్యంగా చక్రం, పద్మం ప్రధాన చిహ్నాలు. విష్ణు భక్తులైన మాధ్వులకు, వైష్ణవులకు ఇవి పూజకు ఎంతో విలువైనవి. వైష్ణవ పురాణాలు, ఇతవ వైష్ణవ గ్రంధాలు వీటిని గురించి సవిస్తరంగా వివరిస్తాయి.

నేపాల్ దేశంలో ఖట్మండుకు సుమారు 197 మైళ్ళు దూరంలో ముక్తినాధ్, గండకీ నదీ తీరంపై ఉన్న మహాషేత్రంలో ఇవి లభిస్తాయి. ఇవి సాధారణంగా స్థలజాలు, జలజాలు అని రెండు రకాలు. గండకీ నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న సాలగ్రామ గిరిపైన స్థలజాలు, గండకీ నదీ గర్భంలో జలజాలు లభిస్తాయి. సాలగ్రామాలలో బంగారం ఉంటుంది. అందుకే వాటిని హిరణ్యగర్భ అని కూడా అంటారు. సాలగ్రామాలు అమోనైట్ శిలామాలు. ఇండియాలో ఈ సాలగ్రామాలు సముద్రంలో నివసించే టెథైస్ అనే ప్రాణి వల్ల ఏర్పడతాయి. ఇటువంటి శిలాజాలు అనేక రకాలు ఉన్నాయి. 250 మిలియన్ సంవత్సరాలలో ఇండియా ఉత్తర దిక్కుగా 9,000 కి.మీ. జరిగిపోయింది. హిమాలయాలు ఏర్పడ్డాయి. వీటి నుండి అనేక నదులు ప్రవహించాయి. ఇండో మైదానంలోకి ప్రవహించిన అటువంటి నదులలో ఒకటి గండకి. సాలగ్రామములు మన శాస్త్రం అనుసరించి కొన్ని సౌమ్యమైనవి. కొన్ని ఉగ్రమైనవి. శాస్త్ర సమ్మతంగా చక్రశుద్ధి, వక్త్రశుద్ధి, శిలాఉద్ధి, వర్ణశుద్ధి గల వాటినే పూజించాలి. రకరకాల రంగులు గలిగిన కారునలుపు, భగ్నమైన, మొక్కవోయిన సాలగ్రామాలను పూజించకూడదు. నారసింహ పాతాళ నారసింహ, గండభేరుండ, మహాజ్వాల మొదలైనవాటిని సన్యాసులు, బ్రహ్మచారులు పూజించాలి. విష్ణు, సీతారామ, గోపాల వంటి శాంతమూర్తులనే గృహస్థులు పూజించుకూవాలంటారు. పరిమాణాన్నిబట్టి కూడా పూజార్హతను నిర్ణయించుకుంటారు.. సాధారణంగా ఇవి ప్రతి గృహంలోనూ వంశపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి. సాలగ్రామ శిలామహత్మ్యం గురించి వేరే చెప్పనక్కరలేదు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరునికీ, మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికీ అంతటి మహిమ ఉండడానికి కారణం అక్కడ ఉండే సాలగ్రామాలు అంటారు. సాలగ్రామాన్ని పూజిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో దాని దానం వలన కూడా అంతటి ఫలం లభిస్తుంది.

BHAGAWATHAM SARAMSAM IN POETRY


BRIEF DESCRIPTION ABOUT SRI KANAKA MAHALAKSHMI TEMPLE AT VISAKHAPATNAM - ANDHRA PRADESH - INDIAవిశాఖపట్నం లోని బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు కోవెల చాల ప్రసిద్ధమైనది. ఈ అమ్మవారు స్వయంభువు. ఈ అమ్మవారు స్థానికంగా ఉన్న ఒక బావిలో దొరికిందని, ఆ విగ్రహానికి 1912లొ స్థానిక రాజులు కోవెల కట్టించారని ప్రతీతి. 

ఇక్కడ ఉన్న విశేషం ఏమిటంటే, భక్తులు తము స్వయంగా మూలవిరాట్టుకు పూజలు చేసుకోవచ్చు. అభిషేకాలు చేసుకోవచ్చు. ఇక్కడ మార్గశిర మాసంలో పూజలు చాల విశేషంగా జరుగుతాయి. మొత్తం మాసం లో దాదాపు 10 లక్షల మంది భక్తులు వైజాగ్, చుట్టుపక్కల ప్రాంతాలనుండి, పక్క రాష్ట్రాల నుండి కూడా విచ్చేసి అమ్మవారి పూజలు చేసుకుంటారు. ఈ అమ్మవారిని, కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, సత్యమైన తల్లిగా, స్త్రీలకూ సౌభాగ్యం ప్రసాదించే తల్లిగా నమ్ముతారు.

మార్గశిర మాసం ప్రత్యేకించి లక్ష్మివారం, అంటే గురువారం ఈ తల్లికి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. భక్తులు ఎంతో ఆనందోత్సాహాలతో ఇందులో పాల్గొంటారు.

ఇక్కడ జరిగే అన్నదానంలో పాల్గొనడాన్ని అన్నదాన ప్రసాదం స్వీకరించడాన్ని భక్తులు తమ పుణ్యంగా భావిస్తారు. మార్గశిర మాసంలో ప్రతిరోజూ అన్నదానం జరుగుతుంది. లక్ష్మివారం నాడు విశేషించి భక్తులు అన్నదానంలో పాల్గొంటారు.

మార్గశిర లక్ష్మివారమ్ సాధారణ రోజువారీ పూజలే కాక, విశేష పూజలు, విశేష అభిషేకాలు, లలిత సహస్ర పారాయణ, భగవద్గిత పారాయణ, హరికథ కాలక్షేపం వంటివి కూడా నిర్వహించబడతాయి.
LATEST DESIGNS OF WOMEN BLOUSESBRIEF DESCRIPTION ABOUT DWARAKA - THE LOST CITY

ద్వారక..... శ్రీకృష్ణుడు ఏలిన ద్వారక.... 
చరిత్ర చెప్పినదానిని పోల్చి చూస్తె... ఈ ద్వారక నగరం గౌతమి నది అరేబియా సముద్రంలో కలిసే దగ్గర ఉన్నదని తెలుస్తూంది... కంస సంహారానంతరం శ్రీకృష్ణుడు (Feb 9, Friday , 3219 BC ) ... సముద్రుని సహకారంతో విశ్వకర్మ సారధ్యంలో 12 యోజనాల విస్తీర్ణంతో 6 సేక్టర్ల తో.... ఈ పట్టణాన్ని సువర్నమయంగా నిర్మించినదని తెలుస్తుంది... అందులో ఉండే వీధులు... ఆకాశ హర్మ్యాలు అన్నీ ఎంతో అధ్బుతంగా ఉండేవని వర్ణన... (సముద్ర మధ్యం లో ఇంత పెద్ద నిర్మాణాన్ని నెలకొల్పాలంటే ఎంత విజ్ఞానాన్ని వాడి ఉండాలి..)

మన పురాణాల ప్రకారం...అర్జునుడు శ్రీ కృష్ణుడు చనిపోయినతర్వాత ద్వారక సముద్రంలో కలిసిపోయే సమయంలో అక్కడే ఉన్నడని.. చివరి సౌధం మునిగిపోయి మామూలు సరస్సు మాదిరి అయ్యే వరకు.. ఆ స్తలాన్ని వదలలేదట (బాధతో నిష్క్రమిస్తాడట).... ఆ సమయాన్ని పోలిస్తే సుమారు ఈ సంఘటన క్రీ. పూ. 3102 సంవస్త్సరంలో జరిగింది...

ప్రస్తుతం ఈ ప్రాంతంలో లభించిన అవశేషాలను... పురావస్తు శాస్త్రజ్ఞులు లెక్క వేసే దాని ప్రకారం ఖచితంగా కృష్ణుడి ఉనికి సూచిస్తున్నాయి.... వీటన్నిటి ఆధారాలు లభిస్తున్నాయి.... దీని వెంట ఆ చరిత్రకు సంబంధిన చిత్రాలను కూడా ఉంచుతున్నాను... వీక్షించండి...

సముద్రంలో పరిశోధించిన ఆ కాలానికి సంభందించిన పాత్రలు.... గంట.... వీటన్నిటిని పరిశోధిస్తే అవి (క్రీ. పూ. 3103 ) 5102 సంవత్సరాల క్రిందవని తెలిసింది.. �

ప్రపంచం లోహన్నే కనుగొనని సమయాన పెద్ద పెద్ద లంగరులు లభించాయంటే ఎంత పెద్ద ఓడల నిర్మాణం చేపట్టి ఉండవచు.. ఇక్కడ దొరికిన లంగరులను చూస్తే అదే తెలుస్తుంది.... ఆ కాలంలో వాడిన పాత్రలు చూస్తే అవి మిశ్రమ లోహానికి సంభందించినవి.... అప్పటికి ఇంకా అల్యూమినియం కనుక్కోలేదు.... మన శాస్త్రజ్ఞులకు సింధు నాగరికత... హరప్పా మొహంజొదారో నాగరికత కు సంబంధించిన ఆనవాళ్ళు మాత్రమే దొరికాయి.... కాని అవి క్రీ.పూ. 3200 వి కావు... అవి 1300 BC కు సంబందిచినవి...
ద్వారకకు సంభందించిన నాగరికత చాల పురాతనమయినది.... ఈ ఆనవాళ్ళు ఎవరికీ దొరకక పోవటం... చరిత్రలో ఎక్కక పోవటం .. విచిత్రం

LATEST RICH QUALITY DESIGNED BRIDAL DRESS


LOVING MOTHER AND CHILD


SLEEPING POSITIONS AND SLEEPING TECQNIKESfestival special dark blue - green half saree combination


NATURAL VILLAGE BEAUTY


DETAILS OF THE BEST OF THE BEST VEGETABLES FOR HEALTHY GROWTH


NEXT NET GEN LKG POEMS


LOVING MOTHER AND CHILD - PAINTING


BEAUTIFUL MARUN SAREE


SHREE NAVAGRAHA YANTRAS


CHI RU THAA


IMPORTANT ACTIONS TO BE TAKEN WHEN YOU LOOSE YOUR MOBILE


LORD GANESH PICS


BIGGEST STATUE OF LORD GANESHA


DETAILS OF COINS OF INDIAN CURRENCY OF DIFFERENT DENOMINATIONS


loading...