ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BRIEF PROFILE OF FIRST PRESIDENT OF GREAT INDIAN NATION - DR.BABU RAJENDRA PRASAD




బాబూ రాజేంద్ర ప్రసాద్ భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి.
రాజేంద్ర ప్రసాద్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి. 1948 నుండి 1950 వరకు భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం ఏర్పరచబడిన సంఘానికి (Constituent Assembly) అధ్యక్షత వహించాడు. భారతదేశ మొట్టమొదటి ప్రభుత్వంలో కొద్ది కాలం పాటు కేంద్ర మంత్రిగా కూడా పని చేసాడు. భారతదేశ స్వాతంత్ర్య సమరంలో ఒక ముఖ్య నాయకుడుకూడా. ప్రజలు ఇతనిని ప్రేమగా, గౌరవంగా 'బాబూ' అని పిలిచేవారు.రాజేంద్ర ప్రసాద్ బీహార్ రాష్ట్రంలో శివాన్ జిల్లాలోని జిర్దేయి గ్రామంలో 1884 లో డిసెంబరు మూడున జన్మించాడు. అతని తండ్రి మహదేవ్ సహాయ్ సంస్కృతం మరియు పర్శియను భాషలలో పండితుడు. తల్లి కమలేశ్వరీ దేవి ఎప్పుడూ రామాయణం నుండి కథలు వివరించేది.

న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన అనతికాలంలోనే స్వాతంత్ర్య పోరాటంవైపు ఆకర్షితుడయ్యాడు.1918 లో'సర్చ్ లైట్'అనే ఆంగ్ల పత్రికను, ఆ తర్వాత'దేశ్'అనే హిందీ పత్రికనూనడిపాడు.1921 లో మహాత్మా గాంధీ తో ఒకమారు సమావేశం తరువాత, విశ్వవిద్యాలయంలో తన సెనేటర్ పదవికి రాజీనామా చేశాడు.పాశ్చాత్య చదువులను బహిష్కరించమని గాంధీజీ పిలుపునిచ్చినపుడు తన కుమారుడు మృత్యుంజయ ప్రసాదును విశ్వవిద్యాలయ చదువు మానిపించి వెంటనే బీహార్ విద్యాపీఠ్‌లో చేర్చాడు. ఈ విద్యాపీఠాన్ని1921 లో తన మిత్రబృందంతో కలిసి స్థాపించి భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా నడిపాడు. 1924 లో బీహారు బెంగాల్‌లలో వచ్చిన వరదలలో అన్నీ కోల్పోయిన అభాగ్యులను ఆదుకోవడంకోసం తనవంతు సహాయాన్ని ముందుండి అందించాడు. జనవరి 15, 1934 న బీహారులో భూకంపం వచ్చినప్పుడు రాజేంద్ర ప్రసాదు జైలులో ఉన్నాడు. రెండురోజుల అనంతరం అతనిని విడిచిపెట్టారు. బయటకు రాగానే అతను నిధులను సేకరించడం మొదలుపెట్టాడు. అలా భూకంప బాధితుల సహాయార్ధం అతను సేకరించిన నిధులు(38 లక్షలు) అప్పట్లో వైస్రాయి సేకరించిన నిధులకు మూడింతలున్నాయి.రాజేంద్రప్రసాద్ 1934 అక్టోబరులో బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలకు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. అలాగే 1939 లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసిన తరువాత, 1947 లో ఇంకోసారి మొత్తం మూడుసార్లు ఆ పదవిని చేపట్టాడు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజేంద్ర ప్రసాదును రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు.2 సంవత్సరాలపాటు భారత రాష్ట్రపతిగా సేవలందించి 1962 న పదవీ విరమణ చేసాడు.హిందీ,సంస్కృతం,ఉర్దూ,పర్షియన్,ఇంగ్లీషు భాషల్లో పండితుడైన రాజేన్ద్రప్రసాద్ హిస్టరీ ఆఫ్ చంపారన్ సత్యాగ్రహ,ఇండియా డివైడెడ్,ఆత్మకథ,ఎట్ ది ఫీట్ ఆఫ్ మహాత్మా వంటి గ్రంథాలను రచించారు. అనంతర కాలంలో భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన భారతరత్న పురస్కారాన్ని రాజేంద్ర ప్రసాదుకు ప్రకటించారు.

పదవీ విరమణ తర్వాత కొన్ని నెలలకు అనగా సెప్టెంబర్ 1962 లో, అతని భార్య రాజ్‌వంశీ దేవి చనిపోయింది. మరణానికి నెలరోజుల ముందు తనకుతానే ఒక ఉత్తరం రాసుకున్నాడు,అందులో ఇలా చెప్పాడు, "నేను అంతిమ దశకు చేరువైనట్లు అనిపిస్తూంది, ఏదైనా చేసే శక్తి అంతమవుతుంది, నా ఉనికే అంతమవుతుంది". ఫిబ్రవరి 28, 1963 న రాం రాం అంటూ కన్ను మూశాడు.

దేశ ప్రజలలో ఆయనకు ఉన్న అచంచలమైన ప్రేమాభిమానాల వలన ఆయనను దేశ్ రత్న అని పిలిచేవారు.