ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

WHAT IS THE REASON BEHIND THE LIGHTINING LAMP BEFORE GOD'S PUJA


మనము దీపము ఎందుకు వెలిగిస్తాము ....?
---------------------------------------------------

దీపంజ్యొతిః పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప ! నమోస్తుతే ||

మనము దేవుడి ముందర దీపము ప్రొద్దున,సాయంకాలము,
రెండు పూటలా కూడా దీపమువెలిగిస్తాము. కొంతమంది
అఖండ దీపము కూడా వెలిగిస్తారు.

వెలుతురు చీకటిని తొలగించునట్లు జ్ఞానము అవివేకమును
తొలగించును.

చమురు దీపము నకు ఒక ప్రత్యేకత ఉంది.చమురు గాని,నెయ్యి గాని
మన వాసనలని తెలియపరుస్తుంది.వత్తి మన అహాన్ని
తెలియపరుస్తుంది.జ్ఞానదృష్టి వెలిగించగానే వాసనలన్నీతొలగిపోయి
అహమంతయూ నశించును.దీపపు మంట పైకి చూచునట్లుగానే
మనము ఎత్తైన ఆదర్శములకు చేర్చే జ్ఞానమును సంపాదించవలెను..