ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BANANA TIPS FOR HEALTH AND BEAUTY - BANANA BEAUTY




అందాన్నిచ్చే అరటిపండు
ఎంతో చౌకగా లభ్యమయ్యే అరటిపండు అంటే అందరికీ చులకనే. అమృతఫలమని పిలిచే ఈ పండును రోజూ తిం టే ఆరోగ్యమని పెద్దలు చెబుతుంటారు. మానసిక ఉద్వేగాల ను కూడా నియంత్రించే గుణం అరటి పండులో ఉందిట. అందుకే ఎప్పుడెైనా మూడ్‌ బాగో లేకపోతే అరటిపండు తింటే సరి. ఇవన్నీ ఆరోగ్యానికి సంబంధించినవి. అందాన్ని కాపాడు కోవడంలో కూడా అరటి పండు దోహదం చేస్తుందిట. ముఖ్యంగా మండువేసవిలో ఈ పండును సౌందర్య సాధనంగా ఉపయోగించడం ద్వారా అందరూ లాభపడ వచ్చునంటున్నారు.

చర్మ సమస్యలు మొటిమలు, ముఖం పొడిబారటం. ఈ సమస్యలను దూరం చేయడానికి అరటిపళ్ళు ఎంతో ఉపయోగపడతాయంటున్నారు. బి, ఎ, సి,ఎ విటమిన్లే కాక పొటాషి యం కూడా కలిగిన ఈ పళ్ళు అటు చర్మానికి, ఇటు జుట్టుకు కూడా పోషకాలుగా ఉపయో గపడతాయి.

మొటిమలు : చాలా త్వరగా మొటిమలు, ఇతర సమస్యలు వచ్చే సున్నితమైన చర్మానికి అరటిపండు ఒక వరంలా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ పండులో చర్మానికి సమస్యలు తీసుకువచ్చే పదార్ధాలు ఏమీ ఉండవు. అందుకే సున్నితమైన చర్మానికి ఇది సరెైన పరి ష్కారం. బాగా పండిన అరటిపండును ఒక దానిని తీసుకుని మెత్తగా చిదిమి ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించి, 20 నిమిషాల పాటు ఉంచుకొని గోరు వెచ్చటి నీటితో ముఖం కడుక్కో వాలి. ఇన్ఫెక్షన్‌తో కూడిన మొటిమలలోని బాక్టీరియాను అరటి పండులోని పొటాషియం హరించివేయడంతో అవి చాలా త్వరగా తగ్గిపోతాయి. అలాగే ఇందులో ఉన్న బి విటమిన్‌ దురద వంటి వాటిని తగ్గించడమే కాదు మన చర్మం కూడా మంచి రంగులో ఉండేలా చేస్తుంది. అంతేకాదు వేసవి కాలంలో చెమట వల్ల వచ్చే పేలుడును, అతివేడి వల్ల వచ్చే రాష్‌ను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.

పొడి చర్మం : ముఖం పెై గీతలు, పొట్టు లేచి పోవడం వంటి చిహ్నాలు కనిపించాయంటే ముఖం పొడిబారుతోందని అర్థం. పురాతన కాలం నుంచి ముఖంలో తేమను నిలపడానికి, నింపడానికి అరటిపండ్లను ఉపయోగిస్తూ వస్తున్నారు. ఈ పండులో ఉన్న విటమిన్‌ ఎ చర్మంలో ఉండే సహజ నూనెలను పునరుద్ధరిస్తుంది. ఇక విటమిన్‌ ఇ పాడెైన చర్మాన్ని మర మ్మత్తు చేసి, ఏజింగ్‌ స్పాట్స్‌ను తగ్గిస్తుంది. విటమిన్‌ సి చర్మ కణాలలోని విషవాయువులను నిల్వ ఉంచకుండా చేయడంతో సన్నటి గీతలు ఏర్పడటం, వయసు పెరిగినట్టు కనిపించడం తగ్గుంది.

వయసు మీద పడినట్టు కనిపిస్తున్నామని భావించే వారు, ఒక పండిన అరటి పండును తీసుకుని దానిని మెత్తగా పేస్ట్‌లా చేసి, దానికి ఒక చెమ్చా తేనెను కలిపి ముఖానికి పట్టించుకుని 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఎండిన తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని కడిగి వేయాలి. తేనె చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇక అరటిపండు ముఖాన్ని మృదువుగా చేస్తుంది. పొడి చర్మానికి అరటిపండ్లు బాగా ఉపయోగ పడతాయి ఎందుకంటే అవి సహజంగానే తేమను ఇస్తాయి. ఈ ప్యాక్‌నే ఎండవల్ల కమిలిన చర్మాన్ని సహజ స్థితికి తీసుకువచ్చేందుకు ఉపయోగించవచ్చు. వేసవిలో జుత్తు కూడా దెబ్బతింటుంది. వేడిమి వల్ల అది ఎండి, పాడవుతుంది. అరటిపళ్ళు జుత్తుకు సహజ మెరుపును తెచ్చేందుకు సాయపడతాయి.

జుట్టు పొడిబారడం : ఎండలో ఎక్కువగా తిరిగే వారికి, రంగుల వంటి రసాయనాలను ఉపయోగించేవారికి, జుట్టును వంకీలు తిప్పుకునే వారికి వాతావరణంలో వచ్చే మార్పులు హాని చేస్తాయి. అరటిపళ్ళు పొడిబారిన జుట్టును, మాడుకు కూడా మరమ్మత్తు చేసి సహజ స్థితికి తీసుకువస్తాయి. అరటిపండ్లలో ఉండే పొటాషియం మాడుపెై ఉన్న ఎటువంటి బాక్టీరియానెైనా తొలగించి, ఆరోగ్యవంతమైన జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఒక పండిన అరటిపండును తీసుకుని మాష్‌ చేసి, దానిని మాడుకు జుట్టుకు పట్టించాలి. దానిపెై క్యాప్‌ ధరించి ఒక ఇరవెై నిమిషాల పాటు ఉంచి తరువాత షాంపూ చేయాలి. దీనితో జుట్టుఆరోగ్యవంతంగా అవుతుంది. అలాగే జీవరహితంగా కనిపించే జుట్టుకు ఒక అరటిపం డులో ఒక టేబుల్‌ స్పూన్‌ ఆల్మండ్‌ ఆయిల్‌ను కలిపి దానిని జుట్టుకు పట్టించాలి. తరువాత వేడి నీటిలో ముంచి పిండిన టవల్‌ను తలకు చుట్టుకుని 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత గోరు వెచ్చటి నీటితో తలను కడుక్కొని షాంపూ చేసుకోవాలి. సంవత్సరం పొడువునా దొరికే ఈ పండుని అన్ని రకాలుగా మనం ఉపయో గించుకోవచ్చు.