ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

DASARA FESTIVAL NAVARATHRULU - LIST OF FOOD ITEMS TO BE PREPARED FOR GODDESS SRI KANAKA DURGA AMMA VARI PUJA


నవరాత్రులు: సమర్పించాల్సిన నైవేద్యాలు ఏమిటి?

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ గల ఈ తొమ్మిది రోజులను 'దేవీ నవరాత్రులు'గా పిలుచుకుంటూ వుంటారు. ఈ తొమ్మిది రోజులలో ఒక్కోరోజున అమ్మవారిని ఒక్కో రూపంగా అలంకరించి, ఆ రూపాలకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తున్నారు.

శరన్నవరాత్రులలో అమ్మవారిని మొదటి రోజున 'శైలపుత్రి'గా అలంకరించి ఆ తరువాత రోజుల్లో వరుస క్రమంలో 'బ్రహ్మచారిణి' .. 'చంద్రఘంట' .. 'కూష్మాండ' .. 'స్కందమాత' .. 'కాత్యాయని' .. 'కాళరాత్రి' .. 'మహాగౌరీ' .. 'సిద్ధి దాత్రి' రూపాలుగా ఆరాధిస్తూ ఉంటారు.

శైలపుత్రికి కట్టుపొంగలి, బ్రహ్మచారిణికి పులిహోర, చంద్రఘంటకు కొబ్బరి కలిపిన అన్నం, కూష్మాండకు అల్లంతో చేయబడిన గారెలు, స్కందమాతకు దధ్యోదనం, కాత్యాయనికి కేసరీబాత్, కాళరాత్రికి వివిధరకాల కూరముక్కలతో కలిపి వండిన అన్నం, మహాగౌరీకి చక్రపొంగలి, సిద్ధిదాత్రికి పాయసం అత్యంత ప్రీతికరమైనవని పండితులు చెబుతున్నారు.