ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

RAINY SEASON HAIR CARE TIPS IN TELUGU



వర్షాకాలంలో జుట్టు సంరక్షణ ఇలా...! 

అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో అందమైన ఒత్తైన కేశాలు ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే వర్షాకాలంలోనూ జుట్టును పరిరక్షించు కోవాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో తడిసినపుడు జట్టు పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలం టున్నారు నిపుణులు. తడిసిన జుట్టు చుండ్రు సమస్యకు దారి తీస్తుంది. వర్షాకాలంలో జుట్టు రాలకుండా, చుండ్రు సమస్య దరిచేరకుండా ఉండాలంటే ఎక్కువసేపు పొడిగా ఉంచాలి. మైల్డ్‌ షాంపూ తో ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య దూరమవుతుంది. షాంపూతో స్నానం చేసేముందు జుట్టుకు వెనిగర్‌ పట్టిస్తే చాలు కాంతివంతం అవుతుంది.

జుట్టు ఆరోగ్యకరంగా ఉండాలంటే కోడిగుడ్లు, క్యారెట్‌, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, బీన్స్‌, నట్స్‌, కొవ్వు తక్కువగా ఉన్న పాల ఉత్పత్తులతో కూడిన పోషకాహారం తీసుకోవటం మేలు. నీరు ఎక్కువగా తాగడంతోపాటు కనీసం వారానికి ఓ రోజు జట్టుకు నూనె పట్టించడం మంచిది. వర్షాకాలంలో జుట్టు పొడుగ్గా పెంచకుండా పొట్టిగా కటింగ్‌ చేయించుకోవటం మేలు.