ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BHAGAWADHGEETHA SLOKAS AND ITS MEANING


ఒం నమోనారాయణాయనమః
ఓం శ్రీకృష్ణపరమాత్మనేనమః
భగవద్గీత...18/68--78

య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వ భిదాస్యతి
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్య సంశయః

న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః
భవితా న చ మే తస్నాత్ అన్యః ప్రియతరో భువి

అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాద మవయోః
జ్ఞానయజ్ఞేన తేనాహమ్ ఇష్టః స్యామితి మే మతిః

శ్రద్ధావాన నసూయశ్చ శృణుయాదపి యో నరః
సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్
పుణ్యకర్మణామ్

కచ్చిదేతచ్చ్రుతం పార్ధ త్వయైకాగ్రేణ చేతసా
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ

అర్జున ఉవాచ:

నష్టో మోహః స్మృతిర్లబ్దా త్వత్ప్రసాదాన్మ
యాచ్యుత
స్ధితో స్మి గతసందేహః కరిష్యే వచనం తవ 

సంజయ ఉవాచ:

ఇత్యహం వాసుదేవస్య పార్ధస్య చ మహాత్మనః
సంవాదమిమమశ్రౌషమ్ అద్భుతం రోమహర్ష
ణమ్

వ్యాసప్రసాదాచ్చ్రుతవాన్ ఏతద్గుహ్యమహం
పరమ్
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్
కధయతః స్వయమ్

రాజన్ సంస్మృత్య సంస్మృత్య సవాదమ్ ఇమమద్భుతమ్
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః

తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతమ్ హరే
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతిః ద్ర్హువా నీతిర్మతిర్మమ!

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతానూపనిషత్ బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునాసంవాదే మోక్షసన్న్యాసయోగోనామ అష్టాదశోధ్యాయః

ఓం శాంతిః శాంతిః శాంతిః

$$$$ 

నాయందు పరమభక్తి కలిగి ఈఅత్యంతగోప్యమైన
శాస్త్రమును నాభక్తులకు భోదించువాడు నన్నే చేరును. మనుష్యులలో అతనికన్న ప్రియముచేయువాడులేడు ఈలోకమున నుండబోడు. మా యీధర్మసంవాదము భక్తితో
పఠించువాడు నన్ను జ్ఞానయజ్ఞరూపముగా
పూజించినవాడగును. శ్రద్దావంతుడై అసూయారహితుడై వినువాడుకూడ ముక్తుడై
పుణ్యకర్మలొనర్చినవారేగులోకమునకేగును.

నీవు ఏకాగ్రచిత్తముతో వింటివా? నీఅజ్ఞాన మూడత్వము నశించినదా?

అర్జునుడు పలికెను:

అచ్యుతా నీకృపచేత నా మూడత నశించినది.
నా ఆత్మతత్త్వముయొక్క జ్ఞప్తి లభించినది. స్ధైర్యమలవడినది. సంశయములు తొలగినవి.

సంజయుడు పలికెను:

వాసుదేవునకును మహాత్ముడగు అర్జునకును
జరిగిన ఈ అద్భుత సంవాదమును రోమములు గగుర్పొడుచుచుండ నే వింటిని. నాకు దివ్య
చక్షువులిచ్చిన వ్యాసుని కృపవలన పరమ
గోప్యమగు ఈ యోగమును యోగేశ్వరుడగు
కృష్ణుడు వివరించుచుండగా ఆయనయొద్దనుండియే వింటిని. రాజా
కృష్ణార్జునులకు జరిగిన పుణ్యము అద్భుతము
అగు ఈ సవాదము ఎన్నిసార్లు జ్ఞప్తికి వచ్చునో
అన్నిసార్లు మరల మరల హర్షీంచుచున్నాను.
రాజా శ్రీకృష్ణుని అత్యద్భుతమగు ఆ విశ్వరూప
ము నాకెన్నిసార్లు జ్ఞప్తికివచ్చునో అన్నిసార్లు

అబ్బురపడుచు మరల మరల హర్షించు చున్నాను. 

యోగీశ్వరుడగు కృష్ణుడును ధనువుధరించిన
అర్జునుడును ఎచ్చటనుందురో అచ్చట సంపద
విజయము అభ్యుధయము స్ధిరముగా రాజనీతియు ఉండును. ఇది నా అభిప్రాయము.

శ్రీ మద్భగవద్గీత లో బహ్మవిద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదము
రూపమగు 18వ అధ్యాయము 'మోక్ష
సన్న్యాసయోగము' స మా ప్త ము.

ఓం శాంతిః శాంతిః శాంతిః

సర్వం ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు

గోవిందా గోవిందా గోవింద గోవిందా గోవిందా
ఓం నమోనారాయణాయనమః