ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LADIES FINGER IS THE BEST FOOD ITEM TO ASTHAMA PATIENTS - HEALTH TIPS WITH VEGETABLES - BENDAKAYA - LADIES FINGER


మీ ఆరోగ్యానికి అండ.. బెండ

సీజన్లతో పనిలేకుండా ఎప్పుడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లినా ఆకుపచ్చరంగులో తాజాదనాన్ని నింపుకుని ఆకర్షిస్తుంది బెండ. కూరలు, వేపుళ్లు, పచ్చడి ఏది చేసిన బెండకాయ రుచే వేరు. అయితే చాలామంది జిగురుగా ఉంటుందనిచెప్పి.. బెండను తరచూ తినడానికి ఇష్టపడరు. ఇందులోని పోషక విలువలు, అధిక పీచుపదార్థం తెలుసుకున్న తర్వాత తినకుండ ఉండలేరు. వంద గ్రాముల బెండలో 1.5 శాతం శక్తినిచ్చే క్యాలరీలు ఉంటాయి., ఏడుగ్రాముల కార్పోహైడ్రేడ్లు, రెండు గ్రాముల ప్రొటీన్‌తోపాటు అతి తక్కువ కొవ్వులను కలిగి ఉంటుందీ కాయగూర. శరీరంలో జీర్ణశక్తిని మెరుగుపరిచి, పేవుల్ని శుభ్రం చేసే శక్తి పీచుపదార్థానికి ఉంది. ఈ పీచును ఆహారం రూపంలో తక్కువ మోతాదులో తీసుకోవడం వల్లే.. ఉదరకోశ సమస్యలు వస్తున్నాయి. అందుకని బెండను తీసుకోవాలి. ఇందులో తొమ్మిది శాతం పీచు లభిస్తుంది. విటమిన్‌ ఇ, సి, కెతో పాటు మెగ్నీషియం, ఫాస్పరస్‌లు కూడా లభిస్తాయి. దీంతో రక్తనాళాల్లో రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు తోడ్పడుతుంది. మధుమేహంతో బాధపడేవాళ్లకు బెండ అండగా నిలుస్తుంది. ముఖ్యంగా మహిళలలో అయితే రుతుక్రమంలో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ఇక, బెండలోని విటమిన్‌ కెతో ఎన్నో లాభాలు. రక్తనాళాలు చిట్లకుండా చేస్తుంది. ఎముకలు బలిష్టంగా తయారయ్యేందుకు తోడ్పడుతుంది.

ఆస్మాకు అద్భుత ఔషధం..!

వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చాలు.. ఆస్మా బాధితుల తిప్పలు అన్నీఇన్నీకావు. ఇలాంటి వాళ్లకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది బెండ. భోజనంలో ఏదో ఒక రూపంలో రెగ్యులర్‌గా తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి బెండను తినడం వల్ల సమస్య తొలగిపోతుంది. ఒక్కోసారి ఏ కాలమైన కాస్త ఎండవేడికే వడదెబ్బ కొట్టే ప్రమాదం సంభవిస్తుంది. వేడికి గురైన శరీరాన్ని చల్లబరిచే గుణం బెండకు ఉంది. ఆధునిక జీవనశైలి తెస్తుస్న ముప్పులో మొదటిది అధిక బరువు సమస్య. కూర్చుని చేసే ఉద్యోగాలకుతోడు, మానసిక ఒత్తిళ్ల మధ్య పనిచేస్తుండే వాళ్లను ఒబెసిటీ వేధిస్తున్నది. దీనికి చక్కటి ఔషధం బెండ. అధిక బరువును తగ్గించడమే కాకుండా.. చెడు కొవ్వులను శరీరంలో పేరుకుపోకుండా జాగ్రత్త పడుతుంది.

వాటన్నిటికీ తోడు చర్మ సౌందర్యంలోను దీని ప్రాముఖ్యం అధికం. ఇందులోని విటమిన్‌ సి చర్మాన్ని యుక్తవయసులో ఉన్నట్లు చేస్తుంది. జబ్బులు దరి చేరనీయదు. జుట్టు రాలడాన్ని అరికట్టి, రోగనిరోధకశక్తిని పెంచి, కంటిచూపును మెరుగుపరిచి, ఎనీమియా, డయాబెటిస్‌ను రాకుండా చూస్తుందీ బెండ.