ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LORD SIVA KESAVA DEVOTIONAL TELUGU PRAYER


శివాయ విష్ణురూపాయ!
శివకేశవులొకటేయని తెలియర పసివాడా 
హరిహరులకు అభేదమన్నది వేదం కూడా ... 
జయ జయ శివ జయ జయ శివ జయహో జయ ఉమాపతీ 
జయ కేశవ జయ కేశవ కేశవ జయ రమాపతీ ...
శివకేశవులనే రెండు మహా కల్పవృక్షములు
దరిజేరిన వారికిడును ఒకే మోక్ష ఫలమును
వా'సు'దేవుడన్నా వా'మ'దేవుడన్నా
'సుమ'భేదం పేరుకె పూజకు సుమములు ఫలమొకటే...
శివ శివ శివ శివ శివయని శ్రీరామచంద్రుడు
శివుని పూజ చేయునురా సకల సుగుణసాంద్రుడు
రామ రామయనుచు శివుడు రామనామ తారకం
జపియించును రామనామమనే మోక్ష కారకం..
దుష్ట దైత్య నిర్జనకై వీర విజయ గర్జనకై
తమోశక్తి కొరకు కొల్చు ఉమాపతిని రాముడు
తనలోని తమోగుణమును నిగ్రహించుకొనుట కొరకు
శుద్ధ సత్త్వ స్ఫూర్తి ఐన రామసాధకుడు సోముడు...
మురహరుడు పురహరుడు ఒకటే సరిజూడ
రమ్యమైన వేదాంతరహస్య ముడులు వీడ
ఎవనికొక్కరే యగుదురు శ్రీరాముడు సోముడు
వాడొకడే ఈ భువిని అవాప్త సర్వ కాముడు!!!
-వనం వేంకట వరప్రసాదరావు