ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HISTORY AND PARTICULARS OF SRI RAJARAJESWARI SWAMY DEVASTHANAM - VEMULAWADA - KARIMNAGAR DISTRICT - INDIA


శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం

వేములవాడ - 505 302, కరీంనగర్‌ జిల్లా, ఫోన్‌ : 08723-236018, 236040

* స్థల పురాణం

దక్షిణ భారతమందలి పుణ్యక్షేత్రములలో వేములవాడ - శ్రీ రాజరాజేశ్వర క్షేత్రము ప్రధానమైనది. ఈ క్షేత్రము ఎంతో ప్రాచీనమైనది. పూర్వం ఇంద్రుడు వృతాసుర వధానంతరము బ్రహ్మహత్య దూషితుడై అనేక క్షేత్రములను తిరిగినా, ఆ పాపం పోగొట్టుకోలేక ఖిన్నుడై పవిత్రమైన పుణ్యక్షేత్రమును గురించి అడుగగా దేవతల గురువగు బృహస్పతి శ్రీ రాజరాజేశ్వర క్షేత్రమును గురించి తెలిపాడు. అనంతరం ఇంద్రుడు అక్కడ ధర్మగుండము యొక్క పుణ్యజలముతో స్నానం చేసి, తన భక్తితో శ్రీ రాజరాజేశ్వరుని మెప్పించి, నిర్మలుడై స్వర్గ రాజ్యమును పాలించెను. శ్రీ రాజరాజేశ్వరస్వామి కృతయుగాదిలో ఇక్కడికి వేంచేసి ఉన్నట్లు తెలుస్తోంది.

చంద్రవంశ సంభూతుడగు శ్రీ రాజరాజనరేంద్రుడు వేట కొరకు ఈ ప్రాంతమునకు వచ్చాడు. నీరు తీసుకుపోతున్న ఒక బ్రాహ్మణ బాలుని శబ్దభేరి బాణముతో కొట్టినందుకు, బ్రహ్మహత్య పాపం చేత, కుష్టురోగ పీడితుడై, అనేక తీర్థములుసేవించి, నిర్మలత్వమును, మనశ్శాంతిని పొందక ఇక్కడి ధర్మగుండము నందలి నిర్మలోదకములను దోసిలితో మూడుసార్లు త్రాగి, కనులకద్దుకొని రాత్రి అక్కడే నిద్రించాడు. స్వప్నములో ధర్మకుండ స్థల రాజేశ్వరుడు తాను ఆ సరస్సులో ఉన్నట్లు, తనను ఆ సరస్సు నుండి బయటకుతీసి, మరల ఒక దేవాలయములో ప్రతిష్ట చేయమని ఆజ్ఞాపించాడు.

* అనంతరం రాజు ప్రాత: 

కాలమున నిద్ర లేచి చూడగానే తన కుష్టురోగము పూర్తిగా పోయినందున మనశ్శాంతి పొంది, ఆ పుష్కరిణికి సొపానములను నిర్మింపచేసి, శ్రీ రాజరాజేశ్వర స్వామి లింగమును ఉద్దరించి, గట్టుపైన ఒక దేవాలయము నిర్మించి, తెల్లవారుఘుమున సుముహ్రొర్తముండుట వలన మేల్కొనియుండియు, చివరకు నిద్రపోయాడు. ఆ సమయంలో ప్రతి నిత్యము అక్కడకు వచ్చి పూజించు సిద్ధులు ఆ శివలింగమును దేవాలయములో రాజు నిర్ణయించిన సుముహ్రొర్తానికే ప్రతిస్థసచేసి వెళ్ళిపోయారు. తర్వాత రాజు నిద్రలేచి పశ్చాత్తాప పడ్డడు. స్వామివారు రాజుకి స్వప్నంలో కనబడి, ఇది సిద్ధ స్థాపితమైనందున నీవు చింతించవద్దు. నీ పేరుతోనే ఈ లింగమునకు సూర్య చంద్రులు వున్నంతవరకు వెలుగొందుతూ, ప్రసిద్ధి చెందు తుందని చెప్పడంతో రాజుకు మనశ్శాంతి కలిగింది.

శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి లింగము కృత, త్రేతా, ద్వాపర యుగాలలో ఇక్కడ బ్రహ్మాదులచే పూజింపబడిన స్వయంవ్యక్త లింగమని పురాణాదులు పోషించుట చేత, తర్వాత సిద్ధులచే పున:ప్రతిషస చేయబడిన కారణము చేత కొంచెం కూడ మహోత్సవమును కోల్పోక దినదిన ప్రవర్ధమానమై కీర్తి ప్రతిష్టలతో, నిత్య కళ్యాణం, పచ్చతోరణములతో అత్యంత వైభవముగా విలసిల్లుతోంది. ఈ క్షేత్రములో ప్రధాన దైవం శివుడైనప్పటికీ శ్రీ కోదండ రామస్వామి ఆలయము, శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయములో వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా నిత్య నైమిత్తికాదుత్సవములు జరుప బడుచున్నవి. కావున ఈ క్షేత్రము ''హరి హర క్షేత్రము'' గా భావించ వచ్చును.