ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

PURANA STORY OF JAMBHAVANTHA IN TELUGU AND ENGLISH


జాంబవంతుడు - హనుమాద్గాదా తరంగిణి అనే హనుమద్ చరితామృతం.

జాంబవంతుడు బ్రహ్మ ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. కృత యుగం నుండి ద్వాపర యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది. క్షీరసాగర మధనం సమయంలోను, వామనావతారం సమయంలోను జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో రాముని పక్షాన పోరాడాడు. కృష్ణునికి శ్యమంతకమణిని, జాంబవతిని ఇచ్చాడు.


రామాయణంలో వయోవృద్ధునిగాను, వివేకవంతునిగాను, మహా బలశాలిగాను జాంబవంతుని ప్రస్తావన సుందర కాండ, యుద్ధకాండలలో తరచు వస్తుంది. ముఖ్యంగా హనుమంతుని జవ సత్వాలు ఎరిగిన వివేకిగా జాంబవంతుని వ్యక్తిత్వం గోచరిస్తుంది. సముద్రాన్ని దాటి సీతను అన్వేషించడం ఎలాగో తెలియక అందరూ విషణ్ణులైనపుడు జాంబవంతుడే ఆ పనికి హనుమ సర్వ సమర్ధుడని తెలియజెప్పాడు.

యుద్ధకాండలో సారణుడనే రాక్షస చారుడు రావణునికి జాంబవంతుని, అతని అన్న ధూమ్రుని ఇలా వర్ణించాడు - "భల్లూక వీరుల సేనాపతి అయిన ధూమ్రుడు నర్మదా జలం త్రాగుతూ ఋక్షవంతం అనే గిరి శిఖరం మీద నివశిస్తూ ఉంటాడు. అతని ప్రక్కన ఉన్న పర్వతాకారుడైన మరో భల్లూక వీరుడే జాంబవంతుడు. పరాక్రమంలో ఈ తమ్ముడు అన్నకంటే మిన్న. సేనాధిపతులందరిలోనూ చాలా గొప్పవాడు. మహా పరాక్రమ శాలి. పెద్దలను సేవించడం అతనికి చాలా ఇష్టం. ఎన్నో యుద్ధాలలో ఆరి తేరాడు. అసహాయ శూరుడు. దేవాసుర యుద్ధంలో దేవేంద్రునకు సాయం చేసి చాలా వరాలు పొందాడు."

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వల్ల రామ లక్ష్మణులు, వానర సేన మూర్ఛిల్లినపుడు - మృత ప్రాయులై ఉన్నవారిలో బ్రతికినవారికోసం విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధాన కరణి అనే ఔషధాలను తీసుకు రమ్మని హనుమను కోరాడు.

జాంబవంతుడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కొన్నింటిని (బహుశా నాలుగు కూర్మ, వామన, రామ, కృష్ణావతారాలు) చూసిన పరమ భక్తుడు. సమస్త భూమండలాన్ని ఎన్నో సార్లు ప్రదక్షిణ చేశాడు. క్షీరసాగర మథనం జరుగుతున్నపుడు దేవతల కోరిక మేరకు భూగోళంపై ఔషధులన్నింటినీ అందులో పోశాడు. బలి చక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు మహావిష్ణువు త్రివిక్రమావతారం ఎత్తినపుడు, సురగంగతో బ్రహ్మపాదాలు కడిగే సమయాన జాంబవంతుడు త్రివిక్రముడుకి అనేక ప్రదక్షిణలు చేశాడు. రామావతారంలో హనుమంత, అంగదాది వానర వీరులతో సీతాన్వేషణకై వెళ్ళాడు. శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని దాటే ఉపాయం తెలియక వానరవీరులంతా ప్రాయోపవేశానికి సిద్ధమైనపుడు జాంబవంతుడు హనుమంతుని సమీపించి అతని జన్మ వృత్తాంతం, శాపాల్లాంటి వరాల గూర్చి చెప్పి హనుమంతుడికి ప్రేరణనిచ్చాడు. ఆ తర్వాత యుద్ధంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించిన వేళ, సర్వ వానరసేన మూర్చిల్లుతారు. అస్త్ర ప్రభావం సోకని విభీషణుడు వానర యోధులను సమీపించి వారి చెవులలో ధైర్య వచనాలు పలుకుతుంటే, ఆంజనేయుడు కూడా లేచి తనవారికి ఉత్సాహం కల్పించే ప్రయత్నం చేస్తాడు. ఈ సమయంలో విభీషణుడు జాంబవంతుడి దగ్గరకు వెళ్ళి ”తాతా!” అంటే ”బ్రహ్మాస్త్రం ధాటికి కన్నులు కనపడకున్నవి. కంఠస్వరాన్ని బట్టి నిన్ను గుర్తిస్తున్నాను. ఇంతకూ మన వాయునందనుడు క్షేమమేనా?” అని ప్రశ్నిస్తాడు. ఆశ్చర్యచకితుడైన విభీషణుడు ”తాతా! రామలక్ష్మణులు, అంగద సుగ్రీవుల గురించి అడగకుండా, కేవలం హనుమంతుని గురించి మాత్రమే ఎందుకడుగుతున్నావు?” అని ప్రశ్నిస్తాడు. అప్పుడు జాంబవంతుడు ”ఒక్క హనుమంతుడు ఉంటే చాలు. సర్వం శుభప్రథమే అంటాడు. ” హనుమంతునిపై ఆయనకున్న విశ్వాసం అటువంటిది. అప్పుడు మారుతి జాంబవంతుని చెంతకు చేరి సంతోషంతో ఆలింగనం చేసుకుని, బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల మూర్ఛితులైన వారిని కాపడటం కోసం హిమగిరుల్లోని ఔషధులు తెమ్మని చెబుతాడు. ఇంకా జాంబవంతుడి ప్రస్థావన క్రిష్ణావతారంలోనూ కనిపిస్తుంది. స్వయంగా కృష్ణుడితో యుద్ధం చేయడమే కాకుండా, ఆయనకు కన్యాదానమే చేశాడు.

Jambavanatha

Jambavan (Sanskrit: जाम्‍बवान, Telugu:జాంబవంతుడు, Kannada : ಜಾಂಬುವಂತ, Malay: Jambuwana, Burmese: Zabaman, Tamil: Sambuvan, Hindi: जाम्बवन्त, Thai: Chomphuphan) also known as Jamvanta, Jambavantha, Jambavat, or Jambuvan is a first form of humans created by god Brahmā, with lots of hair on his body he is perhaps not a bear, later he appeared has a bear in next life in Indian epic tradition (though he is also described as a monkey in other scriptures), immortal to all but his father Vishnu.[1] Several times he is mentioned as Kapishreshtha (Foremost among the monkeys) and other epithets generally given to the Vanaras. He is known as Riksharaj (King of the Rikshas). Rikshas are described as something like Vanaras but in later versions of Ramayana Rikshas are described as bears. He was created by Brahma, to assist Rama in his struggle against Ravana.[1] Jambavan was present at the churning of the ocean, and is supposed to have circled Vamana seven times when he was acquiring the three worlds from Mahabali. He was the King of the Himalayas who had incarnated as a bear in order to serve Rama. He had received a boon from Lord Rama that he would have a long life, be handsome and would have the strength of ten million lions.
In the epic Ramayana, Jambavantha helped Rama find his wife Sita and fight her abductor,Ravana. It is he who makes Hanuman realize his immense capabilities and encourages him to fly across the ocean to search for Sita in Lanka.
In the Mahabharata, Jambavantha had killed a lion, who had acquired a gem called Syamantaka from Prasena after killing him. Krishna was suspected of killing Prasena for the jewel, so he tracked Prasena's steps until he learned that he had been killed by a lion who had been killed by a bear. Krishna tracked Jambavantha to his cave and a fight ensued. After eighteen days, realizing who Krishna was, Jambavantha submitted. He gave Krishna the gem and also presented him his daughter Jambavati, who became one of Krishna's wives
Jambavantha he is the first form of human and strongest. He was considered very experienced and intelligent. He had a good knowledge of running a kingdom. Sugriva’s advisers included Jambavantha, Nala, Neela, Hanuman and a few others. Sugriva was residing on mount Rishyamukha with these advisers. Jambavantha advised Sugriva to send Hanuman to identify Rama and Lakshmana, to find out who they were and what their purpose was.
He was very powerful when he was young. He said this while he was encouraging Hanuman to cross the 100 Yojana Sea and go to Lanka in search of Sita. He was so powerful that he circled 7 times to God when God grew so huge to measure all three loka i.e. heaven, earth, and patal (below earth) in two simple steps. Jambavantha circled (parikrama) seven times to God in a brief time. So he could have easily jumped 100 Yojana Sea had he been young.
Once during a duel with Ravana, Jambavan was quick and ferocious. He gave Ravana mighty punches with his hands and finally kicked him on his chest, knocking Ravana unconscious and making him fall flat in his chariot. As a result, the charioteer withdrew Ravana from the battle. Earlier, Ravana had dueled Hanuman, who is considered to be the incarnation of Lord Shiva, and Sugriva, known to be the sun God Suriya .
Jambavan mentions two incidents in his life in the Ramayana. Once at the foot of Mount Mahendra, where Hanuman is about to take a leap and mentions that he could have jumped over the ocean to Lanka except that he got injured when he was beating the drum for Vishnu during the Vamana Avatara when the great god measured the three worlds. Vamana's shoulder struck Jambavan and he was injured which limited his mobility.
And once during the Samudra-Manthan,he was present at the time of the event. He got to know about the all-curing plant Vishalyakarni from the gods there and he later used this information to order Hanumana to help an injured and unconscious Laxmana in the great battle with the Lanka emperor,Ravana.
There was a Ramji temple in the village where Nilkanth Varni(Swaminarayan) rested. In the village, there were two daughters who would learn about Ramayan. One day the bawa who had requested Nilkanth to stay in his village could not answer the daughters’ questions. Nilkanth stepped in and satisfactorily answered their questions. The girls were pleased and went home to tell their parents. They wanted to invite Him to their house for dinner. Their father persuaded Neelkanth to come. Neelkanth came and ate dinner. Their father requested Him to stay longer to teach his son, Jairamdas since he wasn’t educated. Nilkanth agreed to stay for a few days and He taught Jairamdas scriptures and yoga.
Jairamdas’ friend, Krishna Tamboli, would come to have darshan of Nilkanth everyday. He would often bring lotus fruits to Nilkanth. Nilkanth asked him, “From where do you bring these lotus fruits, they are sweet indeed.” Tamboli replied, “There is a lake near my house.” Nilkanth wanted Tamboli to take Him there, so that evening Nilkanth and Jairamdas met Tamboli at the lake and Tamboli had a raft ready for them. As they were sailing, Nilkanth asked if He could steer the raft. While He was steering, the wind changed direction and was headed toward the forest with the wild animals. Nilkanth told them that they should all get off and rest, but Jairamdas and Tamboli were scared.
As they entered the forest, they heard a loud noise and a black bear came running toward Nilkanth . As soon as Nilkanth looked into the bear’s eyes, it calmed down and bowed to Him. Tears began rolling down from its eyes. Nilkanth told the bear, “You will be redeemed, You shall attain Akshardham in a few days. Nilkanth explained that the bear was Jambavan in a previous life and could not recognize Ram so had to pass through cycles of births, but that today, he recognized Him as the supreme Lord.