ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SRIKALAHASTHESWARA SATAKAM POEMS AND ITS MEANING IN TELUGU


సత్యం..శివం...సుందరం..
నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవంబబ్బనీ
జనమాత్రుండననీ మహాత్ముడననీ సంసార మోహంబు పై
కొననీ జ్ఞానముగల్గనీ గ్రహగతుల్ కుందింపనీ,మేలు వ
చ్చిన రానీ యవి నాకు భూషణములే .. శ్రీకాళహస్తీశ్వరా!
.
(శ్రీకాళహస్తీశ్వర శతకము)
.
శ్రీకాళహస్తీశ్వరా!నీకు సేవలు చేయు సందర్భములో నాకు ఆపదలు వచ్చిన రానిమ్ము
లేక మేలు జరిగి అన్ని వేళాలయందు నీకు వేడుకలు జరుగనిమ్ము
.సామాన్య మానవుడని అందరూ అననిమ్ము.లేక నన్నుమహాత్ముడనిప్రశంసించనిమ్ము,
సంసార సముద్రములో మోహాదులు కలిగితే కలుగనీ,జ్ఞానము లభ్యముకానీ
,గ్రహగతులు అనుకూలించక పోతేపోనీ,మేలే జరిగితే జరుగనీ,
అవీఅన్నీ నాకు ఆభరణముల వంటివే అగును.