loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

skin wrinkles KITCHEN remedies


AMAZING PHOTOGRAPHY


IF YOU WANT TO WALK FAST - WALK ALONE


GEORGEOUS SRUTHI HASAN


BHAGAWADHGEETHA QUOTES


BOLLYWOOD BEAUTY


ETERNAL GOD - ADHI DEVUDU


EVER GREEN GEORGEOUS AND GLAMOROUS SREE DEVI IN WHITE


CRAZY FANTASY BEAUTY


GEORGEOUS BLUE FULL LENGTH DESIGNER SUIT FOR TEEN WOMEN


HOW TO TAKE CARE OF YOUR BEAUTIFUL HAIR - TIPS FOR HAIR GROWING HEALTHY AND STRONGLYజుట్టు ఆరోగ్యంగా ఉండి, ఊడిపోకుం డానూ, వెంట్రుకలు నల్లగా నిగనిగలాడటానికీ, పేలు, చుండ్రు, పేనుకొరుకుడులాంటి అనారో గ్యాలు ఏర్పడకుండా జుట్టును పరిశుభ్రంగా ఉంచు కోవటమే కాకుండా, కేశాల అందం మెరుగు పడేలా సరయిన పోషణ, రక్షణ ఉండాలి. జుట్టు ఒత్తుగా ఉంటే, ఏరకమయిన హెయిర్‌స్లైల్‌ చేసు కున్నా అందంగానే ఉంటుంది. అయితే తమ జుట్టు ఏ రకమయినదో స్త్రీలు ముందుగా తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. జుట్టును మూడు రకాలుగా విభజించవచ్చు. 

1. నార్మల్‌హెయిర్‌ 2. పొడిజుట్టు 3. జిడ్డు జుట్టు.

1.    నార్మల్‌ హెయిర్‌ : నార్మల్‌ హెయిర్‌ ఉన్న వారు వారానికి ఒకసారి అభ్యంగన స్నానం చేయ వచ్చు. కొబ్బరినూనెను వెచ్చచేసి వెంట్రుకల కుదుళ్ళలోకి ఆయిల్‌ చేరేలా రాసుకోవాలి. సీకాయ, కుంకుడుకాయలను తలస్నానానికి ఉపయో గించాలి. జుట్టు బిరుసుగా ఉంటే తలస్నానానికి ముందు తాజా మందార ఆకులను కానీ, మందార పువ్వులనుకానీ మెత్తగా నూరి, ఆ పేస్టును తలకు పట్టించుకుని, పదిహేను నిమిషాలయిన తర్వాత స్నానం చేస్తే వెంట్రుకల బిరుసుతనం తగ్గి, కురులు మెత్తగా అవుతాయి. ఉసిరిక పొడిలో గోరువెచ్చని నీటిని కలిపి తలకుపట్టించి, ఓ అరగంట అయిన తర్వాత తలస్నానం చేస్తే వెంట్రుకలు నల్లగానూ, మృదువుగానూ ఉంటాయి. జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి.

2.    పొడి జుట్టు : జుట్టు బిరుసుగానూ, పొడి గానూ ఉంటే ప్రతిరోజూ జుట్టుకు నూనె పట్టిం చాలి. వారానికి ఒకసారి గోరువెచ్చని కొబ్బరి నూనెతో తలకు మసాజ్‌ చేయాలి. తాము తీసుకునే ఆహారంలో పాలు, నెయ్యి, వెన్న, గుడ్లులాంటివి చేర్చాలి. వారానికి ఒకసారి తలంటిస్నానం చేయాలి. సీకాయపొడి, కుంకుడురసం లేదా పొడిని వాడాలి. ప్రత్యేకంగా మందార పూలను మెత్తగానూరి, ఆ పేస్టును తలకు పట్టించాలి. కొంతసేపయిన తర్వాత తలస్నానం చేయాలి. వారానికి రెండు, మూడుసార్లు ఈ విధంగా చేయాలి. పోషకాహారలోపం ఏర్పడకుండా చూసుకోవాలి.

3.    జిడ్డు జుట్టు : జిడ్డుజుట్టున్నవారు ఆహార పదార్థాల్లో నూనెను బాగా తగ్గించాలి. వారానికి రెండుసార్లు మాత్రమే వెంట్రుకలకు నూనెను పట్టించాలి. తలలో జిడ్డు ఎక్కువగా ఉంటే మొటిమలు ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలోని దుమ్ము, ధూళి వెంట్రుకలకు అతుక్కుని జుట్టు అపరిశుభ్రంగా మారిపోతుంది. వెంట్రుకలు అపరిశుభ్రమయితే, జుట్టుకు సంబం ధించిన అనారోగ్యాలు కలుగుతాయి. పేలుపడ తాయి. చుండ్రు కూడా రావచ్చు.జిడ్డుజుట్టుఉన్నవారు వారినికి రెండుసార్లు తలస్నానం చేయాలి. నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి మిశ్ర మాన్ని తయారుచేసి దాన్ని తలకురాసి అరగంట తర్వాత కుంకుడురసం లేదా సీకాయపొడితో తల రుద్దుకోవాలి. ఆ విధంగా తలస్నానం చేస్తే వెంట్రు కల జిడ్డు తొలగిపోయి తలశుభ్రంగా ఉంటుంది.
తలలో చుండ్రు ఏర్పడితే వెంట్రుకలు ఊడి పోవడం, తల దురదగా ఉండటం, తెల్లని పొట్టు రాలడంలాంటివి కలుగుతాయి. చుండ్రువల్ల మొటిమలు కూడా వస్తాయి. తలలో చుండ్రు ఏర్పడినప్పుడు తలకు నూనెను రాయకూడదు. వారానికి మూడుసార్లయినా తలస్నానం చేయాలి. తలలోంచి తెల్లని పొట్టు రాలుతూంటే, నిమ్మరసంలో కొబ్బరినూనెను కలిపి తలకు బాగా పట్టించాలి. ఆ తర్వాత మృదువుగా మసాజ్‌ చేయాలి. గంట సేపయిన తర్వాత తలస్నానం చేయాలి. మెంతులు నానేసి మెత్తగా రుబ్బి, శీకాయపొడిలో కలిపి ఆ పేస్టుతో తలను రద్దుకుంటే తలలోంచి పొట్టు రాలటం, దురదలాంటి బాధలు తగ్గిపోతాయి.

తలలో పేలు పడినట్లయితే జుట్టు ఊడి పోతుంది. గోళ్ళతో గీకుతూండటంవల్ల వెంట్రుకలు తెగిపోవడం, కుదుళ్ళు బలహీనపడటం జరుగు తుంది. గోకడంవల్ల తలమీద చర్మం చిట్లి పేలు ఆ ప్రదేశంలో నెత్తురు త్రాగుతూ పుండ్లను ఏర్పరుస్తాయి. పేలు ఉన్నప్పుడు తలకు వేపనూనెతో మర్దనాచేసి, ఆ తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేయాలి. తాజా వేపాకులను మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి, ఓ పావుగంటలయిన తర్వాత తలస్నానం చేయాలి. కలరా ఉండలను మెత్తని పొడిచేసి, ఆ పొడిని తలకు పట్టించినట్లయితే, పేలు చచ్చి పోతాయి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

తలలో అనారోగ్యాలు ఏర్పడినప్పుడు వెంట్రు కల శుభ్రతను పాటించాలి. దువ్వెనలు, తలగడలు, తలగడ గలీబులు, తలతుడుచుకునే తువ్వాల విషయాల్లో పరిశుభ్రతను పాటించాలి. జుట్టుకు రసాయనికాలు కలిపే హేరాయిల్స్‌ను వాడేకంటే కొబ్బరినూనెను వాడటమే మంచిది. 

i'm fishermen - i'm too intelligent - Telugu Kids Stories
సముద్రం ఒడ్డున నివసిస్తున్న ఒక జాలరి చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళాడు. చేపలకోసం నీటిలోకి వల విసిరాడు. కాసేపటి తర్వాత వల పైకి లాగి చూడగా అందులో రెండూ మూడు చిన్న చేపలతో పాటు ఒక సీసా కనిపించింది. జాలరి ఆశ్చర్యంగా ఆ సీసా తీసుకుని మూత తెరిచాడు. వెంటనే దానిలోంచి బుస్‌మని నల్లటి పొగ బయటకు వచ్చింది. ఆ పొగ మేఘంలా మారి, దాని మధ్యలో పెద్ద ఆకారంలో భూతమొక్కటి ప్రత్యక్షం అయ్యింది. భూతాన్ని చూసి జాలరి భయంతో గడగడా వణికిపోయాడు. భూతం భయంకరంగా నవ్వి..''కొన్ని వందల సంవత్సరాల పాటు నేను అందరిని హడల కొట్టాను. అయితే ఒక మాయావి తన మంత్ర శక్తితో నన్ను ఈ సీసాలో బంధించి సముద్రంలోకి విసిరేశాడు. ఎంతోకాలంగా బయటపడే అవకాశం లేకుండా గడిపాను. చివరకు నీ వల్ల నాకు స్వేచ్ఛ లభించింది'' అన్నాడు. జాలరి నోట మాట రాలేదు. తిరిగి ఆ భూతమే ఇలా అంది. ''నిన్ను చంపక తప్పదు. ఎందుకంటే ఈ సీసాలోంచి నేను బయట పడ్డ విషయం నీకొక్కడికే తెలుసు. ఇది రహస్యంగా వుండాలంటే నువ్వు చావాలి'' అన్నది. ఈలోగా జాలరి భయంలోంచి తేరుకున్నాడు. భూతం జాలరిని చంపడానికి సిద్ధమయ్యింది. ఎప్పుడో ఒకసారి వాళ్ళ తాత చెప్పిన కథ గుర్తుకు వచ్చి, జాలరి ధైర్యం తెచ్చుకొని ఒక్కక్షణం ఆగు. నువ్వు ఎలాగూ నన్ను చంపకుండా వదలవని తెలుసు. అయితే చనిపోయే ముందు నాదో చివరి కోరిక తీరుస్తావా?'' అన్నాడు. ''చివరి కోరికఏమిటోవెంటనే చెప్పు'' అంది భూతం కోపం గా.''నువ్వు చూస్తే పర్వతంలా ఇంత పెద్దగా వున్నావు. ఇంత చిన్న సీసాలోకి నువ్వెలా వెళ్ళావో అస్సలు అర్థం కావడం లేదు. తెలుసుకోవాలని వుంది.చనిపోయే వ్యక్తి ఆఖరి కోరిక తీర్చడం ధర్మం'' అంటూ తొందరపెట్టాడు జాలరి. చాలాకాలం బంధింపబడి ఉండి, అనుకోకుండా దొరికిన స్వేచ్ఛ వల్ల కలిగిన ఆనందంతో భూతంలోని ఆలోచనా శక్తిని హరింప జేశాయి. ''అహ్హహ్హ అని పెద్దగా నవ్వుతూ మానవులకు అన్నీ సందేహాలే!'' అనుకొని ''చూడు మానవుడా..నేనెలా లోపలికి వెళ్ళానో..''అంటూ ఆ భూతం తన ఆకారాన్ని చిన్నగా మార్చకుని జాలరి చేతిలోని సీసాలోకి దూరింది.వెంటనే జాలరి సీసా మూతను గట్టిగా బిగించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సీసాను సముద్రంలోకి విసిరేశాడు.

TIPS FOR PARENTS TO THEIR CHILDREN ON GOING BACK TO SCHOOL AFTER ENJOYING HOLIDAYS1. పిల్లలకు స్కూలంటే భయపడే విషయాలు చెప్పవద్దు. టీచర్స్‌ అంటే వణికిపోయే మాటలు అస్సలు చెప్పవద్దు. 

2. పిల్లలకు బ్యాగ్‌లో తినడానికి ఏవైనా బాక్సులలో పెట్టడం మరిచి పోవద్దు. ఎందుకంటే ఇప్పటివరకు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఏదో ఒకటి తింటుంటారు. కాబట్టి ఆ బెంగ ముందర పోగొట్టాలి. అలాగే వాటర్‌బ్యాగ్‌, కర్చీఫ్‌ మరిచిపోకూడదు. 

3. స్వయంగా మీరే వారిని తీసుకెళ్ళి స్కూల్‌ దగ్గర వదలడం, తేవడం చేస్తుండాలి. స్కూల్‌ వదలడానికి పావుగంట ముందే మీరు అక్కడ ఉండేలా చూసుకోండి. లేకపోతే మీ పిల్లలు ఏడ్చి మరునాటి నుంచి స్కూలుకి వెళ్ళనని మారాం చేయవచ్చు. 

4. కే.జీ. పిల్లలను సాయంత్రంపూట దగ్గర్లో ఉన్న పార్కులకు తీసుకెళ్ళి ఆడించవచ్చు, అలాగే కాస్త పెద్ద క్లాసులో చదివే పిల్లలైతే రిలాక్స్‌ కోసం స్కేటింగ్‌, వీణ, వయోలిన్‌ లాంటి కోర్సులలో ఒక గంట శిక్షణ ఇప్పిస్తే అటు చదువుతోపాటు ఇటు ఆటల్లో రాణిస్తారు. 

5. ఇంటికెళ్ళాక పుస్తకాలన్ని తెచ్చారాలేదా అని పిల్లల్ని చెప్పమనండి. ఏం హౌంవర్క్‌ ఇచ్చారో డైరీతీసి చెప్పమనండి, వర్క్‌ తమ స్వంతంగా చేయమనండి, అప్పుడు మీరు ఇంట్లోలేనప్పుడు వారే స్వయంగా చేసుకోగలుగు తారు. 

6. పిల్లలకు చిన్నచిన్న మాటల్ని, పాటల్ని రాయడం, పాడడం, జి.కె.ఆన్సర్లు రాసేలా ప్రోత్సహించండి. అలా పోటీలకు పంపండి. వారికొచ్చిన బహుమతుల్ని స్కూల్లో చూప మనండి. అప్పుడు చదువు ఈ విధంగా ఉంటుందని అందుకు తప్పని సరిగా చదువుకోవాలని చెప్పండి. 

7. ఇంట్లో కంప్యూటర్‌ ఉన్న పిల్లలకైతే చిన్నప్పటి నుంచి ఛాటింగ్‌ చేయ మనక వారితో చిన్నచిన్న లెటర్స్‌, వారి నోట్స్‌ అందులో టైప్‌ చేయమనండి అవి ప్రింటింగ్‌ గీసి మీ పిల్లలకు చూపడం, వారూ చేయగలరని తెలపండి. ఈ విధంగా కంప్యూటర్‌ అంటే ఇంట్రస్ట్‌ కలిగేలా చేయండి. 

8. ఇది సెల్‌ఫోన్స్‌ కాలం, కానీ పిల్లలకు మరీ చిన్న వయస్సు నుంచే అలవాటు చేయకండి. అందులో ఉన్న ఆప్షన్స్‌ తెలియచేయండి, వాటిని ఆపరేట్‌ చేసేలా ప్రోత్సహించండి. కానీ స్కూల్స్‌కి పట్టుకెళ్ళనివ్వవద్దు, కొంతమంది పెద్దలు తమ అమాయకత్వంతో పిల్లలకు అడగంగానే సెల్స్‌ ఇవ్వడం మనం అక్కడక్కడా చూస్తుంటాం, అది మంచి పద్దతికాదు. 

9. ఎప్పుడైనా పుస్తకాలకి అట్టలు చినిగిపోతే వాటిని వారే కవర్‌ చేసేలా నేర్పించండి. అలా నేర్పేటప్పుడు బలవంతంగా ''ఇలా, అలా వేయాలి, వేసుకోవడం చేతకాదు'' అని కాక ఒకవేళ ఇంట్లో మేం లేనప్పుడు నువ్వే వేసుకోవాలి కదా నాన్న'' అంటే అది తప్పనిసరిగా పిల్లలు నేర్చుకుంటారు. 

10. మీరు బయటకెళ్ళేటప్పుడు మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. బ్యాంకులకు వెళ్ళేటప్పుడు డబ్బులు వేసే ఫారం ఎలా నింపాలి, ఎలా డ్రా చేయాలి, డి.డి.ఫారాలు ఎలా నింపాలి, ఇలాంటివి నేర్పితే ఇంకా మంచిది. 

11. పిల్లల్ని సం||రానికో స్కూలు మార్చే బదులు చదు వంతా అయ్యే వరకూ ఒకే స్కూల్లో ఉంచితేనే మంచిది. ఎందుకంటే ఎప్పుడూ కొత్తకొత్త స్కూల్స్‌ అయితే అలవాటు పడేసరికి సగం సమయం అయిపోతుంది, ఇతరులను ఫ్రెండ్స్‌ చేసుకోవడం ఆలస్య మవుతుంది. అందుకే ఒకే స్కూల్‌ అయితేనే బావుంటుంది. 

12. బజారుకి వెళ్ళేటప్పుడు మీ పిల్లలకు లేని పుస్తకాలని, కావల్సిన ఆట వస్తువులని వారి చేతే కొనేలా చేయండి. వాటి మీద ధరల్ని చూడమనండి, అలాగే తినే వస్తువుల్ని, మందుల్ని కొనేటప్పుడు వాటి మీద మాన్యుఫ్యాక్చరింగ్‌ డేట్‌, ఎక్స్‌పైరీ డేట్‌ గురించి వివరించండి. 

13. స్కూల్స్‌లోపోటీలు, బయటి పోటీలకు పంపండి, అలా బయట ప్రోగ్రామ్స్‌ చేసేటప్పుడు ఫోటో సెషన్స్‌ ఉంటాయి కాబట్టి పిల్లలకు స్టేజ్‌ మ్యానర్స్‌, పక్కవాళ్ళతో ఎలా మాట్లాడాలో చక్కగా నేర్పండి, అలాగే డ్రస్‌కోడ్‌ విషయం నేర్పడం మరీ అవసరం.

ఇంట్లో పెద్దవారికి సహాయం చేయడం నేర్పండి. వృద్ధులు ఉన్నట్లయితే మందులు, మంచినీళ్ళు అందించడం వంటి పనులు వారిని చిన్న చిన్న పనులు చేసేలా ప్రోత్సహించండి. ఇలాంటివి నేర్పించడం వల్ల చదువు పూర్తయ్యేసరికి పిల్లలు మంచివ్యక్తిత్వం కలవారుగా తయారవుతారు. 

amazing art combination painting of lord sri krishna and Radha


GLAMOUR ANGELS OF INDIAN CINEMA PHOTO GALLERY


HOT BEAUTIES OF INDIAN CINEMA INDUSTRY


CUTE AND STYLISH MODEL AND ACTRESS GAYATHRI PHOTO PICSGEORGEOUS SUMMER HOT GAYATHRI PHOTO GALLERY


loading...