ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT LORD MAHADEV'S VIBHOODHI


విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. 

ఈ విభుతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతు ఉంటాడు. 
నరక బాధలు లోనుకాకుండా చూస్తాడు. కాల్చిన పేడను (ఆవు పేడ) ఈ భస్మం లో ఉపయోగిస్తూ ఉంటారు. 
భస్మ ధారణ చేయకుండా చేసే జపతపాలు ఫలితాలను ఇవ్వవని శాస్త్ర వచనము. 
మన శరీరములో 32 చోట్ల భస్మ ధారణ చెయ్యాలి అని శాస్త్రము చేప్తోంది, కాని ఈ కాలము లో అలాగ చెయ్యటము వీలుపడని పక్షములో కనీసము శిరస్సు, రెండు చేతులు, గుండే, నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మాన్ని ధరించవచ్చు. 
త్రిపుండ్రాలుగా (ముడు గీతలు) అడ్డముగా భస్మ ధరణ చెయాలి. 
ఇలాగ చేస్తే జన్మ జన్మల పాపాలు నసించి పోతాయని పెద్దల వాక్కు.
ఈ భస్మ ధారణ చేయడానికి కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి శాస్త్రాలలో.
బ్రాహ్మణ, క్షత్రీయులు "మానస్తోకే మంత్రము " తో, వైశ్యులు " త్ర్యయంబక " మంత్రము తో , 
ఇతరులు శివపంచాక్షరి తో భస్మ ధారణ చెయాలి.
ఈ విభుతి మహిమను వివరించే కధ దేవి భాగవతము పదకొండవ స్కందము లో ఉంది.
మహిమాన్వితమైన విభుతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. ఆవుపేడను కింద పడనీయకుండా, చేత్తోపట్టుకుని, వేదమంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని "శాంతికము " అని అంటారు.
షడాక్షరి మంత్రముతో హొమము చేసి తయారు చేసుకునే భస్మాన్ని "పౌష్ఠికం" అని అంటారు. బీజాక్షరాలతో హొమము చేసి తయారు చేసిన భస్మాన్ని "కామదం" అని అంటారు..

భస్మం తయారు చేసుకునే ముందే ఆవుపేడను సేకరించి, చిట్టు, లేక పొట్టును కలుపుతూ ముద్ద చేసి, ఆ ముద్దను పిడకలుగా చేసి అతి శుభ్రమైన ప్రదేశములో ఎండబెట్టాలి.

యాగాలు చేస్తున్నప్పుడు అరణిని మధించడం ద్వార వచిన అగ్నితో గాని, మంత్ర పూర్వకముగా పిడకలను హొమ గుండము లో వేసి హోమము చెయ్యాలి.
అనంతరం శుబ్ర్హమైన పాత్రలో విభుతిని నింపాలి.
హర హర మహా దేవ శంభో శంకర

PEACOCK CUP SET


ACTRESS SHRAVYA IN BEAUTIFUL HALF SAREE


GRAPES HAVING VITAMIN-A - C - B6 - POTASIUM - MANGANESE ETC


CHILD CARE WITH BANANA - THE POWER OF BANANA


CAPSICUM HEALTH TIPS


HOW TO MAINTAIN AFRESH OF SKIN ROUND THE CLOCK


HEALTHY BATHING TIPS FOR ALL


YOGA GIVES FITNESS TO HUMAN BODY


POWER OF TULASI MEDICINE


WHAT IS LEMON GRASS - HOW TO USE LEMON GRASS IN DAILY LIFE - HEALTH TIPS ABOUT LEMON GRASS


USE LEMON JUICE/ OLIVE OIL / HONEY FOR REMOVING DEAD CELLS ON SKIN - TIPS FOR SKIN GLOW IN TELUGU


BANANA TIPS FOR HEALTH AND BEAUTY - BANANA BEAUTY




అందాన్నిచ్చే అరటిపండు
ఎంతో చౌకగా లభ్యమయ్యే అరటిపండు అంటే అందరికీ చులకనే. అమృతఫలమని పిలిచే ఈ పండును రోజూ తిం టే ఆరోగ్యమని పెద్దలు చెబుతుంటారు. మానసిక ఉద్వేగాల ను కూడా నియంత్రించే గుణం అరటి పండులో ఉందిట. అందుకే ఎప్పుడెైనా మూడ్‌ బాగో లేకపోతే అరటిపండు తింటే సరి. ఇవన్నీ ఆరోగ్యానికి సంబంధించినవి. అందాన్ని కాపాడు కోవడంలో కూడా అరటి పండు దోహదం చేస్తుందిట. ముఖ్యంగా మండువేసవిలో ఈ పండును సౌందర్య సాధనంగా ఉపయోగించడం ద్వారా అందరూ లాభపడ వచ్చునంటున్నారు.

చర్మ సమస్యలు మొటిమలు, ముఖం పొడిబారటం. ఈ సమస్యలను దూరం చేయడానికి అరటిపళ్ళు ఎంతో ఉపయోగపడతాయంటున్నారు. బి, ఎ, సి,ఎ విటమిన్లే కాక పొటాషి యం కూడా కలిగిన ఈ పళ్ళు అటు చర్మానికి, ఇటు జుట్టుకు కూడా పోషకాలుగా ఉపయో గపడతాయి.

మొటిమలు : చాలా త్వరగా మొటిమలు, ఇతర సమస్యలు వచ్చే సున్నితమైన చర్మానికి అరటిపండు ఒక వరంలా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ పండులో చర్మానికి సమస్యలు తీసుకువచ్చే పదార్ధాలు ఏమీ ఉండవు. అందుకే సున్నితమైన చర్మానికి ఇది సరెైన పరి ష్కారం. బాగా పండిన అరటిపండును ఒక దానిని తీసుకుని మెత్తగా చిదిమి ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించి, 20 నిమిషాల పాటు ఉంచుకొని గోరు వెచ్చటి నీటితో ముఖం కడుక్కో వాలి. ఇన్ఫెక్షన్‌తో కూడిన మొటిమలలోని బాక్టీరియాను అరటి పండులోని పొటాషియం హరించివేయడంతో అవి చాలా త్వరగా తగ్గిపోతాయి. అలాగే ఇందులో ఉన్న బి విటమిన్‌ దురద వంటి వాటిని తగ్గించడమే కాదు మన చర్మం కూడా మంచి రంగులో ఉండేలా చేస్తుంది. అంతేకాదు వేసవి కాలంలో చెమట వల్ల వచ్చే పేలుడును, అతివేడి వల్ల వచ్చే రాష్‌ను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.

పొడి చర్మం : ముఖం పెై గీతలు, పొట్టు లేచి పోవడం వంటి చిహ్నాలు కనిపించాయంటే ముఖం పొడిబారుతోందని అర్థం. పురాతన కాలం నుంచి ముఖంలో తేమను నిలపడానికి, నింపడానికి అరటిపండ్లను ఉపయోగిస్తూ వస్తున్నారు. ఈ పండులో ఉన్న విటమిన్‌ ఎ చర్మంలో ఉండే సహజ నూనెలను పునరుద్ధరిస్తుంది. ఇక విటమిన్‌ ఇ పాడెైన చర్మాన్ని మర మ్మత్తు చేసి, ఏజింగ్‌ స్పాట్స్‌ను తగ్గిస్తుంది. విటమిన్‌ సి చర్మ కణాలలోని విషవాయువులను నిల్వ ఉంచకుండా చేయడంతో సన్నటి గీతలు ఏర్పడటం, వయసు పెరిగినట్టు కనిపించడం తగ్గుంది.

వయసు మీద పడినట్టు కనిపిస్తున్నామని భావించే వారు, ఒక పండిన అరటి పండును తీసుకుని దానిని మెత్తగా పేస్ట్‌లా చేసి, దానికి ఒక చెమ్చా తేనెను కలిపి ముఖానికి పట్టించుకుని 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఎండిన తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని కడిగి వేయాలి. తేనె చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇక అరటిపండు ముఖాన్ని మృదువుగా చేస్తుంది. పొడి చర్మానికి అరటిపండ్లు బాగా ఉపయోగ పడతాయి ఎందుకంటే అవి సహజంగానే తేమను ఇస్తాయి. ఈ ప్యాక్‌నే ఎండవల్ల కమిలిన చర్మాన్ని సహజ స్థితికి తీసుకువచ్చేందుకు ఉపయోగించవచ్చు. వేసవిలో జుత్తు కూడా దెబ్బతింటుంది. వేడిమి వల్ల అది ఎండి, పాడవుతుంది. అరటిపళ్ళు జుత్తుకు సహజ మెరుపును తెచ్చేందుకు సాయపడతాయి.

జుట్టు పొడిబారడం : ఎండలో ఎక్కువగా తిరిగే వారికి, రంగుల వంటి రసాయనాలను ఉపయోగించేవారికి, జుట్టును వంకీలు తిప్పుకునే వారికి వాతావరణంలో వచ్చే మార్పులు హాని చేస్తాయి. అరటిపళ్ళు పొడిబారిన జుట్టును, మాడుకు కూడా మరమ్మత్తు చేసి సహజ స్థితికి తీసుకువస్తాయి. అరటిపండ్లలో ఉండే పొటాషియం మాడుపెై ఉన్న ఎటువంటి బాక్టీరియానెైనా తొలగించి, ఆరోగ్యవంతమైన జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఒక పండిన అరటిపండును తీసుకుని మాష్‌ చేసి, దానిని మాడుకు జుట్టుకు పట్టించాలి. దానిపెై క్యాప్‌ ధరించి ఒక ఇరవెై నిమిషాల పాటు ఉంచి తరువాత షాంపూ చేయాలి. దీనితో జుట్టుఆరోగ్యవంతంగా అవుతుంది. అలాగే జీవరహితంగా కనిపించే జుట్టుకు ఒక అరటిపం డులో ఒక టేబుల్‌ స్పూన్‌ ఆల్మండ్‌ ఆయిల్‌ను కలిపి దానిని జుట్టుకు పట్టించాలి. తరువాత వేడి నీటిలో ముంచి పిండిన టవల్‌ను తలకు చుట్టుకుని 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత గోరు వెచ్చటి నీటితో తలను కడుక్కొని షాంపూ చేసుకోవాలి. సంవత్సరం పొడువునా దొరికే ఈ పండుని అన్ని రకాలుగా మనం ఉపయో గించుకోవచ్చు.

SWIMMING HEALTH TIPS FOR ALL AGES


ENJOY LIFE PEACEFULLY AND PUT CHECK TO STRESS - STRESS RELIEF TIPS IN TELUGU


HOW TO INCREASE HEALTH RESISTENCE POWER IN OUR BODY - TIPS FOR MAINTAINING GOOD RESISTENCE POWER IN OUR BODY


వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ)
ఇట్టే పెరుగుతుంది.....!

శరీరం పలురోగాల పాలయ్యాక డాక్టర్ల చుట్టూ తిరగడమే గానీ, రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నాలెప్పుడూ చేయం. దీని వల్ల ఆర్థికంగా నష్టమే కాదు. అమూల్యమైన కాలమూ వృధా అవుతుంది.. ఇంతకూ వ్యాధి నిరోధక శక్తి ఎందుకు తగ్గుతుంది? అందుకు కారణాలు అనేకం. చిత్రమేమిటంటే, పోషక పదార్థాల మాట అలా ఉంచి ఏ ఖర్చూ లేకుండానే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే అవకాశాలను కూడా మనం జారవిడుచుకుంటాం. ఉదాహరణకు నిద్ర, నీరు, గాలి. వీటికి ఖర్చేమవుతుంది? శరీరంలో ఆక్సీజన్‌ పరిమాణం తగ్గినా, నీటి శాతం తగ్గినా, అవసరమైనన్ని గంటలు నిద్రించకపోయినా వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. అవసరమైనన్ని గంటలు నిద్రించకపోతే, ఎంతటి బలవర్ధక ఆహారం తీసుకున్నా అవేవీ శరీరానికి శక్తిని ఇవ్వలేవు. అలాగే మనం తీసుకున్న పోషకాలు శరీరంలోని సప్తధాతువులకూ చేరాలంటే వాటికి వాహికగా శరీరంలో అవసరమైన నిష్పత్తిలో నీరుండాలి. రోజూ ఐదారు లీటర్ల నీళ్లు తాగడానికి బదులు అందులో సగమే తీసుకుంటే ఏమవుతుంది? శరీర సమస్త కణజాలాలన్నిటికీ పోషకాలు అందకపోవడమే కాకుండా జీవక్రియలన్నీ కుంటుపడతాయి. ఈ లోపం ఏ వ్యాధి రావడానికైనా దారి తీస్తుంది.

వాతావరణంలో సహజంగా 35 శాతం దాకా ఉండాల్సిన ఆక్సీజన్‌ ఇప్పుడు 15 శాతానికి పడిపోయింది. ఈ స్థితిలో ప్రాణాయామం తప్పని సరి అవుతోంది. అందుకు రోజూ ఓ అరగంట వ్యాయామం, ఓ 15 నిమిషాలు ప్రాణాయామం చేస్తే సరిపోతుంది. కానీ, 90 శాతం మంది ఆ పని చేయడం లేదు. అదేమంటే తినే ఆహార పదార్థాలు, పీల్చే గాలీ అన్నీ కలుషిత మైపోయాయి. ఈ స్థితిలో ఏం చేస్తే మాత్రం ఏం ఒరుగుతుంది? అంటూ తమ బద్దకాన్ని కప్పిపుచ్చుకుంటారు. కలుషిత ఆహారాన్ని తీసుకున్నా, వాటిలోని మంచిని గ్రహించి, చెడును విసర్జించే శక్తి శరీరానికి సహజంగానే ఉంటుంది. కాకపోతే శరీరానికి అవసరమైనంత శ్రమ లేదా వ్యాయామం ఉండాలి. ఆ శ్రమే లేకపోతే, ఆహారంలోని మంచిని సరిగ్గా గ్రహించలేకపోగా, చెడుకు బలైపోతుంది.

ఒత్తిళ్లతోనూ నష్టమే.....!

కారణం ఏదైనా కావచ్చు. మానసిక ఒత్తిళ్లు శరీర వ్యవస్థను బాగా దెబ్బ తీస్తాయి. ఒత్తిళ్లు తీవ్రమైనప్పుడు నాడీ వ్యవ స్థ అడ్రినలిన్‌, నార్‌-అడ్రినలిన్‌ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. మనసు ఒత్తిడికి గురవుతోందీ అంటే, ఏదో ఘర్షణ ఉందని, శరీరానికి అదనపు శక్తి అవసరమవుతుందని భావించి శరీరం ఈ హార్మోన్లను విడుదల చే స్తుంది. ఆ వెనువెంటనే గుండె వేగం, రక్తపోటు పెరుగుతాయి. అదనపు శక్తి కోసం గ్లూకోజ్‌ సాధారణ పరిమాణం కన్నా మించి విడుదల అవుతుంది. ఇది శరీర శ్రమకు సంబంధించినది కాకపోవడం వల్ల అదనంగా విడుదల అయిన గ్లూకోజ్‌ శరీరంలోనే నిలిచిపోతుంది. అంతిమంగా ఇది మధుమేహానికి దారి తీస్తుంది. వీటన్నిటికీ విరుగుడు శరీర శ్రమ, యోగ, ప్రాణాయామాలే. వ్యాయామాలు శరీర వ్యవస్థను బలోపేతం చేయడమే కాదు మానసిక ఒత్తిళ్లను తట్టుకునే శక్తిని కూడా పెంచుతాయి.

ఆహారంలో భిన్నత్వం

* ప్రతి ఆహార పదార్థంలోనూ పోషకాలు ఉంటాయి కానీ, ప్రతి దాంట్లోనూ అన్ని రకాల పోషకాలు ఉండవు. అందుకే పండ్లు, కూరగాయల్ని రోజుకో రకం తీసుకోవడం ఉత్తమం. పైగా రోజూ ఒకే రకమైన ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరం వాటిలోని పోషకాలను గ్రహించడం పట్ల ఆసక్తి చూపదు.

* కేవలం విటమిన్లు ఉన్న ఆహార పదార్థాలకే పరిమితం కాకుండా, వ్యాధులతో పోరాడేందుకు తోడ్పడే ఫైటో కెమికల్స్‌ ఉన్న పదార్థాలకు ప్రాముఖ్యతనివ్వాలి.

* లవణాలు ప్రత్యేకించి జింకు, ఐరన్‌, కాపర్‌ ఉండే ఆహార పదార్థాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ముడి ధాన్యాల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి.

* రోజుకు కనీసం 40 గ్రాముల పీచు పదార్థాలు అందే ఆహార పదార్థాలకు ప్రాధాన్యతనివ్వాలి. పీచుపదార్థాలు లోపిస్తే మలినాలు శరీరంలోనే నిలిచిపోయి జీవక్రియలు కుంటుపడిపోయే పరిస్థితికి ఏర్పడుతుంది. అంతిమంగా ఇది వ్యాధినిరోధక శక్తిని దెబ్బతీస్తుంది.
ఫ నాడీ వ్యవస్థ పోషణకు కొవ్వు పదార్థాలు కూడా అసవరమే. కాకపోతే అవి ఆహారంలో 20 శాతానికి మించకూడదు.

* తీపి పదార్థాల్లో మెదడును చైతన్యపరిచే గుణం ఉంది. అయితే అతిగా తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గే ప్రమాదం కూడా ఉంది. అందుకే చాలా పరిమితంగానే తీసుకోవాలి.

ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు శరీరంలో వ్యాధినిరోధక శక్తిని గణనీయంగా పెంచుతాయి. నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలా చేస్తాయి.

HEALTH WITH ALASANDHA GRAINS


అలసందలతో ఆరోగ్యం

నవధాన్యాలైన అలసందలు లేదా బొబ్బర్లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనా లున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. తక్కువ కేలరీలతోపాటు కొవ్వు శాతం తక్కువ ఉండే అలసందలు స్థూలకాయాన్ని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఫైబర్‌ ఎక్కువగా ఉన్న బొబ్బర్లు షుగర్‌ లెవెల్‌ను సాధారణంగా ఉంచుతాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌లు వైరస్‌, జలుబు ఇన్ఫెక్షన్‌లకు దూరంగా ఉంచుతాయి. రక్తంలో కొలెసా్ట్రల్‌ను తగ్గించి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉన్న అధిక ఫైబర్‌ వల్ల జీర్ణసంబంధిత సమస్యలు దూరమవుతాయి.

RAINY SEASON HAIR CARE TIPS IN TELUGU



వర్షాకాలంలో జుట్టు సంరక్షణ ఇలా...! 

అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో అందమైన ఒత్తైన కేశాలు ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే వర్షాకాలంలోనూ జుట్టును పరిరక్షించు కోవాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో తడిసినపుడు జట్టు పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలం టున్నారు నిపుణులు. తడిసిన జుట్టు చుండ్రు సమస్యకు దారి తీస్తుంది. వర్షాకాలంలో జుట్టు రాలకుండా, చుండ్రు సమస్య దరిచేరకుండా ఉండాలంటే ఎక్కువసేపు పొడిగా ఉంచాలి. మైల్డ్‌ షాంపూ తో ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య దూరమవుతుంది. షాంపూతో స్నానం చేసేముందు జుట్టుకు వెనిగర్‌ పట్టిస్తే చాలు కాంతివంతం అవుతుంది.

జుట్టు ఆరోగ్యకరంగా ఉండాలంటే కోడిగుడ్లు, క్యారెట్‌, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, బీన్స్‌, నట్స్‌, కొవ్వు తక్కువగా ఉన్న పాల ఉత్పత్తులతో కూడిన పోషకాహారం తీసుకోవటం మేలు. నీరు ఎక్కువగా తాగడంతోపాటు కనీసం వారానికి ఓ రోజు జట్టుకు నూనె పట్టించడం మంచిది. వర్షాకాలంలో జుట్టు పొడుగ్గా పెంచకుండా పొట్టిగా కటింగ్‌ చేయించుకోవటం మేలు.

EAT FRUITS FOR GOOD SLEEP


MY HANDS


BAPU CARTOONS


SUMMER SWEATING TIPS


BIRYANI SIDE RECIPE - KADDHU KA DALCHA


STORY OF A MAD MAN


WORKS HARD GIVES FRUIT FUL RESULTS - KIDS STORY



AMARAVANI QUOTATIONS


HOW TO REDUCE OVER FAT AND WEIGHT - HOW TO ATTAIN FITNESS - TIPS FOR REDUCING OVER FAT IN OUR BODY


BOLLYWOOD BECOMES HOT AND HOTTER AND HOTTEST






GLAMOROUS INDIAN BEAUTY


AMAZING MEDICINE FOR ALLERGY - DOCTORS ADVISE


FOUNTAIN WALL


GOLDEN BANGLES WITH STONES AND PEARLS




LATEST STONE BANGLES COLLECTION




Om Narayana Namah Om Shivaya Namah Om Shakthi Namah


LORD MAHADEV'S MARRIAGE PIC


KANKANALU - TELUGU KIDS STORY



MANA ANDHRA


BEAUTIFUL DOLLS


BOLLYWOOD ACTRESS STAR GALLERY