ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ACTRESS IN BEAUTIFUL HOT SAREES






Amazing Braided Hairstyles-5



Amazing Braided Hairstyles-4





Amazing Braided Hairstyles-3






Amazing Braided Hairstyles-2






Amazing Braided Hairstyles-1






DASARADHI SATAKAM - SRI RAMADASU POEMS COLLECTION



దాశరథీ శతకం -- రామదాసు

తరువులు పూచికాయలగు దుత్కసుమంబులు పూజగా భవ
చ్చరణము సోకి దాసులకు సారములౌ ధనదాన్యరాశులై
కరి భట ఘోటకాంబర నికాయములై విరజానదీ సము
త్తరణమొనర్చు చిత్రమిది దాశరధీ కరుణాపయోనిధీ !

భావము :
దశరధపుత్రా కరుణా సముద్రా రామా ! చెట్లు పూలు పూచి ఆ పూలు కాయలుగా మారును. ఆ పూవులు కోసి పూజకై నీ చరణములు సోకిన నీ భక్తులకు ధన ధాన్యములు, చతురంగబలములు ఏర్పడి విరజా నదిని దాటించును. అటులనే నన్ను కుడా ఈ సంసారమను విరజా నదిని దాటింపుము.

GODDESS SRI MAHA LAKSHMI RESIDES


లక్ష్మీదేవి ఎవరింట నివసిస్తుంది "
.
ఒక సారి రుక్మిణీ దేవి లక్ష్మీదేవిని ఈ ప్రశ్న వేసింది. అప్పుడు లక్ష్మీదేవి ఋక్మిణీ దేవికి చెప్పిన విషయము
. నిత్యము సత్యము పలికే వారు, శుచిగా శుభ్రంగా ఉండే వారు, గురువుల ఎడ భక్తి కలవారు, ఎల్లప్పుడూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండేవారు, సదా దక్షతతో దీక్షితులుగా ఉండేవారు, మంచి పనులు చేసే వారు, మలినము లేని వారు, ఎప్పుడూ మంచి పనులు చేసే వారు, వుజ్ఞావంతులు, తపస్సు చేసే వారు, తనకు ఉన్నంతలో దానము చేసే వారు, బ్రహ్మచర్యము పాటించే వారు, ఇంద్రియ నిగ్రహము కల వారు నాకు ప్రేమ పాత్రులు నేను వారి వెంట ఎప్పుడూ ఉంటాను.
ఇక క్రూరాత్ములు, నాస్థికులు, కృతఘ్నులు, దుర్మార్గుల వద్ద అసలు ఉండను. ఇక స్త్రీల వాద ఎవరి ఎంగిలి తినని వారు, ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకునే వారు వారి అందు నివసిస్తాను. ఇక భర్తకు ఎదురు చెప్పే వారు, ఇతరులను నిందించు వారు, భర్తకు తెలవకుండా పర పురుషుల ఇళ్ళకు వెళ్ళే వారు, ఎప్పుడూ నిద్రించె వారు వారి వద్ద నేను ఉండను.
మరియు నేను తామర పువ్వులందు, పూల తోటలందు, ఫలవృక్షముల అందు నేను నివసిస్తాను " అని లక్ష్మీ దేవి రుక్మిణీ దేవికి చెప్పింది "

SWAYAMBHULINGESWARA SWAMY TEMPLE AT MELLACHERUVU - KODAD - NALGONDA DISTRICT


స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయం::: మేళ్ళచెరువు, కోదాడ నల్లగొండజిల్లా

కాకతీయుల కాలం నాటి ఈ చారిత్రక శివాలయం ప్రత్యేకమైనది ఎందుకంటే ఇక్కడి శివలింగం(1.83 మీటర్ల ఎత్తు 0.34 మీ చుట్టు కొలత కలిగి ప్రతి సంవత్సరం ఎత్తు పెరుగుతూ ఉంటుంది... నిత్యం స్వయం అభిషేకం జరుగుతుంటుంది....

శివలింగం పెరిగే ఎత్తు ఒక ఎత్తయితే ప్రతి అడుగు ఎత్తు తర్వాత ఒక వలయం(చిత్రం రెండు, ఆరు) ఏర్పడుతూ ఉంటుంది.. ఆవిధంగా చూస్తే మనకు కొన్ని సంవత్సరాల తర్వాత వలయాల సంఖ్యలో పెరుగుదల మనకు స్పష్టంగా కనపడుతుంది... మొదట్లో కేవలం మూడు నామములు(చిత్రం నాలుగు) పెట్టే స్థలమే ఉండేదట.. ప్రస్తుతం ఆరు నామములు (చిత్రం ఐదు)పెట్టేంత స్థలం ఏర్పడిందని ఆలయ అర్చకులు.. పెద్దవారు చెపుతుంటారు...
ఇంకొక విచిత్రమేమిటంటే ఈ శివలింగం పై భాగంలో చిన్న ఖాళీ (చిత్రం మూడు)ప్రదేశముంది.. ఇక్కడ ఎప్పుడూ నీరు ఊరుతూ (చిత్రం తొమ్మిది)ఉంటుంది.. ఈ నీరు విగ్రహంపై అభిషేకంలా ఎప్పుడూ (చిత్రం తొమ్మిది)ఉబుకుతుంది... అంటే శివుని ఝటాఝూటంలోని గంగమ్మ వారిలా... అందుకే ఇది స్వయంఅభిషేక లింగంగా చెప్పుకోవచ్చు... ఇది ఈ క్షేత్రంలో చాలా ప్రత్యేకం.. ఈ నీరు ఎంత తీసివేసినా తిరిగి తిరిగి ఊరుతూనే ఉంటుంది... ఇక్కడ శాస్త్రీయమైన ఏ ఆధారాలు లేవు... కానీ ఇది ఒక అద్భుతం... శివుని ఝటాఝూటంలో గంగా దేవి లాగా శివుని అభిషేకం చేయటం అద్భుతమే కదా... మన భారతదేశంలో కేవలం వారణాసి లో మాత్రమే ఇలా ఉందట.. అందుకే దీనిని దక్షిణ కాశీ అని కూడా ఇక్కడ పిలుస్తారు...

కాకతీయుల కాలంలో ఒక ఆవు ప్రతిరోజూ వచ్చి ఈ శివలింగానికి క్షీరాభిషేకం చేసేదట... ఆ యాదవ కాపరి ఆ రాయిని శివలింగంఅని తెలియక పదకుండు ముక్కలుగా చేసి వేర్వేరు ప్రదేశాలలో పారవేస్తాడట... కానీ తిరిగి రెండవ రోజు చూస్తే మరల అక్కడ ఈ లింగం ప్రత్యక్షమై కనిపించిందట... అతనికి ఏమీ అర్థంకాక రాజుగారికి చెపితే ఆయన దీనిని శివలింగం గా గుర్తించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నదిగా చెపుతారు...

ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి.. శివ కళ్యాణమును లక్షదీపారాధనలను చాలా కన్నుల పండువగా నిర్వహిస్తారు...

కాకతీయుల కాలమునకు సంబంధించిన ఈ ఆలయమునకు ఎందుకో ఎక్కువగా ప్రాచుర్యం లభించలేదు...
ఈ ఆలయం కోదాడ దగ్గరలో ఉంది... జాతీయరహదారి (నుండి కేవలం పది కి.మీ. లోపులో ఇక్కడకు చేరుకోవచ్చు.

Free Crochet Baby Dress Patterns-3





Free Crochet Baby Dress Patterns-2





Free Crochet Baby Dress Patterns-1





BAPU GARI CHITRALU


బాపు గారి కి వందనములతో)
"ఎంకంటే ఎంకిరా" ! .......
సిరిమల్లె పూలన్ని
సిగదురుము కొచ్చింది 
సరిగంచు సీరలో 
సరసాలు పోయింది
ఎంకంటే ఎంకిరా
ఎగిరేటి జింకరా !
ఎన్నెల్లో మెరిసేటి
నెలవంక కంకిరా !
ఎంకటే ఎంకిరా!
కీగంటి చూపెట్టి
కితకితలు పెట్టింది !
పలు వరస నవ్వుతో
పులకింత తెచ్చింది !
ఎంకంటే ఎంకిరా
ఎనలేని సొంపురా
ఎన్నెల్లో మెరిసేటి
గోదారి వంపురా !
ఎంకటే ఎంకిరా !
ఎన్నె లేడేక్కింది
తిన్నె చాపేసింది
కన్నె గోదారేమో
కలత నిదరోయింది !
ఎంకి దాపున కొచ్చి
ఏంది మావా అంటే !
గూటిలోనీ సిలక
ఎగిరెగిరి ఆడింది !
ఎంకటే ఎంకిరా
ఎల మావి పూతరా !
సెలయేటి పాటరా,
సరసాల మూట రా !
ఎంకంటే ఎంకిరా !!
.డా . కృష్ణ సుబ్బారావు పొన్నాడ .

GLAMOROUS FROOTI BEAUTI POONAM BAJWA


SAVE ANIMALS


ONE WAY TRAFFIC


TRAFFIC SIGNALS CARTOONS


BEAUTIFUL AND CRAZY BEAUTY ARCHANA


GEORGEOUS SAMANTHA


GODDESS SRI KANAKA DURGA AVATHAR


RARE PIC OF LORD SIVA