ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

GODDESS SRI MAHALAKSHMI HD PIC


ANCIENT IMPORTANCE OF SHANKAM IN PUJA PERFORMANCE AND USAGE IN TEMPLES


శంఖము యొక్క పూజా ప్రాధాన్యత

సనాతన హిందూ సంప్రదాయ పూజా విధానములో శంఖానికి విశేష ప్రాధాన్యము ఉన్నది . దేవతలు , రాక్షసులు అమృతము కోసము సముద్ర మధనము చేసినప్పుడు ఈ శంఖము పుట్టినది అని అంటారు . . అప్పటి నుండి అది పాంచజన్యము గా మారిపోయినది . శంఖం అనేది రెండు సంస్కృత పధాల కలయిక ... శం అంటే ఏధైనా మంచి అని , ఖం అంటే జలము అని అర్ధము ... కాబట్టి జలము ఉంచే మంచి కలశము అని అనుకోవచ్చును . శంఖం లో ఉంచిన నీటిని పవిత్ర తీర్ధము గా ఉపయోగిస్తారు . దానిలో అనేక లవణాలు కరిగి ఉంటాయి .

1.భూమి , 2.ఆకాశము , 3.గాలి , 4.నీరు , 5.అగ్ని . అనేవి పంచభూతాలు . ఇక్కడ భూమి అంటే మట్టి - జీవి జన్మకు వేదిక . . . భూమి చుట్టూ ఉన్న శూన్యప్రదేశమే - ఆకాశము ... ఇక భూమి పైన ఉన్న ప్రకృతివాతావరణము లో ప్రతి జీవికి కావలసిన గాలి , నీరు , అగ్ని/శక్తి (ఆహారము) జీవపరిణామ క్రమములో వాటంతటవియే సమకూర్చబడ్డాయి . జీవి + పంచభూతాలు కలిస్తేనే ప్రకృతి . ఒకదానినుండి ఒకటి ఉద్భవించాయి . అలా ఉద్భవిస్తూనే ఉంటాయి . వీటికి అంతము లేదు ... అంతరాయమూ ఉండదు . భూగోళము ఉన్నంతవరకూ ఇలా జరగవలసినదే . వీటిలో ఏ ఒక్కదానికి అంతరాయము కలిగినా ప్రకృతిలో జీవి (ప్రాణి) నశించి భూమి ఉనికే ప్రశ్నార్దకము ?.తొలి రోజుల్లో మానవుని విజ్ఞాన శాస్త్రము అంతగా అభివృద్ధి చెందని కాలములో అన్నింటిని అతీత శక్తులు గాను , దైవాలుగాను భావించి పంచభూతాలను లింగాలుగాను , అంగాలుగాను ఊహించి పూజించి... మనోశక్తిని , మానసిక ఉల్లాసాన్ని పొందేవాడు . ఆ కోవలోనిదే ఈ శంఖం పూజ .

శంఖం - కొన్ని ఆరోగ్య చిట్కాలు :

* శంఖం లో రాత్రంతా నీటిని ఉంచి మరుసటి ఉదయం ఆ నీటితో చర్మాన్ని రుద్దుకుంటే చర్మసంబంధమైన రోగాలు నయమవుతాయి .
* శంఖం లో నీటిని పోసి 12 గంటలు అలాగే ఉంచాలి .. ఆ నీటిని చర్మము కీద ఉన్న తెల్లమచ్చలు పై రుద్దాలి ఇలా రోజూ క్రమం తప్పకుండా చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఆ మచ్చలు మాయమవుతాయి .
* రాత్రి శంఖాన్ని నీటితోనింపి ఉదయము దానికి కొంచెం రోజ్ వాటర్ కలపాలి . . అలా కలిపిన నీటిని జుట్టుకిపట్టించాలి . దీనివల్ల జుట్టు ఆరోగ్యము గా నల్లగా తయారవుతాయి . గడ్డము , మీసాలము ఇదే నీటిని పట్టిస్తే అవి అందం గా నల్లగా ఒత్తుగా మారతాయి .
*కడుపు నొప్పి సంబంధిత రోగాల నివారణకు పరగడుపున రాత్రి పన్నెండు గంటలపాటు శంఖం లో ఉంచిన నీటిని ఒక స్పూన్‌ త్రాగాలి . ఈ నీరు పేగులను బాగా శుబ్రపరుస్తుంది .
*పన్నెండు గంటలపాటు శంఖం లో నిల్వవుంచిన నీటిని మామూలు నీళ్ళలో కలిపి పరగడుపున ఆ నీటితో కళ్ళు కడుక్కోవాలి . ఇలా రోజూచేస్తే కంటి సంబంధిత రోగాలు మాయమౌతాయి . కళ్ళు ఆరోగ్యం గా ఉండి కళ్ళజోడు వాడవలసిన అవసరము తగ్గుతుంది .
* ఉదయము స్నానము చేశాక శంఖాన్ని ముఖానికి , ఒంటికి రుద్దుకుంటే ముఖం పై ముడుతలు , నల్లమచ్చలు పోయి ముఖం కాంతివంతం గా ఉంటుంది .

ఇన్ని ఉపయోగాలు న్న శంఖం ను పూజించడం .. ఆరాదించడం .. పూజా విధానాలలో ఉపయోగించడం ఎంతోమంచిది .. ఆవిధంగా రోజూ శంఖం తో సంబంధం ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచిది .

శంఖం గురించి :

శంఖము ( Conch) ఒకరకమైన మొలస్కా జాతికి చెందిన జీవి. ఇవి వివిధ జాతులకు చెందిన మధ్యమ పరిమాణం లోని ఉప్పునీటి నత్తలు లేదా వాటి కర్పరాలు. నిజమైన శంఖాలు సముద్రంలో నివసించే గాస్ట్రోపోడా తరగతికి చెందిన స్ట్రాంబిడే (Strombidae) కుటుంబంలోని స్ట్రాంబస్ (Strombus) ప్రజాతికి చెందిన జీవులు. ఇవి చాలా చిన్నవాటినుండి చాలా పెద్దవాటి వరకు వివిధ పరిమాణాలలో ఉంటాయి. వీటిలో చాలా జాతులు వాణిజ్యపరంగా ఆహార పదార్ధాలుగా ముఖ్యమైనవి. Strombus gigas శంఖువుల నుండి ఖరీదైన ముత్యాలు తయారౌతాయి. సుమారు 65 జాతుల శంఖులు అంతరించిపోయాయి. జీవించియున్న జాతులు ఎక్కువగా హిందూ మహాసముద్రం - పసిఫిక్ మహాసముద్రంలో నివసిస్తున్నాయి. ఆరు జాతులు కారీబియన్ ప్రాంతంలో నివసిస్తున్నాయి. చాలా శంఖు జాతులు ఇసుకమేట వేసిన సముద్రగర్భంలో ఉష్ణప్రాంతాలలో జీవిస్తాయి.

శాస్త్రవేత్తలు అభిప్రాయానుసారం శంఖ ధ్వని వల్ల వాతావరణ లోపాలు, కీటకముల నాశనం జరుగుతుందని -అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు. శంఖ బస్మము వల్ల అనేక రోగాలు నయము అగుచున్నవి. ఋషి శృంగుడు చెప్పిన విధానం ప్రకారం చంటి పిల్లలకు శంఖమాలలు ధరింపచేసి వాటితో నింపిన నీరును త్రాగించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. శంఖాన్ని పూరించుట వల్ల శ్వాశకోశ రోగాలు నశిస్తాయి. కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాధం వినిపిస్తుంది. దానివల్ల భక్తుల కోర్కెలు తీరును. ఈ శంఖాలు వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుచున్నవి. శంఖము పాపనాశిని ప్రతి ఇంటిలోను శంఖము వుండవలసిన వస్తువు శంఖము వున్న ఇల్లు లక్ష్మీ నివాసము.

మానవులకు ఉపయోగాలు

ఆహార పదార్ధాలు-- శంఖాలలోని అన్ని భాగాలు మాంసాహారంగా తింటారు. తూర్పు ఆసియా దేశాలలో వీటిని పలుచగా కోసి వేపుడు చేసుకుంటారు.
సంగీత పరికరాలు --శంఖు కర్పరాలు ట్రంపెట్ మాదిరిగా గాలితో ఊదే సంగీత పరికరాలు. శంఖము నుండి వెడలే నాదాన్ని శంఖారావం అంటారు. అమెరికన్ జాజ్ సంగీతకారుడు స్టీవ్ టర్రే (Steve Turre) శంఖాలను కూడా తన ఆర్కెస్ట్రాలో ఉపయోగిస్తాడు.
బహుమతి వస్తువుగా --శంఖాలు ఫిజీ వంటి దక్షిణ పసిఫిక్ దేశాలలో చారిత్రాత్మకంగా ఉపయోగంలో ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని హోటళ్ళలో యాత్రికులకు స్వాగతం ఇవ్వడానికి దీనిని ఉపయోగిస్తున్నారు.
పురాణములలో -- శ్రీకృష్ణుడు ఉపయోగించిన శంఖము - పాంచజన్యము.

శంఖం - ఆద్యాత్మిక ప్రాముఖ్యత :

శంఖే చంద్ర మావాహయామి
కుక్షే వరుణ మావాహయామి
మూలే పృధ్వీ మావాహయామి
ధారాయాం సర్వతీర్థ మావాహయామి

శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు. మందిరాలలోనూ శుభకార్యాలలోనూ దీని ధ్వని శోభను పెంచుతుంది. దీని పుట్టుక సముద్ర మధనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మధనంలో వచ్చిన పదనాలుగు రత్నాలలో శంఖం ఒకటి , విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి ,శంఖం ... సముద్రతనయ అయివున్నది.

శంఖం లక్ష్మికి సోదరి, సోదరుడు కూడాను. ఈమె లక్ష్మికి వారసురాలు, నవనిధులలో అష్టసిద్ధులలో దీనికి ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠాలలో, ఆరతిలో, యజ్ఞాలలో, తాంత్రికక్రియలలో దీనిని ఉపయోగిస్తారు. ఆయుర్వేదరీత్యా దీనిలో మంచి గుణాలు వున్నాయి. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోనూ దీనిని స్థాపించి ఆరాధించేవారు. కూర్మ పీఠం మీద ఎరుపు పట్టు వస్త్రాన్ని వేసి దీనిని స్థాపించి, దేవతగా భావించి పూజించేవారు. ఈ పూజలు వల్ల వాళ్లకు ఎంతో అభివృద్ధికల్గేది. దీనికి అనేక రకాల పూజా విధానాలు కలవు. పూర్వం కొన్నింటిని గృహ కృత్యాలలో తప్పనిసరిగా వాడేవారు.

శంఖాలలో చాలా రకాలు వున్నాయి. రకాలను బట్టి పూజా విధానాలు కలువు. శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తి చేయును. సుఖ సంతోషాలను కలగజేస్తుంది. ఈ శంఖాలు మానససరోవర్‌, లక్షద్వీప్‌, కోరమండల్‌, శ్రీలంక, భారతదేశంలోను లభిస్తున్నాయి. శంఖం యొక్క ఆకారాన్ని బట్టి వాటిని విభజిస్తారు ముఖ్యంగా 3 రకాలు 1. దక్షిణావృత శంఖం, 2. మధ్యావృత శంఖం, 3. ఉత్తరావృతవ శంఖం. ఎడమ చేతితో పట్టుకునే దానిని దక్షిణావృతమని కుడిచేతితో పట్టుకునే దానిని ఉత్తరావృత శంఖమని మధ్యలో నోరు వున్నదానిని మధ్యావృతమని అంటారు. ఈ శంఖాల పేర్లు ఈ విధంగా ఉన్నవి. 1. లక్ష్మీ శంఖం, 2. గోముఖ శంఖం, 3. కామధేను శంఖం, 4. దేవ శంఖం, 5. సుఘోష శంఖం, 6. గరుడ శంఖం, 7. మణిపుష్పక శంఖం, 8. రాక్షస శంఖం, 9. శని శంఖం, 10. రాహు శంఖం, 11. కేతు శంఖం, 12. కూర్మ శంఖం,

భారత యుద్ధ సమయంలో అనేక రకాల శంఖాలు పూరించారు. ఉదా:- శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించాడు, అర్జునుడు దేవదత్తాన్ని, భీముడు పౌంఢ్ర శంఖాన్ని యుధిష్ఠరుడు అనంత విజయ శంఖాన్ని, నకులుడు సుఘోష శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పక శంఖాన్ని, కాశీరాజు శిఖండి శంఖాన్ని దుష్ఠ ద్యుమ్నుడు, విరాటుడు స్వాతిక శంఖాన్ని అలాగే ఇతర రాజులు అనేక రకాల శంఖాలు పూరించారు.

శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక, శంఖాన్ని శివపూజకు, పూజనందు ఆరతి ఇచ్చేటప్పుడు ధార్మిక ఉత్సవాలలో యజ్ఞాలలో రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు మరియు దీపావళి, హోళి, మహాశివరాత్రి, విశిష్టమైన ఖర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు. రుద్రపూజకు, గణశపూజకు, దేవిపూజకు, విష్ణుపూజకు దీనిని ఉపయోగిస్తారు. దీనిని గంగాజలం, పాలు, తేనె, నేయితోను, బెల్లంతోను, అభిషేకిస్తూ వుంటారు. దీనిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. దీనిని పూజించటం వల్ల వాస్తుదోషాలుపోతాయి. వాస్తుదోషం పోవడానికి ఎర్ర ఆవుయొక్క పాలతో దానిని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు, దు:ఖాలు దౌర్భాగ్యం దూరమవుతాయి.

విష్ణు శంఖాన్ని దుకాణాలలోను ఆఫీసుల్లోను ఫ్యాక్టరీలలోను స్థాపించి అభివృద్ధిని పొందుతున్నారు. లక్ష్మి స్వయంగా శంఖం నాసహోదరి అని చెప్పిన సందర్భాలు కలవు. దేవి యొక్క పాదాలు వద్ద శంఖాన్ని వుంచుతారు. శంఖాలు వున్న చోట నుండి లక్ష్మి తరలిపోదు. ఆడ మగ శంఖాలని రెండు కలిపి స్తాపించాలి.

గణేష్ శంకాలలో నీరు నింపి గర్భవతులకు త్రాగించినట్లయితే గ్రుడ్డి, కుంటి, మూగ మొదలైన సంతానం కలగదు. అన్నపూర్ణ శంఖాన్ని ఆహారపదార్థాలలో స్థాపించి పూజిస్తారు. మణిపుష్పక్‌, పాంచ జన్యాలను కూడా అక్కడ స్థాపించి పూజిస్తారు. చిన్న శంఖ మాలలను ధరించి కూడా అనేక సిద్ధులను పొందుచున్నారు.

శాస్త్రవేత్తలు అభిప్రాయానుసారం శంఖ ధ్వని వల్ల వాతావరణ లోపాలు, కీటకముల నాశనం జరుగుతుందని -అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు. శంఖ బస్మము వల్ల అనేక రోగాలు నయము అగుచున్నవి. ఋషి శృంగుడు చెప్పిన విధానం ప్రకారం చంటి పిల్లలకు శంఖమాలలు ధరింపచేసి వాటితో నింపిన నీరును త్రాగించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. శంఖాన్ని పూరించుట వల్ల శ్వాశకోశ రోగాలు నశిస్తాయి. కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాధం వినిపిస్తుంది. దానివల్ల భక్తుల కోర్కెలు తీరును. ఈ శంఖాలు వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుచున్నవి. శంఖము పాపనాశిని ప్రతి ఇంటిలోను శంఖము వుండవలసిన వస్తువు శంఖము వున్న ఇల్లు లక్ష్మీ నివాసము.

కొన్ని శంఖాల వివరణ:

దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు. దక్షణావృతంలో శివశంఖం, పాంచజన్యం మొదలగు రకాలున్నవి. పాంచజన్యం పురుష శంఖం ఇది దొరుకుట కష్టం. శని శంఖాలకు నోరు పెద్దది పొట్ట చిన్నది. రాహు, కేతు శంఖాలు సర్పాకారంలో ఉంటాయి. రాక్షస శంఖానికి అన్నీ ముళ్లుంటాయి. ముత్యపు శంఖాలు పాలిష్‌ వల్ల వెండిలా మెరుస్తూ వుంటాయి. వినాయక శంఖం తొండాలతో కూడి ఉంటుంది. కూర్మ, వరాహ శంఖాలు తాబేలు, పంది ఆకారంలో ఉంటాయి. శంఖాలు ఎక్కువుగా రామేశ్వరం, కన్యాకుమారి, మద్రాసు, విశాఖపట్నం కలకత్తా, బొంబాయి మరియు పూరీలో ఎక్కువుగా దొరుకుచున్నవి.

సముద్రతనయాయ విద్మహే శంఖరాజాయ ధీమహీ తన్నో శంఖప్రచోదయాత్‌

MOBILE TRAVEL


FOOD SEEDS


COME FROM MY DREAM


GODDESS SARADA DEVOTIONAL PRAYER


శారదే వీణా వాదన విశారదే వందే తవపదే
నారద జననీ చతుర్వదన నాయకి భుక్తి ముక్తి దాయకి
నళిన దళ లోచని భవ మోచని హంసవాహిని హంసగామిని
ఇంద్రాది సకల బృందారక గణ వందిత పదార విందే
ఇందు విటంబన మంద స్మితయుత సుందర ముఖార విందే
వందారు సుజన మందార దయా సదనే మృదు గతనే
వాణి నిత్య కల్యాణి వరదే రామదాస హృదయాలయే శ్రీ

MIDHUNA LATEST HOT PIC


Om isanaputraya namaha


ఓం ఈశానపుత్రాయ నమః
Om isanaputraya namaha

నామార్ధం: మహేశ్వరుని పుత్రుడు, శివుని యొక్క జ్యోతిస్వరూపమైనవాడు.
Meaning: Son of Lord Maheswara, manifestation of Shiva. 

DREAM BEAUTY MEGHANA RAJ




SIGN ON WILL


LisaHaydon looks uber stylish in this long dress avataar


High Trend Anarkali Suit for Diwali festival special


HEALTH TIPS - PRANA MUDRA - VAYU MUDRA - SUBHARATHRI MUDRA - AGNI MUDRA OR SURYA MUDRA





SWEETEST BEAUTY GAYATHRI




AUTOBIOGRAPHY


MATHS TEACHER


LIFT SIR


ALL PROPERTIES TO ME


ONE DEGREE FOR ME


DONT DEPEND ON ANYONE


RADHA DEAR


FACE BOOK HAWA


FB LIKES VERY MUCH THANKS


DIWALI FESTIVAL CARTOON - DEAR GO HOME


PVR'w work with charcoal pencil