loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SWEET AND LOVELY PARROTS


IMPORTANCE OF 30 DAYS OF KARTHIKAMASAM MONTH - FESTIVAL SPECIAL ARTICLE IN TELUGU


INTERNATIONAL STANDARDS DEVELOPMENT OF GUJARATH BUS STAND


PUT CHECK TO AIDS WITH ADAVI THANGEDU PLANT - RESEARCH ARTICLES IN TELUGU


TELUGU LANGUAGE - TELUGU GRAMMER - INFORMATION ABOUT ALANKARAMULU - TWO TYPES - SABDHALANKARAMULU AND ARDHALANKARAMULU


WEDDING LEHANGA CHOLI DRESSES COLLECTIONTELUGU PURANA BIRTH STORY OF LORD KUMARASWAMY


కుమారస్వామి పుట్టడం-శ్రీ రామాయణం

"దేవతలందరూ ఇంద్రునితోనూ అగ్నిహోత్రునితోనూ కలిసి బ్రహ్మదగ్గిరికి వెళ్లి 'దేవా! నువ్వు మాకు శత్రుసంహారదక్షుడైన సేనాధిపతిని అనుగ్రహించావు; కాని అతను ఇంకా పుట్టనేలేదు. పైగా, భగవంతుడైన శివుడు హిమవచ్చిఖరం మీద ఉమాదేవితో కూడా గొప్ప తపస్సు చేస్తున్నాడు. అంచేత, ఇప్పుడు చెయ్యవలసిందేమో ఆలోచించి లోకాలను రక్షించు. నువ్వే మాకు గతి ' అని ప్రార్థించారు. దానిమీద బ్రహ్మ తియ్యనిమాటలతో వారిని ఓదార్చి 'ఉమాదేవి మిమ్ము శపించింది. కనక, మీభార్యలయందు మీకు సంతానం కలగదు. ఉమాదేవి మాట జరిగితీరుతుంది. కాని పొల్లుకాదు. ఇది సత్యం. ఇందులో సంశయం ఎంతమాత్రమూ లేదు. ఇదే, ఆకాశంలో ప్రవహించే గంగానది చూడండి. మీకు సేనాధిపతి కావలసిన మహావీరుణ్ణి అగ్నిహోత్రుడు అకాశగంగయందు పుట్టించగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగ యందు పుట్టించగలడు. గంగ అగ్ని వల్ల తప్పకుండా కుమారుణ్ణి కంటుంది. ఉమాదేవికి అది ఇష్టమున్నూ అవుతుంది. సందేహం లేదు' అని చెప్పాడు.

అప్పుడు దేవత లందరూ బ్రహ్మను పూజించి ధాతుశోభితం అయిన కైలాసపర్వతానికి వెళ్లి 'దేవా! ఇది దేవకార్యం. కనుక, ఇది నెరవేర్చు. శైలపుత్రిక అయిన గంగాదేవియందు నువ్వు ధరించి వున్న మహాదేవుని రేతస్సు విడిచి పెట్టు ' అని కోరారు.

వెంటనే అగ్ని గంగదగ్గరికి వెళ్లి 'దేవీ! నువ్వు గర్భం ధరించు, ఇది దేవతలకు మిక్కిలి ప్రియమైనది ' అని చెప్పాడు. ఆ మాట విని గంగ చక్కని స్త్రీరూపం ధరించి రాగా అగ్ని ఆ సౌంధర్యం చూసి అన్ని అవయవాలనుంచీ విడిచి గంగ స్రోతస్సులన్నీ శివరేతస్సుతో నింపాడు. కాని 'అగ్నీ, నే నీ తేజస్సు భరించలేను ' అంది. 'అయితే , ఈ హిమవత్పర్వత పాదంమీద గర్భం ఉంచు' అని అగ్ని చెప్పాడు. ఆమాట మీద గంగాదేవి పరమభాస్వరం అయిన గర్భం స్రోతస్సుల నుంచి విడిచిపెట్టింది. గంగ విడిచిన శివరేతస్సు భూమిమీద పడడం వల్ల బంగారమూ, వెండీ, రాగీ, ఉక్కు,తగరమూ, సీసమూ పుట్టాయి. ఆ శ్వేతపర్వతం అంతా రెల్లువనంతో కూడా బంగారం అయిపోయింది. బంగారం అది మొదలు అగ్నిలాగ మెరుస్తూ జాతరూపం అని పేరుపొందింది.

ఇంద్రాది దేవతలు, కుమారుడు పుట్టగానే పాలిచ్చి పెంచడానికి షట్కృత్తికలనూ ఏర్పాటు చేశారు. 'ఈ బిడ్డ మా ఆరుగురికీ కొడుకే ' అని సమయం చేసుకుని కృత్తికలు అతన్ని పెంచడానికి ఉన్ముఖులయినారు. అది చూసి దేవతలు 'కుమారుడు కార్తికేయుడనిన్నీ పేరుపొందుతాడు. త్రిలోకాలయందూ విఖ్యాతుడున్నూ అవుతా' డన్నారు. అప్పుడు గర్భ పరిశ్రావంకాగా స్కన్నుడైన బాలుణ్ణి కృత్తికలు స్నానం చేయించారు. అగ్నిహోత్రంలాగ ప్రకాశిస్తున్న ఆ కుమారుడు స్కన్నుడైనాడు కనుక దేవతలు స్కందుడనిన్నీ పేరు పెట్టారు. వెంటనే కృత్తికలకు పాలు పుట్టాయి. కుమారుడు ఆరు మొగాలు కలవాడై ఏకకాలంలో ఆరుగురి పాలూ తాగి, సుకుమారదేహుడే అయినా తన అఖండపరాక్రమం వల్ల రాక్షస సేనలనన్నిటినీ జయించాడు. అగ్నిని పురస్కరించుకుని దేవతలందరూ కుమారుణ్ణి దేవసేనాధిపత్యం యిచ్చి అభిషేకించారు. రామా! గంగ వృత్తాంతం యిదీ. పుణ్యప్రదమైన కుమారస్వామి జననం ఈ విధంగా జరిగింది. ఇక్ష్వాకు వంశవర్ధనా! కార్తికేయుడైన కుమారస్వామి యెడల భక్తిగల మానవుడు ఇహలోకంలో దీర్ఘాయువూ అష్టైశ్వర్యాలూ అనుభవించి చివరికి స్కందసాలోక్యసిద్ధి పొందుతాడు.

MAHABHARATHA PURANA TELUGU STORY ABOUT EKALAVYA


గురు దక్షిణ -శ్రీ మహాభారతంలో కథలు

ద్రోణుడు పరుశురాముడి శిష్యుడు. ఆయన దగ్గర శస్త్రాస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు. భీష్ములవారు ద్రోణాచార్యుడి ధనుర్విద్యాశక్తిని గురించి విని ఆయనను పిలిపించి కురుపాండవులకు శిక్షణ ఇప్పించాడు.

హస్తినాపురంలో ద్రోణాచార్యులు ధనుర్విద్య నేర్పుతున్న సంగతి ఆ నోటా ఆ నొటా అందరికీ తెలిసింది. కర్ణుడు కూడా విద్యాభ్యాసం కోసం వచ్చాడు.

అందరూ ఎంతో శ్రమపడి విద్య నేర్చుకుంటున్నా, అందరికంటే దీక్షగా అర్జునుడు చేసే సాధన ఆచార్యునికి సంతోషం కలిగించింది. అందుకని మరింత ఓపికతో, ప్రేమతో అతనికి పాఠాలు చెప్పావారు. ఒకనాడు భోజన సమయంలో పెనుగాలికి దీపం ఆరిపోయింది. అయినా అలవాటు ప్రకారం అర్జునుడు భోజనం ముగించి చీకటిలో కూడా విద్యాభ్యాసం ఆరంభించాడు. నిద్రపోతున్న గురువుగారు అర్జునుడి ధనుష్ఠంకారం విని లేచాడు. శిష్యుడి ఏకాగ్రతకు, దీక్షకు పరవశించి గాఢాలింగనం చేసుకుని " అస్త్రవిద్యలో నీ అంతటివాడు వండడు" అని వెన్ను తట్టారు.

రోజులు గడుస్తున్నాయి.

కురుపాండవుల విలువిద్యాశక్తిని పరిశీలించేందుకు ద్రోణాచార్యులవారు ఒకనాడు ఓ పరీక్ష పెట్టారు.ఒక పిట్ట బొమ్మని తయారు చేయించి దానిని ఒక చెట్టు చిటారుకొమ్మకు కట్టి శిష్యులందరినీ పిలిపించారు. ముందుగా ధర్మరాజును పిలిచి "చిటారుకొమ్మన పక్షిని చూశావా? నేనూ, నీ సోదరులూ, చెట్టూ కనిపిస్తున్నాయా?" అని అడిగారు.

అన్నీ చూస్తున్నానన్నాడు ధర్మరాజు.

అలాగే దుర్యోధనాదులందరినీ పిలిచి అడిగాడు.

అందరూ గొప్పగా తలలూపారు.

చివరికి అర్జునుడ్ని పిలిచి అడిగితే "ఆచార్యా! పక్షి తప్ప మరేమీ కనిపించడం లేదు నాకు" అన్నాడు.

"ఆ పక్షి అవయవాలు ఎలా వున్నాయి?" గురువుగారు మరో ప్రశ్న వేశారు.

"దాని శిరస్సు తప్ప మరే అవయవమూ నా దృష్టిలో లేదు" అన్నాడు అర్జునుడు.

దాని శిరస్సు పడగొట్టమన్నాడు ద్రోణుడు.

అనటమే ఆలస్యం- అర్జునుడి ధనస్సు నుండి బాణం దూసుకుపోయింది. పక్షి తల నేల రాలింది.

ద్రోణుడు శిష్యుడ్ని గాఢాలింగనం చేసుకున్నాడు.

అర్జునుడు గురువుగారికి పాదాభివందనం చేశాడు.

అయితే, ఆ రోజుల్లోనే అర్జునుడికి దీటైనవాడు మరొకడు ధనుర్విద్యలో ఆరితేరాడు. అతను హిరణ్యధన్వుడనే ఎలుకరాజు కుమారుడు ఏకలవ్యుడు. అతను ధనుర్విద్య నేర్పమని ద్రోణాచార్యులవారిని బ్రతిమాలితే ఆయన తిరస్కరించాడు. అయినా బాధపడక గురువుగారి పాదాలకు నమస్కరించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళాకా ద్రోణుని విగ్రహం ఎదుట వుంచుకుని, ఆ ప్రతిమనే గురువుగా భావించి పూజిస్తూ ధనుర్విద్య అభ్యసించటం మొదలు పెట్టాడు.

ఒకనాడు కురుపాండవులు వేటకు వెళ్ళి అడవి జంతువులను సంహరిస్తుండగా వారి వేటకుక్క ఏకలవ్యుడ్ని చూసి మొరిగింది. అది నోరు తెరచి మొరుగుతున్న క్షణంలో ఏకలవ్యుడు ఒకేసారి దాని నోట్లోకి ఏడు బాణాలు వదిలాడు.

అది అలాగే పాండవుల దగ్గరికి వెళ్ళింది.

పాండవులకు ఆశ్చర్యం కలిగింది.

అంతటి విలుకాడెవరా అని వెదికి వెదికి చివరకు ఏకలవ్యుడని తెలుసుకున్నారు. కుతూహలం చంపుకోలేక "నీ గురువు పేరేమిటి?" అని అడిగారు పాండవులు. "ద్రోణాచార్యులు" అని వినయంగా సమాధానం చెప్పాడు అతను. అతను కూడా ద్రోణుని శిష్యుడే అని తెలియగానే హస్తినాపురం వస్తూనే అర్జునుడు నేరుగా గురువుగారి దగ్గరకు వెళ్ళాడు. "ఆర్యా! మీ శిష్యులలో నన్ను మించినవాడు లేడన్నారు. కాని మీ శిష్యుడు ఏకలవ్యుడు విలువిద్యలో నాకంటే ఆరితేరాడు" అనగా, ద్రోణుడు అర్జునుడితో అడవికి వచ్చి ఏకలవ్యుణ్ణి చూశాడు. ఆ వీరుడు ద్రోణుడికి నమస్కరించి గురుదక్షిణగా ఏం కావాలన్నా యిస్తానన్నాడు. వెంటనే కుడిచేతి బొటనవేలు కోసి యిమ్మన్నాడు. ఏకలవ్యుడు సంతోషంగా గురువు కోరిన ప్రకారం దక్షిణ అర్పించాడు.

"నిన్ను మించిన విలుకాడు ఉండటానికి వీల్లేదు" అని ద్రోణుడు అర్జునుడికి చేసిన వాగ్ధానం కోసం ఏకలవ్యుని అంగుష్ఠం గ్రహించి తిరిగి వచ్చాడు.

LIST OF NAMES OF 60 TELUGU YEARS AND ITS RESULTS IN EACH YEAR
BEAUTIFUL PAPER ART OF COCK


NAMES OF EIGHT POETS OF SRI KRISHNADEVARAYA - BRIEF ARTICLE ABOUT ASTADIGGAJALU IN TELUGUNEW MODEL YAMAHA SUPER BIKE MONSTER


loading...