ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

YOUNG AGE PICS OF MAHANATI SAVITHRI


DANCING BRIDE


FISH POWER


RARE PICS COLLECTION OF MAHANATI SAVITHRI




A TRIBUTE TO MAHANATI SAVITHRI 06-12-2014



AN INTELLIGENT HARE


SUPER BIKE IN BLACK


DIGITAL PIC OF LORD SREE VENKATESWARA SWAMY


LOVE LIFE


DR ANR WITH MAHANATI SAVITHRI


DR NTR WITH MAHANATI SAVITHRI - RARE PICS


SIMPLE DAY TO DAY SMALL PROBLEMS HEALTH TIPS


MILK WITH HALDI - HEALTH TIPS IN TELUGU


పసుపు పాలతో మేలు

ఒక గ్లాసు పాలలో టీ స్పూన్‌ చక్కెర, చిటికెడు పసుపు కలిపి పది పదిహేను నిమిషాల పాటు మరిగించాలి. కొంత సేపటి తర్వాత పాలు గోరు వెచ్చగా అయ్యాక తాగాలి. పసుపు పాల ఫలితం సంపూర్తిగా పొందాలంటే ప్రతిరోజూ క్రమం తప్పక తాగాల్సిందే. 
దగ్గు, జలుబుకు ఉపశమనం:
నిరంతరాయంగా వేధించే దగ్గు, జలుబు, గొంతు నొప్పులకు పసుపు పాలు చక్కని ఉపశమనాన్ని అందిస్తాయి. పసుపులో యాంటీసెప్టిక్‌, యాస్ట్రింజెంట్‌ గుణాలుంటాయి. ఇవి శ్వాస కోశ సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి. దగ్గుతో కందిపోయిన గొంతుకు మలామ్‌లా పని చేసే, పాలతో పసుపు కలిపి తీసుకుంటే ఊపిరితిత్తుల్లోని కఫం కరగటంతోపాటు ఊపిరి తీసుకోవటం సులువవుతుంది.
తలనొప్పులు దూరం:
యాంటీ ఆక్సిడెంట్లు, అత్యవసరమరమైన పోషకాలు పుష్కలంగా ఉండే పసుపు యాస్ప్రిన్‌లా తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గించేస్తుంది. ముక్కు దిబ్బడతో తలపట్టేస్తే వేడి పాలలో ఒక టీస్పూన్‌ పసుపు కలుపుకుని తాగి చూడండి. క్షణాల్లో తల నొప్పితోపాటు ముక్కు దిబ్బడ కూడా వదులుతుంది.
కంటినిండా నిద్ర కోసం:
పాలలో సెరటోనిన్‌ అనే బ్రెయిన్‌ కెమికల్‌, మెలబోనిన్‌లు ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్‌ న్యూట్రియంట్స్‌తో కలిపి ఒత్తిడిని తొలగించటానికి తోడ్పడతాయి. దీంతో మానసిక స్వాంతన చేకూరి హాయిగా నిద్ర పడుతుంది.
రుతుక్రమం నొప్పులకు:
రుతుక్రమం గాడి తప్పినప్పుడు స్రావం సమయంలో బాధలు అధికమవుతాయి. ఆ సమయంలో శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావం ఫలితంగా పొత్తి కడుపు, ఇతర ఒంటి నొప్పులు బాధిస్తాయి. ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే పసుపు పాలు సేవించాలి. రుతుక్రమ నొప్పుల్ని హరించే పసుపును ప్రతి రోజూ క్రమం తప్పకుండా పాలలో కలిపి తీసుకోగలిగితే కొంత కాలంలోనే ఈ సమస్య పరిష్కారమవుతుంది.

Punjabi Beauty Ihana Dhillon latest pics







Bollyood Actress Ihana Dhillon cute pics






TEMPER MOVIE STILLS



KNOW ABOUT INDIA


DADS SECRET SERVICE


PREVIOUS LIFE EXPERIENCES


PURE ANDHRA BRIDE IN RED


BIG DINING TABLE


COMPUTER AND FAMILY


RARE PIC OF MAHANATI SAVITHRI


BLACK AND WHITE EYES


9000 YEARS OLD TEMPLE AT THOLI TIRUPATI - NEAR KIRLAMPUDI - EAST GODAVARI DISTRICT - ANDHRA PRADESH - INDIA - MUST VISIT


ఈ గుడి ద్వాపరయుగం నాటిదా!?

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట నుంచి కిర్లంపూడి వెళ్ళేదారిలో దివిలికి ఒక కిలోమీటరు దూరంలో తొలి తిరుపతి అనే ఊరు ఉంది. సామర్లకోటనుంచి ఇక్కడికి 12 కిలోమీటర్లు. గుడికి బయట ఒక ఫ్లెక్సీ బోర్డ్‌మీద తొమ్మిదివేల సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఇది అని రాసి ఉంటుంది. దేవాలయం పురాతనంగానే కనిపిస్తుంది కానీ మరీ అంత పాతది కాదేమో అనే సందేహంకూడా కలుగుతుంది. కొతమంది అభిప్రాయం ప్రకారం కలియుగం మొదలై సుమారు 5000 సంవత్సరాలు అయ్యిందని. అంటే ఈ దేవాలయం ద్వాపరయుగం నాటిదన్నమాట!

తొలితిరుపతి దేవాలయం యొక్క స్థలపురాణం ప్రకారం ఈ ప్రదేశం ఒకప్పుడు కీకారణ్యంగా ఉండేదని, దృవుడు ఇక్కడ విష్ణుమూర్తికోసం తపస్సుచేశాడని చెపుతారు. ఇక్కడొక చిన్న లింక్ మిస్సయ్యింది. దృవుడు తపస్సుచేసిన మధూవనం యమునా నది సమీపంలో ఉంటుందని పురాణంలో చెప్పబడి ఉంది. కానీ ఇక్కడ యమునా నది లేకపోవడమే మిస్సయిన లింకు. దృవుడికథ విష్ణుపురాణంలోను, బగవత్‌పురాణంలోనూ ఉంటుంది. ఉత్తానపాదుడనే రాజుగారికి సురుచి, సునీతి అనే ఇద్దరు భార్యలు ఉంటారు. ఆయనకి సునీతి ద్వారా దృవుడు, సురుచి ద్వారా ఉత్తముడు అనే కుమారులు కలుగుతారు. రాజుగారికి సురుచి అంటే ప్రేమ మెండు. అమెకీ, ఆమె కుమారుడికీ ముద్దుమురిపాలన్నీ దక్కేవి. ఒకరోజు ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చొని ఉండగా చూసిన దృవుడు తానుకూడా తండ్రి ప్రేమను అదేవిధంగా పొందాలని భావించి ఒడిలోని ఎక్కబోతుండగా అతని సవతి తల్లి సురుచి అతడిని నిందిస్తుంది. బాధపడుతున్న దృవుడిని చూసి తల్లి సునీతి విష్ణువుని గూర్చి తపస్సు చేసి తండ్రిప్రేమని పొందే వరంకోరుకోమంటుంది. అప్పుడు దృవుడు యమునా నది తీరంలో ఉన్న మధూవనం అనే ప్రదేశానికి వెళ్ళి తపస్సుచేసి విష్ణువుని ప్రసన్నం చేసుకొంటాడు.

పిల్లవాడైన దృవుడు దేవుడి తేజస్సుచూసి భయపడ్డాడని, అప్పుడు విష్ణువు దృవుడి అంత పొడవుతో కనిపించి, చిరునవ్వుతో అతని చెంపలు నిమిరాడని, ఆకారణంగానే ఇక్కడిస్వామి చిరునవ్వులు చిందిస్తూ శృంగార వల్లభ స్వామిగా పిలవ బడుతున్నాడని, ఎవరుఎంత పొడవు వుంటే అంత పొడవుగానే కనిపిస్తాడని చెపుతారు. శృంగార వల్లభ స్వామి అంటే వేంకటేశ్వరుడే. అన్నిచోట్లా ఆయన కుడిచేతిలో శంఖం, ఎడమచేతిలో చక్రం ఉంటాయి. కానీ, ఈ దేవాలయంలో అవి అది ఇటు, ఇది అటు మారి ఉంటాయి. మరొక ప్రత్యేకత ఇది. స్వామివారి దేవేరులైన శ్రీదేవిని నారదమహర్షి, భూదేవిని శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్టించారట. స్వామివారికి వెండితొడుగు విక్టోరియా మహారాణి భహూకరించినదట.

దేవాలయానికి వెనుకవైపు ఉన్న నూతిలో నీటిని తలపై జల్లుకొని, స్వామివారిని కోరుకొంటే, ఆయా కోరికలన్నీ నెరవేరుతాయట. శృంగార వల్లభ స్వామికి పటికబెల్లం అంటే ఇష్టంకాబట్టి కోరికలు నెరవేరిన భక్తులు పటికబెల్లాన్ని స్వామివారికి సమర్పిస్తారు.

ANIMAL FRIENDS STORY IN TELUGU


STORY OF THE DEMON AND SIVANANDA


WORKING SECRETS OF VACCUM CLEANER


AYURVEDIC HEALTH TIPS FOR HEADACHE - KARPURANJANAM


A TRIBUTE TO MAHANATI SAVITHRI


NAVAGRAHA DYANA SLOKAM IN TELUGU BY SRI SRAJU NANDA GARU


నవగ్రహ ధ్యానశ్లోకమ్

ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
రవిః
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |
తమోరియం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ||
చంద్రః
దథిశఙ్ఞ తుషారాభం క్షీరార్ణవ సముద్భవమ్ |
నమామి శశినం సోమం శంభోర్-మకుట భూషణమ్ ||
కుజః
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ |
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ||
బుధః
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ |
సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||
గురుః
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభమ్ |
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ||
శుక్రః
హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ |
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ||
శనిః
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ||
రాహుః
అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ |
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||
కేతుః
ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||
ఫలశ్రుతిః
ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః |
దివా వా యది వా రాత్రౌ విఘ్న శాంతిర్భవిష్యతి ||
నర నారీ నృపాణాం చ భవే ద్దుస్వప్ననాశనమ్ |
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్ ||
గ్రహ నక్షత్రజాః పీడా స్తస్కరాగ్ని సముద్భవాః |
తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే నసంశయః ||

navagraha dhyānaślokam
ādityāya ca somāya maṅgaḷāya budhāya ca |
guru śukra śanibhyaśca rāhave ketave namaḥ ||
raviḥ
japākusuma saṅkāśaṃ kāśyapeyaṃ mahādyutim |
tamoriyaṃ sarva pāpaghnaṃ praṇatosmi divākaram ||
candraḥ
dathiśaṅña tuṣārābhaṃ kṣīrārṇava samudbhavam |
namāmi śaśinaṃ somaṃ śambhor-makuṭa bhūṣaṇam ||
kujaḥ
dharaṇī garbha sambhūtaṃ vidyutkānti samaprabham |
kumāraṃ śakti hastaṃ taṃ maṅgaḷaṃ praṇamāmyaham ||
budhaḥ
priyaṅgu kalikāśyāmaṃ rūpeṇā pratimaṃ budham |
saumyaṃ satva guṇopetaṃ taṃ budhaṃ praṇamāmyaham ||
guruḥ
devānāṃ ca ṛṣīṇāṃ ca guruṃ kāñcana sannibham |
buddhimantaṃ trilokeśaṃ taṃ namāmi bṛhaspatim ||
śukraḥ
himakunda mṛṇāḷābhaṃ daityānaṃ paramaṃ gurum |
sarvaśāstra pravaktāraṃ bhārgavaṃ praṇamāmyaham ||
śaniḥ
nīlāñjana samābhāsaṃ raviputraṃ yamāgrajam |
chāyā mārtāṇḍa sambhūtaṃ taṃ namāmi śanaiścaram ||
rāhuḥ
arthakāyaṃ mahāvīraṃ candrāditya vimardhanam |
siṃhikā garbha sambhūtaṃ taṃ rāhuṃ praṇamāmyaham ||
ketuḥ
phalāsa puṣpa saṅkāśaṃ tārakāgrahamastakam |
raudraṃ raudrātmakaṃ ghoraṃ taṃ ketuṃ praṇamāmyaham ||
phalaśrutiḥ
iti vyāsa mukhodgītaṃ yaḥ paṭhetsu samāhitaḥ |
divā vā yadi vā rātrau vighna śāntirbhaviṣyati ||
nara nārī nṛpāṇāṃ ca bhave ddusvapnanāśanam |
aiśvaryamatulaṃ teṣāmārogyaṃ puṣṭi vardhanam ||
graha nakṣatrajāḥ pīḍā staskarāgni samudbhavāḥ |
tāssarvāḥ praśamaṃ yānti vyāso brūte nasaṃśayaḥ ||

RAMAYANA STORIES COLLECTION - DHARMIKUNI STORY IN TELUGU


దార్మికుని కధ - హనుమాద్గాదా తరంగిణి అనే హనుమద్ చరితామృతం 

కాశీ పట్టణం లో కేదారేశ్వర ఘాట్ లో దక్షిణాన రామ వాటిక వుంది .దాని ముందు గంగా తీరం లో జానకీ నాధుడు వున్నాడు .అయోధ్య లో శ్రీ రాముని విగ్రహం ఉన్నట్లుగా ఇక్కడ శ్రీ రాముని మూర్తి అద్భుతం గా వుంటుంది .ఆయన పాద పద్మాల చెంత హనుమ కూర్చుండి భక్తుల మనో భీష్టాలను నెర వేరుస్తుంటాడు .రామ వాటిక లో ధార్మికుడు అనే వేదాధ్యయనుడైన బ్రాహ్మనుడున్నాడు .అతని కుమారుడు ధర్మ కీర్తి .సదాచారి ,వినయ సంపన్నుడు .పితృ షేవా పరాయణుడు .పదహారేళ్ళ ప్రాయం వాడు .మహా ప్రాజ్ఞుడు .అయినా ఇంట్లో దారిద్ర్యం తాండ విస్తూనే వుంది .ధన సంపాదన కోసం చాలా దూరం ప్రయాణం చేసి గోకర్ణ క్షేత్రం చేరాడు .గోకర్నేశ్వరున్ని అర్చించి ,పూర్వ జన్మ వాసన వల్ల ఇంటిని మరిచి పోయి అక్కడే చాలా కాలమ్ స్వామి సేవ లో ఉండి పోయాడు .
అక్కడ కాశి లో భార్యా పిల్లలు ధర్మ కీర్తి జాడ తెలియక బాధ పడుతున్నారు .కనపడిన ప్రతి యాత్రికుడిని తన కుమారుడు ధర్మకీర్తి ఎక్కడైనా కన్పించాడా అని అడిగే వాడు ధార్మికుడు .కొడుకు యెడ బాటును సహించ లేక నిత్యం దుఖిస్తూనే ఉండే వాడు .ఒక రోజూ సుతప్తుడు అనే బ్రాహ్మణుడు ధార్మికుని వేదన చూసి ”ధార్మికా !దుఃఖించ వద్దు .దైవ సహాయం ఇప్పుడు నీకు కావాలి .భూత ,భవిషత్ ,వార్త మానాలను తెలియ జేసే ”స్వప్నాన్జనేయ మంత్రం ”వుంది. నీకు దాన్ని ఉప దేశిస్తాను .నిరంతరం జపించి నీ పుత్రుని ,ఆయన అనుగ్రహం తో తిరిగి పొందు ”అని చెప్పి మంత్రోపదేశం చేశాడు .కలలో ఆంజనేయ స్వామి కని పించి ధర్మ కీర్తి ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తాడో కూడా తెలియ జేస్తాడని కూడా చెప్పాడు .

ధార్మికుడు ఏకాగ్ర చిత్తం తో రామ వాటిక లోని శ్రీ రామ సన్నిధిలో కూర్చుని ,మంత్రాన్ని జపిస్తున్నాడు .ఒక రోజూ కలలో హనుమ కన్పించి ”ధార్మికా !నీ కుమారుడు క్షేమం గా గోకర్ణం లో ఆరోగ్యం గా స్వామి సేవ లో గడుపు తున్నాడు .తనంతట తానె తిరిగి మీ వద్దకు తిరిగి వస్తాడు .నన్ను స్వప్న హను మంతుని గా భావించు .స్వస్తి .”అని చెప్పి మారుతి అదృశ్యమైనాడు .ఆకష్మికం గా జరిగిన ఈ సంఘటన అతనికి ఆశ్చర్యం కలిగింది .ఉదయం నిద్ర లేచి తన కలను అందరికి తెలియ బర చాడు .అందరు ఆంజనేయ వైభవాన్ని దార్మికుని అదృష్టాన్ని పొగిడారు .పుత్రుని రాక కోసం ఎదురు చూస్తూ ,ఆంజనేయ జపాన్ని చేస్తూనే వున్నాడు ధార్మికుడు .
అక్కడ గోకర్ణ క్షేత్రం లో తనను అత్యంత భక్తీ విశ్వాసాలతో కొలుస్తున్న ధర్మ కీర్తి సేవలను ప్రస్తు తించి ,కాశీ క్షేత్రం కు వెళ్లి తలిదండ్రులకు ఆనందాన్ని చేకూర్చ మని హితవు చెప్పి , గోకర్నేశ్వర స్వామి వెళ్ళ టానికి అనుమతి నిచ్చాడు .అతడు శివుని ఆజ్న ను శిరసా వహించి కాశీ కి ప్రయాణమైనాడు .కొన్ని రోజులకు కాశీ చేరి ఇంటికి వచ్చాడు .తలిదండ్రుల ఆనందం వర్ణించ లేకుండా వుంది .అందరికి నమస్కారాలు చేసి ,బంధువులను పలకరించాడు .కాశీ విశ్వ నాధుని నిత్యం సేవిస్తూ ఆంజనేయ ఉపాసన పొంది రోగాలు లేకుండా ,ఆరోగ్యం గా జీవిస్తూ ,చివరకు మోక్షాన్ని పొందాడు .”స్వప్న హను మంతుని ”దివ్య ప్రభావం అంత గొప్పది అని ధార్మిక ,ధర్మ కీర్తి ల కధ మనకు తెలియ జేస్తోంది .





FOOD STUFF THAT NEEDS FOR STRONG AND HEALTH LONG BLACK HAIR


GO FOR MARRIAGE TO LIVE FOREVER


FULL INFORMATION OF ARTICLE IN TELUGU ABOUT THE GREAT TEMPLE - ARUNACHALAM - THIRUVANNAMALAI - ARUNACHALESWARALAYAM AT TAMILNADU - INDIA


అరుణాచలం (తిరువణ్ణామలై) ,అరుణాచలేశ్వరాలయము

అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ = పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళం లో "తిరువణ్ణామలై" అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాల గొప్ప పుణ్యక్షేత్రము . స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము . కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని చెప్పుకుంటారు .
అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉన్నది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభుతమునకిది ప్రతీక. అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళంలో " తిరువణ్ణామలై " అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము . స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము. కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వాసిస్తున్నారు.
అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివజ్ఞచేత ఏర్పాటు చేశరనీ స్కాందపురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది. ఈ కొండ శివుడని పురాణములు తెల్పుతుండటము చేత ఈ కొండకు తూర్పున గల అతిపెద్ద దేవాలయమైన అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్య మీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పు కొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు. ఈ అరుణాచలం పమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపమే కావటంవలన దీనిని చుట్టి ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం.
అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము . అరుణాచలేశ్వర దేవాలయం శివజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ , దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివజ్ఞచేత ఏర్పాటు చేశరనీ స్కాందపురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది.ఈ కొండ శివుడని పురాణములు తెల్పుతుండటము చేత ఈ కొండకు తూర్పున గల అతిపెద్ద దేవాలయమైన అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధన్య మీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పు కొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు. దక్షిణభాతరతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక .పంచభూతలింగక్షేత్రములు
1. అన్నామలైశ్వరుడు - అరుణాచలము : అగ్ని లింగం,

2. జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం : జల లింగం,
3. చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం : ఆకాశ లింగం,
4. ఏకాంబరేశ్వరుడు - కంచి : పృధ్వీ లింగం,
5. కాళహస్తేశ్వరుడు - శ్రీకాళహస్తి : వాయు లింగం,
--------------------------------------------------------
* అరుణాచలేశ్వరాలయము

అరుణాచలేశ్వరాలయము అతిపెద్ద దేవాలయం ఒక్కొక్క రాజగోపురం ఒకదానితొ ఒకటి పోటిపడి కట్టినట్లు కనిపిస్తాయి . నాగుగుదిక్కులు నాలుగు రాజగొపురములు ఉంటాయి .

తూర్పు రాజగోపురం - దక్షిణగోపురము-పడమర రాజగోపురం - ఉత్తర రాజగోపురం .

* పాతాళలింగము
ఇక్కడే రమణమహర్షి కొంతకాలం తపస్సు చేసారు . రమణ మహర్షి ఫొటొలు కూడ ఇక్కడ ఉన్నవి . మీరు వాటిని కూడ వచ్చు . మెట్లద్వార క్రిందకు దిగితె పాతాళలింగము ఉంటుంది. ఒకసారి అరుణాలేశ్వర దేవాలయములో ముఖ్యస్థానముల లిష్ట్ చూస్తే . . . .

పెద్ద నంది, - వెయ్యిస్తంభాల మండపము, -చిలుక (కిలి) గోపురం,,- బ్రహ్మ ప్రతిష్ఠింఛిన లింగం ,చిలుక (కిలి) గోపురం .. అరుణగిరినాధర్ కధ తెలుసుకధా మీకు ..ఈ గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టించరంటా .. ఈ గోపురంలో అరుణగిరినాధుడు చిలుక రూపంలో ఉండిపోయాడని చెప్పుకుంటారు. గోపురం పైన చిలుక కూడ కనిపిస్తుంది .

* బ్రహ్మ ప్రతిష్ఠింఛిన లింగం
గర్భగుడి లో పరమ పవిత్రమైన అరుణాచలేశ్వర స్వయంభూ లింగము సుందరమై, సురుచిరమై , సర్వసిద్ది ప్రదమై , పానపట్ట్ముపై విరాజిల్లుతూ ఉంటుంది. 

ఇది త్రిమూర్త్యాత్మకము గనుక ఇక్కడ ఇతర దేవతారాధన జరుపనవసరము లేదు. ఈ అలయం ప్రక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది .ఇక్కడే మీరు పంచ లింగాలయల దర్శనం కూడ చెయవచ్చు.

ఈ ఆలయం లో శివగంగతీర్ధము , బ్రహ్మాతీర్ధము ఉన్నాయి. వాటిని కొన్ని ముఖ్య రోజుల్లో మాత్రమే తెరుస్తారు
* తమిళ దేశం లో ఆలయాలన్ని 12.30 వరకు మాత్రమె లొపలికి అనుమతినిస్తారు .. సాయంత్రం 3.45 - 4.00 కి తెరుస్తారు . రాత్రి 8.30 -9.00 గంటలకు మూసివెస్తారు

ఈ ఆలయం చాల పెద్దది కావడం వళ్ళ మీరు లొపలనే ఉండవచ్చు . గర్బగుడి ఒకటే తెరచి ఉండదు .
కిలి గోపురానికి ఎదురుగా మరో గోపురం ఉంటుంది దానికి అనుకుని సుబ్రహ్మణ్యుల గుడి ఉంటుంది, మరోల చెప్పలంటే పెద్ద నందికి ఎదురుగ కుడి పక్కన ఉంటుంది . పక్కనే ఒకగది ఉంటుంది ఆ గదిలో శివుని నాట్య ముద్రలు చిత్రికరించినవి అద్భుతంగ ఉంటాయి .

* బస్ స్టాండు కు దగ్గరలోనే దేవాలయం ఉంటుంది (సుమారు 2 కి.మి )
* గిరి ప్రదక్షణం (గిరివలం)
ఈ అరుణాచలం పమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపమే కావటంవలన దీనిని చుట్టి ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం.
శ్రీరమణులు దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఊద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగవావిస్తూ ప్రదక్షిణ చేసేవార్కి మహాపుణ్య సిద్దిస్తుందని మహత్లుల వచనం. అందుచేత నిత్యమూ , అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుంది .
గిరిప్రదక్షణం చేస్తున్నప్పుడు మనకి అష్ట లింగములు కనిపిస్తాయి. అగ్ని లింగం రమణాశ్రమానికి వేళ్ళే దారిలో కనిపిస్తుంది..

గిరిప్రదక్షణం చాల వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలం లొ గిరిప్రదక్షణం చెయనికి వీలుగా రోడ్డు పక్కన పూట్ పాత్ కూడ వేసారు. ఎక్కువ మంది ఉయదయం సూర్యతాపన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేద తెల్లవారుజామున చెస్తారు . రమణ ఆశ్రామానికి 2కి.మి దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరగలి రోడ్ కి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ మీరు కొండను చూస్తే మీకు నంది కనిపిస్తుంది .
దారిలో మనకు తీర్దములు కనిపిస్తాయి కాని వాటిని వారు పెద్దగ పట్టించుకున్నట్టు కనిపించదు ...
మీరు జాగ్రత్తగ చూడగలిగితే .. రాజరాజేశ్వరి దేవాలయం తరువాత మీకు..

* గిరిప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి.

*బరువు ఎక్కువగాఉన్నావాటిని మీ కూడ తీసుకువెళ్ళకండి (సంచులు అలాంటివి)
*గిరిప్రదక్షణం 14కి.మి దూరం ఉంటుంది.
*ఉదయం పూట గిరిప్రదక్షణం చేయడం చాలా కష్టం .. 9 లోపు ముగించడం మంచిది .
*గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు ..
* మీరు చిల్లర తిసుకువేళ్ళడం మరిచిపొవద్దు .
* గిరిప్రదక్షణం లో "నేర శివాలయం" అని ఉంది కద లిస్ట్ లో దానికర్ధం శిఖరానికి ఏదురుగ ఉన్న శివాలయం అని.
*నిత్యనంద స్వామి అశ్రమం కూడ కనిపిస్తుంది గిరిప్రదక్షణం చేసేటప్పుడు. ఆశ్రమానికి పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది.
* గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు .

* రమణాశ్రమం
రమణాశ్రమం అరుణాచలేశ్వరాలయమునకు 2 కి.మి దూరం లో ఉంటుంది. అరుణాచలం వేళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని సందర్శిస్తూంటారు. అక్కడ అరవవాళ్ళకంటే అమెరికా వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు మనకు . సాయంత్రం సమయం లో రమణాశ్రమంలో చెసే ప్రార్దన చాల బాగుంటుంది . రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడవచ్చు . రమణాశ్రమంలో కోతులు ఎక్కువగ మనకు కనిపిస్తాయి . నేమళ్ళు కూడ స్వేచ్చాగ తిరుగుతూంటాయి . రమణాశ్రమం లో ఇంకా లక్ష్మి (ఆవు) సామధి , కాకి సమాధి , కుక్క సమాధి నికూడ ఛుడవచ్చు . ఇవన్ని వరుసగ ఉంటాయి . అక్కడ గ్రంధాలాయం లో మనకు రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి . మీరు ఆశ్రమం లో ఉండలాంటె ముందుగానె బూక్ చెసుకొవాల్సి ఉంటుంది.
* శేషాద్రి స్వామి ఆశ్రమం 

రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి అశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడ అక్కడే ఉంది. ఇక్కడ కూడ ఉండటానికి రూం లు ఉన్నవి. మీరు ముందుగానే రూం లను బూక్ చేసుకోవాల్సి ఉంటుంది.

జీవితం లో ఒక్కసారైన చూడవాల్సిన ప్రదేశాలలో అరుణాచలం ఒకటి.

THANKS TO SRI SRAJU NANDA GARU FOR THIS ARTICLE