ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

2015 SANKRANTHI FESTIVAL SPECIAL MUGGULU / DESIGNER KOLAM FOR SANKRANTHI FESTIVAL






STORY OF SURAIAH AND SOMAIAH IN MEMORY LOSS FOR CHILDREN


STOP SMOKING USING ONION - ONION TIPS FOR STOPPING SMOKING


ENT SPECIALIST


SRI RAMA PADYA STHUTHI


శ్రీ తులసిదాసకృత శ్రీరామచంద్రస్తుతి:

శ్రీ రామచంద్ర కృపాళు, భాజు ,మన హరణ భావ భయ దారుణమ్ |
నవకంజలోచన , కంజముఖ , కరకంజ , పడకంజారుణమ్ || 1||

కందర్ప అనగణిత అమిత చభి నవనీల నీరద సుందరమ్ |
పటపీత మానహూ తడిత రుచి శుచి నౌమి జనకసుతావరమ్ ||2||

భజు ధీనబంధు దినేశ దానవ దైత్య వంశ నికందనమ్ |
రఘునంద ఆనందకాండ కోసలనంద దశరధనందనమ్||3||

సిరసముకుట కుండల తిలక చారు ఉదారు అంగ విభూషణమ్ |
ఆజానుభుజ శర-చాప-ఉదారు అంగ విభూషణమ్ ||4||

ఇతి వదతి తులసీదాస శంకర శేష-ముని-మనరంజనమ్ |
మామ హృదయకంజ నివాస కురు , కామాదిఖల-దల గంజనమ్ ||5||

BE PATIENCE - LIFE WILL BE SET


ARTICLE ABOUT MAREDU DHALALA NOOMU IN TELUGU


మారేడుదళాల నోము

పూర్వం ఒకానొక దేశపు రాజకుమారుడు ఆయువుడు తీరి చనిపోయాడు. రాజపీనుగు తోడులేకుండా పోరాదుకనుక నా కుమారుని శవానికి తోడుగా పోవుటకు ఎవరైనా తీసుకు రావలసిందని మృతుని తండ్రియైన మహారాజు భటులను పంపాడు. ఆ భటులు ఎంతగా తిరిగినా చచ్చిన వానికి తోడుగా పోవుటకు గాని తమ వారి నేవరైనా తోడుగా పంపించుటకు గాని ఏ ఒక్కరూ అంగీకరించలేదు.
ధనాశ పరులైన ఒక బ్రాహ్మణ వనితా తన సవతి బిడ్డను ఎత్తుకు ఎట్టు ధనం పుచ్చుకుని పంపించుటకు అంగీకరించినది. ఆమె కోరిన ప్రకారం ధనమిచ్చి రాజు భటులు పిల్లను తీసుకుని వెళ్ళారు. అలా తీసుకుని వచ్చిన ఆ పిల్లను రాకుమారుని శవంతోపాటు కటి స్మాశానానికి తీసుకుని వెళ్ళుతున్నారు. ఆకస్మికంగా చీకట్లు కమ్ముకుని పెద్ద వర్షం కురిసింది. ఆ వర్షంలో చెకటిలో ముందుకు పోలేక శవాన్ని శివాలంముండు దింపి వారంతా తప్పుకుని వెళ్ళారు. ఆ బాలిక కట్లు వూడదీసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి ఆలయం లోపలకు వెళ్లి పార్వతీ పరమేశ్వరులు ముందు కూర్చుని తన దుస్థితికి పరితపిస్తూ భోరుభోరున ఏడ్వసాగింది. కరునామయులైన ఆ దంపతులు ఆమెను ఆగ్రహించి అక్షతలు జలాన్ని ఇచ్చి రాకుమారుని శవంపై చల్లమన్నారు. మారేడు దళం నోచుకోవలసినదని చెప్పారు ఆ ఆది దంపతులు ఆదేశానుసారం ఆ చిన్నది మారేడు దలముల నోమును నోచి శవం పై మంత్ర జలాన్ని సంప్రోక్షించి అక్షింతలు వేసింది. రాకుమారుడు నిద్రమేల్కొన్న్ట్టు సజీవుడై లేచి కూర్చున్నాడు. జరిగిన విషయాన్ని యావత్తు ఆమె వల్ల విన్నాడు.
ఇంతలో తెల్ల వారుతుండగా రాజు తాలూకు జనులు శవాదాహన సంస్కారం చేయడానికి వచ్చారు బ్రతికి వున్న రాకుమారుడిని చూసి ఆశ్చర్య పడ్డారు. వారిని అంతఃపురానికి తీసుకువెళ్ళారు. రాజ దంపతులు ఎంతగానో ఆనందించి ఆ బాలికతో తమ కుమారునికి వివాహం చేసారు.
ఉద్యాపన: మారేడు దలములతో మూడు దోసిళ్ళ బియ్యంతో శివునకు పూజచేసి నిరుపేదలకు అన్న దానం చేయ వలెను

SANKRANTHI FESTIVAL 2015 DESIGNER MUGGULU COLLECTION





DONT FEEL ABOUT FAILURE - DEFINITELY YOU WILL GET SUCCESS


HOW TO TAKE CARE OF HAIR LOSS - TIPS TO TAKE PRECAUTIONS LOSING HAIR IN EARLY YEARS



జుట్టు రాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

1) ప్రస్తుతం చిన్న పిల్లల దగ్గరనుండి , పెద్దవాళ్ళ వరకు జుట్టురాలడం సమస్యగా మారిపోయింది.

2) మొట్టమొదటిగా ఎక్కువగా ఒత్తిడి , మానసిక ఆందోళనలు లేకుండా జాగ్రత్త పడాలి.

3) ఆహారంలో ప్రోటీన్ , విటమిన్ , మినరల్స్ ,పీచు ఎక్కువగా ఉన్న పండ్లు , కూరగాయలు , ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.

4) రోజులో కనీస వ్యాయామం 30 నిముషాలు ఉండేలా చూసుకోవాలి.

5) ప్రతి ఒక్కరు కనీసం ఒక రోజులో 10-12 గ్లాసుల నీటిని త్రాగాలి.

6) పని ఒత్తిడి , మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి యోగ లో ప్రాణాయామం చక్కని పరిష్కారం.

7) కెమికల్ షాంపూ వాడకం , హెయిర్ డ్రైయర్ వాడకం భాగా తగ్గించాలి. కెమికల్స్ జెల్స్ , కెమికల్ షాంపూ వాడకం ఎక్కువైతే కుదుళ్ళు పటుత్వం కోల్పోయి , జుట్టు నిర్జీవంగా మారి , జుట్టు ఊడిపోతుంది.

8) వారం లో కనీసం రెండు నుండి మూడు సార్లు తల స్నానం చేసుకోవాలి. జుట్టు మీద మరీ వేడి నీళ్ళు కానీ , మరీ చల్ల నీళ్ళు పోసుకోకూడదు.

9) తలలో ఉండే చుండ్రు ప్రభావం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది, చుండ్రు ఉంటె ముఖం మీద , వీపు మీద మొటిమలు వస్తాయి. కాబట్టి చుండ్రును తగ్గించుకోవాలి.

10) చుండ్రు ఉన్నవాళ్లు , తల స్నానం చేసే అరగంట ముందు కొబ్బరి నూనె లో , నిమ్మరసం కలిపి కొద్దిగా వేడి చేసి , జుట్టుకు , కుదుళ్ళకు పట్టించి , మృదువుగా వేళ్ళను ఉపయోగిస్తూ , ఒక 5 నిముషాలు మసాజ్ చేసుకోవాలి.

11) రాత్రి పడుకొనేటప్పుడు స్వచ్చమైన కొబ్బరి నూనె లేదా బాదాం నూనె లేదా ఆలివ్ నూనె తో తలను ఒక 5 నిముషాలు మసాజ్ చేసుకొని పడుకోవాలి.

12) ఆహార సమయాలు కచ్చితంగా పాటిస్తూ , రోజులో కనీసం 7-8 గంటల నిద్ర ఉండాలి.

13) ముఖ్యంగా క్యారట్ , బీట్రూట్ , ఆపిల్ , పాలు , గుడ్లు , చేపలు , ఆకుకూరలు , చిలగడదుంపలు , సోయాబీన్స్ , బీన్స్ , చిక్కుళ్ళు , ఖర్జూరాలు , అరటిపండు , బెర్రీ పండ్లు , మటన్ ఫ్లాష్ , పెరుగు , ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

14) ఇలా పాటిస్తే , జుట్టురాలే సమస్య నుండి ఉపసమనం పొందవచ్చు.


MORE INFORMATION VISIT THE LINK BELOW:

How To Make A Stimulating Essential Oil Blend For Hair Growth

For a man, hair loss commonly begins by the time he reaches the age of 35. At this age, about 70 percent of men will experience hair loss.
While most women won’t experience baldness as much as men, it can also affect this gender. About 50 percent of women experience female-pattern baldness when they reach 65 years old.
So what can you do to help thinning hair regrow? The latest trend in hair care is natural essential oils. Here you’ll find an essential oil blend for hair growth that you can make at home. But first, what exactly causes hair loss?

http://oilingpoint.com/how-to-make-a-stimulating-essential-oil-blend-for-hair-growth/

FREEDOM - INDEPENDENCE DAY CARTOONS


FOR BEAUTINESS NOT ONLY MAKE UP IS SUFFICIENT - EAT PROTEINS FOODS, FRUITS, VEGETABLES, GREEN LEAVES FOR GOOD HEALTH AND FOR PERFECT BEAUTINESS


మేకప్‌ సరిపోదు పోషకాలూ తీసుకోండి

చర్మ సౌందర్యం కోసం చాలా మంది మేకప్‌పైనే ఆధారపడతారు. దానికోసం వేలకొలది డబ్బు ఖర్చుచేస్తుంటారు. బ్యూటీపార్లర్‌ చుట్టూ తిరుగుతుంటారు. కాని మోము మెరిసిపోవాలంటే కేవలం మేకప్‌కు ప్రాధాన్యం ఇస్తే సరిపోదు. చక్కటి పోషకాహారం తీసుకోవడం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. మీ మోము తాజాగా మెరవడానికి ఐదు రకాల ఆహారాన్ని తరచూ తీసుకుంటే చాలని న్యూట్రీషన్లు చెబుతున్నారు. 
* నిమ్మరసం: చర్మాన్ని తాజాగా ఉంచి, ముడతలు పడనీయ కుండా చూస్తుంది. నిమ్మరసాన్ని ముఖానికి రాసుకున్నా లేదా రోజూ అర గ్లాసుడు తీసుకున్నా మీ చర్మం కాంతివంతం అవుతుంది. నిమ్మరసంతో చేసిన పదార్థాలను విరివిగా తినడం చేస్తే కూడా ఫలితం ఉంటుంది.
* గుడ్లు: రోజుకో గుడ్డు తింటే మంచిది అంటారు. తినడమే కాదు. గుడ్డులోని తెల్లసొనను తీసి ముఖానికి రాసుకుని కాసేపటి తరువాత కడిగేసుకుంటే చర్మం నునుపుదేలి మెరుస్తుంది.

* తేనె: ఉదయాన్నే ఒక చెక్క నిమ్మరసంలో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె వేసుకుని తాగితే మంచిది. అలాగే దీనిని రోజూ ముఖానికి రాసుకుంటే మొటిమలు రాకుండా ఉంటాయి.
* స్ట్రాబెర్రీస్‌: ఎర్రని స్ట్రాబెర్రీలు నెలలో నాలుగైదు సార్లు తినడం వల్ల చర్మానికి మంచి పోషకాహారం అందుతుంది. విటమిన్‌ 'సి' యాంటిఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిని మెత్తగా చేసి ముఖానికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
* అరటిపళ్లు: రోజుకో అరటిపండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలా తింటు న్నప్పుడు చిన్న ముక్కతో ముఖ మంతా రుద్దుకుని కాసేపటి తరువాత కడిగేసుకుంటే చర్మానికి మేలు. తేనెలో ముంచి రాసుకున్నా ముఖం తాజాగా కనిపిస్తుంది.

DETAILED ARTICLE ABOUT MARGASIRA LAKSHMI VRATHAM - HOW TO PERFORM LAKSHMI PUJA - THIDHULU - PANDUGALU ETC INFORMATION IN ONE ARTICLE IN TELUGU


మార్గశిర లక్ష్మీ వ్రతం ఎలా చేయాలో మీకు తెలుసా!?

మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని ఈ నెలలో ఏ గురువారమైనా చేసుకోవచ్చునని పండితులు చెబుతున్నారు. పూజ చేసుకునేవారు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి ఆహారం తీసుకోవచ్చు.
గురువారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, పూజగదిని శుభ్రం చేసి కడిగి ముగ్గులు పెట్టాలి. పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. బియ్యప్పిండితో ఎనిమిది దళాల పద్మాన్ని వేసి దానిమీద పసుపు కుంకుమలు జల్లి లక్ష్మీదేవిని నిలిపేందుకు పీఠాన్ని ఉంచాలి.
పీటపై లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని ఉంచాలి. అయిదు తమలపాకులు, అయిదు వక్కలు, అయిదు నాణాలు, అయిదు గరికపోచలు ఉంచాలి. దీపం వెలిగించి, ఐదు రకాల నైవేద్యాలను సమర్పించాలి. కొందరు అయిదు పిడకలను కూడా లక్ష్మీదేవివద్ద ఉంచుతారు.
ఉద్దరిణితో నీటిని లక్ష్మీదేవిమీద చిలకరిస్తూ, పూవులు జల్లుతూ, అక్షతలు జల్లుతూ మహాలక్ష్మి అష్టకాన్ని చదువుతూ దేవిని స్తుతిస్తారు. చివరికి ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేస్తారు.
మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు లక్ష్మీదేవి పూజను భక్తిగా చేసుకున్నవారికి అపార సంపదలు లభిస్తాయని, సుఖశాంతులు ప్రాప్తిస్తాయని చెప్పే అనేక నిదర్శనాలు ఉన్నాయని పండితులు అంటున్నారు.

మార్గశిర లక్ష్మీపూజతో బంగారు కాసులు

ద్వాపరయుగంలో సౌరాష్ట్రలో శ్రవణుడు అనే రాజు ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడూ, వేదాలు, శాస్త్రాలు , పురాణాలు చదివినవాడు. ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనుకుని చిత్తశుద్ధితో పరిపాలించేవాడు. శ్రవణుడి భార్య సురత చంద్రిక. ఆమె కూడా ఉత్తమురాలు. గొప్ప భక్తురాలు. వారికి ఎనిమిదిమంది సంతానం. ఏడుగురు కొడుకులు, ఒక కూతురు. ఆ రాజు పాలనలో ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉన్నారు.
ఇదిలావుండగా, ధనధాన్యాలిచ్చే లక్ష్మీదేవి సౌరాష్ట్రకు వెళ్ళాలని, రాజును, ప్రజలను దీవించాలని నిర్ణయించుకుంది. లక్ష్మి ఒక వృద్ధ స్త్రీ రూపంలో రాజభవనానికి వెళ్ళింది. అక్కడ మహారాణి దగ్గర పనిచేసే దాసీ ''ఎవరమ్మా నువ్వు?” అనడిగింది.
''నేను మహారాణిని కలవడానికి వచ్చాను. ఆమె క్రితం జన్మలో ఒక పేద వైశ్యుని భార్య. ఆ పేదరాలు ఒకరోజు అంతులేని నిరాశతో ఇళ్ళు విడిచి నడుస్తూ వెళ్ళి అడవి చేరింది. అక్కడ ఆకలితో అలమటిస్తూ, చలికి తాళలేక తిరగసాగింది.
అది చూసిన లక్ష్మీదేవి ఆమెమీద జాలితో మామూలు స్త్రీగా కనిపించి ''మార్గశిర లక్ష్మీదేవి పూజ చేసుకోమని'' చెప్పింది. దాంతో ఆమె వెంటనే ఇల్లు చేరి ఆ పూజ చేసింది. వెంటనే వారి కష్టాలు తీరాయి. ఆ ఇళ్ళు సంపదలతో తులతూగింది...'' అంటూ చెప్పింది.
దాసి వెళ్ళి మహారాణితో అదంతా చెప్పింది. రాణీకి ఆ మాటలు ఎంతమాత్రం నమ్మశక్యంగా తోచలేదు. ''ఈవిడెవరో పబ్బం గడుపుకోవడానికి ఏదో చెప్పింది'' అనుకుని ఆ వృద్ధ స్త్రీని కలవనేలేదు. దాంతో లక్ష్మీదేవికి కోపం వచ్చి నగరం విడిచి వెళ్ళిపోడానికి సిద్ధమైంది.
ఈ సంగతి తెలిసిన రాకుమారి పరుగున వెళ్ళి వృద్ధస్త్రీని నిలవరించింది. ''మా అమ్మను క్షమించు తల్లీ! మార్గశిర లక్ష్మీ పూజ నేను చేస్తాను'' అంటూ వేడుకుంది. చెప్పినట్లుగానే లక్ష్మీపూజ ఎంతో నమ్మకంతో భక్తిగా చేసింది. లక్ష్మీదేవి సంతోషించింది. ఆ రాకుమారికి ధీరుడు, వీరుడు అయిన రాజుతో వివాహం జరిగింది.
కొంతకాలానికి సౌరాష్ట్ర రాజు శ్రవణుడికి కష్టకాలం దాపురించింది. వర్షాభావంతో పంటభూములు బీడుల్లా మారాయి. విపరీతమైన కరవు వచ్చింది.
మహారాణి సలహా మేరకు, శ్రవణుడు కూతురి ఇంటికి వెళ్ళాడు. ఆమె ఎంతో సానుభూతి చూపి ఒక పాత్ర నిండా బంగారు కాసులు నింపి, మాత బిగించి తండ్రికిచ్చింది. ఆయన రాజ్యానికి తిరిగివచ్చి ఆ పాత్ర మూత తెరిచాడు. అయితే దాన్నిండా బొగ్గు కనిపించింది. అది చూసి రాజు దుఃఖంతో కన్నీళ్ళు కార్చాడు. రాణి అయితే కోపంతో ఊగిపోయింది. ''సాయం చేయకపోగా ఇంత అవమానిస్తుందా'' అంది. ''ఎందుకిలా పరాభావించిందో వెళ్ళి అడుగుతాను'' అంటూ వెళ్ళింది.
రాణి వెళ్ళేసరికి కూతురు మార్గశిర లక్ష్మీపూజ చేసుకుంటోంది. ఆమె తల్లిని చూసి సంబరపడి ''అమ్మా, నువ్వూ పూజ చేయి'' అంది. తల్లి ''చేయలేను'' అంటూ అడ్డంగా తల ఊపింది. కానీ కూతురు విడిచిపెట్టక తల్లితో కూడా పూజ చేయించింది. ఇక రాణి కూతుర్ని ఏమీ అడక్కుండానే పూజ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగివెళ్ళింది. రాణి రాజ్యం తిరిగి చేరేసరికి ఆశ్చర్యకరంగా పూర్వ వైభవం తిరిగి వచ్చింది. రాజభవనం కళకళలాడిపోతోంది. ప్రజలంతా మునుపటిమాదిరిగానే సుఖసంతోషాలతో సంతృప్తిగా కనిపించారు.
అదంతా మార్గశిర లక్ష్మీదేవి పూజ మహిమేనని మహారాణికి స్పష్టమైంది. ఇక అప్పటినుంచీ ప్రతి సంవత్సరం మార్గశిర లక్ష్మీవ్రతం నియమం తప్పకుండా చేయసాగింది. శ్రవణుడు ''ప్రజలంతా మార్గశిర లక్ష్మీవ్రతం చేసుకోవాలని, లేకుంటే అనర్ధమని'' చాటింపు వేయించాడు.

మార్గశిర మాస విశిష్ఠ తిథులు - పండుగలు

మార్గశిరమాసం - శుక్లపక్షం :

పాడ్యమి : గంగాసాన్నం 
విదియ : 
తదియ : ఉమామహేశ్వర వ్రతం, అనంత తృతీయ వ్రతం 
చవితి : వరద చతుర్థి, నక్త చతుర్థి – వినాయకపూజ 
పంచమి : ‘నాగపంచమి’ నాగపూజ ( స్మృతి కౌస్తుభం ) ‘శ్రీ పంచమి వ్రతం’ ( చతుర్వర్గ చింతామణి) 
షష్ఠి : సుబ్బారాయుడి షష్ఠి, స్కందషష్ఠి, చంపాషష్ఠి, ప్రవార షష్ఠి వ్రతాలు – సుబ్రహ్మణ్య పూజ, రైతుల పండుగ 
సప్తమి : మిత్ర సప్తమి "ఆదిత్య ఆరాధన " ( నీలమత పురాణం ) 
అష్టమి : కాలాష్టమీ వ్రతం 
నవమి :
దశమి : 
ఏకాదశి : ముక్కోటి ఏకాదశి, మోక్షదైకాదశి, సౌఖ్యదా ఏకాదశి, గీతాజయంతి – ఏకాదశీ ( ఉపవాస) వ్రతం కృష్ణ పూజ, భగవద్గీతా పారాయణ
ద్వాదశి : ద్వాదశీ పారణ, తీర్థదినం, అఖండ ద్వాదశాదిత్య వ్రతం
త్రయోదశి : హనుమద్ వ్రతం, అనంగ (మన్మధ) త్రయోదశీ వ్రతం 
చతుర్దశి : చాంద్రాయణ వ్రతం ఆరంభ తిథి - రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి గౌరీదేవిని ఆరాధించాలి 
పూర్ణిమ : కోరల పున్నమి, దత్త జయంతి - చంద్ర ఆరాధన, దత్త చరిత్ర పారాయణం, సాయి సత్చరిత్ర పారాయణం.
మార్గశిర మాసం - కృష్ణపక్షం :
పాడ్యమి : శిలావ్యాప్తి వ్రతం 
విదియ :
తదియ : 
చవితి : సంకష్ట హర చతుర్థి 
పంచమి : 
షష్ఠి : 
సప్తమి : ఫలసప్తమీ వ్రతం 
అష్టమి : అనఘాష్టమీ వ్రతం, కాలభైరవాష్టమి/ – కాలభైరవపూజ 
నవమి : రూపనవమి వ్రతం 
దశమి : 
ఏకాదశి : సఫల ఏకాదశీ వ్రతం, వైతరణీ వ్రతం, ధనద వ్రతం 
ద్వాదశి : మల్లి ద్వాదశి వ్రతం, కృష్ణ ద్వాదశీ వ్రతం 
త్రయోదశి : యమత్రయోదశి వ్రతం, మాస శివరాత్రి 
చతుర్దశి : 
అమావాస్య : వకుళామావాస్య, అమావాస్య వ్రతం - ఆవు పాలతో పరమాన్నం వండి దేవునికి నివేదన చేయడం సర్వ శుభస్కరం
ధనుర్మాసం : సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన నాటి నుండి – మకర రాశిలోకి ప్రవేశించే వరకు ధనుర్మాసంగా పిలుస్తారు. సంక్రాంతి నెలపెట్టుట అని కూడా పేర్కొంటారు. సాధారణంగా ప్రతీనెలా 14,15 తేదీలలో సూర్యుడు ఒకరాశినుండి మరో రాశికి ప్రవేశిస్తుంటాడు. ఈ మాసంలో "తిరుప్పావై" రోజుకొక్క పాశురం చొప్పున ప్రతి వైష్ణవ ఆలయంలోను చేస్తారు. గోదా దేవిని ( సాక్షాత్తు లక్ష్మీదేవి ) పూజిస్తారు. తిరుప్పావై ప్రవచనాలు, ప్రత్యెక పూజలతో వైష్ణవ ఆలయాలు చాల సందడిగా ఉండే మాసం ఇది. ఈ ధనుర్మాసం నెలరోజులూ కన్నె పిల్లలు తెల్లవారుజ్హామునే లేచి ఇళ్ళముందు కలాపి చల్లి చక్కని రంగవల్లులతో, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. వీధులన్నీ రంగురంగుల ముగ్గులతో కళ కళ లాడుతూ ఉంటాయి.
తీర్థ దినం : ఈ భూలోకంలో ఉన్న మూడు కోట్ల తీర్థాలు, మార్గశిర సుద్ధ ద్వాదశి నాడు "అరుణోదయ (సూర్యోదయ)" సమయంలో తిరుమల కొండపై గల స్వామీ పుష్కరిణిలో ప్రవేశించి ఉంటాయని పురాణ ప్రమాణం. అందుకే, స్వామి పుష్కరిణి "తీర్థ దినం" గా పూజిస్తారు
మోక్షదా ఏకాదశి : ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి జనన మరణ రహితమైన మోక్షప్రాప్తి కులుగుతుందని చెబుతారు. అందుకే దీనిని మోక్ష ఏకాదశిగా పేర్కొంటారు. ఈరోజు ‘ఏకాదశీవ్రతం’ ఆచరిస్తారు. పూర్వం వైఖానసుడు అని ఒకరాజు ఉండేవాడు. అతనికి ఒకనాడు తన తండ్రి నకరంలో ఉండిపోయి యమయాతనలు పడుతూ ఉన్నట్లు కల వచ్చింది. అందుకు అతను మార్గశిర శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం ఉండి నియమాలతో వ్రతం చేశాడు. ఆ వ్రత ఫలితంగా అతని తండ్రి స్వర్గలోకానికి చేరాడు. తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత దీనికి ‘మోక్షదా ఏకాదశి’ అని పేరువచ్చింది.
తిథిలన్నింటిలోకీ మార్గశిర శుద్ధ ఏకాదశికి మరో ప్రత్యేకతా ఉంది. కురుక్షేత్రంలో తాతలనూ, తండ్రులనూ, బంధుగణాల్నీ చూసి అస్తస్రన్యాసం చేసిన అర్జునుడికి కృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చి గీత బోధన చేసిందీ రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజును "గీతాజయంతి" గా వ్యవహరిస్తారు. ఆవేళ కృష్ణుణ్ని భక్తీ శ్రద్ధ లతో పూజించి, గీతా పారాయణ చేయడం నిర్దేసించబడింది.


మార్గశిర లక్ష్మీ వ్రతం

మార్గశిర మాసం వచ్చేసింది. ఈ నెలలో ముఖ్యంగా మార్గశిరంలో వచ్చే ఏ గురువారమైనా లక్ష్మీ వ్రతం చేసుకోవడం ఆనవాయితీ. ఈ నెలలో లక్ష్మీవ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని, సర్వ సౌఖ్యాలూ ప్రాప్తిస్తాయని పూరాణాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించిన కథ ఒకటి చూడండి.
పూర్వం ఒక చిన్నారి సవతి తల్లి పెట్టే బాధలు పడలేక అవస్త పడుతోంది. ఆమెను చూస్తే అందరికీ జాలిగా ఉండేది. ఒకరోజు ఆలయ పూజారి ఆ చిన్నారిని చేరదీసి ''అమ్మా! నువ్వు లక్ష్మీదేవి పూజ చేసుకో.. నీ కష్టాలన్నీ తీరతాయి..'' అని చెప్పాడు.
ఆమె దగ్గర లక్ష్మీదేవి ప్రతిమ అయినా లేదు. దాంతో మట్టితో బొమ్మను తయారుచేసి, ఆ విగ్రహాన్నే లక్ష్మీదేవిగా భావించి ప్రార్ధించసాగింది. సవతితల్లి తన కూతుర్ని ఆడించమని చేతిలో ఉంచి, ఆమెకోసం ఇచ్చిన బెల్లంలోంచి చిన్న ముక్క తీసుకుని లక్ష్మికి నైవేద్యం సమర్పించేది.
కొన్నాళ్ళకు ఆమె పెళ్లయింది. మంచి వరుడు వచ్చాడు. ఆమె వెళ్తూ వెళ్తూ తాను చేసుకున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసికెళ్ళింది. ఆమె చేసిన పూజాఫలంతో అత్తగారింట్లో సిరిసంపదలు ప్రవాహంలా వచ్చిపడ్డాయి. అయితే ఆమె వెళ్ళిన మరుక్షణం పుట్టింట్లో పేదరికం తాండవించింది.
సంగతి తెలిసి ఆమె బాధపడింది. సవతితల్లిమీద ఎలాంటి కోపతాపాలూ లేవు. తమ్ముడు వచ్చి పరిస్థితి చెప్పగా అయ్యో అనుకుని కొన్ని బంగారు కాసులను మూటకట్టి ఇచ్చింది. కానీ తమ్ముడు దారిలో వాటిని పారేసుకున్నాడు. అలా రెండోసారి, మూడోసారి కూడా బంగారు కాసులను ఇచ్చినా, తమ్ముడు పారేసుకున్నాడు. సోదరి ఇచ్చినా తాను నిలుపుకోలేకపోయానని అతను బాధపడ్డాడు.
కొన్నాళ్ళ తర్వాత ఆమె పుట్టింటికి వెళ్ళింది.
అక్కడ సౌభాగ్యాలు రావాలని సవతితల్లితో ''అమ్మా! ఇవాళ మార్గశిర గురువారం.. చాలా మంచిరోజు.. నువ్వు ఏమీ తినకుండా, తలకు నూనె రాసుకోకుండా ఉండు.. లక్ష్మీదేవి వ్రతం చేసుకుందాం'' అంది.
కానీ ఆవిడ పిల్లలకు అన్నం పెడుతూ, ఆకలికి ఆగలేక తాను కూడా కొంచెం తింది.
అది విని కూతురు ''అయితే వచ్చే గురువారం చేసుకుందాం'' అని వాయిదా వేసింది.
రెండోవారం ఆ తల్లి పిల్లలతోపాటు తాను కూడా తలకు నూనె రాసుకుంది. నియమోల్లంఘన జరిగినట్లు తెలిసి కూతురు మళ్ళీ వచ్చేవారం అంటూ వాయిదా వేసింది.
ఆ తర్వాత మూడో గురువారం కూడా తల్లి నియమాలను పాటించలేకపోయింది.
ఇక కూతురు బాధగా ''అమ్మా! ఇదే ఆఖరి మార్గశిర గురువారం.. ఈసారి అయినా జాగ్రత్తగా ఉండు.. లేదంటే ఈ పేదరికం పోదు..'' అంటూ పదేపదే చెప్పగా, తల్లి భయంతో గుర్తు ఉంచుకుని నియమాలు పాటించింది.
మొత్తానికి చివరి మార్గశిర గురువారం నాడు తల్లితో కలిసి ఆమె లక్ష్మీదేవి వ్రతం చేసింది. అయితే తల్లి పెట్టిన నైవేద్యం లక్ష్మీదేవి స్వీకరించలేదు. కూతురు పెట్టిన నైవేద్యం స్వీకరించింది.
కూతురు వేడుకుంటూ అడగ్గా ''నీ తల్లి ఎన్నో తప్పులు చేసింది.. ముఖ్యంగా నువ్వు భక్తిగా నా ప్రతిమ చేసి, పూజ చేస్తోంటే కూడా అడ్డుకునేందుకు చూసింది...'' అంటూ సెలవిచ్చింది.
కూతురు తల్లితో విషయం చెప్పి ''అమ్మా! లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పుకో.. ఇకపై ఎన్నడూ పూజను అశ్రద్ధ చేయనని, పూజ చేసుకునేవారిని అడ్డుకోనని ప్రార్ధించు'' అని చెప్పింది.
తల్లి అలాగే వేడుకుంది. నిజంగానే చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందింది.
లక్ష్మీదేవి శాంతించి ఇద్దరికీ అభయమిచ్చి అంతర్ధానం అయింది.
ఈసారి ఆమె అత్తగారి ఇల్లే కాకుండా పుట్టిల్లు కూడా సిరిసంపదలతో తులతూగింది.
అదీ కథ.
మార్గశిర లక్ష్మీదేవి వ్రతానికి ఆడంబరాలు ఏమీ అక్కర్లేదు. లక్ష్మి విగ్రహాన్ని పెట్టి, నైవేద్యం సమర్పించి, భక్తిగా కొలిస్తే చాలు దేవి అనుగ్రహిస్తుంది. సర్వ సంపదలూ దొరుకుతాయి.



MARGASIRAMULO LAKSHMI VARA VRATHAM - GODDESS SRI MAHALAKSHMI PUJALU


మార్గశిరంలో లక్ష్మీవారవ్రతం

లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునేవారంతా మార్గశిరంలో లక్ష్మీవారవ్రతం తప్పకుండా చేయాలనుకుంటారు. దీన్నే కొందరు గురువారలక్ష్మి పూజ, లక్ష్మీదేవినోము అని పిలుస్తారు.

మార్గశిర లక్ష్మీపూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. మార్గశిరమాసంలోని గురువారాలు, పుష్యమాసంలోని మొదటి గురువారంనాడు వ్రతాన్ని ఆచరించవలెను.

* వ్రత విధానం..

ముందుగా ప్రాతఃకాలాన నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్టించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యప్పిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. 'హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత ప్రజాం' అంటూ ప్రార్ధన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం,ఆర్గ్యం, ఆచమనీయం, శుద్దోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూర నీరాజనాన్ని యధావిధిగా సమర్పించాలి. ' ఓం లక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీచ ధీమహి తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్' అంటూ లక్ష్మీగాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. అనంతరం 'సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం' సిద్ధలక్ష్మీ కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి, మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవారవ్రత కథని చెప్పుకుని అక్షతలు శిరసున ధరించాలి. క్షమాప్రార్ధన చేయాలి.

అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు. తొలి గురువారం అమ్మవారు పుట్టినవారంగా ప్రఖ్యాతమైంది. కాబట్టి ఈ రోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి. రెండవవారం క్షీరాన్నం (పరమాన్నం), మూడవవారం అట్లు, తిమ్మనం లేదా కుడుములు, నాలుగోవారం గారెలు, అప్పాలు నైవేద్యం పెట్టాలి. ఐదోవారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలను నివేదించాలి. ఆ రోజు అయిదుగురు ముత్తయిదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్లే. ఇతర వ్రతాల్లాగా పూజ పూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతని ఉవాచ.

IMPORTANCE OF FRUITS / BANANAS USED FOR GOD'S PUJA


అరటి పండు నైవేద్యంగా పెడితే.. ఇష్టార్థ సిద్ధి కలుగుతుందట. 

1. అరటి పండు నైవేద్యంగా ఉంచితే... ఇష్టార్థ సిద్ధి కలుగుతుంది.

2. చిన్న అరటి (యాలక్కి అరటి) నైవేద్యంగా ఉంచితే...నిలచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. త్వరగా పనులు పూర్తవుతాయి.

3. అరటి పండు రసాయనం (గుజ్జు) నైవేద్యం ద్వారా - అప్పుల బాధ తొలగిపోతుంది. రావలసిన డబ్బు తిరిగి వస్తుంది. నష్టపోయిన నగదును పొందే అవకాశం, రాదనుకున్న నగదు తిరిగి రావటం, ప్రభుత్వానికి పన్ను రూపంలో ఎక్కువ కట్టినా తిరిగి వస్తుంది. పెళ్లి శుభకార్యాలకు కావలసిన నగదు సకాలంలో చేతికి అందుతుంది. హఠాత్తుగా నగదు మంజూరై చేతికి లభిస్తుంది.

4. పూర్ణఫలం/కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే- పనులు త్వరగా, సులభంగా అవుతాయి. మనం మనసు పెట్టిన విధంగానే పనులు నెరవేరుతాయి. అన్ని పనులు దిగ్విజయంగా జరుగుతాయి. పని చేసి పెట్టేవారు మంచి స్నేహితుల్లాగా పని చేసి పెడతారు. పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు.

5. సపోటా పండును నైవేద్యంగా పెడితే- అమ్మాయిను చూసి వెళ్లినవారు ఒప్పుకునేందుకు ఆలస్యం చేస్తున్నా, లేదా సంబంధం చేసుకునేందుకు నిరాకరించినా, ఇతరుల మధ్య వర్తిత్వం ద్వారా ప్రయత్నించినా అబ్బాయి తరపు వారు నిరాకరిస్తే, సపోటా పండును దేవునికి నైవేద్యంగా పెడితే ఎటువంటి అవాంతరాలున్నా తొలగిపోతాయి.

6. దేవునికి కమలా పండు నైవేద్యంగా పెడితే - పనులు చేసి పెడతామని మాట ఇచ్చిన తరువాత వేర్వేరు కారణాలతో పనులు నిలిచి పోతే, కమలాపండును దేవునికి నైవేద్యంగా ఉంచితే నమ్మకమైన వ్యక్తుల ద్వారా అయ్యే పనులు పూర్తవుతాయి.