ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

IF YOU SCOLD ME AGAIN, I WILL GO TO MY HOME PLACE. IT'S UP TO YOU AFTERWARDS


LINES AND DOTS MELIKELA MUGGULU


LARGE LOTUS FLOWERS FOR 2015 SANKRANTHI FESTIVAL


BEAUTIFUL TRIANGLES MUGGU


HOW TO PREPARE LEGS LOOKS BEAUTIFUL


సొగసైన పాదాలకు

కాళ్లను అందంగా తీర్చిదిద్దుకోవడానికి... మొదట గోళ్లను కత్తిరించుకోవడంతో ప్రారంభించండి. కాలి గోళ్లకు చక్కని ఆకృతినివ్వడం మరిచిపోవద్దు. ఇలా ప్రతి పదిహేను రోజులకోసారి చేసినా సరిపోతుంది. దీనివల్ల కాళ్లు శుభ్రంగా ఉండటమే కాదు, గోళ్లలో పేరుకునే మురికి దూరమవుతుంది. ఎప్పుడూ నెయిల్‌పాలిష్ వేసుకుని ఉండటం కొందరు ఫ్యాషన్‌గా భావిస్తే, మరికొందరు కనీసం సగం మిగిలిపోయిన రంగుని కూడా తొలగించరు. దీనివల్ల గోళ్లపై ఉండే సహజ నూనెలు పోతాయి. అవి పొడిబారడం, చిట్లిపోవడం, రంగు మారడం జరుగుతుంది. వారంలో ఒకట్రెండు రోజులైనా గోళ్ల రంగు లేకుండా చూసుకోండి. గోరువెచ్చని బాదం నూనెతో గోళ్లకు మర్దన చేస్తే వాటికి కావలసిన పోషకాలు అంది, ఆరోగ్యంగా ఎదుగుతాయి.

గోళ్ల రంగును ఆరేవరకూ ఉంచుకోవడం కష్టమనుకుని బ్లో డ్రయర్‌ని వాడతారు కొందరమ్మాయిలు. దీనివల్ల గోళ్లు పొడిబారిపోతాయి. వీలైనంత వరకూ సహజంగా ఆరేట్లు చూసుకోవడమే మంచిది. తరచూ నెయిల్‌పాలిష్ ఉపయోగించేవారు, ఎక్కువగా రిమూవర్‌ని వాడతారు. దానిలో ఉండే కఠిన రసాయనాలు గోళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నేరుగా ఎసిటోన్‌ను రంగు తొలగించడానికి ఉపయోగించొద్దు. వీలైనంత వరకూ ఎసిటోన్ లేని రిమూవర్ వాడటం మంచిది.


BRIEF INFORMATION ABOUT THE GREAT WRITER SRI ADHI KAVI NANNAYYA GARU



మహర్షి ఆదికవి నన్నయ

వేయి సంవత్సరాల ఆంధ్రసాహిత్య ప్రక్రియలో నిత్యసత్య వచనుడనని చెప్పిన కవిపుంగవుడు నన్నయ తప్ప ఎవరున్నారు? అందువల్లే అజరామరంగా నేటికి ఆంధ్రమహాభారత కావ్యం పండిత పామరులను ఆకట్టుకొంటున్నది. 

భూమిక్రిందున్న పాతాళలోకం చీకటిమయం కదా? అక్కడకు వెలుగు ఎలా ప్రసరిస్తుందన్న ప్రశ్నకు సమాధానం నన్నయ మహర్షి ఎలా చెప్పగాలిగారో చదివితే తెలుస్తుంది. 

ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆంధ్రమహాభారత రచన జరిగి నేటికి వెయ్యేళ్ళు కావస్తున్నది. నన్నయగారు 4000 పద్యాలలో ఆదిసభారణ్యపర్వాలను తెలుగు చేసారు. అరణ్యపర్వంలో 4వ ఆశ్వాసంలో పద్యరచన ఆగింది. కారణం నన్నయ గారు పరమపదించడం. ఆంధ్రానువాదపీఠికలో తనను గురించి నన్నయగారు నిత్య సత్యవచనుడననీ, అవిరళజపహోమతత్పరుడననీ చెప్పుకున్నారు.

రాజరాజు కుల బ్రాహ్మణుగా ఉంటూ అనుదినం రాచకార్యాలలో పాల్గొంటూ కావ్యారంభంలో ఎంతో వినయశీలాన్ని ప్రదర్శించారు. వేయి సంవత్సరాల ఆంధ్రసాహిత్యప్రక్రియలో నిత్యసత్యవచనుడనని చెప్పిన కవిపుంగవుడు నన్నయ తప్ప ఎవరున్నారు? అందువల్లే అజరామరంగా నేటికీ ఈ రచన పండితపామరులను ఆకట్టుకొంటున్నది. "నా నృషిహ్ కురుతే కావ్యం" - మహాకావ్యాలను ఋషులే వ్రాయగలరు. మహర్షులు విశ్వం నలుమూలల నుండి గొప్ప భావాలను స్వీకరించిన మహోన్నత ఆదర్శపురుషులు.

* ఆనోభద్రా క్రతవోన్యంతువిశ్వతః

ఋషులు మన కళ్లెదుటనున్న నిత్యసత్యాలను వెలికిదీసి చూపేవారు. మరి కవులో, అతిశయోక్తి అలంకారానికి జీవం పోసేవారు. ("కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ " - ఏనుగుల సమూహం దోమ కుత్తుకలో ప్రవేశించటం). నన్నయగారు కావ్యారంభంలో స్మరించిన ఋషిపుంగవులు ఇద్దరే- వారే వాల్మీకి, వ్యాసులు. వారి అడుగుజాడల్లో నిత్యసత్యాలను వెదికి మనకు జ్ఞానతేజాన్ని చూపారు.

వాల్మీకి మహర్షిని - "దుర్భరతపోవిభవాధికుడు (అధికతపస్సంపద చేత గొప్పవాడు), గురుపద్యవిద్యకు ఆద్యుడు (పద్యరచనా సంప్రదాయానికి తొలి కవి), అంబురుహ గర్భవిభుడు, (బ్రహ్మతో సమానుడు)" అన్నాడు నన్నయ.

వ్యాసమహర్షిని - "భరతవాక్యములను శుభకరములైన కిరణములచేత సంసార దుఃఖమను చీకటి తొలగించి పండిత హృదయ కమలములకు వికాసము కల్గించిన వ్యాససూర్యుడు"గా కీర్తించాడు. వ్యాసహృదయకమల వికాసము శాశ్వతమని అన్నాడు.

* ఆంధ్రభారతకావ్యాన్ని విశ్లేషిస్తే...

శకుంతల, దుష్యంతునిసభలో నిరాదరణకు గురియై, కుమారుడు భరతుని, రాజుకు చూపిస్తూ,

"విపరీతప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ ! ఈ పుత్రగా
త్ర పరిష్వంగసుఖంబు సేకొనుము ముక్తాహారకర్పూరసాం
ద్ర పరాగప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయుం బుత్రగా
త్ర పరిష్వంగము నట్లు జీవులకు హృద్యంబే ? కడున్ శీతమే ?"

అంటుంది. ఓ రాజా, విరుద్ధాలైన మారుమాటలు ఎందుకు ? కుమారుడి కౌగిలి వలన కలిగే సుఖానుభూతి పొందుము. ముత్యాలహారాలు, పచ్చకర్పూరపు దట్టమైన పొడి ప్రసారం, మంచిగంధం, వెన్నెలయూ జీవులకు పుత్రుని కౌగిలి వలె మనసుకు మంచి చల్లదనాన్ని, సుఖాన్ని కలిగించలేవు.

ఇందులో నన్నయ ఎన్నుకొన్న ఉపమానాలన్నీ, వ్యాసభారతంలో లేని విషయాలు. సర్వప్రాణులకు అంటే పశుపక్ష్యాదులకూ కౌగిలి సుఖం సమానమేనంటున్నాడు - విశ్వజనీన భావన.

వేటకై వెళ్లిన దుష్యంతుడు అడవిలో తిరుగుతూ, తాను ముని ఆశ్రమంలో ప్రవేశించానని ఎలా ఊహించాడో, నన్నయ వాక్కులో చూడండి.

"అపేయలతాంతములైనను బాయని మధుపప్రకరంబు జూచి"- దుష్యంతుడు చెట్లకొమ్మలు చూచాడు. వాటిపై పుష్పములు లేకున్నప్పటికీ తుమ్మెదల గుంపు కొమ్మలపై ఎలా వ్రాలాయి అని ఆశ్చర్యంగా తిలకిస్తున్న రాజుకు, కారణం వెంటనే స్ఫురించింది. యజ్ఞహవిస్సులో కమ్మని నెయ్యి, హోమద్రవ్యాలు ఋషులు వాడటం వల్ల సువాసనల పొగలతో చూరిన తీగలు ఆ చెట్ల కొమ్మలను అల్లుకొనడం వల్ల తుమ్మెదల గుంపులు అక్కడ చేరాయి.
ఎంత కమ్మని మధురభావన !

ఉపమా కాళిదాసస్య (నన్నపార్యస్య) - ఉపమాలంకారానికి కాళిదాసుతో సమానుడు నన్నయ. కచదేవయాని కథలో కచుడు ఉదయ పర్వత గుహాద్వారము నుండి ఉదయించు పూర్ణచంద్రుడో యనునట్లు శుక్రాచార్యుని ఉదరము ఛేదించుకొని బయటకు వచ్చాడు.

మరణించిన శుక్రాచార్యుడెలా బ్రతికాడో చూడండి -
"విగతజీవుడై పడియున్న వేదమూర్తి యతని చేత సంజీవితుడై వెలుంగెదనుజమంత్రి ఉచ్ఛారణ దక్షుచేత నభిహితంబగు శబ్దంబు నట్లపోలె".

ఉచ్ఛారణ సామర్ధ్యం గల ఒక విద్వాంసుడు పటుత్వంతో పలికిన వేదశబ్దం ఎలా సజీవంతో వెలుగునో, ఆ విధంగా శుక్రాచార్యుడు కచుని చేత సంజీవనీవిద్య చేత బ్రతికింపబడ్డాడు.

బ్రహ్మవేత్తలైన ఋషులే ఇలా భావన చేయగలరు. అందుకే నన్నయను విపులశబ్దశాసనుడన్నారు.

గర్భవతియైన జరత్కారువు భార్య (ఆస్తీకుని తల్లి) "దినకరగర్భయగు పూర్వదిక్సతివోలె" ఉన్నది అంటాడు నన్నయ. సూర్యుడు గర్భంలో ఉన్న తూర్పుదిక్కు అనే కాంత వలె ఆమె ప్రకాశించింది.

అలాగే కిరాతార్జునీయ సన్నివేశంలో -
కం|| హరుశరమును నరు శరమును సరి నిరుపక్కియలు దాకి జవమఱి శరసం
భరమున దిరిగె వరాహము శరనిధి మథనమున దిరుగు శైలముపోలెన్"

శివుడు ప్రయోగించిన బాణమున్నూ, అర్జునుడు వేసిన అమ్మున్నూ ఏకకాలంలో ఇరువైపులా ఆ పందిని తాకాయి. రెండు డొక్కలలో నాటుకొన్న ఆ రెండుబాణాల తాకిడికి ఆ వరాహం శక్తి నశించి క్షీరసాగరమథన సమయంలో తిరిగిన మందరపర్వతం వలె గిరగిర తిరిగింది.

తాతగారు మనవడికి కథ చెప్తున్నాడు.
1. భూలోకం మనమున్నది.
2. పైన స్వర్గనరకలోకాలు
3. క్రింద- పాతాలలోకం

భూమి క్రిందున్న పాతాల లోకం చీకటి కదా తాతయ్యా, అక్కడకు వెలుగు ఎలా వస్తుందన్న మనవడి ప్రశ్నకు, నన్నయ మహర్షి సమాధానం చూడండి.

"అలఘు ఫణీంద్ర లోకకుహరాంతర దీప్త మణి స్ఫురత్ ప్రభావలి
గలదాని, శశ్వదుదవాస మహావ్రత శీతపీడితా
చలముని సౌఖ్యహేతు విలసద్బడబాగ్ని శిఖాచయంబుల
వెలిగెడుదాని గాంచిరరవింద నిభానన లమ్మహోదధిన్"

ఇది సముద్రవర్ణన. సముద్రం రత్నగర్భ. వెలలేని మాణిక్యాలకు నెలవు. అవి సముద్రం అట్టడుగున ఎందుకున్నవో తెలుసా? ఆ మణుల కాంతి పాతాళలోకానికి వెలుగు ప్రసాదించి, చీకటి పోగొట్టుటకే. అలాగే సముద్రగర్భంలో తపస్సు చేసుకొంటున్న మునుల చలిని పోగొట్టే బడబాగ్నికూడ వారికి సౌఖ్యాన్ని ప్రసాదిస్తున్నది.
నిజంగా నన్నయగారు వేయి సంవత్సరాలకు పూర్వమే నీటిలో వెచ్చని శక్తి (కరెంటు) ఉందని చెప్పగలిగారు. మహర్షుల వాక్కులు అమోఘం, దివ్యం!

అంధుడైన దీర్ఘతమమునిసత్తముని, ఒక్కడిని తల్లి ఆజ్ఞపై పడవలో బంధించి కుమారులు గంగాప్రవాహంలో వదలగా, కొట్టుకుపోతున్న ఋషి ఎంచేసాడు అన్న ప్రశ్నకు వ్యాసుడు సమాధానం చెప్పకపోతే, మహర్షి నన్నయ ఏమంటున్నాడంటే - "ఉదాత్త అనుదాత్త స్వరితప్రచయ స్వరభేదంబులేర్పడ సలక్షణంబుగా వేదము చదువుచుండెనట"- ఉదాత్త అనుదాత్త స్వరితప్రచయస్వరభేదం స్పష్టంగా తెలిపేటట్లు లక్షణ సహితంగా వేదాలను చదువుతూ కాలం వెళ్లబుచ్చాడు.

"తనర జనకుండు నన్నప్రదాతయును భయత్రాత
యును ననగ నింతులకు మువ్వు రొగిన గురువులు వీర
లనఘ, యుపనేత మరియు నిరంతరాధ్యాపకుండు,
ననగ బురుషున కియ్యేవు రనయంబును గురువులు"

స్త్రీలకు తండ్రులుగా కన్నవాడినీ, అన్నం పెట్టినవాడినీ, భయం నుండి రక్షించినవాడినీ, మొత్తం వరుసగా ముగ్గురిని గురువులుగా ముచ్చటగా చెప్పుతారు. ఓ పుణ్యాత్ముడవైన మహర్షీ! పురుషులకు ఈ ముగ్గురే కాక ఉపనయనం చేసినవాడినీ, వేదాలు చెప్పినవాడినీ కలిపి మొత్తం ఐదుగురిని గురువులుగా ఎల్లప్పుడూ పరిగణిస్తారు.

"మూలంలో శరీరకృత్, ప్రాణదాతా, యస్య చాన్నానిభుంజతే, క్రమేణైతే త్రయోప్యుక్తాః పితరోధర్మదర్శనే" అని స్త్రీలకు గురువులైన ముగ్గురే చెప్పబడియుండగా, నన్నయ పురుషులకు ఐదుగురు గురువులని విశేషించి పేర్కొన్నాడు. 

LORD NARASIMHA SWAMY PIC


BRIEF INFORMATION ABOUT KORUKONDA TEMPLE - NEAR RAJAHMUNDRY - EAST GODAVARI DISTRICT - ANDHRA PRADESH - INDIA


కోరుకొండ

తెలుగు వారి పుణ్య ఫలమేమో... నరసింహుడు అడుగడుగునా కొలువుదీరి ఆశీర్వదిస్తున్నాడు. కొండపై నిండుగా కొలువున్న నరసింహ క్షేత్రాలలో అరుదైనది కోరుకొండ. ఇది నిటారుగా నింగినంటుతున్నట్టుగా నిలబడి భక్తులకు పరీక్ష పెడుతుంది. ఈ కొండను ఎక్కడం చక్కటి అనుభవం. ఫాల్గుణ మాస శుక్ల ఏకాదశినాడు జరిగే తీర్థంలో పాల్గొనడం మరో అనుభూతి. ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రికి అతి సమీపంలో ఉంది. 

ఇది నిటారుగా నింగినంటుతున్నట్టుగా నిలబడి భక్తులకు పరీక్ష పెడుతుంది. ఈ కొండను ఎక్కడం చక్కటి అనుభవం. ఫాల్గుణ మాస శుక్ల ఏకాదశినాడు జరిగే తీర్థంలో పాల్గొనడం మరో అనుభూతి. ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రికి అతి సమీపంలో ఉంది.

BRIEF INFORMATION ABOUT BRAHMESWARA SWAMY TEMPLE AT BRAHMA SAMEDYAM - PALLAMKURRU - KATRENIKONA MANDAL - EAST GODAVARI DISTRICT - ANDHRA PRADESH


బ్రహ్మ సమేధ్యం 

తూరుపు తీరంలో తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మడలంలోని చిట్టచివరి మత్స్యకార గ్రామం పల్లంకుర్రు. దీన్ని దాటి నాలుగు కిలోమీటర్ల దూరం మడ అడవుల మధ్యనుంచి పడవ ప్రయాణం చేస్తే వచ్చే ద్వీపం 'బ్రహ్మ సమేధ్యం'. ఆ దీవిలో ఒక గుడి. బ్రహ్మేశ్వర స్వామి, ధనలక్ష్మి, దుర్గ అమ్మవారు కొలువుదీరి ఉంటారు.

ఆ గుడిని నమ్ముకున్న పూజారి అయ్యలూరి జగన్మోహన భైరవస్వామి. ఆయనే ఉదయం, సాయంత్రపు వేళల్లో గుడిలో దీపం వెలిగిస్తాడు. తాను వండుకున్నదే దేవతలకు నైవేద్యం సమర్పిస్తాడు. బ్రహ్మ సమేధ్యంలో ఏడాదికొకసారి చొల్లంగి అమావాస్యనాడు జాతర జరుగుతుంది. అదీ రాత్రిపూట. ఆ సమయంలోనే భక్తులు కిక్కిరిసి కనిపిస్తారు. ఆ మర్నాటినుంచి మళ్ళీ బ్రహ్మేశ్వరుడు, ఆయనకుతోడుగా జగన్మోహన భైరవస్వామి ఒకరికొకరు తోడుగా ఉంటారు.

MATYAGIRINDRA TEMPLE AT KOTHAGUTTA - KARIMNAGAR DISTRICT - INDIA



కొత్తగట్టుపై మత్స్యగిరీంద్రుడు 

తెలుగు నేల అడుగడుగునా దేవుని జాడలున్నాయి. శ్రీమహావిష్ణువు అవతార మూర్తులు ఇక్కడ కొలువుదీరాయి. అరుదైన మత్స్య, వరాహ, కూర్మ, నరసింహ, వామన దేవాలయాలు దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలుగునాట పూజలందుకుంటున్నాయి. శ్రీమహావిష్ణువు తొలి అవతారమైన మత్స్య దేవుడి ఆలయాన్ని పరిచయం చేస్తున్నాం.

తెలుగు నేలను పాలించిన రాజులలో కాకతీయులది అద్వితీయ స్ధానం. ఆర్థిక, సామాజిక, రాజకీయ కోణాల్లోనే కాకుండా ఆథ్మాత్మికపరంగానూ వారు ఎనలేని సేవలు చేశారు. వారి కాలంలోనే వేయిస్తంభాల మంటపం, రామప్ప దేవాలయం, భద్రకాళి అమ్మవారి ఆలయం వంటివి రూపుదాల్చాయి. ఆ కోవలోనే శ్రీమహావిష్ణువు ఆది అవతారమైన మత్స్యమూర్తికి కొత్తగట్టులో కోవెల వెలసింది. మత్స్యమూర్తికి మొత్తం భారతదేశంలోనే రెండుచోట్ల ఆలయాలు ఉండగా, ఇదే మొదటిదిగా చెబుతారు. రెండోదికూడా మన రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలో నాటి విజయనగర రాజుల పాలనలో నిర్మితమైంది.

కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరాన కొత్తగట్టుపై మత్స్యగిరీంద్రుడు కొలువుదీరాడు. క్రీ.శ.13వ శతాబ్దంలో కాకతీయుల పాలనా కాలంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగినట్లు చరిత్రకారుల అంచనా. ప్రళయం సంభవించినపుడు శ్రీమహావిష్ణువు లోకోపకారం కోసం మత్స్యరూపుడైనాడు. ఋషులు, సత్పురుషులు, వనమూలికలు, దివ్యౌషధులు, పశుపక్ష్యాదులతో కూడిన నావను తన కొమ్ముకు కట్టుకుని ప్రళయ జలధిని దాటించసాగాడు. అదే తరుణంలో సోమకుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుంచి వేదాలను తస్కరించి సముద్రంలో దాక్కున్నాడు. బ్రహ్మ వేడుకోవడంతో మత్స్యరూపుడైన విష్ణుమూర్తి వేద సంరక్షణ గావించాడు. దుష్ట సంహారం చేసి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించాడు.

శ్రీమహావిష్ణువు అవతారాలలో మొట్టమొదటిదైన మత్స్యఅవతార అంశమే కొత్తగట్టు దేవాలయంలో కొలువై ఉంది. ఈ ఆలయ సమీపానే నిండైన కోనేరుకూడా ఉంది. స్వామివారి గుట్టపైనున్న ఈ కోనేరు సర్వకాలాల్లోనూ నీరు నిండుగా ఉండడం ఒక విశేషంగా భక్తులు భావిస్తారు. ఈ కోనేరులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే తమ పాపాలు హరించి, కోరిన కోర్కెలు ఈడేరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

* పంటకు పెన్నిధి

అంతేగాక, ఈ ప్రాంతంలోని రైతాంగానికికూడా ఈ కోనేరులోని నీటిని పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ నీటిని తమ తమ పంటపొలాల్లో చల్లితే చీడపీడలేవీ దరి చేరకుండా దిగుబడి సమృద్ధిగా ఉంటుందని విశ్వసిస్తారు. ప్రతి ఏడాది మాఘ మాసంలో మత్స్యగిరీంద్రుడికి దశాహం నిర్వహిస్తారు. మాఘ శుద్ధ పౌర్ణమితో ఈ ఉత్సవాలు ఆరంభమై పదిరోజులపాటు కొనసాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీమత్స్యగిరీంద్రుడికి భూదేవి, నీలాదేవిలతో కల్యాణం జరిపిస్తారు. కల్యాణం మరుసటి రోజునుంచి జాతర పెద్దఎత్తున జరుగుతుంది. ఆ పది రోజులూ కరీంనగర్‌ జిల్లావాసులే కాకుండా ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలవారు జాతరలో పాల్గొని మత్స్యగిరీంద్రుడి ఆశీసులు అందుకుంటారు.