ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ON ANCIENT HISTORICAL PURANA STORY OF INDIAN MUGGU IN SANKRANTHI FESTIVAL MONTH


ధనుర్మాసం లో.. స్త్రీలు తెల్ల వారక ముందే లేచి ఇం టి ముందు పేడనీళ్లు చల్లి ముగ్గులు వేసిన తరువాత పరమ పవిత్రమైన గోమయాన్ని గోబెమ్మలుగా తీర్చి ముగ్గు మధ్యలో వుంచి పువ్వులు , పసుపు కుంకుమల తో అలంకరిస్తారు.

గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళె్ళైన గోపికలకు సంకేతంగా భావిస్తారు. ఈ ముద్దల తలమీద కనిపించే రంగురంగుల పూవులు , పసుపు కుంకుమలు ముత్తైదువులకు సంకేతం .గోపీ+అమ్మలు=గోపెమ్మలు.. . అవే..జానపదుల వాడుకలో గొబ్బెమ్మలుగా మారాయి అని చెబుతుంటారు పెద్దలు. మధ్య వుండే గొబెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణభక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు.పువ్వులు పెడతా రు. సాయంత్రమయ్యాక పేడతోగానీ, పసుపుతోగానీ గొబ్బె మ్మలు చేసి ఒక పెద్ద పళ్లెంలో ఉంచుతారు.

కళ్ళ స్థా నంలో గురి వింద గింజలు, ముక్కు స్థానంలో సంపెంగ లాంటి పువ్వును ఉంచుతారు. ఈ గొబ్బెమ్మలకు రక రకాల అలంకారం చేసి ఇంటింటి ముందుకూ తీసు కువెళ్ళి పళ్ళెంతో సహా నేలమీద ఉం చి గొబ్బెమ్మ చు ట్టూ తిరుగుతూ చేతులతో చప్పట్లు తడుతూ పాటలు పాడతారు. అక్కడ పాడే పాటలే గొబ్బి పాటలు.. చివరి రోజైన కనుమ రోజు పాటలు పాడటం పూర్తయ్యాక గొబెమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు.
రోజూ ముగ్గులో పెట్టి పూజించే గొబ్బెమ్మలను ఎండలో ఎండబెడతారు. పండుగ రోజు సూర్యభగవానునికి నైవేద్యం సమర్పించేందుకు సిద్ధం చేసే ప్రసాదాన్ని వండేందుకు ఈ గొబ్బి పిడకలనే వుపయోగిస్తారు.ఎండిపోయిన ఆ పేడ ముద్దలను మండించి ప్రసాదాన్ని తయారు చేస్తారు.

1. కొలని దోపరికి గొబ్బిళ్ళో
యదుకుల స్వామికి గొబ్బిళ్ళో
కొండ గొడుగుగా గోవుల గాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో
కొలని దోపరికి గొబ్బిళ్ళో
యదుకుల స్వామికి గొబ్బిళ్ళో
పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో
కొలని దోపరికి గొబ్బిళ్ళో
యదుకుల స్వామికి గొబ్బిళ్ళో
దండివైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండి పైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో
కొలని దోపరికి గొబ్బిళ్ళో
యదుకుల స్వామికి గొబ్బిళ్ళో

2. గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళొ

సీతా దేవి వాకిట విరిసిన గొబ్బియళ్ళొ
మన సీతా దేవి వాకిట విరిసిన గొబ్బియళ్ళొ
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళొ

మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ
ఆ ముగ్గుల మీద మల్లె పూలు గొబ్బియళ్ళొ
నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ
ఆ ముగ్గుల మీద మొగలి పూలు గొబ్బియళ్ళొ
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళొ

రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ
ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియళ్ళొ
ధాన్యపు రాసుల ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ
ఆ ముగ్గుల మీద సంపెంగలు గొబ్బియళ్ళొ
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళొ

భూదేవంత ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ
ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియళ్ళొ
లక్ష్మి రధముల ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ
ఆ ముగ్గుల మీద గుమ్మడి పూలు గొబ్బియళ్ళొ
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళొ

ముంగిట ముగ్గులు వేసి గొబ్బియళ్ళొ
ఆ ముగ్గులోన పొంగళ్ళు గొబ్బియళ్ళొ
భోగి పళ్ళ సందళ్ళు గొబ్బియళ్ళొ
మరదళ్ల సరదాలు గొబ్బియళ్ళొ
గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ
సంక్రాంతి పండగొచ్చె గొబ్బియళ్ళొ

3. గొబ్బి సుబ్బమ్మ...

గొబ్బి సుబ్బమ్మ సుబ్బణ్ణీయవే..
చేమంతి పువ్వంటి చెల్లెలినియ్యవే

తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యవే-

అరటి పువ్వంటి అన్ననియ్యవే

మల్లె పువ్వంటీ మామానీయవే-

బంతి పువ్వంటి బావానియ్యవే

కుంకుమ పువ్వంటి కూతురునీయవే-

కొబ్బరి పువ్వంటి కొడుకునియ్యవే

అరటి పండంటి అల్లుణ్ణియ్యావే-

గులాబి పువ్వంటి గురువునియ్యావే

మొగలి రేకంటి మొగుణ్నియ్యావే-.