ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT PARASURAMA KSHETRAM - UDIPI IN TELUGU


తొలి పరశురామ క్షేత్రం.. ఉడిపి 

ఉడుపి పూర్వపు పేరు శివళ్ళీ. ఇది పరశురామక్షేత్రాలలో మెదటి స్థానం కలిగి ఉన్నది. ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడిపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయము యొక్క ప్రత్యేకత. ఉడిపి రథవీధిలో శ్రీకృష్ణ మందిరంకలదు. ఉత్తర ద్వారంద్వారా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడి వైపు దేవాలయకార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీనిద్వారా గర్భగుడిలో ప్రవేశం పిఠాధిఫతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండిచే తాపడం పెట్టపడిన నవరంధ్రాల కిటికీ నుండి చేసుకోవచ్చు. గర్భగుడికి కుడి వైపు ముఖ్యప్రాణ దేవత ( హనుమంతుడు), వామభాగాన గరుడ దేవరు ఉన్నరు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు ప్రదెక్షం చేసినట్లైతే ఎడమభాగాన మధ్వాచ్యారులు మంటపం కనిపిస్తుంది. ఇప్పటికి పర్యాయంలో ఉన్నపీఠాధిపతి ఆశీర్వచనాలు ఇక్కడేఇస్తారు. 
"పరమాత్మను నేనే’ అనే కృష్ణ్భగవానుడు భగవద్గీత ద్వారా తన సందేశాన్ని సమాజానికి అందించాడు. ఆ స్వామి అవతరించిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉడిపి. మన దేశంలో ఉన్న శ్రీకృష్ణుని సుప్రసిద్ధ క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం బృందావనాన్ని తలపిస్తుంది. ద్వైతమత స్థాపకులు శ్రీమద్వాచార్యులు. అవతరించిన స్థలం భాగ్యత క్షేత్రం. దానికి సమీపంలో ఉన్నదే ఉడిపి. వీరికి గల అపూర్వమైన దివ్యమహిమలతో తీవ్రమైన గాలివానకు సముద్రంలో మునిగిపోతున్న ఓడను రక్షించినప్పుడు ఆ ఓడలో నావికుడు ఒక గోపీచందనం మూటను కానుకగా సమర్పించాడు. ఆ మూటలో గోపీచందనం కణికల మధ్య వీరికొక చిన్న కృష్ణ విగ్రహం లభించింది. ఈ చిన్న విగ్రహాన్ని శ్రీ మధ్వచార్యులవారు సుమారు 800 సం. లకు పూర్వం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించారు. అంత్యకులజుడైన కనకదాసు ఈ కృష్ణ దర్శనం చేసుకుని తరించాలని ప్రాధేయపడగా, పూజారులు నిరాకరించినప్పుడు, కనకదాసుకి సాక్షత్ ప్రత్యక్ష దర్శనమిచ్చిన శ్రీ కృష్ణ విగ్రహమే ఈ విగ్రహం. పరమ భక్తుడైన కనకదాసుని కరుణించి తూర్పు ముఖంగా ఉన్న కృష్ణుడు పశ్చిమాభిముఖుడై దివ్యదర్శనాన్ని సాక్షాత్కరించాడు. ఆనాడు కనకదాసుకు గవాక్షంగుండా దర్శనమిచ్చిన కిటికీలో నుంచే భక్తులు ఈనాటికి కృష్ణ దర్శనం చేసుకుంటారు. దీనినే కనకుని కిటికి అంటారు. కనకదాసు కృష్ణుని ప్రార్ధించిన చోట ఒక దివ్య మంటపాన్ని నిర్మించారు. ఇదే కనకదాసు మంటపం. శ్రీమద్వాచార్యులవారు ఏర్పాటుచేసిన మఠాల నుంచి ఎంపికైన వారే రెండు సంవత్సరాలకొకసారి ఉడిపి శ్రీకృష్ణుని దేవాలయంలో అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. 12వ శతాబ్దంలో శ్రీమద్వాచార్యులవారు ఉడిపి దివ్యక్షేత్రంలో ఎనిమిది మఠాలను ఏర్పాటుచేశారు. ఆ ఎనిమిది మఠాలలో శ్రీకృష్ణమఠం(శ్రీ కృష్ణ ఆలయం) కూడా ఒకటి. 
ప్రపంచంలోని అత్యంత సుందరమైన శ్రీకృష్ణ ఆలయాలలో ఉడిపి శ్రీకృష్ణ ఆలయం ఒకటి.ప్రశాంతమైన వాతావరణం, ఆకట్టుకునే పరిసరాలు, అణువణువూ కృష్ణ నామస్మరణతో ఉండే ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. ఒకప్పటి శ్రీకృష్ణమఠంగా,ప్రస్తుతం శ్రీకృష్ణ ఆలయంగా పిల్వబడ్తున్న ఈ ఆలయమంతా కేరళ సంప్రదాయ రీతిలో నిర్మించబడి ఉంది. ఈ ఆలయం ముందు ఒక గోపురాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం మహత్తు చాలా గొప్పది. శ్రీమద్వాచార్యులవారు ఇక్కడ శ్రీకృష్ణ్భగవానుడ్ని బాలకృష్ణ రూపంలో ప్రతిష్టించారు. ఆలయం బయట, ప్రధాన గోపురానికి ఎదురుగా కనకదాసు మందిరం ఉంది. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ కొలువై ఉండడానికి భక్తుడైన కనకదాసే కారణం. నిమ్నజాతికులస్థుడైన కనకదాసు శ్రీకృష్ణ్భగవానుడికి మెచ్చిన శ్రీకృష్ణ్భగవానుడు పడమరాభిముఖంగా దర్శనమిచ్చినట్లు ఇక్కడి స్థల పురాణాచెప్తున్నాయ. ఆ కారణంగానే ఇక్కడ గర్భాలయంలో కొలువైన బాలకృష్ణుడు పడమరాభిముఖంగా దర్శనమిస్తాడు. ప్రధానాలయంలో కుడివైపు భాగంలో శ్రీమద్వతీర్థం ఉంది. అలనాటి దేవాలయ సంస్కృతి, సంప్రదాయాలను స్ఫురణకు తెచ్చే ఈ తీర్థం మధ్యభాగంలో మనోహరమైన మండపమొకటి ఉంది. ఈ మండపంలో శ్రీమద్వాచార్యుల దివ్య ప్రతిమ ఒకటి ఉంది. ఉత్సవాలు, పండుగలపుడు ఈ తీర్థంలోనే స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. తీర్థానికి ఒడ్డున ఒకవైపున భగీరధుని మందిరం ఉంది. ప్రధానాలయంలో ఎడమవైపు భాగాన చెన్నకేశవస్వామి మందిరముంది. ప్రధానాలయమంతా భక్తులను ఓ అద్వితీయమైన అనుభూతికి గురిచేస్తుంది. శ్రీకృష్ణుని లీలావిశేషాలు తెలిపే అందమైన తైలవర్ణ చిత్రాలు, అలనాటి పనితనానికి నిదర్శనంగా కానవచ్చే కొయ్యశిల్పాలు, ఇవన్నీ భక్తులను అనితర సాధ్యమైన లోకాలకు తీసుకుని వెళతాయి. గర్భాలయం ముందు భాగంలో వెండితో చేసిన ధ్వజస్తంభం ఉంది. దానికి సమీపంలోనే తీర్థ మండపం ఉంది. ఈ తీర్థ మండపంలోనే స్వామివారికి ప్రీతిపాత్రమైన అటుకలపొడి తదితరాలను ఉంచుతారు. పూజలు నిర్వహించే సమయంలో ఈ తీర్థ మండపంలో జ్యోతులు వెలిగిస్తారు. ఆ సమయంలో ఈ మండప శోభ వర్ణనాతీతం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భక్తులకు గర్భాలయ దర్శనం ఉండదు. స్వామివారిని కిటికీగుండా మాత్రమే దర్శించుకోవాలి. ఈ కిటికీని నవరంధ్ర కిటికీ అని పిలుస్తారు. ఇక్కడ ఈ దేవాలయ సింహద్వారం తూర్పుముఖంగా ఉన్నప్పటికీ స్వామివారు మాత్రం పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు. గర్భాలయంలో కవ్వము, పిల్లనగ్రోవి చెరియొక చేతధరించిన శ్రీకృష్ణుని విగ్రహం దర్శనమిస్తుంది. ఈ గర్భాలయం ద్వారా బంధం లేని గర్భగుడిగా విరాజిల్లుతోంది. గర్భాలయం బయట శ్రీమద్వాచార్యుల దివ్యమంగళ మూర్తి ఉంది. ఆలయ ప్రాంగణంలోనే మరోపక్క శ్రీమద్వాచార్య పీఠం ఉంది. అలనాటి కట్టడాలను స్ఫురణకు తెచ్చే ఈ మఠ శోభ వర్ణనాతీతం. ఇక్కడే ఆంజనేయస్వామివారి భవ్య మందిరం ఒకటి ఉంది. ఈ మందిరంలో కొలువుదీరిన ఆంజనేయస్వామి వీరాంజనేయస్వామి అవతారంలో కనిపిస్తారు. ఇదే ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కొలువుదీరాడు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని వాదిరాజస్వామి ప్రతిష్టించారు.


ఇక్కడే మరోపక్క నవగ్రహాలయం, గోశాల, గీతామందిరాలున్నాయి. ఓ అపురూపమైన ఆధ్యాత్మికానుభూతిని సొంతం చేసే ఈ ఆలయానికి సమీపంలో పురాతన కాలంనాటి అనంతేశ్వరస్వామి ఆలయం ఉంది. భీముడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ప్రసన్న సోమేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అయ్యస్వామి మందిరాలున్నాయి. ప్రధానాలయానికి మరోపక్క చంద్రవౌళీరస్వామి ఆలయం ఉంది. ఇది కూడా అత్యంత పురాతనమైన మందిరంగా ఖ్యాతికెక్కింది. గర్భాలయంలో కొలువైన చంద్రవౌళీశ్వర స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఇదే ఆలయం చుట్టూ మదిరాజమఠం, పుత్తెగ మఠం, అధమూరు మఠం, పేజావరు మఠం, కఠిపురుమఠం, కృష్ణాపూర్ మఠం, పలియారు మఠం, శిదువురు మఠాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఉడిపి శ్రీకృష్ణ ఆలయంలో రోజూ ప్రాతఃకాలంలో స్వామివారికి చేసే పూజలు నయనానందకరంగా సాగుతాయి. అలాగే స్వామివారికి ఏటా చేసే శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు". 
పరమాత్మను నేనే’ అనే కృష్ణ్భగవానుడు భగవద్గీత ద్వారా తన సందేశాన్ని సమాజానికి అందించాడు. ఆ స్వామి అవతరించిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉడిపి. మన దేశంలో ఉన్న శ్రీకృష్ణుని సుప్రసిద్ధ క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం బృందావనాన్ని తలపిస్తుంది. ద్వైతమత స్థాపకులు శ్రీమద్వాచార్యులు. అవతరించిన స్థలం భాగ్యత క్షేత్రం. దానికి సమీపంలో ఉన్నదే ఉడిపి. సుమారు 800 సంవత్సరాల క్రితం శ్రీమద్వాచార్యులు ఇక్కడ శ్రీకృష్ణుణ్ణి ప్రతిష్టించి ఎనిమిది మంది బ్రహ్మచారి శిష్యులకు సన్మాన దీక్ష నందించి, వారి ద్వారా పూజాదికాలు నిర్వహించే ఏర్పాటుచేశారు. శ్రీమద్వాచార్యులవారు ఏర్పాటుచేసిన మఠాల నుంచి ఎంపికైన వారే రెండు సంవత్సరాలకొకసారి ఉడిపి శ్రీకృష్ణుని దేవాలయంలో అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. 12వ శతాబ్దంలో శ్రీమద్వాచార్యులవారు ఉడిపి దివ్యక్షేత్రంలో ఎనిమిది మఠాలను ఏర్పాటుచేశారు. ఆ ఎనిమిది మఠాలలో శ్రీకృష్ణమఠం(శ్రీ కృష్ణ ఆలయం) కూడా ఒకటి.

ప్రపంచంలోని అత్యంత సుందరమైన శ్రీకృష్ణ ఆలయాలలో ఉడిపి శ్రీకృష్ణ ఆలయం ఒకటి. ప్రశాంతమైన వాతావరణం, ఆకట్టుకునే పరిసరాలు, అణువణువూ కృష్ణ నామస్మరణతో ఉండే ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. ఒకప్పటి శ్రీకృష్ణమఠంగా,ప్రస్తుతం శ్రీకృష్ణ ఆలయంగా పిల్వబడ్తున్న ఈ ఆలయమంతా కేరళ సంప్రదాయ రీతిలో నిర్మించబడి ఉంది. ఈ ఆలయం ముందు ఒక గోపురాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం మహత్తు చాలా గొప్పది. శ్రీమద్వాచార్యులవారు ఇక్కడ శ్రీకృష్ణ్భగవానుడ్ని బాలకృష్ణ రూపంలో ప్రతిష్టించారు. ఆలయం బయట, ప్రధాన గోపురానికి ఎదురుగా కనకదాసు మందిరం ఉంది. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ కొలువై ఉండడానికి భక్తుడైన కనకదాసే కారణం. నిమ్నజాతికులస్థుడైన కనకదాసు శ్రీకృష్ణ్భగవానుడికి మెచ్చిన శ్రీకృష్ణ్భగవానుడు పడమరాభిముఖంగా దర్శనమిచ్చినట్లు ఇక్కడి స్థల పురాణాచెప్తున్నాయ. ఆ కారణంగానే ఇక్కడ గర్భాలయంలో కొలువైన బాలకృష్ణుడు పడమరాభిముఖంగా దర్శనమిస్తాడు. ప్రధానాలయంలో కుడివైపు భాగంలో శ్రీమద్వతీర్థం ఉంది. అలనాటి దేవాలయ సంస్కృతి, సంప్రదాయాలను స్ఫురణకు తెచ్చే ఈ తీర్థం మధ్యభాగంలో మనోహరమైన మండపమొకటి ఉంది. ఈ మండపంలో శ్రీమద్వాచార్యుల దివ్య ప్రతిమ ఒకటి ఉంది. ఉత్సవాలు, పండుగలపుడు ఈ తీర్థంలోనే స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. తీర్థానికి ఒడ్డున ఒకవైపున భగీరధుని మందిరం ఉంది. ప్రధానాలయంలో ఎడమవైపు భాగాన చెన్నకేశవస్వామి మందిరముంది. ప్రధానాలయమంతా భక్తులను ఓ అద్వితీయమైన అనుభూతికి గురిచేస్తుంది. శ్రీకృష్ణుని లీలావిశేషాలు తెలిపే అందమైన తైలవర్ణ చిత్రాలు, అలనాటి పనితనానికి నిదర్శనంగా కానవచ్చే కొయ్యశిల్పాలు, ఇవన్నీ భక్తులను అనితర సాధ్యమైన లోకాలకు తీసుకుని వెళతాయి. గర్భాలయం ముందు భాగంలో వెండితో చేసిన ధ్వజస్తంభం ఉంది. దానికి సమీపంలోనే తీర్థ మండపం ఉంది. ఈ తీర్థ మండపంలోనే స్వామివారికి ప్రీతిపాత్రమైన అటుకలపొడి తదితరాలను ఉంచుతారు. పూజలు నిర్వహించే సమయంలో ఈ తీర్థ మండపంలో జ్యోతులు వెలిగిస్తారు. ఆ సమయంలో ఈ మండప శోభ వర్ణనాతీతం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భక్తులకు గర్భాలయ దర్శనం ఉండదు. స్వామివారిని కిటికీగుండా మాత్రమే దర్శించుకోవాలి. ఈ కిటికీని నవరంధ్ర కిటికీ అని పిలుస్తారు. ఇక్కడ ఈ దేవాలయ సింహద్వారం తూర్పుముఖంగా ఉన్నప్పటికీ స్వామివారు మాత్రం పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు. గర్భాలయంలో కవ్వము, పిల్లనగ్రోవి చెరియొక చేతధరించిన శ్రీకృష్ణుని విగ్రహం దర్శనమిస్తుంది. ఈ గర్భాలయం ద్వారా బంధం లేని గర్భగుడిగా విరాజిల్లుతోంది. గర్భాలయం బయట శ్రీమద్వాచార్యుల దివ్యమంగళ మూర్తి ఉంది. ఆలయ ప్రాంగణంలోనే మరోపక్క శ్రీమద్వాచార్య పీఠం ఉంది. అలనాటి కట్టడాలను స్ఫురణకు తెచ్చే ఈ మఠ శోభ వర్ణనాతీతం. ఇక్కడే ఆంజనేయస్వామివారి భవ్య మందిరం ఒకటి ఉంది. ఈ మందిరంలో కొలువుదీరిన ఆంజనేయస్వామి వీరాంజనేయస్వామి అవతారంలో కనిపిస్తారు. ఇదే ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కొలువుదీరాడు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని వాదిరాజస్వామి ప్రతిష్టించారు.

ఇక్కడే మరోపక్క నవగ్రహాలయం, గోశాల, గీతామందిరాలున్నాయి. ఓ అపురూపమైన ఆధ్యాత్మికానుభూతిని సొంతం చేసే ఈ ఆలయానికి సమీపంలో పురాతన కాలంనాటి అనంతేశ్వరస్వామి ఆలయం ఉంది. భీముడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ప్రసన్న సోమేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అయ్యస్వామి మందిరాలున్నాయి. ప్రధానాలయానికి మరోపక్క చంద్రవౌళీరస్వామి ఆలయం ఉంది. ఇది కూడా అత్యంత పురాతనమైన మందిరంగా ఖ్యాతికెక్కింది. గర్భాలయంలో కొలువైన చంద్రవౌళీశ్వర స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఇదే ఆలయం చుట్టూ మదిరాజమఠం, పుత్తెగ మఠం, అధమూరు మఠం, పేజావరు మఠం, కఠిపురుమఠం, కృష్ణాపూర్ మఠం, పలియారు మఠం, శిదువురు మఠాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఉడిపి శ్రీకృష్ణ ఆలయంలో రోజూ ప్రాతఃకాలంలో స్వామివారికి చేసే పూజలు నయనానందకరంగా సాగుతాయి. అలాగే స్వామివారికి ఏటా చేసే శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాలలో భక్తివిశ్వాసాలతో పాలుపంచుకుంటారు. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు సుమారు 500 కిలోమీటర్లు దూరంలో ఉడిపి జిల్లాలో ఈ క్షేత్రముంది. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన కేంద్రాలనుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే హైద్రాబాద్ నుంచి మంగళూరుకు నేరుగా వచ్చి అక్కడనుంచి 80 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఉడిపికి చేరుకోవచ్చు. ఈ క్షేత్ర దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.
తొలి పరశురామ క్షేత్రం.. ఉడిపి
కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉడిపి వంటకాలకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. శాఖాహార వంటకాలకు ఉడిపి శైలి పెట్టింది పేరు. అంతేకాకుండా ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా ఉడిపికి విశిష్ట స్థానం ఉంది. ఉడిపి పూర్వనామం శివళ్ళీ. ఇది పరశురామ క్షేత్రాలలో మెదటి స్థానం కలిగి ఉన్న క్షేత్రం. ఇక్కడ ఉన్న శ్రీ కృష్ణ మఠం, దేవాలయం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినవి...

ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుడిని దర్శనం చేసుకోవటానికి ఉడిపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయము యొక్క ప్రత్యేకత. ఉడిపి రథవీధిలో శ్రీకృష్ణ మందిరం ఉంది. ఉత్తర ద్వారం ద్వారా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడివైపు దేవాలయకార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీనిద్వారా గర్భగుడిలో ప్రవేశం పిఠాధిఫతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండిచే తాపడం పెట్టపడిన నవరంధ్రాల కిటికీ నుండి చేసుకోవచ్చు. గర్భగుడికి కుడి వైపు ముఖ్యప్రాణ దేవత (హనుమంతుడు), వామభాగాన గరుడ దేవుడు ఉన్నారు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు ప్రదక్షి ణం చేసినట్లైతే ఎడ మభాగాన మధ్వా చ్యారులు మంటపం కనిపిస్తుంది. ఇప్పటి కి పర్యాయంలో ఉన్న పీఠాధిపతి ఆశీర్వచ నాలు ఇక్కడే ఇస్తారు.
అష్ట మఠాలు...

ఉడిపిలో బహు సుందర రూపమైన బాలకృష్ణ స్వామి విగ్రహాన్ని మధ్వాచార్యులు ప్రతిష్టించారని చరిత్ర చెబుతోంది. స్వామి భక్తసులభుడై కనకదాసు అను భక్తుని కరుణించటానికి తూర్పు ముఖంగా ఉండే స్వామి పశ్చిమాభిముఖుడైనాడని ఒక భక్తుని కథ. స్వామిని కనకదాసు ఎక్కడ నుండి చూచాడో అక్కడ మండపం కట్టించి దానికి కనకదాస మండపం అని పేరు పెట్టారుట. స్వామిని అర్చించటానికి ఆచార్యులవారు పుత్తగె, పేజావర, పలిమారు, ఆదమారు, సోదె, శీరూరు, కాణియూరు, కృష్ణాపుర అనే 8 మఠాలు ఏర్పరిచారనీ... అందులో ఉండే యతీశ్వరులే రెండు సంవత్సరాలకొకరుగా వంతుల వారీగా అర్చన చేయటానికి నియోగించబడినట్లుగా చెప్తారు. మారేటప్పుడు పర్యాయోత్సవమని చేస్తారు. ఈ ఉత్సవంలో యాత్రికలు విశేషంగా పాల్గొంటారు.
దర్శనీయ స్థలాలు...
ఈ క్షేత్రంలో ముఖ్యంగా దర్శించు కోవాల్సిన ప్రదేశాలు... పవిత్ర వాది రాజ స్వామివారి సోదెమఠం, శ్రీకృష్ణ మఠం - అందులో ఆచార్యుల వారు వాడి న వస్తువుల ప్రదర్శన. దగ్గరిలోని సముద్ర తీరం దర్శించి పవిత్ర స్నానమాచరిం చడంతో పాటు... మాల్పి, మారవంతె, అంకోలా అనే మూడు బీచుల్లో విహరించవచ్చు. సుందర సముద్రతీరంలో దర్శించదగినవి నిదర్శనం వీరి కాలంలో బౌద్ధ, జైన మతాలు కూడా పోషించబడటం, పౌజిక క్షేత్రం - 10 కి.మీ. దూరంలో ఉన్నది. విమానగిరి దుర్గాలయం - అక్కడి మధ్వాచార్యుల వారు స్నానమాడిన నాలుగు తీర్థాలు - మరి కొంచెం దూరం వెళితే గల కోటిలింగాలు గల కోటీశ్వర క్షేత్రం ఉన్నది.