ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HEALTH WITH FOOD GRAINS - RAGULU GOOD FOR HEALTH


రాగుల్లో పోషకాలు మెండు

రాగి సంగటి రాయలసీమలో చాలా ఫ్యామస్. మీరు గనుక మాంసాహారులైతే నాటుకోడి ఇగురుతో తింటే దాని రుచే వేరు. అదే శాకాహారులైతే పల్లీల చట్నీతో ఒక పట్టు పట్టొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే రాగులను ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం.. !

• ఈ క్రమంలో రాగులలో ఉండే పోషకాలేంటో మీరే చూడండి...

* వంద గ్రాముల రాగుల పిండిలో 350 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. అలాగే 3.9 మి.గ్రా. ఐరన్, 1.1 మి.గ్రా. నియాసిన్, 0.42 మి.గ్రా. థయమిన్, 0.19 మి.గ్రా. రైబోఫ్లావిన్ ఉంటాయి.

* రాగుల్లో ఉండే పీచు పొట్ట నిండిన భావనను కలిగిస్తుంది. అదే సమయంలో తక్కువ కెలొరీలు అందుతాయి.వీటిల్లో ఉండే ట్రిప్టోపాన్ అనే అమినోయాసిడ్ ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా బరువును అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది. ఇదే అమినోయాసిడ్ మానసిక సాంత్వనను కూడా అందిస్తుంది. ఫలితంగా ఆందోళన, ఒత్తిడి లాంటి వాటిని అదుపులో ఉంచుకోవడం సులువవుతుంది.

* రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సుగుణాలు, ఫైటోకెమికల్స్ వాటిని ఆలస్యంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. ఓ అధ్యయనం ప్రకారం.. బియ్యం, గోధుమల్లో కన్నా.. రాగుల్లో పీచుశాతం అధికమని తేలింది.

* కాలేయంలో చేరిన అధిక కొవ్వును తగ్గించి.. పరోక్షంగా కొలెస్ట్రాల్ సమస్యనూ అదుపులో ఉంచుతాయి రాగులు.

* రాగుల్లో సమృద్ధిగా లభించే ఇనుము రక్తహీనతను తగ్గిస్తుంది.

* రాగులతో చేసిన ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకుంటే.. పోషకాహారలేమి, వార్థక్యపు లక్షణాలు.. దరి చేరవు. రక్తపోటు, గుండె బలహీనత, కాలేయ సమస్యలు, ఉబ్బసం వంటి సమస్యలకు రాగులు చక్కని పరిష్కారం.

* వీటిలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. రాగుల్ని రోజూ తీసుకుంటే.. భవిష్యత్‌లో ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది.