ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LORD HANUMAN MAHAYANTRAM STORY AND PUJA INFORMATION IN TELUGU


ప్రమాదాలను నివారించే శ్రీ హనుమాన్ యంత్రం

ఆంజనేయుడు కొలువై ఉండే ”శ్రీ హనుమాన్ యంత్రం’’ మహా శక్తివంతమైనది. ”శ్రీ హనుమాన్ యంత్రం’’ ఇంట్లో ఉందంటే ఆంజనేయుడు కొలువై ఉన్నట్లే. ఇది ముఖ్యంగా వాహన ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతుంది. హనుమంతునికి మంగళవారం ఇష్టమైన రోజు కనుక, శ్రీ హనుమాన్ యంత్రాన్ని మంగళవారం తెచ్చుకోవడం శ్రేయస్కరం. శ్రీ హనుమాన్ యంత్రాన్ని పూజా మందిరంలో ఉంచి ప్రార్ధించాలి. తర్వాత ‘’ఓం ఓం హ్రీం హ్రీం శ్రీ వాయుపుత్రాయ నమః’’ అనే మంత్రాన్ని 108సార్లు జపించి యంత్రాన్ని ధరించాలి. రోజూ స్నానం చేసిన తర్వాత 11 సార్లు ‘’ఓం ఓం హ్రీం హ్రీం శ్రీ వాయుపుత్రాయ నమః’’ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఇలా చేసినట్లయితే వాహన ప్రమాదాలు చోటు చేసుకోవు.

చిన్నారులచేత శ్రీ హనుమాన్ యంత్రాన్ని ధరింపచేయడం మంచిది. పిల్లలకు ‘’ఓం ఓం హ్రీం హ్రీం శ్రీ వాయుపుత్రాయ నమః’’ మంత్రాన్ని నేర్పి నిత్యం కనీసం మూడుసార్లు అయినా జపించమని చెప్పాలి. హనుమంతుడు శ్రీరామునికి నమ్మినబంటు. రాముడికి గుండెలోనే గుడి కట్టి పూజించాడు. శ్రీరాముని అంగుళీయకం చూపి సీతమ్మను ఓదార్చాడు. లంకాదహనం చేశాడు. సుగ్రీవుని రక్షించాడు. సర్వ అభయ దీక్షాదక్షుడు. హనుమంతుని భక్తులు చింతలు, చిరాకులకు దూరంగా ఉంటారు. రామనామం ఎంత మధురమైనదో చాటి చెప్పాడు హనుమంతుడు.

శ్రీరాముడు తన అవతారం చాలిస్తూ ‘’కలియుగం అంతమయ్యేవరకూ భూలోకంలో ఉండి సజ్జనులను కాపాడమని, భయాలూ, ఆందోళనల నుండి రక్షించమని, భూత, ప్రేత, పిశాచాల్లాంటి బాధలు, భయాల నుండి బయట పడేయమని, ఆర్తజన రక్షకుడిగా ఉండమని’’ కోరాడు. శ్రీరాముని ఆజ్ఞను శిరసావహించాడు హనుమంతుడు. ఆంజనేయుడు భక్తుల మొర ఆలకిస్తాడు. ఆదుకుని ఆపదలు తొలగిస్తాడు. ఆందోళనల నుండి విముక్తి కలిగిస్తాడు. హనుమంతుడు కొలువై ఉండే ”శ్రీ హనుమాన్ యంత్రం” ఎలాంటి ప్రమాదాలూ జరక్కుండా కాపాడుతుంది.