ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

NEVER SIT FOR A LONG TIME WHICH REDUCES LIFE SPAM - AN ANALYSIS


కూర్చుంటే కరిగిపోతుంది!

ఒకప్పుడు కూర్చుని తింటే కొండైనా కరిగిపోతుందనే వాళ్లం! ఇప్పుడు తెలుసుకోవాల్సిందేమంటే రోజులో ఎంత సేపు కూర్చుంటే మన ఆయుర్దాయం అంత తరిగిపోతుందని!! హాయిగా కాలు మీద కాలు వేసుకుని కుర్చీల్లో కూర్చోవటాన్ని ఒకప్పుడు గొప్పగా భావించేవాళ్లం. కానీ ఆధునిక వైద్య పరిశోధనలన్నీ కూడా ఎక్కువసేపు కూర్చుని ఉండటం ఏమాత్రం మంచిది కాదని ఘోషిస్తున్నాయి. రోజులో ఎక్కువ సేపు కూర్చుని ఉండేవారిలో.. కూర్చుని ఉండే ప్రతి గంటకూ.. 14% గుండె జబ్బు ముప్పు పెరుగుతోందని తాజాగా అమెరికా పరిశోధకుల అధ్యయనంలో గుర్తించారు.ఒక్క గుండె జబ్బులే కాదు.. అధిక రక్తపోటు, వూబకాయం, కొలెస్ట్రాల్ స్థాయులు పెరగటం, బొజ్జ దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకోవటం.. ఇలాంటి సమస్యలన్నీ వరస కడుతున్నాయని అధ్యయనాలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి.

• మరో కీలకమైన అంశమేమంటే-

రోజులో ఓ గంటపాటు నడక/జాగింగ్ వంటివి చేసేసి.. ఆ తర్వాత ఏకధాటిగా 8 గంటలు కూర్చుని ఉండిపోయినా కూడా ఏమంత మంచి ఫలితాలు కనబడటం లేదు. కూర్చుని ఉండటం వల్ల ఒంటికి జరిగే నష్టాన్ని ఆ గంట నడకా ఏమాత్రం పూడ్చలేకపోతోందని, కాబట్టి ఏకబిగిన కూర్చుని ఉండటం కాకుండా.. మధ్యమధ్యలో ప్రతి 30 నిమిషాలకూ లేచి నాలుగు అడుగులు నడవాలని పరిశోధకులు చెబుతున్నారు.