ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

RAMAYAN STORIES IN TELUGU - ARTICLE ABOUT THE GREAT WARRIOR KING - VAALI


వాలి

ఇతడు మహా బలశాలి. తన ఎదురుగా వొచ్చి యుద్దం చేసే శత్రువుల బలాన్ని సగానికి తగ్గించగల శక్తి వాలీ కి ఉన్నదని ప్రతీతి. ఇతడు సూర్యోదయనికన్నా ముందుగా లేచి, నాలుగు సముద్రాలలో స్నానమచరించి, ఆనుస్తానం పూర్తి చేసి దినఛర్య మొదలు పెట్టేవాడు.కిష్కీంధ లోని అసంఖ్యాకమైన వానరులందరికి ఇతడు రాజుగా ఉండేవాడు. ఇతని భార్య శూర, కుమారుడు అంగదుడు. దుందుభి అనే రాక్షసుడు మహా బలవంతుడు. ఇతడు ఒకనాడు బ్రహ్మ వద్దకు వెళ్ళి యుద్ధానికి రమ్మని పిలవగా బ్రహ్మ ఇతనిని హిమావంతుని వద్దకు పంపుతాడు. దుందుభి హిమావంతుని జయించ తలాపోసి హిమాలయాలకు వెళ్ళగా, హిమావంతుడు వాలీ మాత్రమే నీ యుద్ధ దాహాన్ని తీర్చగలదు అని దుందుభి ని వాలీ వద్దకు పంపుతాడు.నగర ద్వారం వద్దకు వొచ్చి గొప్ప సింహానాదం తో వాలీ ని యుద్ధానికి పిలిచిన దుందుభి కి తన అంతఃపుర స్త్రీ లతో వాలీ కనిపిస్తాడు. తనను అవహేళన చేసిన దుందుభి ని ముష్టి ఘతలతో , పిడి గుద్దులతో అవలీలగా సంహరిస్తాడు వాలీ. దున్నపోతు రూపంలో ఉన్న దుందుభి శరీరాన్ని గిరగిర తిప్పి విసరగా రుష్యముక పర్వథమ్ పై ఉన్న మాతన్గ మహముని ఆశ్రమం పై రక్తపు వర్షం కురుస్తుంది. దానికి కోపించిన మహముని, తన ఆశ్రమం ఆవరణ లోకి ప్రవేశిస్తే తల పగిలి మరణిస్తా వాణి సపిస్తాడు దుందుభి తమ్ముడు మాయావి.

తన అన్న మరణానికి ప్రతీకారం తెర్చుకోవాలని తలాపోసి, వాలీ వద్దకు వెళ్ళి యుద్ధానికి కావ్విస్తాడు. అర్ధరాత్రి దాటుతున్న వాలీ, సుగ్రీవులు మాయావిని వెంబాదిస్తారు. కొండ బిలాం లో దురిన మాయావి ని సంహరించి గాని రానని తన తమ్ముడి తో చెప్పి గుహ లో ప్రవేశిస్తాడు వాలీ. కొన్ని రోజులు గడిచాక గుహ బయటకు ప్రవహించే రక్తాన్ని తన అన్న రక్తంగా భ్రమిస్తాడు సుగ్రీవుడు. గుహ లోపలి విజయ నాదాన్ని మాయావి గొంతుగా తలాపోసి, గుహ ముఖ ద్వారాన్ని ఒక బండరాయి తో కప్పి, కిష్కీంధ కు చేరి వాలీ మరణ వార్తను అందరికి తెలియ చేస్తాడు సుగ్రీవుడు. సుగ్రీవుడి ని రాజు గా పట్టాభిశిక్తుడిని చేసిన అనంతరం వాలీ తిరిగి వొచ్చి, సుగ్రీవుడి ని తులనది, అతడిని రాజ్యం నుండి తరిమి వేస్తాడు. అతని భార్య ఐన తార ను, తన రాణి గా చేసుకుంటాడు. ఆ తదనంతర పరిణామాలలో, సుగ్రీవుడి స్నేహితుడైన రాముడి చేతిలో మరణిస్తాడు వాలీ. సాక్షత్ విష్ణు రూపమైన రాముడు సైతం చెట్టు చాటు నుంచి ఛంపల్సిన పరిస్థితీ కల్పిస్తాడు వాలీ.