ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SHOWING OF ARUNDHATHI STAR IN INDIAN MARRIAGES - WHY - TRADITIONAL REASON AND SCIENTIFIC IMPORTANCE OF INDIAN MARRIAGES


వివాహము లో అరుంధతీ నక్షత్ర దర్శనము

వివాహములోని అనేకమైన తంతులలో , అనగా , అంకురార్పణము అయిన తర్వాత , పెళ్ళికుమారుని , పెళ్ళికూతురును చేయుట ,గౌరీ పూజ , వరపూజ , అటుతర్వాత మధుపర్కము , జీలకర్రా బెల్లము , తలంబ్రాలు మొదలు ఆచరించు అనేక కార్యముల తో పాటు విశిష్టమైనది అరుంధతీ నక్షత్ర దర్శనము. వివాహ సమయములో వరుడు తన క్షేమాభివృద్ధుల కోసము అనేక మంది దేవతలను ప్రార్థించును . దానికొరకు పెళ్ళికుమారుని చేత పురోహితుడు అనేక మంత్రములను చెప్పించును .

మొదట పెళ్ళికుమారుడు వధువుతో , " ఓ కన్యా , నా గృహమునకు వచ్చి నాతో కాపురము చేయుచూ సంతాన సమృద్ధిగలదానివి కమ్ము , నా గృహమునకు వచ్చి , గృహస్థుని ధర్మములగు అతిథి అభ్యాగతులను పూజించుట , ఆదరించుట చేయుటలో నాకు సహకరించుము , పుత్రులు , మనవలు కలిగినాక వారికి కూడా ఇవియన్నియూ బోధించుము " అని చెప్పును ( ఇహ ప్రియం ప్రజయా తే సమృధ్యతా ......వివిధ మావదాసి || అనే మంత్రము )

ఆ తరువాత , || సుమంగలీరియమ్ వధూరిమాగ్ం .........విపరేతన || అనే మంత్రము చెప్పును . దాని అర్థము , వివాహమునకు వచ్చిన వారితో , " బహుకాలము వరకూ సువాసినీత్వము కలిగియుండెడి ఈ వధువు చూచి , ఆమెకు ఆయుర్భాగ్యములనొసగి , ఆశీర్వదించి తరువాత మీ ఇండ్లకు స్వేఛ్చగా వెళ్ళుడు " అని ప్రార్థిస్తాడు .

తరువాత ధృవ నక్షత్రమును గూర్చి , ’ తనకు జీవితమున శత్రు బాధలు లేకుండా కాపాడుమని ’ ప్రార్థించును .

అటుతరువాత , భార్యతో సహా ఆకాశములోని సప్తర్షి మండలములో నున్న అరుంధతీ నక్షత్రమును దర్శించి , ఈ విధముగా ప్రార్థించును " కశ్యపుడు మొదలగు ఏడుగురు ఋషులు తమ తమ భార్యలు ఏడుగురిలోను , వశిష్ఠుని భార్య యైన అరుంధతీ దేవి అగ్రగణ్యురాలనీ , అతి పవిత్రమైన పతివ్రత యని, మనస్సునందైననూ , ఒక్క క్షణమైననూ పతిని మరువక సదా తలచుచుండుననీ , అతి నిశ్చలమైనదనీ తలచి ఒప్పుకొనిరి . అందువలన , అరుంధతిగాక మిగిలిన ఆరుగురు స్త్రీలు అరుంధతిని తమలో అగ్రగణ్యురాలు అను భావమును వహించిరి . అట్టి పరమ సాధ్వియైన అరుంధతీ దర్శనముచేత పవిత్ర భావములు పెంపొందిన , నా భార్యను మీ ఏడుగురితో పాటు ఎనిమిదవ దానినిగా ను , పవిత్రమైనదానిగాను తలచి ఆశీర్వదించండి . " . అనగా తాను ఎనిమిదవ ఋషిని యని భావించునట్లు అర్థము .

( || సప్త ఋషయః ప్రథమం కృత్తికానామరుంధతీం ......అస్మాకమేధత్వష్టమీ || అనే మంత్రము )

తర్వాత అగ్నిహోత్రుని , గంధర్వులను , సూర్యుడిని , ఇతర దేవతలనూ ప్రార్థించును .

ఒక సంసారము బాగుగా నడవవలెనంటే దానిలో ఆ ఇంటి గృహిణి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది . అందుకే ఇంటిని చూచి ఇల్లాలిని చూడు అన్నారు . ఒక ఇల్లు నిలవాలన్నా , కూలిపోవాలన్నా అది ఆ ఇంటి ఇల్లాలి వల్లనే అవుతుంది . కాబట్టి తన ఇల్లాలికి అరుంధతిని చూపించి సద్బుద్ధి కలిగించునట్లు చేయమని ప్రార్థించుట.

సముద్రము పక్కన కూర్చొనగానే , మనము వద్దనుకొన్ననూ చల్లగాలి వచ్చి ఎటుల తాకునో , అట్లు , అరుంధతిని చూడగనే ఆమె ప్రభావము వలన మనసు పవిత్రమగును అని ప్రతీతి .

* అరుంధతి,ద్రవ,సప్త ఋషి నక్షత్రాలు ఎలా గుర్తుపట్టాలి?

హిందూ వివాహ వేడుకలలో అరుంధతీ నక్షత్రం, వసిష్ఠ నక్షత్రాలకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు... ప్రతి వివాహ అనంతరం ఈ ఈనక్షత్రాలను తప్పనిసరిగా చూపిస్తారు... దీనిలో పరమార్ధం ఆ దంపతులలాగా చిరకాలం లోకానికి ఆదర్శ దంపతులలా వెలుగొందాలనే .. ఇంకా దీనిని ఆధారంగా చేసుకునే మనం ధృవనక్షత్రాన్ని గుర్తిస్తాంఎందుకంటే దీనిని ఆధారంగా చేసుకొనే మనం దిక్కులను కనిపెట్టవచు.... మనం భౌగోళికంగా ఎక్కడ ఉన్నా సరేఎప్పుడూ ఉత్తర దిశనే సూచిస్తుంది... దీనిని ఆధారంగా చేసుకునే పూర్వం నావికులు సముద్రయానం చేసేవారట