ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT VYSHNO DEVI TEMPLE IN TELUGU


సర్వపాప హరిణి వైష్ణోదేవి

వైష్ణోదేవి ఆలయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ దేవిని సందర్శించుకునే భాగ్యం అందరికీ కలుగదు. ఎన్నో కష్టాలు పడుతూ దేవి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. జమ్మూ కాశ్మీరులో ఉన్న ఈ ఆలయ ప్రాశస్త్యం విశ్వవిఖ్యాతం. నవ దుర్గలలో ఒకటిగా ఇక్కడి దేవిని చెబుతారు. దేవి స్వయంగా తన భక్తులను ఇక్కడకు పిలిపించుకుంటుందని చెబుతారు. అందుకే వైష్ణోదేవి దర్శనాన్ని ఎంతో అదృష్టంగా భావిస్తారు. ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ సాగే ఈ యాత్ర పూర్తరుున తరువాత భక్తులకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం జీవితాంతం గుర్తుండిపోతుంది.

నవ దుర్గలలోని వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీరులో ఉంది. నవదుర్గలలో ఆమె ఆరవది. ఇంకా నయనా దేవి, చింతపూర్ణి, జ్వాలాముఖి, వజ్రే శ్వరి, చాముండి, మానసాదేవి, కాళికాదేవి, శాకంబ రి... దేవతలు నవదుర్గలుగా దుర్గామాత స్వరూప మని ఉత్తర, దక్షిణ భారతదేశ హిందూ భక్తులం దరి నమ్మకము. నవదుర్గలలో ఏ ఒక్కరిని దర్శిం చినా శక్తి స్వరూపిణియగు దుర్గాదేవి ప్రసన్ను రాలయినట్లే.

దక్షయజ్ఞములో దగ్ధమైన సతీదేవి నిర్జీవ శరీరాన్ని చూస్తూ బాహ్య ప్రపంచాన్ని మరిచి శివుడు విచారం లో మునిగిపోయాడు. అప్పుడు విష్ణువు సతీశరీరాన్ని ముక్కలుగా ఖండించి శివుడిని మేలుకొలిపాడు. చం డముండ రాక్షసులను సంహరించిన నవదుర్గగా సతి పూజలందుకుంది. ఆ సతి శరీర ఖండములు పడిన ప్రదేశాలన్నింటిలోనూ ఈ దుర్గాదేవి రూపిణి గా సతీదేవి రూపుదాల్చింది. నయనము లు నయనాదేవి, పాదములు చింతా పూర్ణి, నాలుక జ్వాలాముఖి, పాలిండ్లు వజ్రేశ్వరిదేవి, లలాట ము మానసాదేవి, మస్తకభాగ ము శాకంబరిదేవి, జుట్టు పడి న భాగము కాళికాదేవి.

నవదుర్గలుగా దుర్గ అను గ్రహానికి నిదర్శనం వైష్ణోదేవి. వైష్ణోదేవి సందర్శన చేయగల అదృష్టము కలిగిందంటే జగన్మాత పరిపూర్ణ కటాక్ష లబ్ధికి స్వయంగా పిలిపించుకున్న ఆహ్వానంగా భక్తుల నమ్మకం. వైష్ణోదేవి ఆలయం త్రికూట పర్వ తం మీద ఉంది. ఇది జమ్మూ కాశ్మీరు రాష్ర్టంలో ఉం ది. జమ్మూ నుంచి ఎగుడుదిగుడు గుట్టలు, మిట్టలు దారిలో 53 కిలో మీటర్ల ప్రయాణం చేస్తే ‘కాట్ర’ అనే ప్రదే శం చేరు కుంటాం. ప్రకృతి దృ శ్య సౌందర్యారాధన ఉన్న వారికి ఈ దారి విసుగనిపిం చదు. కాట్ర నుంచి 14 కి. మీ. దూరంలో త్రికూట పర్వ తం ఉంది. మహాకాళి, మహా లక్ష్మి, మహా సరస్వతి అనే మూడు మూర్తులుగా పిండి రూపాలుగా వైష్ణోదేవి గా కొలువై త్రికూట గుహప్రదేశంలో ఉంది. నడక తప్పదు. వాహనయోగం కలిగిం చి డబ్బు తీసుకుని నోరులేని గుఱ్ఱాల మీద స్వారీ, డోలీలతో నరవాహకులు నడకశ్రమను దూరం చేస్తూనే పుణ్యం పంచుకుంటున్నారనే అనిపిస్తుంది.

‘జైమాతాది’ నినాదాలు నడిచేవారికి కలిగించే ఆత్మస్థైర్యం ఇంతా అంతా కాదు. ఆ 14 కిలో మీటర్లు నడిచే శక్తికి బలమూ, చేయూత ఆ నినాదాలే. పిల్లలు, స్ర్తీలు, వృద్ధులు, యువకులు.. యాత్రా రిసెప్ష న్‌ విభాగం వద్ద అనుమతి పత్రం తీసుకుని నడక మొదలు పెడతారు. ఉచితంగా ఇచ్చే ఈ అనుమతి పత్రం యాత్రీకులు తీసుకుని తీరాలి. నడిచి చేరుకోవాలనే మొక్కు కన్నా నడిచే తీరుతా ను అన్న అంతర్లీనమైన జీవిత సంకల్ప భక్తి బలం హిందూమతానిది. దారి పొడుగునా జై మాతాది ఉత్సాహమే కాదు, సేద తీర్చి శక్తి నిచ్చే అల్పా హారశాలలు వ్యాపారమే అయినా కృతజ్ఞతా పాత్ర మవుతున్నాయి.

నడిచి గుహాంతర్భాగంలో పిం డ రూపత్రయ మహాలక్ష్మి కాళి, సరస్వతీలను దర్శిం చి మళ్ళీ నడిచే కాట్ర చేరడం దివ్యానుభూతినిచ్చింది.రజో, తమ, సాత్విక గుణములు కలిగిన కాళి, లక్ష్మి, సరస్వతీలు తమ తేజస్సుతో సృష్టించిన దేవి వైష్ణో దేవి. రత్నాసాగర్‌ అనే వాని ఇంట త్రికూట పేరుతో దక్షిణ భారతదేశంలో పెరిగి పెద్దదై త్రేతాయుగంలో దేవీ త్రయ అంశ వైష్ణోదేవిగా చేరిన ప్రదేశమే త్రి కూట పర్వతము.

* విష్ణుమూర్తిని భర్తగా వలచి...

వైష్ణోదేవి విష్ణువుని వలచి భర్తగా కోరి తపస్సు చేసిం ది. తను సమీపంలోకి వచ్చినపుడు గుర్తించగలిగితే విష్ణువు వివాహమాడతానన్నాడు. శ్రీరామావతారం లో విష్ణువు సాధువు వేషంలో వచ్చి కనిపించాడు. గుర్తించ లేకపోయింది. శ్రీరామావతార ఏక పత్నీ నియమ వ్రతం చెప్పి విష్ణువుగా కల్కి అవతా రంలో ఆమెను భార్యగా స్వీకరిస్తానని మాట ఇచ్చాడు.
త్రేతాయుగం నాటి ఆ వైష్ణోదేవి నిలయం త్రికూట పర్వతం. పిండరూపంలో దర్శనమిస్తున్న లక్ష్మి, కాళి, సరస్వతుల తేజో రూపమే వైష్ణోదేవి.

* భైరవుడూ భక్తుడే...

వైష్ణోదేవి ఓ రహస్యస్థావరంలో కల్కి అవతారానికి నిరీక్షిస్తోంది. భైరవుడనే వాడు భక్తుడే! కాని వైష్ణోదేవి రహస్య స్థావరాన్ని కనుక్కోవాలని విఫలయత్నం చేశాడు. దేవి అతని తల ఖండిం చింది. ఆ తల పడిన ప్రదేశమే భైరవ దేవాలయం. హెలికాఫ్టరు ద్వారా దేవి ఆలయానికి చేరుకుంటున్న భక్తులు ముందే ఎదురయ్యే భైరవుని దర్శించి వస్తున్నారు. నడిచివచ్చిన యాత్రీ కులు పిండి రూపంలో దేవీత్రయాన్ని దర్శించిన అనంతరమే భైరవుని దర్శిస్తారు.

కపూర్తలాలో బంధువులున్నారు. ఆ కారణగా వైష్ణోదేవి ఆలయం తో బాటు బంధువులు ఏర్పాటు చేసిన టూరిస్టు టాక్సీ లో నవ దుర్గలందరినీ దర్శించలేకోపోయినా నయనాదేవి, చింతాపూర్ణి, జ్వాలాముఖి దర్శించగలిగాం. ఇలా దేవీ రూపాలు దర్శించు కోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎంతో అదృ ష్టం ఉంటేగానీ నవరూపాల దర్శనభాగ్యం కలగదు.

* నయనాదేవిగా...

నయన అంటే కన్ను, సతీదేవి నయనాలు ఇక్కడ పడ్డాయని అంటారు. నయనాదేవి పంజాబు సరిహద్దులో ఉన్న శైవాలిక్‌ కొండలమీద ఉంది. రెండు కిలోమీటర్ల నడక, ఇక్కడ కూడా దేవి పిండి రూపంలో కనిపిస్తుంది. నయన అనే గొల్ల వ్యక్తి పశువులకు మేపేవాడు. అతడే అమ్మవారిని కనుగొన్నాడట! అతడు కట్టించిన గుడి కాబట్టి ఇక్కడి దేవతకు అతని పేరు మీద నయనాదేవి అని పేరు వచ్చిందని కూడా అంటారు.

* పాదాలు పడిన చోట...

చింతాపూర్ణి సతీదేవి పాదాలుపడిన చోటుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉంది. మేము కపూర్తలా నుంచి టూరిస్టు కారులో వె ళ్ళాం. ఢిల్లీ నుంచి పంజాబులోని హోషియార్‌ పూరు, అక్క డ్నుంచి బస్సులోను చింతాపూర్ణి దేవాలయం చేరుకోవచ్చు. చింతాపూర్ణి దేవి సార్థకనామ దేవత. అన్ని చింతలనూ దూరం చేస్తుందని స్థానికులు చెబుతుంటారు.

ఒకప్పుడు దేవి రాక్షస సంహారం చేసింది. దేవి అనుచరులు అజయ, విజయలు రాక్షస ధారలతో తృప్తి పొందలేదు. మరింతరక్త ప్రవాహం కావాలన్నారు. అప్పుడు దేవి తన తల కత్తితో నరుకుంది. దేవి మొండెం నుండి స్రవించిన రక్త ధారలు ప్రవాహ సృష్టి అజయ, విజయలకు తృప్తికలిగించాయి.