ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

PANDAVA VANAVASAM MOVIE POETRY/SONG LYRICS IN TELUGU


ధారుణి రాజ్యసంపద, కురువృద్ధుల్ - పద్యాలు- పాండవ వనవాసం నుండి

1965 లో మహాభారతం లోని అరణ్య పర్వాన్ని అద్భుత దృశ్య కావ్యంగా మలచి మనకి అందించారు పౌరాణిక బ్రహ్మ అనబడే కమలాకర కామేశ్వర రావు గారు. ఇలాటి చిత్రాలు, మాస్టారి పద్యాలు చేతిలో చేయి వేసుకుని నడుస్తాయనడం లో సందేహం లేదు. శ్రీ మదాంధ్ర మహాభారతం లోని రెండు చక్కని పద్యాలను ఈ చిత్రంలో వాడారు. జూదంలో పాండవులు ఓడినాక ద్రౌపదిని నిండు సభలోకి దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తాడు. అప్పుడు భీమసేనుడు చేసిన శపథాన్ని ఈ పద్యాలు సూచిస్తాయి. గానం లో నవరసాలు పండిచి, పద్యాలు పాడటానికి ఒక వరవడిని దిద్దారు మాస్టారు. వారి సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రౌద్ర రసాన్ని చక్కగా పలికించారీ పద్యాలలో.

" ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రం
భోరుని జోరు దేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము దు
ర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత! భ
గ్నోరుతరోరు జేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబునన్! "

" కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదో
ద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
కర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైల రక్తౌఘ ని
ర్ఝర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్! "

* చిత్రం: పాండవ వనవాసం
పద్యాలు: మదాంధ్ర మహాభారతము నుండి
సంగీతం: ఘంటసాల
గానం: ఘంటసాల