ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

DASARA FESTIVAL 2ND DAY 14-10-2015 AVATHAR SRI BALATHRIPURA SUNDARI DEVI INFORMATION IN TELUGU


శరన్నవరాత్రులలో రెండవ రోజైన ఆశ్వ యుజ శుద్ధ విదియ నాడు, అమ్మవారిని శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవిగా అలంకరి స్తారు.

త్రిపురాత్ర యంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. అందుకే శ్రీ విద్యోపాసకులకు ముందుగా బాలా మంత్రాన్నే ఉపదే శిస్తారు. బాలా మంత్రో పదేశం లేని వారు శ్రీ చక్రార్చన చేయడా నికి అనర్హులు. ఎందుకంటే మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్ర శ్రీ చక్రంలో మొదటి అమ్నాయంలో ఉం డే మొదటి దేవత బాలాదేవి. అందుకే ముందుగా ఈ బాలాదేవి అనుగ్రహం పొందిన తరువాతే, మహాత్రిపుర సుందరీ దేవి అనుగ్రహానికి పాత్రులమవుతాం. ఆ తల్లి అనుగ్రహం అర్చకులకే కాదు. అర్చన చేయించేవారికి కూడా కావాలి కదా! అందుకే ఆ దేవి స్వరూపం ఎలా ఉంటుందో భక్తు లందరికీ తెలియడం కోసం ఈ అలంకారం చేస్తారు. అంతేకాదు. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి