ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LORD SIVA BHAKTHI POEM AND MEANING IN TELUGU


పరమపదనాథుడైన నప్పరమేశ్వరునకు పంచమహాభూతములును పంచశిరములుగనున్నవని వేదవాక్కు.
ఆ శిరముల నామములు : తత్పుఋష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన: 

అథ తత్పుఋష ముఖధ్యానం: 

సంవర్తాగ్ని తటిత్ప్రదీప్త కనక - ప్రస్పర్దితేజోమయం |
గంభీరధ్వని మిశ్రితో గ్రదహన - ప్రోద్భాసితామ్రాధరం|
అర్దేందుద్యుతిలోల పింగళజటా - భారప్రబద్ధోరగం |
వందే సిద్ధసురాసురేన్ద్రనమితం - పూర్వం ముఖం శూలినః

ప్రళయకాలమునందలి అగ్నితేజముతోడ, ప్రళయకాలపు మెరుపుతేజములతోను బాగుగా కరిగిన పసిడికాంతులతోను పోటీపడునటువంటి మహాతేజోస్వరూపము తనదిగా చేసుకొని, గంభీరధ్వనితోడమిశ్రితము అగుటతోపాటుగా భయంకరాగ్నియదికముగా ప్రకాశించు ఎర్రని పెదవి కలదియు, చంద్రఖండకాంతితో చక చక మెరయు పింగళవర్ణపు జడల గుంపును దాని చుట్టునూగట్టిగా చుట్టుకొనబడినటువంటి సర్పరాజములు కలదియును, సిద్ధులచేతన్, సురాఽసురల చేతన్ నమస్కరిమ్పబడుతున్నటువంటి శూలికి నమస్కరించుచున్నాను "రజోగుణోపాధికసృష్టికర్తృతత్వము ఇట స్తుతి చేయబడినది"